కిసీకా భాయ్ కిసీకా జాన్ అని సల్మాన్ ఖాన్ హిందీ సినిమా వస్తోంది కదా… అందులో ఏంటమ్మా అనే పాటలో వెంకటేశ్, రాంచరణ్ కూడా డాన్స్ అనబడే స్టెప్పులేశారు… విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ పాడిన ఈపాట ‘రామయ్యా వస్తావయ్యా’ టైపులో తెలుగులో స్టార్టవుతుంది… అక్కడక్కడా తెలుగిందీలో ఎవడికీ అర్థం కాకుండా తిక్కతిక్కగా సాగుతుంది… ఆ పాట దిక్కుమాలినతనం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… ఎవడు ఏ ఇకారానికి పాల్పడినా మన తెలుగువాళ్లు ఆహా ఓహో, క్రియేటివిటీ, […]
నేనూ రంగమార్తాండ వంటి సినిమాలే తీస్తాను… తీస్తున్నాను కూడా…
Prabhakar Jaini……… ఈ సినిమా కమర్షియల్ గా విజయం చెందింది కూడా. ధనరాశులు కురవకున్నా బ్రేక్ ఈవెన్ అయింది, ott వల్ల. ఒక గొప్ప దర్శకుడికి ఇది చాలు అనే సంతృప్తి ఉంటుంది. కృష్ణవంశీ గారు హాయిగా, ఆనందంగా ఉన్నారు. కాకపోతే, సినిమాల గురించి నేనెప్పుడూ నకారాత్మక మాటలు చెప్పను. ఏ సినిమా తీయడానికైనా ఎంత కష్టపడాలో నాకు తెలుసు. పెళ్ళీడుకొచ్చిన కూతురు గుండెల మీద కుంపటిలా ఉన్న మధ్యతరగతి తండ్రిలా, డైరెక్టర్ కూడా నిద్రలేని రాత్రులే […]
చీరెకట్టుతో… ఒంటరిగా… బైక్‌పై… ఆరు ఖండాల్లో జర్నీ… రియల్ అడ్వెంచర్…
కెమెరాలకు ఇలా ఫోజు ఇస్తుంటే భలే ఉంది… నా బైక్, నవ్వారి చీరెలో దాని పక్కన నేను… చుట్టూ పెద్ద గుంపు… వాళ్లు ‘భారత్ కే బేటీ’ అంటుంటే నిజంగానే అలా ఫీలయ్యాను… అసలు ఇదంతా 2022 ఇండిపెండెన్స్ డే నాడు నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంతో స్టార్టయింది… గ్రామీణ వృత్తికళాకారులకు ప్రోత్సాహం, మహిళా సాధికారత మీద మాట్లాడాడు ఆయన… తన మాటలు నాకు కనెక్టయ్యాయి… ఓ సాహసయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తళుక్కుమంది… చేయగలనా..? […]
ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా Vs ఇండియా, చైనా, రష్యా, ఇరాన్…
పార్ధసారధి పోట్లూరి … భారత్- రష్యా- చైనా దోస్తీ, పార్ట్ 3… మన పొరుగు దేశం భూటాన్ తన మనసు మార్చుకుంది ! డోక్లాం వివాదం విషయంలో భారత్ కి ఎంత పాత్ర ఉందో చైనాకి అంతే పాత్ర ఉంది అని ప్రకటించింది ! So ! భూటాన్ చైనా ఒత్తిడికి లొంగిపోయింది ! భూటాన్ సహకారం లేకుండా మన దేశం ధోక్లాం విషయంలో పూర్తిగా కలుగచేసుకోలేం ! గత కొన్ని నెలలుగా భూటాన్ వైఖరిలో మార్పు […]
“గాడిద పాల కడుగ పోవును మలినంబు… వచ్చును అందంబు…”
Donkey Milk- Beauty Tip: అఖిల దేశాల గాడిదల సంఘాల సమైక్య సమాఖ్య- అ. దే. గా. సం. స. స. సమావేశం ఢిల్లీలో ఏర్పాటయింది. నానా జాతి గాడిదలయిన అడ్డ గాడిదలు, కంచెర గాడిదలు, పిల్ల గాడిదలు, వృద్ధ గాడిదలు, పండిత గార్దభాలు, గాయక గార్దభాలు, నాయక గార్దభాలు, మూర్ఖ గార్దభాలు… అన్నీ ఒకసారి వెనుక కాళ్లతో కుర్చీలను తన్ని… చెక్ చేసుకుని… ఓండ్రపెట్టి సుఖాసీనులయ్యాయి. మీడియాను అనుమతించకూడదని గాడిదలు ముందే నిర్ణయం తీసుకున్నా… గాడిద చాకిరీకి అలవాటు […]
కేసీయార్‌పై బ్లాంకెట్ బాంబింగ్..! అసలు రాధాకృష్ణ పొలిటికల్ ఎజెండా ఏమిటో..?!
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈమధ్య కేసీయార్ మీద విరుచుకుపడుతున్నాడు కారణమేమిటబ్బా అని ఎంత ఆలోచించినా ఆంతర్యం అంతుపట్టడం లేదు… నిజానికి వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్… ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కేసీయార్ పెద్ద సీరియస్‌గా తీసుకోడు, వెళ్లడు, అలాంటిది ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఓ చిన్న అగ్నిప్రమాదం జరిగితే హుటాహుటిన వెళ్లాడు… పరామర్శించాడు… అయ్యో పాపం అన్నాడు… అట్లుంటది కేసీయార్తోని… ఈమాట మళ్లీ ఎందుకు గుర్తుచేసుకుంటున్నామంటే… ఈరోజు తన ఎడిటోరియల్ ఫీచర్లో కేసీయార్ మీద ఫైరింగ్ చేశాడు రాధాకృష్ణ… ప్రస్తుతం […]
స్వీట్ వయోలినిస్ట్ కామాక్షి… ఆహా ఇండియన్ ఐడల్ ఆర్కెస్ట్రాలో అదుర్స్…
అంబటిపూడి కామాక్షి… మరోసారి చెప్పుకుంటున్నాం… సాధారణంగా టీవీల్లో కనిపించే మ్యూజిక్ కంపిటీషన్, సారీ, సింగింగ్ కంపిటీషన్స్లో ఆర్కెస్ట్రాను పెద్దగా పట్టించుకోరు, గుర్తించరు… అరుదు… ఈటీవీ పాడతా తీయగా వంటి షోలలో ఇన్స్ట్రుమెంట్స్, ప్లేయర్లను చూపిస్తూ ఉంటారు చాలాసార్లు… అభినందనీయం… కొన్ని టీవీ షోలలో మరీ ట్రాకులతో కథ నడిపించేస్తుంటారు… జీతెలుగు వంటి చానెళ్లలో సరిగమప వంటి పరమ నాసిరకం షోలలో చెప్పనక్కర్లేదు… జడ్జిల వేషాలు కూడా చిరాకెత్తిస్తున్నాయి… కానీ ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ […]
రంగమార్తాండ కృష్ణ వంశీ గారూ… ఈ అబ్జర్వేషన్‌కు మీరేమంటారు…
Shyla ………… సూర్యకాంతం, జమున, ఛాయాదేవి , విజయశాంతి, సుహాసిని, రాధిక, రాధ తదితర యాక్టర్ల ఫొటోలేస్తే సినిమా అరిగిపోద్దా మాస్టారు… మీ ఫ్యాన్ అండ్ ఏసీని కాబట్టే అడుగుతున్నా KV సాబ్… నటనకి లింగభేదం వుందనా ఉద్దేశ్యం..? లేదా టైటిల్స్ లో ఫొటువాలు పడ్డ నటులంతా సినిమా మూల పాత్రధారి రాఘవరావులాాగా అహంకారులు, తిరుగుబోతులు, తాగుబోతులు, హంతకులని వారి వరకే వేసారా? కొందరివి అయితే multiple పిక్స్ .. ఆ వ్యవధిలో స్త్రీలవి కూడా వేయవచ్చు.. […]
భేష్ బన్నీ… కథ, పాత్ర, వేషం ఎంతగా మూలాల్లోకి వెళ్తే… అంతగా లైఫ్ కనిపిస్తుంది…
ఓ చిన్న ప్రాంతంలో కనిపించే కల్చర్‌ను ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారనే ఓ అభిప్రాయానికి కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి ఏమని బదులిస్తాడంటే… The more regional the story, the more universal it is… కథ ఎంత ప్రాంతీయం అయితే అది నిజానికి అంత విశ్వజనీనం అని… వివరణ బాగుంది… చాలామందికి ఓ పాఠం అది… ఎంతసేపూ నగరాల్లోని పిచ్చి కల్చర్, అదీ సినిమా ఇండస్ట్రీలో కనిపించే సంస్కృతినే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్ద […]
మహిళ జర్నలిస్టుపై లెఫ్ట్ మూకల అసహనం… ఇంట్రస్టింగ్ ఎపిసోడ్…
పార్ధసారధి పోట్లూరి ……… గత వారం రోజులుగా కేరళలో సుజయ పార్వతి పేరు ట్రెండింగ్ లో ఉంది ! అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రమే ట్రెండింగ్, ఎందుకంటే సుజయ పార్వతి పనిచేస్తున్నది ఒక న్యూస్ చానెల్ కాబట్టి ఇతర న్యూస్ ఛానెల్స్ ఇలాంటి వార్తలని ట్రెండ్ చెయ్యవు మరియు ప్రోత్సహించవు అన్న సంగతి తెలిసిందే ! మార్చి 8,2023 న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున భారతీయ జనతా పార్టీ అనుబంధ కార్మిక సంస్థ BMS […]
బలగం vs రంగమార్తాండ vs శంకరాభరణం… ఫాఫం కృష్ణవంశీ…
రంగమార్తాండ… ఈ సినిమాకు చెత్త ట్యూన్లను ఇచ్చి, కర్ణకఠోరంగా తెలుగు పదాల్ని ఉచ్చరించిన ఇళయరాజాది ఓ పతనావస్థ… ముచ్చటలో పబ్లిషైన ఈ అభిప్రాయాన్ని ఆయనకు ఎవరో ఇంగ్లిషులో ట్రాన్స్‌లేట్ చేసి పంపిస్తే, చివరకు ఇదా నాకు శ్రోతల్లో గుర్తింపు అని బాధపడ్డాడు… ఇప్పటికీ ముచ్చట తన అభిప్రాయానికి కట్టుబడే ఉంది… ఇళయరాజా, పాడటం వేరు, పాఠం అప్పగించడం వేరు, అదీ ఘోరమైన ఉచ్చరణతో… ఈ సినిమాకు సంబంధించిన మేజర్ మైనస్ పాయింట్ అదే… తరువాత లెక్కకు మిక్కిలి […]
‘‘కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణం… కామరాజ్ ప్రణాళిక’’
Agony of Azad: గులాం నబీ అజాద్ కాంగ్రెస్ ను వదిలి వెళతారని ఎవరయినా అనుకున్నారా? పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ గులాం నబీకి వీడ్కోలు ఉపన్యాసంలో ప్రధాని మోడీకి ఉద్విగ్నతతో గొంతు బొంగురుపోయి…కంట్లో నీటి చెమ్మ వస్తుందని ఎవరయినా కలగన్నారా? “అనుకున్నామని జరగవు అన్నీ… అనుకోలేదని ఆగవు కొన్ని… జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని”. మోడీని ఎంతగా విమర్శించినా…ఆయన తనపట్ల చూపిన అపారమైన గౌరవాభిమానాలకు ముగ్ధుడినయ్యానని గులాం నబీ అన్ని వేదికల మీద నిండు మనసుతో చెబుతున్నారు. జమ్ము […]
ఓహో… చెప్పుల పార్టీ వెనుక కూడా నందమూరి కుటుంబ నేపథ్యం ఉందా..?!
Siva Racharla……. ఒక సంఘటన, ఒక వార్త… ఒక సంబంధం, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ అనేక తప్పులు చేసిందని అన్నారు. దానికి సోషల్ మీడియాలో అలాంటి తప్పుల్లో మిమల్ని సీఎం చేయటం అతి పెద్దది అని కౌంటర్లు పడ్డాయి… ఇప్పుడు ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే… ఇప్పటికే బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు ముఖ్యంగా సుజనా చౌదరితో కిరణ్ కుమార్ రెడ్డి కలిసి పనిచేస్తారా? భవిష్యత్తులో […]
జర్నలిస్టు కొలువు పీకేస్తే… ఆఫీసు ఎదుటే అటుకుల బండీ పెట్టుకున్నాడు…
దేశంలో ప్రబలుతున్న కొలువులకోత ప్రభావం న్యూస్‌రూమ్‌ల మీద కూడా పడుతోంది… ఇప్పుడు కాస్త తక్కువ, కరోనాకాలంలో వేలాది మందిని ఇళ్లకు పంపించేశారు… ఎడిషన్ కేంద్రాలు మూతపడ్డాయి… ప్రింటింగ్ ప్రెస్‌లకు తాళాలు పడ్డాయి… నిరుద్యోగం మీద వార్తలు రాసే జర్నలిస్టులు కూడా ఆ భూతానికే బలయ్యారు… మీడియా హౌజులను కూడా ఫ్యాక్టరీలుగా, దుకాణాలుగా చూసే ఓనర్ల వల్ల ఈ ఖర్మ… తాజాగా ఓ ఇంట్రస్టింగ్ కథ… ఆయన పేరు Dadan Vishwakarma… ఐఐఎంసీ, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ […]
టెన్త్ పరీక్షలు అంటేనే ఓ ప్రహసనం… టెన్త్ పేపర్ లీక్- ఓ పరిశీలన…
Shankar Rao Shenkesi……….. టెన్త్ హిందీ పేపర్ లీకు… ఒక పరిశీలన… – టెన్త్ పరీక్షలు అంటేనే ఒక ప్రహసనం. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ రొటీన్ ‘కార్యక్రమం’. టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తే మన రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం 50 కూడా మించదు. కానీ ప్రతీ ఏటా సగటున 85 శాతంపైనే ఉత్తీర్ణత ఉంటుంది. – టెన్త్ పరీక్షల్లో చిట్టీలు చూసి రాయడం అనేది ఒకప్పటి తంతు. ఇప్పుడంతా మారిపోయింది. 100 మార్కుల […]
సో, మార్గదర్శి రామోజీరావు… సారీ, ఈనాడు రామోజీరావు అంటే ఇదన్నమాట…!!
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసుల నేపథ్యంలో రామోజీరావు మీద చర్చ మళ్లీ సోషల్ మీడియాలో సాగుతోంది… నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్టు Naveen Peddada రాసిన ఒక పోస్టును ఆయన అనుమతి లేకుండానే పబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ… మా ఇద్దరికీ ముఖపరిచయం కూడా లేదు, కానీ ఓ బంధం ఉంది… అది సహోదరం, సహృదయం… అప్పటి ఈనాడు చీఫ్ రిపోర్టర్, నా శ్రేయోభిలాషి అన్నమనేని శ్రీరామ్ వరంగల్ కేంద్రంగా పనిచేసేవారు… తనను హైదరాబాద్ జనరల్ బ్యూరో ఇన్చార్జిగా పంపిస్తూ, […]
కేసీయార్‌ను టాకిల్ చేయడం అంటే మాటలా మరి… బీజేపీ అనాలోచిత అడుగులు…
పార్ధసారధి పోట్లూరి ………. పులి తన ఆహారం కోసం వేటాడడానికి చాలా సహనంగా రహస్యంగా వేచి చూస్తుంది ! అలాంటి పులిని వేటాడడానికి వేటగాడికి ఎంత సహనం, ధైర్యం, ఓర్పు ఉండాలి ? ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా చివరికి వెటగాడే పులికి ఆహారం అయిపోతాడు! ఇలాంటి చవకబారు వ్యాఖ్య ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తనకంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునే కరకట్టకి పరిమితం చేశాడు KCR! నీకు, నీ తెలుగు దేశం పార్టీకి […]
మళ్లీ జనతా ప్రయోగం ప్రతిపాదన సరే… జేపి వంటి నిష్కళంక సారథి ఏడీ..?!
ఈమధ్య ప్రతిపక్షాలు ఐక్యంగా కదులుతున్నయ్… రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, ముందుగా బీజేపీ అనే అత్యంత బలమైన ఉమ్మడి ప్రత్యర్థిని దెబ్బతీయాల్సిందే అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది… రాహుల్‌పై అనర్హత వేటును బేస్‌గా చేసుకుని దాదాపు 18, 19 ప్రతిపక్షాలు బీజేపీపై యుద్ధం చేస్తున్నాయి… సుప్రీంకు కూడా వెళ్లాయి… మోడీ ప్రధాన అస్త్రాలైన ఈడీ, సీబీఐల నుంచి రక్షణ కోసం ఏవేవో సాంకేతిక పదాలతో కేసు వేశాయి… మీరు అందరిలాంటివారు కాదా..? మీకెందుకు […]
ఈ నెగెటివ్ పాత్రపై రవితేజకు అభినందనలు… తనలో నటుడు బతికే ఉన్నాడు…
కథ మన తెలుగు క్రియేటర్స్ కొత్తగా రాసుకున్నది ఏమీ కాదు… విన్సి డా అనే బెంగాలీ సినిమా కథను తెలుగీకరించుకుని, రావణాసుర అని పేరు పెట్టుకున్నారు… ప్లాట్ భిన్నంగా ఉంటుంది… కానీ ఎప్పుడైతే దర్శకుడు సుధీర్ వర్మ రవితేజ కమర్షియల్ ఇమేజీకి, మార్కెట్‌కు అనుగుణంగా ఓ సగటు సాదాసీదా తెలుగు సినిమాగా మార్చాడో అప్పుడే అసలు కథ దెబ్బతినిపోయింది… నిజానికి రవితేజను ప్రశంసించాలి… మంచి మెరిట్ ఉన్న నటుడు… మధ్యలో దెబ్బతిన్నా సరే, కొన్ని పిచ్చి సినిమాలతో […]
తెలుగు బతకాలంటే పారిభాషిక పదాల ‘వేరుపిండి’ కావాలిప్పుడు..!!
Life- Language: భాష దానికదిగా గాల్లో పుట్టి ఊడి పడదు. మనమే పుట్టించాలి. అందుకే మాయా బజార్లో- “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న మాటల మాంత్రికుడు పింగళి సూత్రీకరణే సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమయ్యింది. భాషా శాస్త్రంలో నేను చదివింది సముద్రంలో ఆవగింజంతే అయినా…మాటల వ్యుత్పత్తి, వ్యాకరణం, మాండలికాల్లో మాటలను పలికే పద్ధతుల్లో తేడాలను తెలుసుకోవడం ఉత్సాహంగా ఉంటుంది. ఉన్న భాషకు వ్యాకరణం పుడుతుందే కానీ…వ్యాకరణం ముందు పుట్టి భాష తరువాత పుట్టదు. అలా పుడితే అది జీవ భాష కాదు. నిర్జీవ […]
- « Previous Page
- 1
- …
- 300
- 301
- 302
- 303
- 304
- …
- 409
- Next Page »