Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎగ్జిట్ పోల్స్, మీడియా స్టోరీస్ మాత్రమే కాదు… పల్స్ పట్టించేవి ఎన్నో…

June 1, 2024 by M S R

Nationalist Narasinga Rao….   లోకసభ ఎన్నికలకు సుమారు నాలుగు ఐదు నెలల ముందు నుండి ( 2024 జనవరి) ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు ఇచ్చిన అన్ని రకాల సర్వేలు ఫాలో అయ్యా…

కేవలం ఈ సర్వేల మీదనే మాత్రమే ఆధార పడకుండా…. 15 రాష్ట్రాల్లో (ఒక్కొక్క రాష్ట్రమ్ లో పది మందికి తక్కువ కాకుండా ) నాకు ప్రత్యక్ష పరిచయం ఉన్న ఫ్రెండ్స్ / కొలీగ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు… వీళ్ళతో ఈ 5 నెలలలో ప్రతి పదిహేను రోజులకు … కొంతమందితో ప్రతి ఆదివారం మాట్లాడాను… ఇందులో యూపి వాళ్ళు ఎక్కువ, అక్కడ సీట్లు ఎక్కువే (80)…

వీళ్ళు కాకుండా ఢిలీల్లో ముగ్గురు నలుగురు జర్నలిస్టుల నుండి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నా… శేఖర్ గుప్తా, ప్రణయ్ రాయ్, కరణ్ థాపర్ లాంటి ఫ్రీలాన్సర్స్ అభిప్రాయాలు యూ ట్యూబ్ ద్వారా తెలుసుకున్నా…. జైపూర్ డైలాగ్స్ లాంటి హ్యండిల్స్ ఫాలో అయ్యా….
రాజ్ దీప్ సర్ధేశాయి, రాహుల్ కన్వల్, ఆర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళ షోస్ చూశాను… మధ్యలో యోగేంద్ర యాదవ్ ను కూడా వదిలిపెట్టలేదు… అప్పుడప్పుడూ తెలుగులో నాగేశ్వర్, తెలకపల్లి రవిలను కూడా… ప్రముఖ సోషల్ మీడియా influencers ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా ఫాలో అయ్యా…
ఇది కాక నార్త్ లో కొన్ని రాష్ట్రాల్లో క్యాబ్ డ్రైవర్స్, టీ  స్టాల్ వాళ్ళతో, ఇండస్ట్రీలలో పనిచేసే రకరకాల ఉద్యోగులతో ప్రత్యక్షంగా మాట్లాడాను… ఎవరికి ఓటు వేస్తారు ? ఎందుకు అని… ఎన్నికలు అయ్యాక కూడా ఎవరికి వేశారు అని అడిగా? మళ్ళీ ఎందుకు అనే ప్రశ్న కూడా కామన్…

ఓవరాల్ గా జూన్ నాలుగున రాబోయే ఎన్నికల ఫలితాల్లో బిజెపి 325 సీట్ల వరకూ వస్తాయి అనేది నా అంచనా…. జనవరి నుండి నా అంచనా ఇదే.. మార్పు లేదు… NDA లో ఇతర పక్షాలకు 40- 50 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది, వెరసి 360 పైన ఉంటుంది …. (నారపరాజు నరసింగరావు)

Ads

politics(కార్టూనిస్టు సుభానీ సౌజన్యంతో)



(రాజకీయాలపై, ఎన్నికల ఫలితాలపై అందరికీ ఆసక్తే… కాకపోతే చాలామంది ఎగ్జిట్ పోల్స్ మీద, ఒపీనియన్ పోల్స్ మీద, మీడియా వార్తల మీద ఆధారపడి ఓ అంచనాకు వచ్చేస్తుంటారు ఫలితాల మీద… చివరకు సట్టా బజార్, స్టాక్ మార్కెట్ మూమెంట్స్, పొలిటికల్ పార్టీల టైమ్లీ ప్రకటనలు వంటి చాలా అంశాలు ఓ అంచనాను కలుగజేస్తుంటాయి… కొన్నిసార్లు ఓ ముఖ్య పార్టీ నేతను అధికారులు ఫలితాలకు ముందే కలుస్తున్నారూ అనేది కూడా ఓ ఇండికేషనే… (రాష్ట్రాలకు సంబంధించి)…

సరే, ఇవన్నీ ఎలా ఉన్నా, బోల్తాకొట్టొచ్చు, నిజం కావచ్చు… కానీ ఇంకొందరు ఆసక్తిపరులు ఇదుగో ఈ రేంజ్‌లో తమదైన స్టయిల్‌లో వివరాలు సమీకరించుకుంటూ, క్రోడీకరించుకుంటూ ఓ అంచనాకు వస్తుంటారు… ఇంట్రస్టింగు… అది చెప్పడం కోసమే ఈ పోస్టు…. ముచ్చట)



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!
  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!
  • ఆన్‌లైన్‌లో ఏదో కొరియర్ ఆర్డర్ ఇచ్చి… దావూద్ ‘డ్రగ్స్ హ్యాండ్’ దొరికాడు…
  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!
  • Ten Heads, Ten Minds: A Masterstroke or a Cinematic Mess?
  • పది తలలకు పది వేర్వేరు వ్యక్తిత్వాలట… పదింతల వెర్రితనం !!
  • ట్రంపరికి ఎదురుగాలి… ట్రెండ్స్‌పై అమెరికన్ మీడియా విశ్లేషణ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions