Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆదిపురుష్ రచ్చ నడవనివ్వండి… డీడీ రామాయణం క్యాసెట్లు బయటికి తీయండి…

June 29, 2023 by M S R

ramayan

నో డౌట్… ఏ కోణం నుంచి చూసినా ఆదిపురుష్ సినిమా అట్టర్ ఫ్లాప్… 200 కోట్ల దాకా నష్టం, వెకిలి డైలాగులపై సుప్రీం దాకా వెళ్లిన కేసు, అలహాబాద్ హైకోర్టు తిట్లు గట్రా వార్తల నడుమ బాగా చిరాకుపుట్టించినవి దర్శకుడు, రచయితల తలతిక్క వివరణలు, సమాధానాలు, పెడసరం మాటలు… వీటన్నింటి నడుమ ఓ వార్త ఆకర్షించింది… ఆదిపురుష్ సినిమాను జాతి ఛీత్కరించిన వేళ దూరదర్శన్ తన పాత రామాయణం సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేయడానికి నిర్ణయం తీసుకుందట… […]

మనం అనుకున్నదేమిటి..? నువ్వు చేస్తున్నదేమిటి..? ప్రధాని పీవీపై రుసరుస..!!

June 29, 2023 by M S R

pv

అతను ప్రధానితో రహస్యంగా ఏం మాట్లాడి ఉంటారు? … అందుకే మహానుభావులు అంటారు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు….. ————————————- ప్రధానమంత్రితో ఎవరైనా ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడితే ఏం మాట్లాడి ఉంటారు . ఇప్పుడంటే ఆఫీస్ లో కూర్చొని ఏం మాట్లాడారో తోచింది రాసుకునే మహానుభావులు ఉన్నారు కానీ అప్పుడలా కాదు … ఏం మాట్లాడి ఉంటారు ? అధికారులను , జర్నలిస్ట్ లను , రాజకీయనాయకులను అందరి మెదడును తొలిచిన ప్రశ్న . ఐతే ప్రధాని చెప్పాలి […]

ఇలా ఆలోచిస్తాడు కాబట్టే ముఖేష్ అంబానీ అంత ప్రపంచ ధనికుడయ్యాడు…

June 28, 2023 by M S R

ambani

హఠాత్తుగా కొన్ని పోస్టులు వైరల్ అయిపోతుంటయ్… ఇదెక్కడో చదివినట్టుగా ఉంది, ఇది పాతదా, కొత్తదా అనే డైలమాలో కూడా పడేస్తయ్… పోస్టులో నిజానిజాలను పక్కనపెడితే… ఓ కథలాగా చదివేస్తే సరి అనుకుని చదివేయాలి… ఇదీ అలాంటిదే… ఓసారి పోస్టు చదవండి… ఇది విన్నారా అమ్మాయులూ !! రూ.100 కోట్ల వ‌రుడు కావాల‌న్న, అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్……  రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీకి త‌న సంస్థ‌కు సంబంధించిన పెద్ద మీటింగ్‌ల‌లో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండ‌దు. […]

ఎన్టీఆర్ అంటే జనజాతరలే కాదు… జనం కనిపించని సభల జాడలు కూడా…

June 27, 2023 by M S R

చైతన్యరథం

జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ …. అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————————- బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం … అక్కడ లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పొలిట్ బ్యూరోతో పాటు కీలక నేతల ముఖ్య సమావేశం జరుగుతోంది . మీడియా ఆ ఇంటి ఆవరణలో బయటే ఉంది . లోపల మాట్లాడే మాటలు కొంచెం వినిపిస్తున్నాయి . అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన నాయకుడు […]

శుష్క వాదాలు… శూన్య జ్ఞానాలు… చివరకు రాష్ట్రపతినీ వదలడం లేదు…

June 27, 2023 by M S R

murmu

Priyadarshini Krishna….  ఒక బ్యాచ్ ఉంటుంది దేశంలో… ఎక్కడేం జరిగినా దాన్ని పట్టుకొచ్చి మోడీ మెడలో వేసే బ్యాచ్… లేదంటే బీజేపీకి చుట్టడం… బీజేపీ, మోడీ విమర్శలకు అతీతమని కాదు… కానీ అవసరమైన, వాస్తవమైన విషయాల్లో తిడితే ఓ విలువ… కానీ ప్రతి సంఘటనకూ వక్రబాష్యాలు చెబుతూ, అబద్దాలు వ్యాప్తి చేయడం వల్ల ఒరిగేదేముంది..?  ఒకవైపు వాట్సప్ యూనివర్శిటీ అని వెక్కిరిస్తూనే ఉంటారు కాషాయం బ్యాచ్‌ను… మరి యాంటీ వాట్సప్ యూనివర్శిటీ చేసేది ఏమిటి..? అదే పని […]

పొలిటికల్ ఎత్తులు… మొక్కజొన్న పొత్తులు… వామ్మో, పిచ్చ క్లారిటీ…

June 27, 2023 by M S R

heading-alliance

Alliance- Self reliance: విలేఖరి:- సార్! చెప్పండి…రాత్రి ఇసుక వేస్తే రాలినంత జనం సాక్షిగా… పొత్తుల మీద మీకు క్లారిటీ వచ్చిందన్నారు కదా!… ఏమిటా క్లారిటీ? పార్టీ అధినేత:- చిన్నప్పుడు నేను అమ్మ పొత్తిళ్లలోనే పెరిగాను. ఆనాడే నాకు పొత్తులన్నీ పొత్తిళ్లతోనే మొదలవుతాయని అర్థమయ్యింది. కానీ… అప్పుడు మాటలు రాకపోవడం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు మాటలు తన్నుకుని వస్తున్నాయి కాబట్టి… చెప్పగలుగుతున్నాను. వి:- అప్పుడు మీకు రాని మాటలే… ఇపుడు వచ్చిన మాటలకన్నా నయమేమో! మేమడుగుతున్నది ఎన్నికల పొత్తుల […]

కుటుంబ సంపాదన… భార్యాభర్తల ఉమ్మడి సంపాదన… ఇంట్రస్టింగ్ తీర్పు…

June 27, 2023 by M S R

wife

ఇంట్రస్టింగ్… తమిళనాడులో ఒకాయన ఉద్యోగం కోసం అరబ్ కంట్రీస్ వెళ్లాడు… తినీతినకుండా, పొదుపు చేసుకుంటూ తన జీతం నుంచి ఎప్పటికప్పుడు ఇంటికి డబ్బు పంపించేవాడు… భార్య ఆ డబ్బుతో కొన్ని ఆస్తులు కొన్నది… ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ… ఇక్కడి వరకూ కథ సజావుగానే సాగింది… తను ఇండియాకు తిరిగి వచ్చాడు… ఆమెతో సంబంధాలు దెబ్బతిన్నాయి… ఆ ఆస్తుల్లో నా వాటా నాకు కావాలంటుంది ఆమె… నో, ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది, తన డబ్బులతో సుఖజీవనం గడిపింది, […]

బిఎన్ కొండారెడ్డి… డీఓపీ కమ్ నిర్మాత కమ్ కెమెరామన్…

June 27, 2023 by M S R

dop

Bharadwaja Rangavajhala ……    బిఎన్ కొండారెడ్డి . వాహినీ బ్యానర్ లో వచ్చిన కొన్ని సినిమాలకు కెమేరామెన్ గా పనిచేశారు బి.ఎన్ . కొండారెడ్డి . ఈయన స్వయాన బి.ఎన్.రెడ్డిగారి తమ్ముడే. వాహినీలో పోతన అంతకు ముందు వచ్చిన సినిమాలకూ రామనాథ్ గారు పనిచేశారు. వాహినీ బ్యానర్ ప్రారంభకుల్లో రామనాథ్ గారు ఒకరు కదా.. ఆయన స్క్రీన్ ప్లే రాసేవారు. అలాగే … ఎడిటింగ్ వ్యవహారాలు కూడా చూసుకునేవారు. ఆర్ట్ డైరక్టర్ శేఖర్ కూడా వాహినీ ప్రారంభకుల్లో ఉన్నారు. నిజానికి […]

పోయిందే… ఇట్స్ గాన్… పొయిపొచ్చి… గాయబ్… ఆదిపురుష్ గురించే…

June 26, 2023 by M S R

prabhas

ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కె సినిమాలో అమితాబ్ ఆల్‌రెడీ ఓ పాత్ర అంగీకరించాడు… తను హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒకడు… తాజాగా కమల్‌హాసన్ కూడా నటిస్తున్నట్టు సినిమా టీం వెల్లడించింది… తనూ పాపులర్ ఆర్టిస్టే… తనకూ భారీ పారితోషికం కావాలి… ప్రభాస్ సరేసరి… వెరసి ఎన్ని వందల కోట్ల ప్రాజెక్టు అవుతుందో ఇప్పుడప్పుడే ఓ తుది అంచనాకు రాలేం… ఇవి చదువుతుంటే ఆదిపురుష్ గుర్తొచ్చింది… నిజానికి భారీ సినిమా అంటే, భారీ తారాగణం ఉంటే వసూళ్లు బాగుంటాయని, […]

రాధాకృష్ణ రాతల్లో నిజం లేదు… పత్రికలు ఏదో రాసేస్తే చరిత్ర మారదు…

June 26, 2023 by M S R

ysr

Siva Racharla……   YSR the CM… ఆదివారం వీక్ ఎండ్ కామెంట్, దానికి పలువురు మిత్రుల కౌంటర్ , ప్రతి వారం జరిగేదే. అయితే చరిత్రను టచ్ చేసినప్పుడు చదివి ఇట్టే నిరాసక్తంగా దాటుకొని పోలేము. 2004 అంటే సంగతులు మరీ ఒకళ్ళు చెప్తే కానీ తెలుసుకోలేనంత పాత చరిత్రేమీ కాదు. మరో రకంగా జగన్ రూపంలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు లైవ్ లో ఉంది. రాధాకృష్ణ గారు ఏమంటారంటే , 2004 నాటికి రాజశేఖర్ […]

అదుగో గవర్నర్ మార్పు… ఇదుగో పీసీసీ అధ్యక్షుడి మార్పు… వార్తలు అపహాస్యం పాలు…

June 26, 2023 by M S R

esl

ఎడిటర్ కు , ఓనర్ కు కోపం వస్తే …. రికార్డ్ సృష్టించిన పీసిసి అధ్యక్షుడు, గవర్నర్….. జర్నలిస్ట్ జ్ఞాపకాలు … ———————— ఎడిటర్ కోపంగా ఉన్నాడు . పత్రికా కార్యాలయంలో డెస్క్ వారితో , రిపోర్టర్లతో సమావేశం . అందరినీ ఒకసారి చూసి మీ కెవ్వరికీ సమాజం పట్ల బాధ్యత లేదు . ప్రజల సమస్యలు పట్టవు . జర్నలిజం అంటే ఇదేనా ? మీ రాజకీయ వార్తలే తప్ప జనం గోడు పట్టదా ? […]

ఏ అవార్డులు ఎవరికి ఎందుకు ఇస్తారు..? అబ్బే, సాహితీ అవార్డుల గురించి కాదు…

June 26, 2023 by M S R

awards

Sai Vamshi…….  ఏ అవార్డులు ఎవరికి ఎందుకు ఇస్తారు? Disclaimer: ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గురించి కాదు. వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. గమనించగలరు. 1972లో తెలుగులో ‘బడిపంతులు’ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ఇవ్వాలని అవార్డుల కమిటీ దాదాపు ఖరారు చేసింది. అయితే అదే సంవత్సరం హిందీలో సంజీవ్‌కుమార్ నటించిన ‘కోషిష్’ సినిమా వచ్చింది. ఆయనకు అవార్డు ఇవ్వాలని మరో యోచన. ‘కోషిష్’ […]

ఔట్ సోర్సింగ్ యుద్ధాలు… రష్యా తిరుగుబాటు చెప్పే సైనిక పాఠాలెన్నో…

June 25, 2023 by M S R

wagner

పార్ధసారధి పోట్లూరి …….. నువ్వు ఎంత ధనవతుడివి అయినా, నువ్వు ఎంత బలవంతుడువి అయినా, నువ్వు ఎంత తెలివి గల వాడివి అయినా, కాలమనే సర్పానికి చిక్కి నశించ వలసిందే! రష్యా మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది. అయితే అది బయటి శక్తుల ప్రోద్బలంతో రష్యా అంతర్గత శక్తుల వల్ల జరుగుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఇదే దుస్థితి లో ఉన్నాడు! పుతిన్ ఉక్రెయిన్ లో నియమించిన వాగ్నేర్ గ్రూపు పుతిన్ కి ఎదురు తిరిగింది! ఉక్రెయిన్ […]

ఇంట్రస్టింగ్… తండ్రి కబ్జా చేసిన ఆస్తిని… ఊరికి తిరిగిచ్చేస్తున్న బిడ్డ…

June 25, 2023 by M S R

తుల్జా

ఇలాంటి బిడ్దలు కూడా ఉంటారా..? తండ్రి ఏదో ఊరి భూమి కబ్జా చేసి, బిడ్డ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తే… ఆ బిడ్డ దాన్ని ఛీత్కరించి, నాకు ఆ భూమి అక్కర్లేదని, తిరిగి లీగల్‌గా ఆ భూమిని ఆ ఊరికే రాసిచ్చేయడం గొప్ప విశేషమే… అత్యంత అరుదు కూడా… ఆహా, అందరు నాయకుల వారసులు ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తోందా..? జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి… కబ్జాలకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి… అప్పట్లో జనగామ కలెక్టర్‌తో కూడా […]

అదుగో డ్రగ్ సప్లయర్… ఇదుగో సినీ సెలబ్రిటీలు… వండండి మసాలా వార్తలు…

June 24, 2023 by M S R

drugs

నిన్నటి నుంచీ టీవీల్లో హోరు… ఆయనెవరో కేపీ చౌదరి అట… సినిమా వాడు అట… డ్రగ్స్ సప్లయర్ పేరిట అరెస్టు చేశారట… పత్రికల్లో జోరుగా వార్తలు… ఊదరగొడుతున్నారు… సురేఖావాణి, జ్యోతి, ఆషురెడ్డి ఎట్సెట్రా బోలెడు మందికి సదరు చౌదరి ఫోన్ల నుంచి వందల కాల్స్ వెళ్లాయట… నాలుగు ఫోన్లలో వందల సెలెబ్రిటీల పేర్లున్నాయట… ఇక చూసుకో నా రాజా… ఎవడికి తోచింది వాడు రాసేస్తున్నాడు, చూపించేస్తున్నాడు… ఒకటే హోరు… టీవీ మీడియాకు పాత సంచలన కేసుల ఫాలో […]

రాజాలా అనుభవించాడు – అటెండర్‌గా బతుకీడ్చాడు …

June 24, 2023 by M S R

media

రాజాలా అనుభవించాడు – అటెండర్ గా బతుకీడ్చాడు .. సీఎంతో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————————— మాసిన బట్టలతో దాదాపు 60 ఏళ్ళ వయసున్న అతను సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరికీ టీ ఇచ్చేవాడు . అటెండర్ గానే పరిచయం . అక్కడికి వచ్చే నాయకులు ఎంతో కొంత ఇస్తే అదే అతని బతుకు తెరువు . ఓరోజు ఎందుకో హఠాత్తుగా అప్పటి […]

పాలమ్మి, కూరలమ్మి, కష్టపడి… మెడికల్ సీట్ల బ్లాక్ మార్కెటింగ్…

June 24, 2023 by M S R

mci

Maths in Medicine: ఏమిటండీ ఇది? మరీ అరాచకం కాకపొతే! అడిగేవాళ్లే లేరా? ప్రాణాలు కాపాడే వైద్య విద్య బోధించే మెడికల్ కాలేజీల మీద ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్– ఈ డి, ఆదాయప్పన్ను- ఐ టీ దాడులేమిటండీ? అదికూడా సరిగ్గా అడ్మిషన్లు జరిగేవేళ మూకుమ్మడి దాడులతో సభ్యసమాజానికి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? 1. పైసా పైసా కూడబెట్టిన సొమ్మును తెలుపుగానో, నలుపుగానో మెడికల్ కాలేజీలకు మూటగట్టి ఇచ్చుకున్నది బాధ్యతగల తల్లిదండ్రులే కదా? మధ్యలో మీకెందుకు బాధ? కందకు లేని దురద […]

మోడీపై ఓ అమెరికన్ ఎన్జీవో దిక్కుమాలిన సర్వే… మన లెఫ్ట్ మీడియాకు పండుగ…

June 24, 2023 by M S R

modi

మోడీ గురించి అస్సలు వినలేదని 40 శాతం అమెరికన్లు చెప్పారట… అసలు ఆయనపై విశ్వాసం లేదని 37 శాతం మంది చెప్పారట… ఇది ఓ వార్త… ఇలాంటివి ఎక్కువగా కమ్యూనిస్టుల పత్రికల్లోనే కనిపిస్తుంటాయి… అమెరికా, ఇంగ్లండు తదితర ప్రాంతాల్లో కొన్ని దిక్కుమాలిన సర్వే సంస్థలు ఉంటాయి… ఇండియాను బ్యాడ్ లైట్‌లో చూపించేలా పలు సర్వేలను అవి ప్రకటిస్తుంటాయి… మన పత్రికలు కళ్లుమూసుకుని పబ్లిష్ చేసుకుని, చంకలు గుద్దుకుంటుంటాయి… ఒక ఉదాహరణ చెప్పుకుందాం… క్వాలిటేటివ్ బెటర్ కంట్రీ పేరిట […]

చాలా పాతబడిన మేఘ ప్రయోగాలు… కొత్తగా ఈ ఐఐటీ కనిపెట్టిందేమిటట..!!

June 24, 2023 by M S R

seeding

పూర్వకాలంలో కొందరు రుషులు హోమగుండంలో కొన్ని ప్రత్యేక మూలికలు వేసేవాళ్లట… అవి మండి, మేఘాల్లోకి ఆ పొగ చేరి, అవి వర్షించేవట… కాస్త వ్యయప్రయాసలతో కూడిన అతిరాత్ర యాగాలూ అందుకేనట కదా… ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… క్లౌడ్ సీడింగ్, అనగా మేఘమథనం అనే ప్రక్రియ అంత పాతది అని చెప్పడానికి…!  కానీ నిన్నటి ఓ వార్త ఆశ్చర్యపరిచింది… ఆ వార్త ఏమిటంటే..? ఐఐటీ కాన్పూర్ మేఘమథనంలో గ్రేట్ సక్సెస్ సాధించిందట… క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాల్ని కురిపించిందట… […]

ప్రధానమంత్రి అయ్యే చాన్స్ కూడా వచ్చింది… నేనే వద్దనుకున్నాను…

June 24, 2023 by M S R

dc

A. Saye Sekhar…………   #సీఎంకావాల్సినోడు  ఇది డిసెంబర్ మూడో వారం 1995 లో జరిగిన సంఘటన… ఎల్యీ రావు గారని ఓ పెద్దమనిషి ఓ మధ్యాహ్నం లక్డీకాపూల్ ఇందూ హోటల్ పేవ్‌మెంట్ మీద నిలబడున్నారు. నేనూ, మిత్రుడు వై సూర్యప్రకాష్ (అప్పట్లో ఆంధ్రభూమి బ్యూరో చీఫ్) కార్ అక్కడ పార్క్ చేసి దిగాం. వెంటనే సూర్యప్రకాష్ ఎల్యీ రావు గారిని ఇంటి పేరుతో సహా పిలిచి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కుశలప్రశ్నలు వేసీ… ఏంటి, ఎవరికోసమైనా […]

  • « Previous Page
  • 1
  • …
  • 269
  • 270
  • 271
  • 272
  • 273
  • …
  • 420
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions