తెలుగులో ప్రతి అగ్ర హీరోకు అప్పట్లో సూపర్ హిట్లు, కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన పెద్ద దర్శకుడు… లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ పోతుందని నమ్మి, లాజిక్ రహితంగానూ సినిమాల్ని నిలబెట్టిన దిగ్దర్శకుడు… ఎనభయ్యేళ్ల వయస్సులో విశ్రాంతి తీసుకోకుండా ఇంకా ఏదో చేయాలని తాపత్రయం… కానీ కొత్త తరానికి కోవెలమూడి రాఘవేంద్రరావు తెలిస్తే కదా… అప్పటి ఆలోచనలు, ధోరణికి కొత్త తరం కనెక్ట్ అయితే కదా… అందుకే ఏ పని చేసినా ఇప్పుడు ఫెయిల్యూరే… బొడ్డు దర్శకుడిగా పేరు […]
The Revenant …. ఎందుకు చూడాలంటే ఈ హాలీవుడ్ సినిమాను…
Sankar G……….. ది రెవెనెంట్ సినిమా చూశారా? సినిమా గొప్పతనం ఏమిటి? నేడు ప్రపంచ సినిమాలో అత్యుత్తమ సాంకేతిక దర్శకుల్లో అలెహాండ్రో ఇన్యారిటు ముందు వరుసలో ఉంటారు. అత్యుత్తమ సాంకేతిక దర్శకులు అంటే? అద్భుతమైన లేదా ఒరిజినల్ కథ లేకపోయినా కథనం, దర్శకత్వం, సంగీతం, సినిమటోగ్రఫీ విభాగాల్లో అత్యుత్తమ సృజన చూపేవారు. వెస్ ఆండర్సన్, డెనిస్ వెల్నూవ్, స్పైక్ జాంజ్, టైకా వైటిటి, అలెక్స్ గార్లండ్, ఎడ్గర్ రైట్, అల్ఫోన్సో కువరో ఈ కోవకు చెందిన వారు. వీరి సినిమాల్లో […]
అందరికీ నీలా ఓ సెలబ్రిటీకి పుట్టే అర్హత, భాగ్యం ఉండవు కదా వరలక్ష్మీ…!!
మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబులో సినిమా రివ్యూలు రాసేవాళ్లపై మండిపడే సినిమావాళ్లలో వరలక్ష్మీ శరత్‌కుమార్ మొదటిదీ కాదు, చివరి వ్యక్తి కూడా కాబోదు… అసలే పాపులర్ నటికి పుట్టిన బిడ్డ… బార్న్ విత్ గోల్డెన్ స్పూన్… ఓ సెలబ్రిటీ పిల్లగానే పెరిగింది… సినిమాల్లో ఎంట్రీ కూడా శరత్‌కుమార్ బిడ్డగానే సులభంగా దొరికబట్టుకుంది… అఫ్కోర్స్, తను కష్టపడి నిలబడింది… కానీ మనిషిలోని అహం, సెలబ్రిటీ పిల్లగా పెరిగిన తాలూకు పొగరు ఇంకా అలాగే ఉన్నట్టున్నయ్… అందుకే రివ్యూలు రాసేవాడికి […]
విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక… హంపి (పార్ట్-1)
History- Hampi: విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక హంపీ తెలియనివారుండరు. విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ కోశాధికారి విరుపణ్ణ పర్యవేక్షణలో నిర్మితమయిన లేపాక్షి ఒడిలో పాతికేళ్ళపాటు పెరిగినవాడిని. లేపాక్షిలో మాట్లాడే రాళ్లు, నడిచే రాళ్లు, వేలాడే రాళ్లు, పాడే రాళ్లు, ఆడే రాళ్లు, వెంటాడే రాళ్ల మధ్య తిరుగుతూ పెరిగినవాడిని. అలాంటి లేపాక్షి సృష్టికర్త అయిన విజయనగరం- హంపిని చాలా ఆలస్యంగా చూసినందుకు సిగ్గుపడుతూ… యాభై మూడేళ్ల వయసులో మొన్న తొలిసారి హంపీకి వెళ్లాను. విజయనగర రాజుల చరిత్ర, హంపీ […]
పాత సర్కారు సాగునీటి పనులూ బీఆర్ఎస్ ఖాతాలోనికే… కాంగ్రెస్ పూర్ రెస్పాన్స్…
నిన్న హరీష్‌రావు అసెంబ్లీలో మాట్లాడుతూ… తమ సర్కారు హయాంలో సాగునీటి ప్రాజెక్టులు ఏవేవి పూర్తిచేశామో వివరంగా చెబుతూ పోయాడు… సడెన్‌గా అవన్నీ చదివితే… పర్లేదు, ఈ సర్కారు బాగానే చేస్తోందిగా అనిపిస్తుంది… ఓసారి అవి చదవండి… ‘‘తుమ్మిళ్లను రికార్డు స్థాయిలో 11 నెలల్లో పూర్తి చేశాం. భక్త రామదాసు ప్రాజెక్టుని 10 నెలల్లో పూర్తి చేశాం. మిడ్ మానేరు, శ్రీరాం సాగర్ రెండో దశ, గోదావరి నది మీద లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతి బ్యారేజ్‌లను […]
రోజూ జైలుకు వెళ్లి భర్తతో ములాఖత్… వసూళ్ల దందాలో చేదోడువాదోడు…
అబ్బాస్ అన్సారీ… సిట్టింగ్ ఎమ్మెల్యే… ఉత్తరప్రదేశ్… ఈయన ఎవరూ అంటే గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్తార్ అన్సారీ కొడుకు… అన్సారీ పెద్ద క్రిమినల్… పెద్ద రికార్డే ఉంది… మవు నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ సుహేల్దేవ్ బీఎస్పీ నాయకుడిని ఈడీ అరెస్టు చేసింది… తను బాందా జైలులో ఉన్నాడు ప్రస్తుతం… ఘాజిపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు గత డిసెంబరులో తనకు గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద పదేళ్ల జైలు శిక్ష, అయిదు లక్షల జరిమానా విధించింది… […]
రష్మికకు కత్తెర… పుష్ప సీక్వెల్ పాత్ర కుదింపు… స్క్రీన్ స్పేస్ తక్కువే…
సొంత కన్నడ ఇండస్ట్రీ దాదాపు తనను వదిలేసినా, వ్యతిరేకత కనబరుస్తున్నా సరే… రష్మిక హేపీగానే ఉంది… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి ప్రిస్టేజియస్ ప్రాజెక్టులు, పెద్ద బ్యానర్ల అవకాశాలు తలుపు తడుతున్నాయి… రెమ్యునరేషన్ భారీగా అందుతోంది… షేర్ చేసుకోవడానికి జాన్ దోస్త్ విజయ్ దేవరకొండ ఉండనే ఉన్నాడు… హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను రిలీజ్ అయిపోగా, చేతిలో యానిమల్ ప్రాజెక్టు ఉంది… తెలుగులో పుష్ప-2 చేస్తోంది… ఈ పుష్ప దగ్గరే చిన్న చిక్కు… ఆమెకు […]
ఒవైసీకి తెలంగాణ జేఏసీ సూపర్ కౌంటర్… బీఆర్ఎస్ సర్కారు సైలెంట్…
పదే పదే ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి తెలంగాణలో… కేసీయార్ హైదరాబాద్ పాతబస్తీని పూర్తిగా విడిచిపెట్టేశాడు… ఒవైసీ మీద ప్రేమో, భయమో గానీ కరెంటు బిల్లులు ఎవరూ కట్టరు, నీటి బిల్లులు ఎవరూ కట్టరు… అసలు పాతబస్తీలో ప్రభుత్వమే లేదు అనేది వాటి విమర్శల సారాంశం… అంటే పాతబస్తీలో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి… బిల్లులు కట్టినా, కట్టకపోయినా… మజ్లిస్‌కు కోపం రాకూడదనీ, ముస్లిం వోట్లు పోకూడదని మొత్తానికి అధికార యంత్రాంగమే పనిచేయడం లేదని విపక్షాలు, ప్రత్యేకించి బీజేపీ పదే […]
ప్రేమ ఎంత మధురంలోకి ఓ తెలుగమ్మాయి… ఈమె కథ ఎన్నిరోజులో మరి…
తెలుగు సినిమాలు అంటే మలయాళ, తమిళ సినీతారలు… లేదంటే ముంబై భామలు… నటన కావాలంటే దక్షిణం… వైట్ స్కిన్, ఆరబోత కావాలంటే ముంబై, అనగా నార్త్… కానీ తెలుగు సీరియల్స్ అంటే కన్నడ తారలు… నిజంగా మంచి మెరిట్ చూపిస్తున్నారు… మీరు ఎప్పుడు బెంగుళూరు ఫ్లయిట్ ఎక్కినా సరే ఎవరో ఒకరు సీరియల్ నటి కనిపిస్తారు… మెల్లిమెల్లిగా సినిమాల్లోకీ వ్యాపిస్తున్నారు… నవ్య స్వామిలా..! ఆమె వదిన ఐశ్వర్య పిస్సె కూడా మంచి నటే… అయితే తెలుగు వాళ్లు […]
ఆస్కార్ బాట దొరికింది… డీఎస్పీ, థమన్ బీరెడీ… గుడ్ ఆర్గనైజర్‌ను వెతకండి…
తెలుగు పాట ‘నాటునాటు’ ఆస్కార్‌కు చేరువైనట్టే ఉంది… కీరవాణిని ఆస్కార్ అవార్డుల వేదికపై పర్ఫామ్ చేయమని అడిగారు అంటే… అది అవార్డు దక్కబోతోందనడానికి ఒక సూచికగా భావించాలట… ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం కూడా ఒక సూచికే అంటున్నారు… సరే, మంచిదే… కానీ పాపం, ఆ పాటకు ప్రాచుర్యమే ఆ స్టెప్పులతో వచ్చింది… లేకపోతే ఆ పాట కంటెంటులో ఏముందని..? ఆ స్టెప్పులు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ బాగా బాధపడుతున్నాడని వార్తలు… ఎంతసేపూ కీరవాణి […]
నిజమా స్మితా… సినిమా సెలబ్రిటీలు నిజాలు చెబుతారా..? చెప్పారా..?
ఎక్కడో ఓ మీమ్… సోనీ లివ్ ప్లాట్‌ఫామ్ కోసం సింగర్-యాక్టర్ స్మిత ‘నిజం విత్ స్మిత’ అని ఓ టాక్ షో చేస్తోంది… కాదు, చేసింది… అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తయింది… తాజాగా ఇప్పుడు ప్రసారం ప్రారంభించారు… సో, పెద్దగా వర్తమాన అంశాలపై ఫోకస్ పెద్దగా ఉండకపోవచ్చు… అయితే పవన్ కల్యాణ్‌ను ఈమధ్య ఓ రాజకీయ నాయకుడిగా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు కదా అన్నయ్య చిరంజీవి… పవన్ ఎప్పుడో ఓసారి ఏదో ఒక పెద్ద హోదాలోకి ఎదుగుతాడు, తన […]
ప్రపంచ వినోద రాజధానిలో ఓ మైనపు బొమ్మల కొలువు… చూస్తే అచ్చెరువు…
Akula Amaraiah……… మైనపు బొమ్మా, నువ్వెవరమ్మా! బొమ్మకు ప్రాణం పోసిన టుస్సాడ్స్.. లాస్ వెగాస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎలా ఉందంటే….. చూపు చుక్కల్లో ఉన్నా కాళ్లు నేలమీదుండాలిగా.. లండన్ పోతానో లేదో, పోయినా కారల్ మార్క్స్ సమాధీ, మేడమ్ టుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియం చూస్తానో లేదో… మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు వొలకబోసుడెందుకు? ఉన్నది చూస్తే పోలా! అనుకుంటూ లాస్ వెగాస్ టుస్సాడ్స్ మ్యూజియం బిల్డింగ్ ముందాగాను. నా మది కనిపెట్టిన మమ్మాయి దీప్తి.. […]
నందమూరి కుటుంబసభ్యులకు వాహనగండం… తాజాగా మరొకటీ అదే…
సీన్ వన్……. చాన్నాళ్ల క్రితమే ఓ జ్యోతిష్కుడు ఏదో మాట్లాడుతూ, మాటల సందర్భంలో ఓ మాట చెప్పాడు… ‘‘ఈ నందమూరి ఎన్టీయార్ కుటుంబానికి కారు ప్రమాదాల గండం బాగా ఉంది, అంటే వాహన గండం… వాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది… ఐనా వాళ్లకు ఎవరు చెబుతారు లెండి…’’ అని నిష్ఠురమాడాడు… వాహనాలు లేకపోతే కదలికే లేని కాలం కదా, ఏం జాగ్రత్తగా ఉండాలి, కార్లు ఎక్కకుండా బతకడం ఎలా సాధ్యం అనుకుని నవ్వుకున్నాను… సీన్ టు……. ఎన్టీయార్ […]
రీల్ లైఫు జంటగా ఢోకా లేదు… త్వరలో రియల్ లైఫ్ జంటగానూ కనిపిస్తారు…
అయ్యో, ఇక ఈ జంట మళ్లీ తెరపై కనిపించదా అని బోరుమన్నాయి కొన్ని సైట్లు… ఒకడు ఏదైనా రాస్తే చాలు, ఇక కుప్పలుతెప్పలుగా అందరూ అదే గొర్రెదాటు… ఇంతకీ ఆ జంటపేరు చెప్పనేలేదు కదూ… విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన… కారణమేమిటీ అంటారా..? ఓ పొంతన లేని విషయానికీ దానికీ ముడిపెట్టేశారు… విషయం ఏమిటంటే..? పరుశురాం అనబడే దర్శకుడు గీతా ఆర్ట్స్ వారికి, అనగా అల్లు అరవిందుడికి ఓ సినిమా చేయాల్సి ఉంది… అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడట… […]
నా భర్తనే అవమానిస్తావా..? ఛిఫో… దోస్తీ కటీఫ్… ఇకపై నీతో నటించను…
AK62… ఇదీ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన సినిమా… ఏకే47 మాదిరిగా ఏకే62 తుపాకీ కాదు… ఇది సినిమా పేరు కాదు, అజిత్ 62 వ సినిమా అని అర్థం… ఇప్పటికే మూడుసార్లు అజిత్‌తో జతకట్టిన నయనతార ఇందులో అజిత్ పక్కన హీరోయిన్గా నటించాలి… వాళ్లది హిట్ పెయిర్… నయనతార లేడీ సూపర్ స్టార్ కదా, అజిత్‌తో కలిస్తే ఇక ఢోకా ఏముంది..? సో, లైకా ప్రొడక్షన్స్ […]
ఈనాడు స్పూర్తితో క్షుద్ర అనువాద ‘గీతం’… మీకు ‘కార్యశాల’ అంటే తెలుసా..?
కొత్తగా చాట్‌జీపీటీ వచ్చింది కదా… అంతకుముందు నుంచే గూగుల్ ట్రాన్స్‌లేషన్స్ తరీఖ చూస్తున్నాం కదా… మరీ కొత్తగా బాడ్ రాబోతోంది కదా… ఇవి గాకుండా మైక్రోసాఫ్ట్ అనువాదం వంటివీ ఉన్నాయి… నిజానికి ఏదీ సరైన అనువాదం కాదు, పైగా నవ్వు పుట్టించే అనువాదాలు… అన్నీ ఈనాడు అనువాదాల తరహాయే… ఈనాడులో వచ్చే అనువాద పదాలను చదివి మనం ఎన్నిసార్లు పకపకా నవ్వుకున్నామో కదా… అప్పుడప్పుడూ ఈనాడును చూసి సాక్షి, ఆంధ్రజ్యోతి, కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా వాతలు […]
ఈ ఉపనయన మరణాలు జలప్రమాదమా..? జెన్కో అధికారులు చేసిన హత్యలా..?
ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు… ఇదీ విషాదం… నిజానికి అది ప్రమాదం కాదు, ఖచ్చితంగా రెండు రాష్ట్రాల జెన్కో అధికారులు చేసిన హత్యలే…. ఆశ్చర్యంగా ఉందా..? మొత్తం చదివాక మీరే అంగీకరిస్తారు… ముందుగా ఈ వార్తను కాస్త ప్రామినెంట్గా కవర్ చేసిన ఆంధ్రజ్యోతికి అభినందనలు, అదేసమయంలో ఉపనయనమే ఉసురు తీసిందనే తిక్క హెడింగ్ పట్ల అభ్యంతరాలు..! ఉపనయనం ఉసురు తీయడం ఏమిటి..? ముందుగా ఇన్సిడెంట్ ఏమిటో చూద్దాం… హర్షిత్ అలియాస్ వాచస్పతి ట్రిపుల్ ఐటీ గౌహతిలో చేస్తున్నాడు… […]
కరెంటు లేక రైతుల అరి గోస… సార్, ఇదేనా తెలంగాణ మోడల్ అంటే..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నాం చూస్తున్నారా..? ఈ తెలంగాణ సూపర్ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం….. ఇదేకదా బీఆర్ఎస్ పదే పదే చెబుతున్న మాట… నిజమేమిటో ఊళ్లల్లో రైతులకు తెలుసు… ఆ 24 గంటల కరెంటు కథేమిటో అనుభవిస్తున్నవాళ్లకు తెలుసు… మరీ కొన్నిరోజులుగా వ్యవసాయానికి కరెంటు సరఫరా పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది… మాట్లాడితే కేసీయార్ అసెంబ్లీలో అంటుంటాడు… ఎవరైనా కరెంటు విషయంలో ఆందోళనలు చేశారా, చేస్తున్నారా..? గతంలో ఉమ్మడి పాలనలో […]
దీన్నే లెక్కలేనితనం అంటారు… ప్రజలన్నా, ప్రజాధనమన్నా, ప్రభుత్వమన్నా…
బడ్జెట్ అనేది పెద్ద ప్రహసనమని మొన్న మనం చెప్పుకున్నాం గుర్తుందా..? నిజానికి బడ్జెట్ విషయంలో ప్రభుత్వాలు ఎంత కాజువల్‌గా వ్యవహరిస్తాయో.., సిన్సియరిటీ, సీరియస్‌నెస్ ఏమీ ఉండవని చెప్పే ప్రబల ఉదాహరణ రాజస్థాన్ సీఎం నిర్వాకం… తరచి చూస్తే మొత్తం సిస్టం ఫెయిలైన తీరు గమనించొచ్చు… రాజస్థాన్ సీఎం గెహ్లాట్ వయస్సు 71 సంవత్సరాలు… ఆమధ్య సచిన్ పైలట్‌ను తొక్కే క్రమంలో ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్‌ను కూడా ఎదిరించి, తిరుగుబాటు చేసేదాకా వెళ్లాడు… తెల్లారిలేస్తే రాజకీయాలు తప్ప మరొకటి […]
శివాయ విష్ణు రూపాయ- శివరూపాయ విష్ణవే..! ఔను, అన్నీ రూపాయల లెక్కలే..!
Pronunciation:దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం అని అనుకుంటారు. దేవుడి వల్ల ఆదాయం, దేవుడి పేరుతో ఆదాయం అని విభక్తులను భక్తి నుండి వేరుచేసి అర్థం చేసుకుంది లోకం. “శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే” అంటే శివుడు- విష్ణువు ఒకటే అని అర్థం. శివుడు డబ్బుకు విలువ ఇవ్వడు […]
- « Previous Page
- 1
- …
- 234
- 235
- 236
- 237
- 238
- …
- 449
- Next Page »