Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వామ్మో… సుమపై జూనియర్ అంత సీరియసయ్యాడా..? ఇక ఆమె మొహమే చూడడా..?

February 8, 2023 by M S R

jr ntr

చివరకు ఈటీవీ భారత్ కూడా సగటు యూట్యూబ్ చానెల్ అయిపోనట్టు అనిపించింది ఆ వార్త చూశాక… అమిగోస్ అని కల్యాణరామ్ సినిమా ఒకటి వస్తోంది తెలుసు కదా… దానికి ప్రిరిలీజ్ ఈవెంట్… అంతకుముందు జూనియర్ వచ్చి బింబిసార ప్రిరిలీజ్‌లో నాలుగు మంచి మాటలు మాట్లాడాడు కాబట్టి అది సూపర్ హిట్ అయిందనేది ఓ సెంటిమెంట్… సో, నిర్మాతలు మైత్రి మూవీస్ ఈ ప్రిరిలీజ్‌కూ రమ్మన్నారు… కల్యాణ‌రామ్ సినిమాా కాబట్టి కాదనలేడు… మరోవైపు తారకరత్న చావుబతుకుల్లోనే ఉన్నాడు… ఇంకోవైపు […]

పాన్ ఇండియా రైటర్… మూలకథల్ని నిలువునా నరికి RRR సినిమా చూపిస్తాడు…

February 8, 2023 by M S R

war of lanka

పాన్ ఇండియా నవలిస్టు… ఈ పదమే కొత్తగా ఉంది కదా… నిజమే, నిఖార్సయిన, సిసలైన నవలిస్టు… ఇప్పటికి 60 లక్షల పుస్తకాలు… మీరు చదివింది నిజమే, అనేక భారతీయ భాషల్లో సహా ఆరు మిలియన్ల పుస్తకాలు అమ్ముడయ్యాయి తనవి… కిండ్లే, ఆడియో బుక్స్ అదనం… దాదాపు 200 కోట్ల టర్నోవర్ అని అంచనా… ఒకప్పుడు చేతన్ భగత్, తనెప్పుడో ఫేడవుట్… ఇప్పుడు అమిష్ త్రిపాఠి… శివపురాణాన్ని మూడు బుక్స్‌గా రాసిన తను రామాయణాన్ని నాలుగు పార్టులుగా రచించాడు… […]

జోలా జో-లమ్మ జోలా, జేజేలా జోలా, జేజేలా జోలా… హమ్ చేయండి ఓసారి…

February 7, 2023 by M S R

viswanath

Bharadwaja Rangavajhala……..   విశ్వనాథ్ చిత్రాల్లో లాలి పాటలు … హాయైన సంగీతాన్ని అందించడమే కాదు … ఎందుచేతో విశ్వనాథ్ గారి చిత్రాల్లో మిగిలిన దర్శకుల చిత్రాలతో పోలిస్తే జోలపాటలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం ఆయన గుర్తించారో లేదోగానీ … నిజం. అసంకల్పితంగా జరిగిపోయి ఉండవచ్చుకూడా. ఆయన సినిమాలకు ఆయనే కథ సమకూర్చుకోవడం వల్ల కావచ్చు … ఆయన మీద చిన్నతనంలో విన్న లాలి పాటల ప్రేరణ ఉండడం వల్లనూ కావచ్చు … మనసు సేద తీరే […]

జర్నలిస్టుల ఇళ్లస్థలాలను జటిలం చేస్తున్నది కేసీయార్ సర్కారే..!

February 7, 2023 by M S R

jnjhs

ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్య సుప్రీం కోర్టులో సానుకూలంగా పరిష్కారం కావడానికి కేసీయార్ ఇచ్చిన అఫిడవిట్లే ఆధారం… అనుకున్నట్టే సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు కూడా వచ్చింది… జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మంత్రి కెటిఆర్ జస్టిస్ రమణకు కృతజ్ఞతలు చెబుతూ… జర్నలిస్ట్ లకు తాము ఇచ్చిన హామీని అమలు చేయటానికి ఇది ఉపయోగ పడుతుంది అని ట్వీట్ చేశాడు… ఇక్కడివరకూ కేసీయార్ ధోరణి, కేటీయార్ స్వాగతించిన తీరు […]

