‘హడ్డీ మార్ గుడ్డి దెబ్బ’… గూగుల్ చేయకండి, అర్థం దొరకదు… తెలంగాణలో పలుచోట్ల ‘ఫ్లూక్ బీటింగ్’కు లోకల్ వ్యక్తీకరణ అది… అవునూ… కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతార, చార్లి777, గరుడగమన వృషభవాహన, విజయాలు, వేల కోట్ల వసూళ్లు కేవలం అదృష్టమేనా..? ఇక మా అంతటి తోపులు లేరని రిషబ్, యశ్, రక్షిత్ గొప్పలు చెప్పుకుంటున్నారా..? ఏతులు కొడుతున్నారా..? ఈ డౌట్ చాలామందిలో ఉంది… ఎందుకంటే సక్సెస్ బాటలో ఉన్నప్పుడు నోరు ఏదైనా పలికిస్తుంది… కానీ ఇది అపోహ మాత్రమే… […]
పాతాళ పాత్రికేయంలో ఈ హెడింగే పదివేలు… ఆంధ్రజ్యోతికి అభినందనలు…
‘‘తెలుగుదేశం సూపర్‌హిట్’’ అనేది ఎన్టీయార్ తొలిసారి అధికారం పొందిన ఎన్నికల ఫలితాలకు ఈనాడు పెట్టిన హెడింగ్… సినిమా నేపథ్యమున్నవాడు కదా, ఈ సినిమా కూడా హిట్టయ్యిందనే అర్థం… కాంగ్రెస్‌వాళ్లు అప్పట్లో ఆడిపోసుకునేవాళ్లు సినిమావాడికి సీఎం కుర్చీ కావాలట అని… ఏయ్, సినిమావాడే ఏం చేశాడో చూశారా అనే అర్థం… నిజానికి ఎన్టీయార్‌కు అప్పటికి ప్రజలు, సమస్యలు, రాజకీయాలు తెలియవు, తెలుగుదేశాన్ని కూడా ఓ సినిమాలాగే చూశాడు… ఆ మార్మిక అర్థం కూడా ఆ హెడింగులో ఉంది… అది […]
ట్విట్టర్ రహస్యాలు ఒక్కొక్కటే బయటపడి పోతున్నయ్… మస్క్ మామూలోడు కాదు…
పార్ధసారధి పోట్లూరి ……………. రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపుకి సంబంధించినది, అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమూహం [సంప్రదాయవాదుల సమూహం ]. ఈ బాబిలోన్ గ్రూప్ కి సంబంధించి తరుచూ ట్వీట్లు డిలీట్ అవుతుండేవి లేదా ఈ సమూహం చేసే ట్వీట్లు వాళ్ళ ప్రమేయం లేకుండా ఎడిట్ అయిపోయి మళ్ళీ ట్వీట్ అవుతుండేవి… […]
గీతు… సొసైటీలో చాలామందికి ఓ ప్రతీక ఆమె… ఈ ఎలిమినేషన్ కాస్త డిఫరెంట్…
గీతు రాయల్… గలాటా గీతు… పేరు ఏదైనా కావచ్చుగాక… ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో సగటు మనిషి ధోరణికి ఆమె ఓ సూచిక… ‘‘ఈ ప్రపంచంలో ఎవరూ మంచివాళ్లు ఉండరు అనుకునేదాన్ని సార్… కానీ లోకంలో మంచివాళ్లు కూడా ఉంటారని ఇక్కడికి వచ్చాక తెలిసొచ్చింది…’’ ఇదీ ఆమె బిగ్‌బాస్ హౌజు నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు ఏడుస్తూ చెప్పిన మాట… ఫాఫం, హౌజులో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు… ఉప్పునిప్పు తరహాలో ఆమెతో కొట్లాడిన వాళ్లు సైతం బాధపడ్డారు… ఒక కోణంలో చూస్తే… […]
50 ఏళ్ల క్రితం… ఆస్ట్రేలియాకు వెళ్లి ‘‘పులియబెట్టే విద్య’’ను చదివింది…
బెంగుళూరులో పుట్టింది… గుజరాతీ తల్లిదండ్రులు… మధ్యతరగతి కుటుంబం… ఆమెకు డాక్టర్ కావాలని కోరిక… 1970… ఇరవయ్యేళ్ల వయస్సు… మెరిట్ ఉంది… డైనమిజం ఉంది… కానీ ఎందుకోగానీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ కాలేకపోయింది… విధి లేక డిగ్రీలో జువాలజీ సబ్జెక్టు తీసుకుని చదవసాగింది… విదేశాల్లో స్కాలర్షిప్స్ ఇచ్చి వైద్యం బోధించే యూనివర్శిటీలకు అప్లయ్ చేసేది… ఉపయోగం లేదు… ఆమె పేరు కిరణ్ మజుందార్… తండ్రి రసేంద్ర మజుందార్ ప్రముఖ బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్లో హెడ్ […]
అమ్మ కడుపు కూడా ప్రదర్శన సరుకేనా…? ఇక్కడా ఆ హాట్దనమేనా..?!
ఆధునికత అంటే… అడ్డగోలుగా ఉండటమా..? బిపాసా బసు తాజా ఫోటోలు చూస్తే ఈ డౌటే వస్తుంది… ఒకప్పటి హాట్ హీరోయిన్ కదా, చివరకు బిడ్డ పెరుగుతున్న కడుపును కూడా హాట్ సరుకును చేసింది… కొందరు ఆహా ఓహో అని మెచ్చుకోవచ్చుగాక… కానీ దిగజారుడుతనమే… పలు దశల్లో అమ్మతనాన్ని కూడా ప్రదర్శనకు పెట్టడమే… బేబీ బంప్ ఫోటోలు ఈమధ్య ట్రెండ్… మరీ సెలబ్రిటీలు అయితే అదొక తప్పనిసరి తంతులా… వదిలేస్తే ఏదో పాపం చేసినట్టుగా భావిస్తున్నారు… అదీ కడుపు […]
ఆదిని తిట్టేంత సీనుందా పూర్ణకు… కొత్త యాంకర్ సౌమ్యకు అప్పుడే ర్యాగింగు…
బబర్దస్త్ షోకు వెళ్లిపోయిన అనసూయ ప్లేసులో సౌమ్య అనే కొత్త యాంకర్‌ను తెచ్చి పెట్టారు… గుడ్… తను గతంలో టీవీలో న్యూస్ ప్రజెంటర్… కాకపోతే తెలుగు రాదు సరిగ్గా… పర్లేదు, రష్మికి ఇన్నేళ్లయినా తెలుగు సరిగ్గా రాదు… చల్తా… ఐనా చేయగలిగితే ఉంటుంది, లేకపోతే వెళ్లిపోతుంది… హైపర్ ఆది రాగింగ్‌కు తట్టుకుంటే నిలబడుతుంది… లేకపోతే పారిపోతుంది… ఆది అంటే అసలు చెప్పాలనుకున్న విషయం వేరే గుర్తొచ్చింది… మొన్నటి నుంచీ ఈటీవీ ఢీ షో ప్రోమో వేసి చావగొడుతున్నారు… […]
నో స్టార్డం..! ఇప్పుడు ప్రతి భాషలోనూ కేవలం హీరోలు మాత్రమే ఉన్నారు…
Bharadwaja Rangavajhala………… స్టార్ ఢమాల్…. తెలుగు సినిమాకు సంబంధించి స్టార్ డమ్ అనే మాట ఉనికి కోల్పోయినట్టే కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆ మధ్య రాజమౌళి కూడా ప్రస్తావించాడు. సీనియర్ ఎన్టీఆర్ , చిరంజీవిలతోనే స్టార్ డమ్ అనే మాట అంతరించిందనే టోన్ లో మాట్లాడారాయన. ఈ మాటలో నిజమెంత ఉంది? అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఉండేది. స్టార్ సినిమా విడుదలైతే రివ్యూలు […]
నువ్వసలే అన్‌స్టాపబుల్… బాలయ్యా… మరీ కరణ్ జోహార్ తొవ్వలోకి వెళ్లకు…
అఖండ సినిమా గుర్తుందా..? ధర్మపన్నాలు చెప్పి, దబిడిదిబిడి చేయడానికి ఓ అఘోరా టైపు కేరక్టర్ ఉంటుంది… కానీ స్టార్ హీరోకు అది సరిపోదు కదా… మరో కేరక్టర్ మామూలు హీరో… ఫాఫం, జగమెరిగిన నాయకుడు, కానీ కల్లు కూడా తెలియదు, కలెక్టరమ్మ స్వయంగా కల్లు తాపించి, కల్లు ఏమిటో చెబుతుంది… అంతేకాదు, హీరోకు ఆవకాయ కూడా తెలియదు… హీరోయినే నాలుక మీద రాసి, ఆ టేస్టేమిటో చెబుతుంది… పక్కనున్న చమ్మక్ చంద్ర అంటూనే ఉంటాడు… ‘‘అమ్మా, తమరు […]
సిధ్ శ్రీరామ్ ఉచ్ఛరణే కర్ణకఠోరం… తోడుగా అనంత శ్రీరాముడి మిడిమిడిసిపాట్లు…
ముందుగా ఓ విషయం చెప్పుకుని… వివాదంలోకి వెళ్దాం… ఈటీవీలో వచ్చిన ‘పాడుతా తీయగా’ చాలా పాత వీడియోలు చూస్తుంటే ఓచోట ఎస్పీ బాలు అసహనంగా చెబుతున్నాడు… ‘‘నోట్స్, హైపిచ్, లోపిచ్… శ్రోతలకు పెద్దగా అక్కర్లేదు, కానీ భావయుక్తంగా ఒక పదాన్ని గాయకుడు ఉచ్చరించాడా లేదా గమనిస్తాడు… సరైన ఉచ్ఛరణకు సంగీత నియమాలు అడ్డం వస్తే, ఉచ్ఛరణ కోసం ట్యూన్లను, టోన్లను, నోట్లను మార్చుకోవాలి తప్ప మన పదాల్ని కాదు…’’ చప్పట్లు కొట్టాల్సిన సందేశం… ఇక వివాదంలోకి వెళ్దాం… […]
సిగ్గుపడేది ఏముంది..? వాటర్ క్యాన్లు అమ్మేవాడిని, హోటల్ వర్క్ చేసేవాడిని…
దేశంలో వందల మంది దర్శకులు… ఎందుకు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికే ఇంత ప్రశంసలు..? అసలు తను పాటల దొంగ… ఆల్రెడీ కోర్టులో ఓ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ కేసు కూడా పెట్టింది… అలాంటివాడికి ఎందుకింత మోత..? ఇదే అడిగాడు ఓ మిత్రుడు… నిజమే… సీన్లను సీన్లే ఎత్తేసిన జక్కన్నలకు వేల కోట్ల మార్కెట్… చప్పట్లు, ప్రశంసల దుప్పట్లు… తన జీవితం గురించి నిజాయితీగా మాట్లాడుతున్న ఓ దర్శకుడు కమ్ రైటర్ కమ్ హీరోకు ఎందుకు దక్కకూడదు […]
టీవీ9 దేవీ, యువార్ కరెక్టు..! విష్వక్సేన్ను పీకిపడేసిన హీరో అర్జున్… అనూహ్యం..!!
మొన్న ఓసారి చెప్పుకున్నాం గుర్తుందా..? ఇండస్ట్రీ ఎందుకు భ్రష్టుపట్టిపోతుందంటే… టీ సప్లయ్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్, హీరోయిన్ దాకా హీరోయే ఎంపిక చేస్తాడు… నిర్మాత ఎవరుండాలో కూడా తనే డిసైడ్ చేస్తాడు… కథ, కథనం, డైలాగ్స్, సంగీతం అన్నీ తనకు ఇష్టమున్నట్టే నడవాలి… తన లుక్కు, తన బిల్డప్పు, తన ఇమేజీ తనే ప్లాన్ చేస్తాడు… మరి నిర్మాత, దర్శకుడు, మిగతా వాళ్లు ఏం చేయాలి..? హీరో షూటింగుకు రాగానే ఓసారి కాళ్లు మొక్కాలి… రిలీజయ్యేంతవరకు […]
గుజరాత్లో ప్రచారం సరే… ఆ వీడియోలకు స్పందన ఎలా ఉంది మాస్టారూ..?!
ఆ వీడియోల విస్పోటనం ఎలా ఉంది..? హైకోర్టుల జడ్జిలు, అత్యున్నత దర్యాప్తు సంస్థలు, సుప్రీం జడ్జిలు, పాత్రికేయ సంస్థలు, పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులందరికీ అర్జెంటుగా పంపించారు కదా… రెస్పాన్స్ ఎలా ఉంది..? దేశమంతా గగ్గోలు పుడుతోందా..? జీరో… ఏ స్పందనా ఏ వైపు నుంచీ లేదు… అసలు అందులో ఏముందని..? ఎవరూ పట్టించుకోలేదు… అసలు తెలంగాణ, ఏపీల్లోనే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… బీజేపీయేతర సీఎంలు, యాంటీ బీజేపీ పార్టీలు కూడా లైట్ తీసుకున్నాయి… చివరకు ఆ కుమారస్వామి […]
అది ఇండియన్ ఐడలా..! ఓన్లీ నార్త్ ఇండియన్ ఐడలా..? ఇదేం వివక్షరా..!!
వివక్ష… బాలీవుడ్ సినిమాలన్నీ తన్నేస్తున్నా సరే, సౌత్ నుంచి డబ్బింగైన సినిమాలే వేల కోట్లు దున్నేస్తున్నా సరే, నార్త్ ఇండియన్ క్రియేటివ్ ఫీల్డ్ వట్టిపోయినా సరే… దక్షిణం మీద ఏదో వివక్ష, కక్ష, చిన్నచూపు… ప్రత్యేకించి టీవీ, సినిమా, మోడలింగ్ తదితర రంగాల్లో… నార్త్ ఇండియన్స్ అస్సలు సౌత్ ఇండియన్స్‌ను సహించరు అదేమిటో… అసలు వీళ్లు మన దేశం వాళ్లేనా అన్నట్టు వ్యవహరిస్తారు… ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే..? ఇండియన్ ఐడల్ షో తెలుసు కదా… టాప్ […]
అబ్బో… నలభయ్యేళ్లకు రీఎంట్రీ… క్రియేటివ్ వీడియోలతో భలే ప్రమోషన్…!!
ఓ వీడియో చూస్తుంటే… మన టాలీవుడ్‌కు సంబంధించిన ఓ ఎపిసోడ్ యాదికొచ్చింది… విష్వక్సేన్ గురించి వాడెవడో పెయిడ్ ఆర్టిస్టు కారు ఆపి, ఓ ఫ్యుయల్ క్యాన్ చేతిలో పట్టుకుని, వీడియో తీయించుకుంటూ, అరుస్తూ కిందామీదా పడిపోవడం, ఫాఫం విష్వక్సేన్ వాడిని పైకి లేపి ఆదరంగా ఆదుకోవడం, అక్కడి నుంచి నేరుగా టీవీ9కు వెళ్తే, దేవి రుధిరభాషలో ‘యూ గెటవుట్ ఫ్రం మై స్టూడియో’ అని బయటికి వేలు చూపించడం… చకచకా గుర్తొచ్చాయి… మామూలుగా ప్రస్తుతం కన్నడ సినిమా […]
ఈ కళ్లు గుర్తున్నాయా..? కాంతార మూవీని నిలబెట్టిన అదనపు స్థంభాల్లో ఒకటి…!!
కాంతార సినిమా చూసినవాళ్లకు ఈ పాత్ర తెలుసు… ప్రత్యేకించి ఈ కళ్లు తెలుసు… అంత త్వరగా మరిచిపోరు… నిజానికి రిషబ్ శెట్టి క్లైమాక్స్ కేవలం తన వల్లనే రక్తికట్టలేదు… ఇదుగో ఇలాంటి పాత్రలెన్నో ప్రాణం పెట్టి నటించారు కాబట్టి, అన్నీ కలిసి అదిరిపోయింది.,. సినిమా చూడలేదా..? పర్లేదు, దిగువన ఓ వీడియో ఉంది చూడండి… దైవ అనే పాత్ర… ఛాతీని ఎగరేస్తూ… అరుస్తూ… ఆ కళ్లతో నిప్పులుమిసేలా చూస్తూ… ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు… ఆయన పేరు నవీన్ బొండె… […]
గోవా బిందాస్ టూరిజాన్ని దాటేసిన వారణాసి ఆధ్యాత్మిక టూరిజం..!
అందరికీ తెలుసు… ఒకప్పుడు ఘాట్ల నుంచి కాశీ విశ్వనాథుడి మందిరం వెళ్లాలంటే పెద్ద చిరాకు… అక్రమ భవనాలు, ఇరుకు దారులు, పారిశుధ్యలోపాలు… దళారులు సరేసరి… ప్రధాని మోడీ కాశీని తన నియోజకవర్గంగా ఎంపిక చేసుకున్నాక యోగికి ఓ బాధ్యత అప్పగించాడు… కాశిని ఓ దారికి తీసుకురావాలని…! ఇంకేముంది..? యోగి తలుచుకుంటే అదెంత పని… బుల్డోజర్లు కదిలాయి… బోలెడు అక్రమ కట్టడాలు నేలకూలాయి… రెండుమూడేళ్ల క్రితం కాశీకి వెళ్లినవారికి, ఇప్పుడు వెళ్తున్నవారికి కాశీలో ఎంత తేడా కనిపిస్తుందో తెలుసు… […]
మునుగోడు ఎన్నికను నెత్తి మీదకు తెచ్చుకున్న పిచ్చి స్ట్రాటజీ ఎవరి పుణ్యమో..!!
మునుగోడులో ఎవరు గెలుస్తారు…? నిజానికి ఇది ప్రశ్న కాదు… మునుగోడును బీజేపీ ఎందుకు నెత్తిమీదకు తెచ్చిపెట్టుకుంది..? ఏం ఫాయిదా ఆశించింది..? ఈ పిచ్చి స్ట్రాటజీలతో కేసీయార్‌ను ఢీకొట్టాలని భావిస్తోందా..? అసలు బీజేపీలో మనసు పెట్టి ఆలోచించే వాళ్లే లేకుండా పోయారా..? రకరకాల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి… వాటిల్లో అధికశాతం పేర్లు ఎప్పుడూ వినలేదు… బాగా బయాస్డ్… కానీ ఆరా సర్వేను మనం ఒక విశ్లేషణకు బేస్ గా తీసుకుందాం… వాళ్లు లేటుగా ఎగ్జిట్ పోల్ రిలీజ్ […]
ఈ తుషార్ అసలు కథ ఇదా..? అబ్బో.., కేసీయార్‌కూ ఇన్‌డైరెక్ట్ దోస్త్…!!
‘‘తుషార్ చెబితే సంతోష్ వింటాడు, సంతోష్ చెబితే అమిత్ షా వింటాడు, అమిత్ షా చెబితే మోడీ వింటాడు… ఆ తుషార్ మధ్యవర్తిగా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటున్నారు…’’ ఇదే కదా కేసీయార్ మొన్న పదే పదే చెప్పింది… అసలు ఎవడు ఈ తుషార్..? కేబినెట్ సెక్రెటరీయా..? ఆర్ఎస్ఎస్ ప్రముఖ్..? అజిత్ ధోవల్ చుట్టమా..? అబ్బే, ఎవరూ కాదట… ఇదే కేసీయార్ చెప్పాడు… రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో కేరళలో వయనాడులో నిలబడ్డాడు కదా, అదుగో అప్పుడు రాహుల్ […]
అక్కడ అంబానీ బ్రదర్స్… సేమ్, టాలీవుడ్లో అల్లు బ్రదర్స్…
అల్లు శిరీష్..! ఓసారి చెప్పుకోవాలి… తనలో స్పాంటేనిటీ ఉంది, ఎనర్జీ ఉంది… సెన్సాఫ్ హ్యూమర్ ఉంది… బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది… కానీ వీసమెత్తు లక్కు లేదు… ఎస్, ఇద్దరు అన్నదమ్ముల కథలు ఒకేరీతిలో సాగాలని ఏముంది..? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కథ తెలియదా మనకు… సేమ్, అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఎక్కడికో వెళ్లిపోయాడు… శిరీష్ ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయాడు… అల వైకుంఠపురంలో తనను స్టార్ హీరోగా నిలబెట్టింది… పుష్ప అయితే జాతీయ స్థాయికి […]
- « Previous Page
- 1
- …
- 301
- 302
- 303
- 304
- 305
- …
- 482
- Next Page »