పార్ధసారధి పోట్లూరి ….. Adani Vs Hindenburg- గౌతమ్ ఆదాని Vs హిండెన్‌బర్గ్. పార్ట్ -01….. గత వారం రోజులుగా ఎలెక్ట్రానిక్,ప్రింట్ మీడియా తో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న వార్త .. ఆదాని తన గ్రూపు షేర్ల ని కృత్రిమంగా పెంచుకుంటూ పోతున్నాడు అని! ఒక చిన్న సంస్థ అయిన హిండెన్‌బర్గ్ అనే పేరుతో అంతర్జాతీయంగా ఆర్ధిక పరమయిన అవకతవకలని బయటపెడతాను అంటూ తమ సంస్థ రీసెర్చ్ [Forensic Financial Research] చేసి […]
అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
సూర్యకాంతం… ఈ మాట వినగానే తెలుగువాడు మొహం చిట్లిస్తాడు… తిట్టిపోస్తాడు… ఎవరూ ఆ పేరును పిల్లలకు పెట్టుకోరు… సగటు లేడీ విలన్‌కు ప్రతీక… ప్రతి సినిమాలోనూ ఆమెకు అలాంటి పాత్రలే చేసీ చేసీ ఆమె ఓ క్రూరురాలు అయిపోయింది… కోడళ్లను రాసిరంపాన పెట్టే ధూర్త అత్తగారు అయిపోయింది… ఆ పాత్రల్నీ ఇరగ్గొట్టి ఆమె అఖండమైన పేరు సంపాదించుకుంది, అది వేరే కథ… సేమ్, రామాయణం అనగానే రావణుడికన్నా జనం అందరూ తిట్టిపోసేది కైకేయిని… సీతమ్మ కష్టాలు చూస్తూ, […]
రోజుకు వంద కోట్ల వసూళ్ల సినిమా… నిజంగా అంత బాగుందా..? బాక్సు బద్దలేనా..?!
రోజుకు వంద కోట్లు… పఠాన్ సినిమాపై వార్తలు జోరుగా సాగుతున్నయ్… కొందరి ఊపు చూడబోతే అవతార్-2 వసూళ్లను కొట్టేయబోతోంది అన్నట్టుగా రాసిపడేస్తున్నారు… నిజంగా అంత గొప్ప సినిమా..? నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టరా..? నిజంగా షారూక్ మెస్మరైజ్ చేశాడా..? ఆ వెగటు దుస్తుల, వెకిలి ఊపుల ఆ దీపికను ఇండియన్ ప్రేక్షకులు అంత ప్రేమిస్తున్నారా..? కొందరు మిత్రులు అబ్బే, అంత సీనేమీ లేదు సినిమాలో అని కుండబద్ధలు కొడుతున్నారు… ఫేస్బుక్లో మిత్రుడు, సీనియర్ జర్నలిస్ట్ Srini Journalist షేర్ చేసుకున్న […]
ఈ జీఎస్టీ శకంలో అసలు బడ్జెట్ వాల్యూ ఎంత..? ఓ తప్పనిసరి తంతు మాత్రమే..!!
రాష్ట్రాలు కొత్తగా ఏ పన్నులూ వేయడానికి వీల్లేదు… ప్రతిదీ జీఎస్టీలో కవరైపోతుంది… రాష్ట్రాలు సొంతంగా వేయదగిన పొగాకు, మద్యం ఉత్పత్తులు ప్లస్ పెట్రో ఉత్పత్తులు ఇప్పటికే మండిపోతున్నాయి… పైగా మద్యం మీద ఎప్పటిప్పుడు బట్జెట్కు సంబంధం లేకుండా పెంచుతూనే ఉన్నారు… పొగాకు వినియోగం తగ్గుతున్న దిశలో ఇంకా పన్నుల మోత మోగించలేరు… పెట్రో మీద పొరుగు రాష్ట్రాల్లోకన్నా ఇప్పటికే మన మోతలు, వాతలు ఎక్కువ… ఇంకా పెంచితే సగటు మనిషి మరింత దరిద్రంలోకి కూరుకుపోయే స్థితి… కరోనా […]
ఆ నల్లత్రాచును అంబానీ ఒడుపుగా పట్టి… పాతాళానికి తొక్కేశాడు ఇలా… (పార్ట్-2)
స్టాక్ మార్కెట్లో బేర్ & బుల్ అన్న రెండు పేర్లతో వ్యాపారం నడుస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లాభపడినప్పుడల్లా బాంబే స్టాక్ ఎక్స్చేంజి ముందున్న ఎద్దుని చూపిస్తుంటారు మన వార్త చానెల్స్ వారు. దళారుల్లో పైన చెప్పిన రెండు రకాలు ఉంటారు. మను మానెక్ బేర్ కూటమికి (Bear Cartel) అధిపతి. స్టాక్ మార్కెట్లో ప్రవేశం ఉన్న అందరూ కూడా బుల్స్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే షేర్ ధరలు పెరిగినప్పుడు అందరూ లాభపడతారు. బేర్స్ ప్రధానంగా షేర్ ధరలు […]
అదానీ స్టాక్స్ గగ్గోలు సరే… షార్ట్ సెల్లింగులో ఓ నల్లత్రాచు కథ తెలుసా..?! (పార్ట్-1)
== స్టాక్ మార్కెట్ నల్ల త్రాచు == హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ షేర్స్ ను షార్ట్ సెల్లింగ్ చేసిన నేపథ్యంలో ఇప్పటి తరానికి అంతగా తెలియని గతంలో జరిగిన ఒక పెద్ద షార్ట్ సెల్లింగ్ ఘటన గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో అందరికీ బాగా గుర్తున్నవి రెండు స్కాంలు మాత్రమే. ఒకటి హర్షద్ మెహతా, రెండు సత్యం కంప్యూటర్స్. హర్షద్ మెహతా, నేను సహఉద్యోగులం, ఒకే సమయంలో ఒకే కంపెనీలో పనిచేసాము. ఎప్పుడూ కలవలేదనుకోండి. నేను పనిచేసిన […]
ఓహో… ప్రపంచపు మొట్టమొదటి కథను శివుడు పార్వతికి అలా చెప్పాడా..?
ఓరోజు పార్వతి ఎందుకో చిరాగ్గా ఉంది… శివుడి రాకను కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తోంది… శివుడు ఆమెను సమీపించి, ఆమె చుబుకం పట్టుకుని, తన కళ్లల్లోకి చూస్తూ, గౌరీ ఏమిటీ పరాకు అనడిగాడు… నాకు అకారణంగా విసుగు వస్తోంది స్వామీ, నాకేదైనా వినోదాన్ని అందించే నాలుగు మాటలు చెప్పు స్వామీ అనడిగింది ఆమె… శివుడు ఓసారి సావధానంగా చూసి, సరే నేనొక ముచ్చట చెబుతాను విను… శివుడు అప్పటికప్పుడు ఓ కథను క్రియేట్ చేసి చెప్పసాగాడు… ప్రపంచపు […]
పిల్లల కడుపులు నిండాలంటే… నేను స్టంట్స్ చేయాల్సిందే… గాయాలా, జానే దేవ్…
నాకు అప్పటికి ఎనిమిదేళ్లు… పెళ్లిళ్లలో నీళ్లు పంచేదాన్ని… వచ్చిన ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లి నీళ్ల గ్లాసు అందించాలి… రోజుకు 40 రూపాయలు సంపాదించేదాన్ని… ఓ పెళ్లి సందర్భంగా ఒకాయన పరిచయమయ్యాడు… ఒక సినిమా కోసం నాకు జూనియర్ ఆర్టిస్టులు కావాలి, వస్తారా అనడిగాడు… పెళ్లిళ్లలో రకరకాల పనులు చేసే టీం అంతా వోకే అన్నాం… అలా పరిచయం అయ్యాను నేను ఇండస్ట్రీకి… డబ్బు బాగానే వస్తోంది… సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టును… పెళ్లిళ్లలో వర్క్ మాత్రం మానేయలేదు… […]
మంచు మోహన్‌లాల్… పేరుకు స్టారాధిస్టారుడే… పల్లీబఠానీ వసూళ్లు…
ఆమధ్య మంచు విష్ణు సినిమా ఒకటి వచ్చింది… దాని పేరు జిన్నా… మాంచి కసి హీరోయిన్లు సన్నీ లియోని, పాయల్ ఉన్నారు… కాస్తో కూస్తో కామెడీ ఉంది… అయితేనేం, టాలీవుడ్ ఈమధ్యకాలంలో ఎరుగనంత డిజాస్టర్ అది… కొన్నిరోజులైతే థియేటర్ల సింపుల్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాలేదు… జీరో షేర్… ప్రేక్షకులు అడ్డంగా ఈడ్చి తన్నడం అంటారు దాన్ని… అంతకుముందు మంచు మోహన్‌బాబు సినిమా ఒకటి కూడా అంతే… అది మరీ దారుణాతిఘోరం… హిందీకి వెళ్తే కంగనా రనౌత్ […]
గడిచిన యవ్వనపు జాడల కోసం… గడియారం వెనక్కి తిప్పే ఓ యయాతి…
45 to 18: “దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!” అన్నాడు ధూర్జటి. వయసు పెరిగేకొద్దీ పళ్లు ఊడడం, శరీర కాంతి తగ్గడం, ముడుతలు పడడం, జుట్టు తెల్లబడడం, రోగాలు పలకరించడం, మన మొహం మనమే గుర్తు పట్టలేనంతగా మారిపోవడం సహజం. ఎన్ని యాంటీ ఏజింగ్ క్రీములు మొహానికి దట్టించినా- వయసును ఆపగలమా? అరవైలో ఇరవై వయసు ఎవరికైనా వచ్చేనా? “ఎలుకతోలు […]
కౌసల్యను ఎత్తుకుపోయిన రావణుడు..! రాముడి అక్కకూ ఓ గుడి ఉంది…!
వాల్మీకి రామాయణంలో కనిపించకపోవచ్చుగాక… వేలాది కళారూపాల్లోకి రామాయణం విస్తరించేకొద్దీ అనేక చిత్రవిచిత్రమైన ఉపకథలు వచ్చి చేరాయి… చాలామందికి తెలియని కథ, చాలా ఆసక్తికరమైన పాత్ర… రాముడి సోదరి శాంత..! ముందుగా దశరథుడు- కౌసల్య పరిణయం దగ్గర నుంచి మొదలుపెడదాం… నీ చెల్లెలి కొడుకే నిన్ను చంపుతాడు అని కంసుడికి ఆకాశవాణి చెప్పినట్టుగా… రావణుడికి కూడా ఫలానా కౌసల్య కొడుకు చేతుల్లో నువ్వు మరణిస్తావు అని అశరీరవాణి ఏదో హెచ్చరిస్తుంది… దాంతో రావణుడు కోసల రాజ్యానికి రహస్యంగా వెళ్లి […]
ఆకుపూజ చేయించారా..? పారేయకండి… ఔషధాహారం చేయొచ్చు…
నిజమే… ఏదో గ్రూపులో చూశాను ఈ పోస్టు… చాన్నాళ్లయింది, సరిగ్గా గుర్తులేదు… అకస్మాత్తుగా కనిపించింది… Sundari Vedula పోస్టు… ఎందుకు ఇంట్రస్టింగు అనిపించిందంటే…. చాలామంది హనుమంతుడికి ఆకుపూజ చేయిస్తుంటారు… ఆ తమలపాకులు మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం… వాటిని ఏం చేసుకోవాలి… ఎవరికి పంచిపెట్టినా ఎవరూ తీసుకోరు, తీసుకున్నా వాడరు… ఇప్పుడు తాంబూలం ఎవరు వేసుకుంటున్నారు గనుక… అందుకే ఆరోగ్యం కూడా ప్రసాదించే ఓ రెసిపీ చెబుతున్నదామె… అవే తాంబూలపు ఉండలు… కావల్సినవి ఏమిటంటే… శుభ్రంగా ఉప్పునీటిలో కడిగి, […]
పది మార్కుల ప్రశ్న…! ఆర్ఆర్ఆర్ నిర్మాత ఎవరు..? ఏమైపోయాడు..?
ఎవరో అడిగారు… ఆర్ఆర్ఆర్ నిర్మాత ఎవరు..? చటుక్కున గుర్తురాలేదు… దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ వంటి నిర్మాతలైతే గుర్తొచ్చేదేమో… సినిమా ప్రమోషన్లలో, వసూళ్ల సక్సెస్ మీట్లలో, ఆడియో రిలీజుల్లో, ప్రిరిలీజ్ ఫంక్షన్లలో, పోస్టర్ విడుదల సమయంలో, టీజర్ల వేళో ఎప్పుడైనా నిర్మాతగా హడావుడి చేసి ఉంటే మన మైండ్లలో ఇంప్రెషన్ పడి ఉండేది… కానీ… ఆర్ఆర్ఆర్ అంటే జస్ట్, రాజమౌళి… తరువాత రాంచరణ్, జూనియర్… ఈమధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చాక నాటు కీరవాణి… అంతే, ఇక […]
ఒకే నెత్తురు… 485 మంది ఒకేచోట గెట్టుగెదర్… అపూర్వం ఆ భేటీ…
ఒక ఫోటో అపురూపం అనిపించింది… ఈరోజుల్లో అది అరుదు… అసలు కాలేజీలు, స్కూళ్ల అల్యుమని, అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగులు ఆర్గనైజ్ చేయడానికే నానా పాట్లు పడాలి… ముగ్గురో నలుగురో అందరి అడ్రస్సులు సేకరించి, మాట్లాడి, మీటింగుకు రమ్మని ఒప్పించి, భోజన ఏర్పాట్లు చేస్తే 50 నుంచి 60 శాతం మంది వస్తారు… సరే, అదొక సంబరం… మన యాంత్రిక జీవనాల్లో పెద్ద రిలాక్స్, ఆత్మానందం… అలాంటిది ఒకే నెత్తురు… పది మంది తోబుట్టువుల కుటుంబాలు, వాళ్ల […]
తమిళంలో ధోని సినిమా… చెన్నై రుణం ఇలా తీర్చుకుంటాడట…
ఆహా… ఏం వార్త..? సూపర్… గెలుపు, ఓటమి, ఆనందం, విషాదం… ఉద్వేగం ఏదైనా సరే, ఏమాత్రం చలనం కనిపించని ధోని ఏకంగా ఓ సినిమాలో నటించబోతున్నాడు… అదీ హిందీలో కాదండోయ్… తమిళంలో…! ఒక రాతి బొమ్మ నటించగలదా అని సందేహించకండి… ప్రొడ్యూసర్ కూడా తనే… పర్లేదు, లాభం నష్టం తరువాత చూసుకుందాం… చెన్నై రుణం తీర్చుకోకపోతే ఎలా మరి..? చెన్నై సూపర్ కింగ్స్ పేరిట కోట్లకుకోట్లు సంపాదించాడు కదా… తిరిగి ఎంతోకొంత ఇవ్వాలి… లేకపోతే లావైపోతాడు కదా […]
ఆ మూడు కులాల్లో ఏదీ కాదు… అందుకేనా ఆమెను అనామకంగా పంపించేశారు…
అవున్నిజమే… ఓ మిత్రుడు చెప్పినట్టు… జమునను సాదరంగా పంపించామా..? లేదు…! ఎందుకు లేదు..? ఎందుకంటే… ఆమెది ఎన్లైటెన్ కులం కాదు కాబట్టి… ఇండస్ట్రీని ఏలే కులం కాదు కాబట్టి… కొడుకులో కూతుళ్లో స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలు కాదు కాబట్టి… వాళ్లు ఫీల్డ్‌లో ఉండి ఉంటే కథ వేరే ఉండేది… ఇండస్ట్రీ పెద్దలు, ముఖ్యులు ఆమె అంత్యక్రియలకు వచ్చేవాళ్లు, నివాళి అర్పించేవాళ్లు… ఆమె మరణించిందీ అనే వార్త చూసి ఆమె కులం ఏమిటీ అని గూగుల్‌లో సెర్చ్ […]
Vani Jayaram… వాణి అంటే పలుకు, చదువు.., ఈ గాన సరస్వతి కూడా…
Vani Jayaram : తమిళనాడులో పుట్టి దక్షిణాది అన్ని భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు పాడిన వాణీజయరాం గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ఆమెకు పద్మభూషణ్ అవార్డు రావడంతో… ఆమె ఏయే భాషల్లో ఎన్ని పాటలు పాడారు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు? లాంటి అనేకానేక విషయాలు మీడియాలో వచ్చాయి. వస్తున్నాయి… శరీర నిర్మాణ అనాటమీ కోణంలో చూస్తే ఏ మనిషికయినా అవే అవయవాలు. అదే పనితీరు. కానీ మెదడు పనితీరులో, మాటలో ఎవరికి వారు ప్రత్యేకం. […]
హైకోర్టు ఒక గవర్నర్‌ను ఆదేశించగలదా..? ఆదేశించినా పట్టించుకోకపోతే..?!
గవర్నర్ ఏం చేయగలదు..? ఆమెకు కోపం వస్తే మనకు నష్టమేంటి..? ఆమెను అడుగడుగునా అవమానిస్తే మాత్రం ఆమె చేయగలిగేది ఏముంటుంది..? ఈ భావనతో కేసీయార్ ప్రభుత్వం ఒక మహిళా గవర్నర్ తమిళిసైని అన్నిరకాలుగా అవమానించడం కొనసాగుతూనే ఉంది… మరీ ఓ థర్డ్ రేట్ లీడరైతే ఆమె ము- అనే చిల్లర, వెగటు భాషలో కామెంట్స్ చేశాడు… ఐనా తనను బీఆర్ఎస్ పార్టీ గానీ, ఈ ప్రభుత్వం గానీ సదరు నాయకుడి మీద చర్య తీసుకోలేదు, కనీసం ఖండించలేదు… […]
బీఆర్ఎస్లోకి శరత్ కుమార్..? కేసీయార్‌కు ఇలాంటోళ్లే దొరుకుతున్నారు ఎందుకో..?!
ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ కేసీయార్ కూతురు కవితను కలిశాడు… చాలాసేపు మాట్లాడుకున్నారు… బీఆర్ఎస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ఎవరో ఒకరు జెండా మోసేవాళ్లు కావాలని కేసీయార్ ప్రయత్నం… అందులో భాగంగా శరత్ కుమార్ కూడా బీఆర్ఎస్లో చేరతాడు, లేదా తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తాడనే ఊహాగానాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి… రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పడానికి వీల్లేదు… దీన్ని కూడా అడ్డంగా కొట్టేయలేం… అయితే కేసీయార్‌కు అందరూ ఇలాంటివాళ్లే […]
కృష్ణాంజనేయులు గొప్ప దౌత్యవేత్తలా..? ఇదేం బాష్యం డియర్ మంత్రివర్యా..?!
మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడడు… విదేశాంగ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసినందున ప్రతి మాటనూ ఆచితూచి మాట్లాడటం అలవాటైందేమో… తన తత్వం అదేనేమో… కేబినెట్లో ఆ శాఖకు అత్యంత సూటబుల్… అలాంటిది తను మొన్న పూణెలో చేసిన ఓ వ్యాఖ్య కాస్త విస్మయకరం… ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప దౌత్యవేత్తలు కృష్ణుడు, హనుమంతుడు అంటాడు తను… తను స్వయంగా రాసిన The India Way: Strategies for an Uncertain World అనే పుస్తకానికి […]
- « Previous Page
- 1
- …
- 247
- 248
- 249
- 250
- 251
- …
- 458
- Next Page »