ఉత్తదే అంకెల కనికట్టు… అప్పుల ఊబి, అసాధారణ అంచనాల మాయామర్మం…

February 7, 2023 by M S R

budget

అనుకున్నట్టుగానే… ఉద్దేశపూర్వకమో తెలియకో కానీ ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలంగాణ బడ్జెట్‌ను శాస్త్రీయంగా విశ్లేషించలేదు… అసలు ఆదాయంపై అశాస్త్రీయ, అడ్డగోలు అంచనాల్ని విప్పిచెప్పలేదు… ఏ శాఖకు ఎంతో రాసేసి పేజీలు దులుపుకున్నారు… పొలిటికల్ పార్టీల నేతలు అసలు బడ్జెట్ చదవరు, చదివినా అర్థం కాదు, అర్థమైనా ఎలా జనానికి చెప్పాలో తెలియదు… సేమ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలాగే… ఎంతసేపూ అంకెల గారడీ అని విపక్షాలు, ప్రగతిశీల బడ్జెట్ అంటూ అధికారపక్షం పడికట్టు పదాల్ని ప్రయోగించడమే… […]

మనసు పలికే మౌనగీతం… తెలుగు సినిమా పాటకు స్మశాన వైరాగ్యం…

February 7, 2023 by M S R

viswanath

Songs-Surrealism: మాటలో, పాటలో మాటలే ఉన్నా మాట మాటే. పాట పాటే. మాటల్లో చెప్పలేనిదేదో పాటలో చెప్పాలి. మామూలు మాటలను పేర్చి పాటల కోటలు కట్టాలి. అది సినిమా సందర్భంలో ఎంతగా ఒదిగి ఉంటుందో… అంతగా సందర్భం దాటి ఎదిగి… బయట ప్రపంచాన్ని కూడా ప్రతిబింబించాలి. ఆ పాట విశ్వవ్యాప్తమై వినిపించాలి. అనంతమైన ఆ పాట ఎవరు పాడుకుంటే వారికి సొంతం కావాలి. ఆ పాట తోడు కావాలి. ధైర్యం చెప్పాలి. ఓదార్చాలి. తట్టి లేపాలి. జోకొట్టి […]

బీజేపీ ఆలోచన సరళిలో బీఆర్ఎస్… మోడీ అడుగుజాడల్లో కేసీయార్…

February 6, 2023 by M S R

kcr

ఇదేం హెడ్డింగు..? మోడీ ఎడ్డెం అంటే కేసీయార్ తెడ్డెం అంటాడు కదా… బీజేపీకి బద్ధ వ్యతిరేకి కదా… బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, దాని మంచీచెడూ ఆలోచించకుండా వ్యతిరేకించడమే అలవాటు కదా… మరి బీజేపీ ఆలోచన సరళిలో బీఆర్ఎస్ ఉండటం ఏమిటి..? మోడీ అడుగుజాడల్లో కేసీయార్ అడుగులు వేయాలని యోచించడం ఏమిటి అంటారా..? నిజమే… నిన్న దిశ అనబడే ఓ డిజిటల్ పత్రికలో ఓ వార్త వచ్చింది… నాందేడ్ మీటింగు వార్తలోనే దాన్ని కలిపేసి, టెక్స్ట్ […]

అన్నా చంద్రబోసన్నా… గీ పాట విన్నావే నువ్వు… సకినాల మిరం రుచి తగుల్తది…

February 6, 2023 by M S R

balagam

జీవనదిలా సాగే ఓ ప్రాంత మాండలికాన్ని పట్టుకోవాలంటే ఆ ప్రాంత సంస్కృతి ఏమిటో తెలియాలి… అర్థం చేసుకోవాలి, ఆవాహన చేసుకోవాలి, అనుభవించాలి, అక్షరీకరించాలి… అప్పుడు అది ఆ మట్టి పరిమళాల్ని మోసుకొస్తుంది… ఒక చిత్తూరు యాస, ఒక రాయలసీమ గోస, ఒక ఉత్తర కోస్తా ధ్యాస, ఒక తెలంగాణ భాషలో పాట రాయాలంటే ఆ పదాల విరుపు పట్టుకోవాలి… ఎలా రాయకూడదంటే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటలా ఉండకూడదు… అది సంకరభాష… నిజాం కాలంనాటి తెలంగాణ భాష […]

ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!

