కేసీయార్ ఇంత చెలరేగిపోతున్నాడు, బట్టలిప్పుతున్నడు, బట్టకాల్చి మీదేస్తున్నడు, బజారుకు గుంజుతున్నడు… ఐనా ఢిల్లీ బీజేపీ నుంచి రియాక్షన్ లేదు, భయపడుతున్నరా..? ఇందిరమ్మే ఉండి ఉంటే, రెండు నిమిషాల్లో ఖతం చేసేది సర్కారును…… అని చెప్పుకుంటూ పోతున్నాడు ఓ మిత్రుడు… సరే, మనం ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్లడం లేదు గానీ… బీజేపీ నిజంగా గవర్నర్లను ముందుపెట్టి, దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వాల మీదకు పోతోందా..? రాజకీయ ప్రత్యర్థుల ప్రభుత్వాల్ని కుట్రలు పన్ని కూల్చేస్తోందా..? అంత సీన్ లేదు… అదొక […]
కేసీయార్ ‘‘వ్యూహాత్మక మౌనం’’ వెనుకా బోలెడు జవాబుల్లేని ప్రశ్నలు..!!
జాగ్రత్తగా గమనిస్తే… చాలామంది సీనియర్ పాత్రికేయులు సైతం ‘‘నిజంగానే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నించింది, కేసీయార్ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు కానీ… ఆ ఆడియో క్లిప్పులు నిజమే… వీడియోలు కూడా బయటికొస్తాయి’’ అని నమ్ముతున్నారు… దొంగకోళ్లు పట్టుకునే బ్యాచ్‌లా కనిపిస్తున్న సదరు మధ్యవర్తులు ఎవరు అసలు..? వాళ్లు ఏది చెబితే అది అల్టిమేటా..? అసలు వాళ్ల వెనుక ఉన్నదెవరు..? వాళ్ల లక్ష్యమేమిటి..? ఎవరినిపడితే వాళ్లను ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ఎంగేజ్ చేస్తుందా..? ఇవి […]
పచ్చి బాలింతపై సర్కారు తప్పుడు పోలీసు కేసులు… ఎవరికీ బుర్రల్లేవు…
గతంలో…. ఇంట్లోనే పురుటినొప్పులు… దగ్గరలో ఎవరైనా మంత్రసాని దొరికితే సాయం… లేదంటే ఇంట్లోని ఆడవాళ్లే సాయం… కాసేపటికి కెవ్వుమని శిశువు ఏడుపు… బొడ్డుతాడుకు ముడి… లోకంలోకి మరో జీవికి స్వాగతం… చాలా ప్రసవాలు ఇవే… కానీ శిశుమరణాలు, బిడ్డ అడ్డం తిరగడాలు, ధనుర్వాతాలు ఎట్సెట్రా ఎన్నో విషాదాలు… ఇప్పుడు… రెగ్యులర్ చెకప్స్… ముహూర్తం గట్రా చూసుకుని చెబితే ఆ టైంకు లేడీ డాక్టర్ సిజేరియన్ చేస్తుంది… ఆపరేషన్ పెయిన్స్ తప్ప లేబర్ పెయిన్స్ ఉండని స్ట్రాటజిక్, ఇన్స్టిట్యూషనల్ […]
ట్విట్టర్ పిట్టను ఏం చేయబోతున్నాడు ఎలాన్ మస్క్..? ఓ నిశిత విశ్లేషణ..!
పార్ధసారధి పోట్లూరి ……….. స్పేస్ X, టెస్లా అధిపతి టెక్ జెయింట్ ఎలాన్ మస్క్ ట్విటర్ ని స్వాధీనం చేసుకున్నాడు ! గత 6 నెలలుగా సస్పెన్స్ డ్రామా నడిపాడు ట్విటర్ టేక్ ఓవర్ మీద ! ముందు ట్విటర్ ని కొనుగోలు చేస్తున్నాను అని ఎలాన్ మస్క్ ప్రకటించగానే ట్విట్టర్ షేర్ ధర అమాంతం పెరుగుదలని సూచించింది ! మళ్ళీ ఏమైందో ఏమో కానీ నేనేంటి, ఆ టెక్స్ట్ మెసేజ్ లు చేసే సంస్థని కొనడమేమిటీ […]
రిషబ్ శెట్టికి ఇదేమీ కొత్త కాదు… గతంలోనూ ఓ పాట పంచాయితీతో తలబొప్పి…
కాంతార సినిమాకు బలమే వరాహరూపం పాట… అసలు ఆ పాట లేకపోతే సినిమాయే లేదు… కానీ ఓ ప్రైవేటు మలయాళ మ్యూజిక్ కంపెనీ కేసు వేసింది… తమ ప్రైవేటు వీడియో నవరసం పాటకు వరాహరూపం కాపీ అని..! సినిమాలో ఆ పాట తీసేయాలనీ, అన్ని ప్లాట్‌ఫామ్స్ మీద ఆ పాట నిలిపివేయాలనీ తీర్పు పొందింది… నిజానికి ఆ రెండు పాటల నడుమ పెద్ద పోలికలు లేవు… పాటల కంటెంటు వేరు, వాటిల్లో చూపించిన కళారూపాలు వేరు… సరే, […]
‘‘నా మనమరాలు పెళ్లి గాకుండానే తల్లి అయితే తొలి ఆశీస్సు నాదే…’’
గుర్తుందా..? పెళ్లికి ముందు శృంగారం తప్పేమీ కాదని ఖుష్బూ అప్పట్లో అన్నందుకు ఆమెపై సంప్రదాయవాదులు భగ్గుమన్నారు… గుడికట్టి ఆరాధించిన వాళ్లే కనిపిస్తే ఖతం చేస్తామంటూ వీరంగం వేశారు… ఒకప్పుడు అది సంప్రదాయ విరుద్ధం… కానీ ఇప్పుడు అలా ఎవరైనా వ్యాఖ్యానిస్తే ఎవరూ పట్టించుకోరు… సమాజం దాన్ని ఆమోదించిందని కాదు… దాన్ని ఓ ప్రాధాన్యాంశంగా పరిగణించడం మానేసింది… జయాబచ్చన్ తెలుసు కదా… లెజెండ్ అమితాబ్ బచ్చన్ భార్య… తనూ ఒకప్పుడు హీరోయినే… రాజ్యసభ సభ్యురాలు… సమాజ్‌వాదీ పార్టీ తరఫున… […]
స్త్రీవాదం అంటే ఇదా..?! అనైతికతను, అక్రమ నడతను బోధించడమా..?!
తలుచుకుంటే ఆడది ఇంటి గడపకు కూడా తెలియకుండా వ్యభిచరించగలదు…. అని ఓ వెగటు, చిల్లర నానుడి తరచూ వినబడేది… నిజానికి అక్రమ సంబంధాలు అనేది పెద్ద సబ్జెక్టు… అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయి, ఉన్నాయి… వయస్సు, అవకాశం, ఆకర్షణ, ఆవేశం, అవసరం వంటివి ఎన్నో చర్చకు వస్తాయి ఆ చర్చలోకి వెళ్తే… కాకపోతే గతం వేరు… అవకాశం ఉన్నంతవరకే అక్రమ బంధాలు… ఇప్పుడు కొన్నాళ్లుగా నేరరికార్డులు చూస్తే విస్మయం… అక్రమ బంధాల సుడిలో పడి, ప్రియుళ్లతో కలిసి […]
అల్లు అరవింద్ తప్పు చేస్తున్నదెక్కడ..? అసలు టార్గెట్ కొట్టాల్సిందెక్కడ..?
ఒక టీవీ వినోద చానెల్ వేరు… ఓటీటీ వేరు… ఓటీటీ అనగానే ప్రేక్షకులు సినిమాలు, ఆయా ఓటీటీల ఎక్స్‌క్లూజివ్ వెబ్ సీరీస్ ఎట్సెట్రా చూస్తారు… అవి ఎప్పుడైనా చూసేలా ఉంటయ్… మళ్లీ వాటికి సబ్‌టైటిళ్లు, సపరేట్ భాషల ఆడియో అదనం… కేవలం సబ్స్క్రిప్షన్ మీద ఆధారపడి అంత కంటెంట్ క్రియేట్ చేసి, డంప్ చేయడం కష్టం… టీవీ వేరు… సీరియళ్లు అనబడే ఫిక్షన్ కేటగిరీ ఉంటుంది, నాన్-ఫిక్షన్లో రియాలిటీ షోలు, ఇతర ప్రోగ్రాములు ఉంటయ్… రెగ్యులర్ యాడ్స్ […]
గరికపాటిపై చిరంజీవి పరోక్ష వ్యాఖ్య మళ్లీ వైరల్… ఇంకా చల్లారినట్టు లేదు…!!
ముందుగా సందర్భం ఏమిటో చూద్దాం… సినిమా జర్నలిస్టు ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకం ఆవిష్కరణ… ముఖ్య అతిథి చిరంజీవి… కార్యక్రమం ముగిశాక కొందరు మహిళలు బొకే ఇచ్చి, సెల్ఫీ అడిగారు… ఈ సందర్భంగా చిరంజీవి ‘ఇక్కడ వారు లేరు కదా’ అన్నాడు… అంటే గరికపాటిని పరోక్షంగా ఉద్దేశించి… అక్కడున్నవాళ్లంతా పడీ పడీ నవ్వారు… మొన్నమొన్నటిదాకా వివాదం నడిచిందే కదా… దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ ప్రోగ్రాంలో వివాదం రేగిందే సేమ్, ఇలా మహిళల […]
చేతిలో 10 సినిమాలు..! అబ్బురమే… మిగతా పాత రక్తానికీ గిరాకీ ఉందండోయ్…!!
అలోన్, ఒలవుం తీరవుం, బర్రోజ్, రామ్ (పార్ట్-1), రామ్ (పార్ట్-2), లిజోజోస్ మూవీ (పేరు పెట్టలేదు) , వివేక్ మూవీ (పేరు పెట్టలేదు), లూసిఫర్ సీక్వెన్స్ ఎంపురాన్… ఇలా మొత్తం పది సినిమాలు ఉన్నయ్ 62 ఏళ్ల మలయాళ వెటరన్ హీరో మోహన్‌లాల్ చేతిలో…! నిజానికి సినిమాల ఫ్యాక్టరీ అంటే అక్షయ్ కుమార్ పెట్టింది పేరు… హిట్టా, ఫ్లాపా అక్కర్లేదు… ఉత్పత్తి మాత్రం ఆగకూడదు… కరోనాలు, విపత్తులు వాళ్లను ఆపవు… ఆపలేవు… మోహన్‌లాల్ కొడుకు కూడా హీరో, […]
వరాహరూపం దైవవరిష్టం… టైమ్ కూడా కలిసివచ్చి… డబుల్ థియేటర్లు…
దీపావళికి ముందు ఏం సినిమాలున్నయ్..? కొన్నిరోజులు బింబిసార, సీతారామం బాగానే నడిచాయి… వాటికి డబ్బులొచ్చాయి… రెండూ హిట్… ఇక కార్తికేయ-2 అనూహ్యమైన హిట్… హఠాత్తుగా అదీ పాన్ ఇండియా సినిమా అయిపోయింది… కోట్లకుకోట్లు నడిచొచ్చాయి… వోకే, ఇంకా..? దీపావళికి రిలీజైన నాలుగు సినిమాల్లో జిన్నాది ఓ విషాదగాథ… ఫాఫం, మా అధ్యక్షుడు మంచు విష్ణు అందులో హీరో, పాన్ ఇండియా సినిమా… సన్నీలియోన్, పాయల్ రాజపుత్ కూడా ఉన్నారు… కోన వెంకట్ కథ… ఇంకేం కావాలి..? కనీసం […]
అనుకోని ప్రయాణం… వనరులున్నా వాడుకునే సోయి కనిపించలేదు…!
చిన్న సినిమా అని తేలికగా తీసుకునే పనిలేదు… అది తప్పు కూడా… ప్రత్యేకించి ‘పెద్ద సినిమాల’కు రోజులు బాగాలేవు… స్టార్లు, బిల్డప్పులను జనం ఇష్టపడటం లేదు… అక్షయ్, అజయ్, చిరంజీవి, మోహన్‌లాల్ అందరూ ఈ ఫలితాల్ని అనుభవిస్తున్నవాళ్లే… అదేసమయంలో సరిగ్గా తీయబడిన కొన్ని చిన్న సినిమాలు తోకపటాకులు అనుకుంటే సుతిలి బాంబుల్లా పేలాయి… ఉదాహరణకు, కార్తికేయ-2, కాంతార, సీతారామం ఎట్సెట్రా… ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ వంటి గ్రాఫిక్ మసాలాల గురించి చెప్పుకోవడం దండుగ… ఇదెందుకు చెప్పుకోవడం అంటే… దర్శకుడికి […]
ఆలీ… అందరూ బాగుండాలి, అందులో తెలుగు కథకులూ ఉండాలి…
ఆలీవుడ్… టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తరహాలో ఆలీవుడ్… అనగా ఆలీ అనబడే కమెడియన్ కమ్ పొలిటిషియన్ కమ్ టీవీ ప్రజెంటర్ కమ్ కేరక్టర్ ఆర్టిస్ట్… తాజాగా నిర్మాత ఆలీ తీయబోయే సినిమాలను ఆలీవుడ్ అని పిలవాలట… పేరు బాగుంది… క్రియేటివ్‌గా ఉంది… ఓ సినిమా తీశాడు… అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి… సినిమా పేరు అదే… ఆలీ తత్వం కూడా అదే… సినిమా తీశాడు కానీ థియేటర్ల దాకా రానివ్వలేదు… అందులో అంత దృశ్యము లేదని […]
సీఎంగా ఉన్నప్పుడు సరే… కానీ సొంతిల్లు అనుకుంటోంది, ఖాళీ చేయదట…
పార్ధసారధి పోట్లూరి ………… నేనెక్కడికి వెళ్ళాలి ? J&K మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ! తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు మెహబూబా ముఫ్తీ ని ఇప్పుడు తాను ఉంటున్న గుప్ కార్ రోడ్ [Gupkar Road ]లో ఉన్న ఫెయిర్ వ్యూ [Fairview ] ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. 2005 నుండి ఈ మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ముఫ్తీ ఫెయిర్ వ్యూ రెసిడెన్సీ లో ఉంటున్నది. అప్పట్లో మెహబూబా […]
మరోసారి కన్నడ ప్రేక్షకుడి కంటతడి…! ఆ జ్ఞాపకాల ఉద్వేగంలో వెండితెర..!
కన్నడ ప్రేక్షకుడు మరోసారి కన్నీరు పెట్టుకుంటున్నాడు… ఏడాదిక్రితం హఠాత్తుగా మరణించిన తమ అభిమాన కథానాయకుడు అప్పు అలియాన్ పునీత్ రాజకుమార్‌ను తలుచుకుని, చివరిసారిగా వెండితెర మీద చూస్తూ ఉద్వేగానికి గురవుతున్నారు… నిజం… తను ఓ పెద్ద హీరో కొడుకు, కానీ ఎక్కడా ఆ వారస దుర్లక్షణాల్ని చూడలేదు కన్నడ సమాజం… పైగా తనలోని గొప్ప ఔదార్యాన్ని, నేల మీద నడిచే సంస్కారాన్ని, పదిమందిలో ఒకడిగా నడిచిన వ్యక్తిత్వాన్ని చూసింది… మన సినీ ఇండస్ట్రీల్లోని చెత్తా బిల్డప్పు గాళ్లకూ […]
వర్మ పిచ్చి లెక్క… జగన్ ఇజ్జత్ పోవడం ఖాయం… ఇదే నిదర్శనం…
ఎందుకు కొన్ని తప్పులు సరిదిద్దుకోలేం..? నిక్షేపంగా దిద్దుకోవచ్చు… ఉదాహరణకు, జగన్ తన తప్పు తెలుసుకుని, ఇప్పటికైనా తన ఇజ్జత్ పోయే ప్రమాదాన్ని గుర్తించి, రాంగోపాలవర్మను తాడేపల్లికి మళ్లీ పిలిపించి ‘‘బయోపిక్కులు లేవు, తొక్కాతోలూ ఏమీ లేవు, వదిలెయ్, లేకపోతే మర్యాద దక్కదు’’ అని హెచ్చరిస్తే… అదొక దిద్దుబాటు… చేయొచ్చు… కానీ చేస్తాడా లేదా అనేది వేరే ప్రశ్న… అంత ఆలోచిస్తే వ్యూహం, శపథం సినిమాలు ఎందుకు వార్తల్లోకి వస్తాయి,..? ఆలీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్ ఎలా అవుతాడు..? […]
సింగిల్ సమంతపై విజయ్ కన్ను… ఫాఫం, రష్మికకు మళ్లీ శోకాలేనా..?!
అతనికన్నా ఆమే రెండుమూడేళ్లు పెద్ద… ఫాఫం, విజయ్ దేవరకొండ కాలేజీలో చదువుతున్నప్పుడే సమంత వెండితెరకు ఎక్కింది… ఆమెను చూసి తనకు పిచ్చెక్కింది… అప్పటి నుంచీ ఆరాధిస్తూనే ఉన్నాడు… మొదట్లో ఆమె సిద్ధార్థ్ మాయలో పీకల్లోతు పడిపోయింది, మునిగిపోయింది… విజయ్ కాలేజీ నుంచి బయటికి వచ్చి, సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేస్తున్నాడు కానీ తనను దేకేవారు ఎవరు..? సమంత ఓ ప్రేమ దేవత… వెండితెరపై వెలిగిపోతున్న దేవత… విజయ్ను చూసేంత సీన్ ఉందా..? కానీ మెల్లిమెల్లిగా తనూ హీరో […]
గుజరాతీ వోటర్లపై కేజ్రీ విసిరిన మతబాణం… కరెన్సీపై దేవుళ్ల బొమ్మలు…!!
పార్ధసారధి పోట్లూరి ………. కేజ్రీవాల్ ఎన్నికల డ్రామా : భారతీయ కరెన్సీ నోట్ల మీద వినాయకుడు, లక్ష్మీ దేవి బొమ్మలు ప్రింట్ చేయాలి ! గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేజ్రీవాల్ పూటకో ఎన్నికల తాయిలం ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. మొదట దీపావళి తరువాత ఎన్నికల తేదీని ప్రకటిస్తారని అనుకున్నాm ఇంతవరకు స్పష్టత లేదు. ఎటూ అక్టోబర్ నెల అయిపోతున్నది కాబట్టి […]
అంతటి చంద్రబాబునే గంగవెర్రులెత్తించిన ఆ ప్లానర్ ఏమైపోయాడు..?!
వర్తమాన తెలంగాణ రాజకీయాల్లో కేసీయార్ దరిదాపుల్లోకి కూడా ఎవరూ చేరలేరు… ఇది నిజం… తను స్కెచ్ వేస్తే ఎదుటోడు గిలగిలా కొట్టుకోవాల్సిందే… నన్ను మించి స్కెచ్చర్, ప్లానర్ లేరనే భ్రమల్లో ఉండే అంతటి చంద్రబాబే అర్జెంటుగా తెలంగాణ ఖాళీ చేసి, ఆంధ్రాకు పరిమితం కావల్సి వచ్చింది కేసీయార్ కొట్టిన ‘వోటుకునోటు’ దెబ్బతో… అలాంటిది కేసీయార్ గ్రహచారం తిరుగుముఖం పట్టినట్టుంది… ఏదో భారీ తేడా కొడుతోంది… నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో వైఫల్యం తాజా ఉదాహరణగా అనిపిస్తున్నది… పొలిటికల్‌గా […]
బాలయ్య అంటే అంతే… కమర్షియల్ యాడ్స్‌లో కూడా అవే భుజకీర్తులు…
సెలబ్రిటీలు… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీలు కాస్త పాపులరైతే చాలు… రకరకాల కమర్షియల్స్‌లో నటించి ఎడాపెడా డబ్బు తీసుకుంటారు… తప్పుకాదు… బ్రాండ్ ప్రమోషన్ల విషయంలో ఉభయతారకం… అయితే తాము ప్రచారం చేస్తున్న సరుకులతో ప్రజలకు నష్టం వాటిల్లే పక్షంలో వాటికి ఆయా సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది… లీగల్‌గానే… ఈ విషయం చాలామందికి తెలియదు… అంతెందుకు..? అనైతికంగానూ డబ్బు సంపాదిస్తుంటారు కొందరు… అప్పట్లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ తదితరులు గుట్కా సరోగేట్ యాడ్స్ చేసి, తరువాత చెంపలేసుకున్నారు… […]
- « Previous Page
- 1
- …
- 279
- 280
- 281
- 282
- 283
- …
- 459
- Next Page »