Nancharaiah Merugumala…. కోస్తాంధ్ర కాపుల్లో యూపీ యాదవుల పోకడలున్నాయన్న డా.కె.బాలగోపాల్ గారి మాటలు 1988లో సరిగా అర్ధం కాలేదనే ఇప్పటికీ అనుకుంటున్నా! …………………………………………………………………………. పేద, బలహీన ప్రజల హక్కుల రక్షణకు, వారి మంచి కోసం పనిచేసిన ఇద్దరు గొప్ప మనుషులు 57 ఏళ్లకే కన్నుమూయడం భారతదేశానికి తీరని లోటు. ఈ విషయం ఇలా ‘సాంప్రదాయబద్ధంగా’ చెప్పకుండా కాస్త ఘనంగా వర్ణించడం నాకు తెలియడం లేదు. ఈ ఇద్దరు ఉద్ధండుల మధ్య వయసులో 42 సంవత్సరాలు తేడా ఉంది. […]
ప్చ్… ఆ పాత స్వాతి కనిపించలేదు… ఈ పాత్ర నేటి స్వాతికి నప్పలేదు…
కలర్స్ స్వాతి… ఇప్పుడు స్వాతిరెడ్డి అని పిలుస్తున్నారు కదా… అలియాస్ స్వెత్లానా… ఆమె అసలు పేరు అదే… రష్యాలో పుట్టింది కదా, అక్కడి పేరే పెట్టారు… తరువాతే స్వాతి అయ్యింది… టీవీ యాంకరింగ్ గానీ, తొలుత నటించిన సినిమాల్లో గానీ యంగ్ లుక్‌తో సరదా మాటలతో గలగలా మాట్లాడుతూ కనిపిస్తుంటేనే కాస్త ముచ్చటగా ఉండేది… ఈ బక్క పిల్ల పెద్ద అందగత్తె కూడా ఏమీ కాదు కదా…! కానీ..? ఐదారేళ్ల క్రితం పెళ్లయ్యింది… విదేశం వెళ్లింది… సినిమాలకు […]
పాకిస్థాన్ డర్టీ బాంబు కథను ఖతం చేసిన ఇండియన్ ఏజెంట్లు..?!
పార్ధసారధి పోట్లూరి ….. ఎవరెన్ని అనుకోవచ్చు గాక! అంతిమంగా దేశ రక్షణే ముఖ్యం! ఇండియన్ మొస్సాద్ (రా) ఆపరేషన్స్ కి ఎదురే లేదు! మిగతా ప్రపంచం అలా చేష్టలుడిగి చూస్తూ ఉండాల్సిందే! అదేంటి? నేరుగా అలా RAW ఆపరేషన్స్ గురుంచి బహిరంగంగా ఎలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు గాక! కానీ ఒక స్పై ఏజెన్సీ గురుంచి మరో దేశానికి చెందిన స్పై ఏజెన్సీకి తెలిసిపోతాయి. ఎవరు ఎక్కడ కిడ్నాప్ కాబడ్డారు? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఇలాంటి విషయాలు […]
మరో లేడీ కంటెస్టెంట్ ఔట్… దిక్కుమాలిన బిగ్‌బాస్ షోలో మగాధిపత్యం…
నిజంగానే బిగ్‌బాస్ క్రియేటివ్ టీం బుర్రలకు ఏదో తెలియని చైనా వైరస్ పట్టుకున్నట్టుంది… ఎలాగూ ఉల్టాపుల్టా అని పేరు పెట్టుకున్నాం కదా, సో, అడ్డదిడ్డంగా వ్యవహరించకపోతే ఇక ఆ పేరుకు అర్థమేమిటి అనే భావనలో ఉన్నట్టున్నారు… లేకపోతే ఏమిటి..? ఇప్పటికే నలుగురు లేడీ కంటెస్టెంట్లను హౌజు బయటికి తరిమేశారు కదా… ఇప్పుడు తాజాగా శుభశ్రీని కూడా తరిమేశారు… అసలు హౌజులోకి వచ్చిందే 14 మంది… ఏడుగురు మగ, ఏడుగురు ఆడ… అందరూ సమానంగా ఆడాలి, మగాళ్లకు దీటుగా […]
తెలంగాణ కమ్మల వోట్లు ఎటు..? ఏకంగా 40 కాంగ్రెస్ టికెట్లు కావాలట…!!
Nancharaiah Merugumala….. తెలంగాణ కమ్మోరు.. కేసీఆర్ కుటుంబాన్ని, బీఆరెస్ నూ అమ్మోరులా ఆదుకోక తప్పదేమో! ——————————– కమ్మ కుటుంబాల్లో పుట్టామని చెప్పిన ఆరుగురు తెలంగాణ మాజీ శాసనసభ్యులకు 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్లు ఇచ్చింది. వారిలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప మిగిలిన ఐదుగురూ (కోనేరు కోనప్ప, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, పువ్వాడ అజయ్ కుమార్) గెలిచారు. వచ్చే డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురికి టికెట్లు […]
ఫ్లాష్… బీఆర్ఎస్ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఈడీ…!?
రాజకీయాల్లో తమకు పడని వ్యక్తులపై బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తుందనేది బహిరంగ రహస్యమే కదా… లేదా తమ రాజకీయ ప్రత్యర్థులకు ఉపయోగపడే అధికారులనూ అది వదిలిపెట్టదు… అలా కత్తుల్ని వేలాడదీసి, అవసరాన్ని బట్టి స్టాండ్ మార్చుకుంటూ ఉంటుంది… పంజరంలో చిలుకలు కూడా కేంద్రం ఆదేశించే పలుకులే పలుకుతాయి… అడుగులు వేస్తాయి… తెలంగాణలో మొన్నమొన్నటిదాకా ఉన్నంతగా ప్రస్తుతం లేకపోయినా ఎంతోకొంత బీజేపీ బలం ఉంది… దాని స్థాయి ఎంత అనేది ఎన్నికలు తేలుస్తాయి… కానీ బీఆర్ఎస్ బీజేపీని […]
సినిమాలనే కాదు… పాజిటివ్ రివ్యూలనూ మనమే ‘నిర్మించాలి’…
Bharadwaja Rangavajhala……… మన సినిమాలు మనమే తీసుకుందాం, మన సమీక్షలు మనమే రాసుకుందాం … సమీక్ష … ఏ భాషలో అయినా … ఏ బంధంలో అయినా …. ఇంత ఇబ్బందికరమైన పదం మరోటి ఉండదేమో? వ్యాపారమైనా, ఉద్యోగమైనా, సంసారమైనా, రచన అయినా సినిమా అయినా సమీక్ష అనగానే …. బోల్డు గందరగోళం ఏర్పడిపోతుంది. సమీక్ష అంటే ఏమిటి? ఒకరు చేసిన పనిని మరొకరు చూసి అందులోని మన్నికను అంచనా వేసి చెప్పడం. చాలా మంది విమర్శ అనే పదాన్ని […]
కేసీయార్ మార్క్ చాణక్యం… సామ దాన భేద దండోపాయాలన్నీ…
ఈటలను తన నియోజకవర్గంలోనే ఓడించి కక్ష తీర్చుకోవాలని కేసీయార్ భేదోపాయంలో వెళ్తున్నాడా..? లేక ఎదుటి పక్షంలోనూ తన వాళ్లు కొందరు ఉండాలనే భావనతో గట్టిగా ప్రయత్నిస్తున్నాడా..? ఏమో, అవసరం రావచ్చు కదా… ఈసారి కూడా గెలిచి, హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నాడా…? రకరకాల ప్రశ్నలు ఎందుకొస్తున్నాయ్..? కరీంనగర్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలు… కెప్టెన్ లక్ష్మికాంతరావు ప్రభావం, పట్టు బలంగా ఉన్న స్థానాలు… ఆయన బీఆర్ఎస్, కేసీయార్‌కు సంబంధించి ఎంత ముఖ్యుడూ అంటే… […]
అబ్బవరం రంజన్… బోర్, బోరర్, బోరెస్ట్… తెలుగు టీవీ సీరియల్ బెటర్…
కిరణ్ అబ్బవరం… ఈ పేరు వినగానే ఓ మోస్తరు బడ్జెట్‌తో తీసే సినిమాలు గుర్తొస్తాయి… హిట్టయిందా, ఫ్లాపయిందా తనకు అక్కర్లేదు… అవకాశాలు వస్తూనే ఉన్నాయి… తను సినిమాలు చేస్తూనే ఉన్నాడు… ఓటీటీ, టీవీ, ఓవర్సీస్ రైట్స్, లోబడ్జెట్ పుణ్యమాని నిర్మాతల చేతులు కాలడం లేనట్టుంది… సో, మిడిల్ రేంజ్ సినిమాలకు తనే చాయిస్‌గా మారినట్టున్నాడు… కానీ ఇప్పటికీ పెద్ద హిట్టేమీ లేదు తన కెరీర్‌లో… తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమా వచ్చింది… రంజన్ అంటే మనోరంజన్… […]
మోడీ చెప్పిన మాట నిజమేనా..? కేసీయార్ ఎన్‌డీఏ ప్రయత్నాలూ నిజమేనా..?
మిత్రుడు Myakala Mallesh వాల్ మీద ఓ పోస్ట్ కనిపించింది… సూర్య దినపత్రికలో అప్పట్లో వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్… పెద్ద పత్రికల్లో, టీవీల్లో ఈ చర్చ పెద్దగా వెలుగులోకి రాలేదు… కానీ ఢిల్లీ, హైదరాబాద్ పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం పొందిన సంగతే… మొన్న ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి కేసీయార్ తమ మద్దతు కోరాడనీ, కేటీయార్‌ను సీఎం చేయాలనుకుంటున్నాననీ, ఆశీస్సులు ఇవ్వండని విజ్ఞప్తి చేశాడనీ.., కానీ ఇదేమైనా రాజరికమా, మేం అలా మద్దతు ఇవ్వబోం అని కరాఖండీగా చెప్పాననీ […]
5 లక్షల మంది మాట్లాడే భాషలో సాహిత్యానికి నోబెల్… మరి మనమెక్కడ..?
Any Chance?: నార్వే దేశ జనాభా 54 లక్షలు. అందులో ఒక అంచున పది శాతం మంది అంటే అయిదున్నర లక్షల మంది మాత్రమే మాట్లాడే ఒకానొక నార్వేకు చెందిన “నైనార్స్క్” మాండలిక భాషలో రాసిన రచయిత జాన్ ఫోసెకు ఈ యేటి సాహిత్య నోబెల్ బహుమతి వచ్చింది. వ్యక్తం కాని విషయాలను తన రచనల్లో వ్యక్తపరచడంలో ఫోసే సిద్ధహస్తుడు అని అవార్డు ఎంపిక కమిటి చెప్పింది. సంతోషం. ఈలెక్కన పది కోట్ల మందికి పైగా మాట్లాడే తెలుగుకు సాహిత్య నోబెల్ […]
చిన్నా… ఓ విషసమస్యపై హీరో సిద్ధార్థ్ సిన్సియర్ ప్రయత్నం… భేష్…
సిద్ధార్థ్… లవ్వులు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు, సహజీవనాలు ఎట్సెట్రా తన వ్యక్తిగత జీవితమే ఓ పెద్ద సినిమా కథ… సుడిగాలి సిద్ధార్థ్ అని పెద్ద వెబ్ సీరీసే తీయొచ్చు… అప్పుడప్పుడూ కొన్ని వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలూ చేస్తుంటాడు… చాన్నాళ్లుగా హిట్లు లేవు… ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరో… అలాంటి సిద్ధార్థ్ ఆమధ్య తన సినిమా ప్రమోషన్ కోసం బెంగుళూరు వెళ్తే కావేరీ ఆందోళనకారులు అడ్డుకున్నారు… ఫలితంగా అవమానంతో తిరిగి చెన్నై వెళ్లిపోయాడు… సో, ఎప్పుడూ ఏదో ఓ కారణంతో […]
ఫిలిమ్ సిటీపై ఆదానీ కన్నుపడిందా..? హట్‌స్టార్, సన్‌టీవీతో కూడా చర్చలు..?
బిజినెస్, హైలెవల్ మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో ఒక టాక్… రాయిటర్స్ ఓ వార్త రాసింది… అదీ బ్లూంబర్గ్ న్యూస్‌ను బేస్ చేసుకుని… నేపథ్యం ఏమిటంటే..? తనదంటూ ఓ మీడియా కావాలని ఆదానీ ఏకంగా ఎన్డీటీవీని టేకోవర్ చేశాడు కదా… అంబానీకి ఆల్‌రెడీ అనేక చానెళ్లున్న గ్రూపు ఉంది… అయితే డిజిటల్ మీడియాకు సంబంధించి (బ్రాడ్‌బ్యాండ్ దందా) అంబానీ చాలా దూకుడు మీద ఉన్నాడు… ఆమధ్య ఏకంగా డిస్నీ హాట్ స్టార్ ఇండియా టీవీ, డిజిటల్ మీడియా వ్యాపారాన్ని […]
నాని సినిమా అయితేనేం… పూర్ టీవీ వాచింగ్… బేబీ కూడా అంతే…
బేబీ… దసరా… ఈ రెండు సినిమాలు గత వారం టీవీల్లో ప్రసారం అయ్యాయి… బేబీలో ప్రధాన పాత్ర పోషించిన వైష్ణవికి ఆ సినిమా హిట్ బాగా కలిసొచ్చింది… ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది… అఫ్ కోర్స్, సినిమాలో బాగా చేసింది… ఇద్దర మగ ప్రధాన పాత్రధారులకన్నా వైష్ణవి పాత్ర బాగా ఎలివేటైంది… సరే, ఆ పాత్రను తిట్టేవాళ్లున్నారు, బాగుందన్నవాళ్లూ ఉన్నారు… ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ లభించింది… పాజిటివ్ రివ్యూలు దక్కాయి… కమర్షియల్‌గా కూడా క్లిక్కయింది… ఐనా […]
కల్ట్ సూసైడ్… రొటీన్ చెత్తకన్నా భిన్నమైన కథ… పర్లేదు, ఓ లుక్కేయవచ్చు…
థియేటర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు… కేవలం ఆహా ఓటీటీకే ఎందుకు పరిమితం చేశారో తెలియదు… కానీ సరైన నిర్ణయమే… ఓటీటీ అయితే అక్కడక్కడా స్కిప్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు… సినిమాలో బాగా ల్యాగ్… వేగంగా కథనం సాగదు… పలుచోట్ల ఎడిటింగ్ ఫెయిల్యూర్లు… ఐతేనేం… ఈ సినిమాను కొన్ని కోణాల్లో అభినందించవచ్చు… అనవసర అట్టహాసాలు, పటాటోపాలు… రొటీన్ తెలుగు సినిమా తాలూకు బిల్డప్పులు గట్రా లేవు… సౌండ్ బాక్సులు బద్దలయ్యే బీజీఎం, తెర నిండా నెత్తురు పూసే ఫైట్లు, […]
కథ చెప్పడంలో దమ్ము లేదోయ్ మశ్చీంద్రా… ఎన్ని వేషాలు వేస్తేనేం…
పోసాని సుధీర్ బాబు… తెలుగు హీరో… బలమైన సినీ కుటుంబ నేపథ్యం ఉన్నా సరే ఈరోజుకూ పాపం ఒక్క హిట్ లేదు… 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్… బోలెడు సినిమాలు… కానీ ఇదీ నా సినిమా అని చెప్పుకునేందుకు ఒక్క సినిమా లేదు… హీరో మహేశ్ బాబుకు బావ, దివంగత హీరో కృష్ణకు చిన్నల్లుడు… అప్పుడే వయస్సు కూడా 46 దాకా వచ్చేసింది… ఐనా తెలుగు హీరోలకు వయస్సుతో పనేమిటి..? 70 ఏళ్లొచ్చినా పిచ్చి గెంతులు, ఫైట్లు […]
చంద్రబాబు డప్పు కొట్టీ కొట్టీ… టీవీ5 చివరకు టీవీ6 అయిపోయింది…
మొన్న ఎవరో ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు… చంద్రబాబు డప్పులో కొత్త రికార్డులు సృష్టిస్తున్న సాంబశివ టీవీ (టీవీ5) రేటింగ్స్‌లో అట్టడుగు స్థానానికి పోయిందీ అనేది ఆ పోస్ట్… ఎహె, అదెలా సాధ్యం..? ఎన్నో ఏళ్లపాటు టాప్ త్రీలో ఉంటున్న చానెల్ కదా… మీటర్లున్న టీవీ కనెక్షన్ల ఇళ్లను పట్టుకునే ఉంటుంది… ఎప్పటిలాగే, ఇతర చానెళ్లలాగే మేనేజ్ చేయలేదా అనుకుంటే అది పొరపాటు అని తేలింది… తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే ఫాఫం టీవీ5 అనిపించింది… కాదు, టీవీ5 […]
సగటు సినిమా పైత్యాలు ఏవీ లేని… ఓ రియల్ బయోపిక్ 800…
ముందుగా ఓ ఒపీనియన్… అందరూ అంగీకరించకపోవచ్చు కూడా… ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు తీసిన ఘనుడు… ఒక క్రికెటర్‌గా కన్నా సేవాభావం, క్రికెట్ పట్ల అంకితభావం, తన దేశం పట్ల ఉన్న నిబద్ధత కోణం తనను ఉన్నతంగా నిలబెడుతుంది… తనకు బాగా అడ్వాంటేజ్ ఏమిటంటే…? పుట్టుకతోనే తన చేతి నిర్మాణం కాస్త వంకర తిరిగి ఉంటుంది… అది తన బౌలింగుకు అనుకూలంగా మారి, మంచి స్పిన్ సాధ్యమయ్యేది… ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎంతటి స్టారుడైనా సరే మురళీధరన్ బాల్ […]
నిజమే… ఈ సినిమా ఓ మ్యాడ్… మరో సెలబ్రిటీ పోరడి వెండితెర ఎంట్రీ…
మ్యాడ్ అంటే… వెర్రి, పిచ్చి… ఈ మ్యాడ్ పేరుతో ఓ సినిమా వచ్చింది… మస్తు బ్యాక్ గ్రౌండ్ ఉన్న మరో వ్యక్తి హీరోగా తెరప్రవేశం (ఆరంగేట్రం) చేసిన సినిమా ఇది… జూనియర్ ఎన్టీయార్ సొంత బావమరిది నార్నే నితిన్ హీరో… మస్తు డబ్బుంది, పైగా జూనియర్ బావమరిది… ఇదే తన అర్హత… అఫ్‌కోర్స్, మన తెలుగు తెరను ఏలేది ఇలాంటి తారాగణమే… బలమైన ధననేపథ్యం లేదంటే వారసత్వం… ఎలా చేశాడు..? ఏదో చేశాడంటే చేశాడు… కొత్త కదా… […]
అప్పటి చిరంజీవి మంచి సినిమా ‘శుభలేఖ’కు ఈ నాటకమే స్పూర్తి…
Sai Vamshi……… వరకట్నంపై వందేళ్ల కిందటి సమ్మెటపోటు… వరకట్నం సాంఘిక దురాచారం. ఎన్నాళ్లయింది దాని మీద ఒక గట్టి సినిమానో, నాటకమో వచ్చి? ‘వరవిక్రయం’ నేటికీ ఆ లోటు తీరుస్తూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లావాసి కాళ్లకూరి నారాయణరావు గారు వందేళ్ల క్రితం రాసిన నాటకం ఇది. ఆయన గనుక ఇది రాయకపోయి ఉంటే తెలుగు నాటకరంగపు ముత్యాలదండలో ఒక మణిపూస ఉండకపోయేది కదా? ఎల్లకాలాలకూ తట్టుకొని నిలిచే ఈ నాటకాన్ని చేజార్చుకునేవాళ్లం గదా? ఎన్ని వేల నమస్సులు […]
- « Previous Page
- 1
- …
- 286
- 287
- 288
- 289
- 290
- …
- 373
- Next Page »