February 6, 2023 by M S R

lokesh

ఏ రాజకీయ నాయకుడైనా సరే… ఎంతటి ఉత్తరకుమారుడు, లక్ష్మణకుమారుడు ఐనా సరే… జనంలో తిరుగుతుంటే, అదీ పాదయాత్ర ద్వారా జనాన్ని కలుసుకుంటుంటే కొంత జ్ఞానం సమకూరుతుంది… ఔట్ లుక్ విస్తృతమవుతుంది… ఇన్నేళ్లూ ఒక తరహా జీవనంలో బతికిన కళ్లకు కొత్త లోకం కనిపిస్తుంది… కానీ లోకేష్ ఈరోజుకూ అలాగే ఉన్నాడు… అవును మరి, ఆ బ్లడ్డు ఆ బ్రీడు అదే కదా మరి… 1994లో హైదరాబాద్ ఎవరికీ తెలియదట… అంతా రాళ్లు రప్పలట… అయిదొందల చరిత్ర కలిగిన […]

నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?

February 6, 2023 by M S R

kcr

ఇన్నాళ్లూ తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే ఖచ్చితంగా నిలబడి మాట్లాడిన పార్టీ… ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిపోయిందో, జాతీయ రాజకీయాల పాట అందుకుందో… తెలంగాణ కోణం దాటిపోయింది…! అవసరార్థం మునుపెన్నడూ లేనంత రాజనీతిజ్ఞత, ఔదార్యం, పరిణతి కేసీయార్ మాటల్లో కనిపిస్తోంది… బాబ్లీ అనేది పెద్ద ఇష్యూయే కాదు, వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, టీఎంసీ కూడా లేని బాబ్లీ పంచాయితీ దేనికి..? అదొక డ్రామా… నీటి లభ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వానికి నచ్చజెప్పి శ్రీరాంసాగర్ నీళ్లను ఎత్తిపోసుకొండి, పెద్ద […]

ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…

February 6, 2023 by M S R

owaisi

తెలంగాణ అసెంబ్లీలో కేటీయార్ మజ్లిస్‌ను ఉద్దేశించి ‘ఏడు సీట్ల పార్టీ’ అని చేసిన వ్యాఖ్య అక్బరుద్దీన్‌కు కోపం తెప్పించింది… అంతేకాదు, తను ఈసారి 50 సీట్లలో పోటిచేస్తాం, 15 మందితో మళ్లీ సభకొస్తామంటూ ఓ సీరియస్ వ్యాఖ్య చేశాడు…… ఇంట్రస్టింగు… అబ్బే, అలా ఝలక్కులిస్తారు, అంతేతప్ప కేసీయార్‌తో జాన్‌జిగ్రీ దోస్తీని వాళ్లెందుకు వదులుకుంటారు… కేసీయార్ వాళ్లకు ఎన్నెన్నో పనులు చేసి పెట్టాడు… మళ్లీ కేసీయార్ గెలిస్తేనే వాళ్లకు పండుగ… అని తేలికగా తీసిపారేసేవాళ్లున్నారు… అసలు వాళ్లకు 50 […]

ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!

February 6, 2023 by M S R

viswanath

విశ్వనాథ్ మరణించి, ఆ కట్టె కాలకముందే ఏవేవో విమర్శలు తనమీద… తను పక్కా థ్రెడ్ లేదా కేబుల్ లేదా వైర్ ఓరియెంటెడ్ సినిమాలే తీశాడనీ, కులతపస్వి అనీ, తన సినిమాలన్నీ బ్రాహ్మణీయాలేననీ వాటి సారాంశం… అగ్రవర్ణ పక్షపాతమనీ వాటి ఆరోపణ… ఆ చర్చ, ఆ రచ్చ సాగుతూనే ఉంది… కొన్నాళ్లు సాగుతుంది కూడా… తన సినిమాల్లోని కొన్ని అభ్యుదయాలు, ఆదర్శాలు గాలికి వదిలేసి, తన కులాన్ని పట్టుకుని, ఒక బయాస్డ్, ప్రిజుడీస్ అభిప్రాయంతో పోస్టులు పెట్టినవాళ్లు కూడా […]

‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’

February 6, 2023 by M S R

film city

అరె భయ్, అనవసరంగా సినిమాల మీద కామెంట్స్ చేయకండి అని ఆమధ్య బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగులో మోడీ హితవు చెప్పాడు తన పార్టీ శ్రేణులకు… ప్రతి సినిమాలో ఏదో ఒక బొక్క వెతికి, బ్యాన్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు, నిరసనలకు దిగుతున్నారు, ఏవేవో ముద్రలు వేస్తున్నారు… ఈ నేపథ్యంలో మోడీ పిలుపుకు ప్రాధాన్యం ఉంది… కాకపోతే మోడీ హితవచనాలు ఆ పార్టీ శ్రేణులకే నచ్చలేదు.,. అంతెందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగికే నచ్చలేదు… శుక్రవారం ఇండియాటుడే […]

స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…

February 5, 2023 by M S R

kantara

‘‘సినిమా షూటింగు కోసం… అవసరమైనప్పుడు క్రౌడ్ చూపించడం కోసం… భారీగా జనాన్ని సమీకరించాలి… ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే, కొంత ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తూనే ఉంటుంది… ఒరిజినాలిటీ ఉండదు… అందుకని కాంతార సినిమా కోసం జనసమీకరణ, డబ్బులిచ్చి జనాన్ని తరలించడం గట్రా చేయలేదు… అందుకని కంబాలా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడే కంబాలా సీన్లను ఆ జనంలోనే తీసేశాం… షూటింగ్ జరుగుతోందని తెలిస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది… అందుకని ఆ విషయం తెలియకుండా జనాన్ని షూట్ చేశాం… అందుకే మీకు కాంతార సినిమాలో […]

అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…

February 5, 2023 by M S R

baloon

పార్ధసారధి పోట్లూరి……….  చైనా ఎయిర్ షిప్ [బెలూన్ ] అమెరికా ఎయిర్ స్పేస్ లో ఎగురుతున్నది ! చైనా ఎయిర్ షిప్ [బెలూన్] అమెరికా ఎయిర్ స్పేస్ మీద ఎగురుతున్నట్లు కనుక్కున్న పెంటగాన్ ! 03-02-23 శుక్రవారం మధ్యాహ్నం చైనా ఎయిర్ షిప్ [బెలూన్] అమెరికా ఎయిర్ స్పేస్ లో ప్రవేశించింది. అయితే అది బెలూనా లేక ఎయిర్ షిప్పా అనేది నిర్ధారణ కాలేదు. కానీ అమెరికా మీద గూఢచర్యం చేయడానికి వచ్చినట్లు పెంటగాన్ వర్గాలు చెపుతున్నాయి […]

ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…

February 5, 2023 by M S R

vani jayaram

. ‘‘ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమాలతోనే ఆరంభం కాదు, వాటితోనే ముగియవు…’’ వాణీజయరాం ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య అది… తనను ఎదగకుండా హిందీ పరిశ్రమలో కొందరు రాజకీయాలు నడిపి, తనంతటతాను ముంబై వదిలి వెళ్లేలా చేశారనే బాధ ఆమెలో ఎప్పుడూ ఉండేది… కానీ కనిపించనిచ్చేది కాదు… అదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… ‘‘ముంబైలో పని తగ్గిపోయింది, ఐతేనేం, ఆ రాజకీయాలు నాకు ఇతర భాషల తలుపులు తెరిచాయి… అనేక భాషల్లో మంచి పాటలు […]

సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

February 5, 2023 by M S R

jnjhs

హైదరాబాదులో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసీయార్ సర్కారు చెప్పేదొకటి, చేసేదొకటి… 18 ఏళ్ల పోరాటం, ప్రభుత్వం చెప్పిన ధరకు కొనుగోలు… సుప్రీం నుంచి స్పష్టత… ఐనా సరే, ఈ సర్కారు కదలదు… ఈ సొసైటీతో సంబంధం లేనివి ఇరికించి, అదో చిక్కు సమస్యగా చూపే ప్రయత్నం… ఇప్పట్లో కేసీయార్ ఆ ఇంటిస్థలాల సంగతి తేల్చే సూచనలు లేవు… అసలు కృతజ్ఞతలు చెప్పడానికి సైతం సొసైటీ ముఖ్యులకు టైం ఇవ్వడం లేదంటే తన ఉద్దేశం ఏమిటో అర్థమవుతూనే ఉంది… […]

జగదానందకారకా… నాటరాగం సహా కష్టమైన రాగాలన్నీ ఆమెకిష్టమైన రాగాలే…

February 5, 2023 by M S R

vani

Bharadwaja Rangavajhala…. అన్ మాచ్డ్ నైటింగేల్ ఆప్ ఇండియా… ఏ పాటైనా పాడేయడమే కాదు… ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను. పేరు వాణీ జయరామ్. అమృతగానమది ….. అమితానందపు ఎద సడి …. తెలుగు సినిమాలను చక్కటి సంగీతంతో అలంకరించిన కన్నడ దేశ జంట సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఎవిఎమ్ వారు తీసిన నోము, పూజ చిత్రాలకు వారే సంగీతం అందించారు. పూజ చిత్రం కోసం దేశ్ రాగంలో ఓ భక్తి […]

ఈ మలయాళీ బుట్టబొమ్మ… తెలుగు వాళ్లకు ధమ్ బిర్యానీ కాదు, జస్ట్ ఉప్మా…

February 4, 2023 by M S R

buttabomma

బుట్టబొమ్మ… ఈ సినిమా ఎలా ఉందనే విశ్లేషణలకు ముందు… నిర్మాత సాయిసౌజన్య అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్యకు ఒక అభినందన… సినిమా లవ్ స్టోరీ అయినా, అక్కడక్కడా డర్టీ రొమాన్స్ సీన్లతో గతి తప్పే అవకాశాలున్నా సరే, ఎక్కడా అసభ్యతకు, అశ్లీలానికి తావివ్వలేదు… ప్లెయిన్ అండ్ ఫెయిర్‌గా ఉంది సినిమా… (క్లాసికల్ డాన్సర్ అయిన ఆమె సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా మేనకోడలు…) ఒకరకంగా త్రివిక్రమ్ సినిమాయే… అందుకే ఈ చిన్న సినిమా మీద రివ్యూయర్ల ఆసక్తి… లేకపోతే […]

విశ్వనాథ్‌కు ఏం తక్కువ..? ఆ సంతాప తుపాకులు గాలిలోకి పేలలేదేమి..?

February 4, 2023 by M S R

nandamuri

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు… అంటే ఏమిటి..? పోలీసులు కొన్ని రౌండ్లు గాలిలోకి కాలుస్తారు… అధికారులు అంత్యక్రియలను పర్యవేక్షిస్తారు… అంతేకదా… ఏ కట్టెలు వాడినా, ఎవరు చితి పేర్చినా కట్టెకాలిపోతుంది…. కానీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటే ప్రభుత్వం తన ప్రాశస్త్యాన్ని గుర్తించడం, వెరసి జాతి ఘనంగా వీడ్కోలు పలకడం… మరి ఒక హరికృష్ణకన్నా విశ్వనాథ్ ఏం తక్కువ..? ఒక సత్యనారాయణకన్నా ఏం తక్కువ..? కులంలోనా..? గుణంలోనా..? పాపులారిటీలోనా..? ప్రతిభలోనా..? కట్టుతప్పని క్రమశిక్షణలోనా..? సౌశీల్యంలోనా..? సార్థకజీవనంలోనా..? హరికృష్ణ, సత్యనారాయణల […]

  • « Previous Page
  • 1
  • …
  • 299
  • 300
  • 301
  • 302
  • 303
  • …
  • 448
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • చీకటి పడితే సీతారాం అట, రాత్రికి వస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!
  • మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
  • ఓ కొలవెరి, ఓ రౌడీ బేబీ… అప్పట్లో ‘తోడీ సిపీలీహై’… మందు కొట్టించేశాడు…
  • బాలు, కొసరాజు, సింగీతం, సాలూరి… అందరి కెరీర్లలోనూ ఇదే చెత్తపాట…
  • సంపద, సర్కిల్, పేరు, చదువు… ఆ ఒక్క దుర్బల క్షణంలో పనిచేయవు..!!
  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…
  • వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…
  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions