నిన్న నమస్తే తెలంగాణలో ఫస్ట్ లీడ్ స్టోరీ ఒకటి వచ్చింది… ఏమిటీ అంటే..? తెలంగాణ భారత యూనియన్‌లో కలిసి 74 ఏళ్లు పూర్తయినందున, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవం నిర్వహించాలని పలువురు మేధావులు ముఖ్యమంత్రిని అడిగారట… సీఎం సానుకూలంగా స్పందించాడట… కేబినెట్లో చర్చిస్తామని చెప్పాడట… 75 ఏళ్లు కాలేదు, 74 ఏళ్లే… ఐతేనేం… రాజకీయ అవసరం… మేధావులు కేసీయార్‌కు చెప్పడం, ఆయన సావధానంగా వినడం, సానుకూలంగా స్పందించడం అసలు జరిగే పనేనా..? కావాలనే ఆ స్టోరీ వండబడింది… […]
ఈ లేడీ ఎంపీ బిగ్‌బాస్ హౌజులోకి..! చెల్లింపులపై సంప్రదింపులు..!!
నాయకులైతేనేం… వాళ్లకు వ్యక్తిగత జీవితాలు ఉండవా అని ప్రశ్నిస్తుంటారు చాలామంది… నిజానికి ఆ ప్రశ్న సరికాదు… సెలబ్రిటీలు, సొసైటీ మీద ప్రభావం చూపించగలవాళ్ల జీవితాలు స్ఫూర్తిమంతంగా ఉండాలి… పోనీ, ఆదర్శంగా ఉండకపోయినా సరే, కాస్త నైతికంగా హుందాగా సంస్కారయుతంగా ఉండాలని కోరుకుంటే తప్పేముంది..? మళ్లీ ఇక్కడ ఏది ఆదర్శం, ఏది నైతికం, ఏది హుందాతనం అనే ప్రశ్నల్లోకి వెళ్లకుండా… విషయంలోకి వెళ్దాం… మమతా బెనర్జీ తెల్లారిలేస్తే లక్ష నీతులు చెబుతూ ఉంటుంది… కానీ తన పార్టీలో, ప్రభుత్వంలో […]
తీసేవాడికి చూసేవాడు లోకువ… కక్కుర్తి కార్తీకదీపం కథ ప్రేక్షకులకు అర్థమైంది…
మనం చాలాసార్లు చెప్పుకున్నాం… కార్తీకదీపం తెలుగు నిర్మాతల కక్కుర్తి యవ్వారం గురించి… ఆ మలయాళ ఒరిజినల్‌కూ దీనికీ అసలు సంబంధమే లేకుండా పోయింది… ఇష్టారాజ్యంగా కథను, కథనాన్ని మార్చేస్తూ, కొత్త పాత్రల్ని తెస్తూ, కొన్ని తొలగిస్తూ… ఏది తోస్తే అది తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు… ఆ నల్ల పిల్ల ఏకంగా రంగుమారి తెల్ల స్త్రీ అయిపోయింది అంటేనే అర్థం చేసుకొండి… ఏ ప్రాంతీయ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు లేనంతగా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు… […]
బాలీవుడ్ షాక్..! సీఎం కేసీయార్ సినిమావాళ్లకు ఏం చెప్పాలనుకున్నట్టు..?!
ఊహించిందే… బ్రహ్మాస్త్ర ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు తెలంగాణ ప్రభుత్వం అర్ధంతరంగా అనుమతులు రద్దు చేయడంతో సినిమా యూనిట్ షాక్ తిన్నది… సినిమా వ్యాపారం అంటేనే సున్నితమైన యవ్వారం, అందుకే పొలిటికల్ వివాదంలోకి వెళ్లలేదు… పోలీసుల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామనీ, సహకరిస్తున్నామనీ చెప్పారు ప్రెస్మీట్లో… తప్పదు… ప్రతి విషయాన్ని పట్టుకుంటున్న బీజేపీ కూడా దీన్ని ఎందుకో లైట్ తీసుకుంది… దాంతో వివాదం సద్దుమణిగింది… కానీ..? రామోజీ ఫిలిమ్ సిటీలో బ్రహ్మాండమైన సెట్టింగులతో, భారీ హంగామాతో శుక్రవారం సాయంత్రం నిర్వహించదలిచిన ప్రోగ్రామ్‌ను పోలీసులు […]
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు… క్రూరహింసకు గురవుతున్న ఓ గుడి ఏనుగు కథ…
నిన్నో, మొన్నో యాంకర్ రష్మి వినాయకుడికి దండ వేస్తున్న ఓ గజరాజు వీడియో పోస్ట్ చేస్తే… వెనకాముందూ చూడకుండా, ఆమె గురించి తెలియకుండా హిందూ ద్రోహి అని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కొందరు… సరే, ఆ వివాదం ఎలా ఉన్నా, ఆ వార్తల్ని చెక్ చేస్తుంటే మరో ఇంట్రస్టింగ్ వార్త కనిపించింది… అదీ ఏనుగుదే… ఓ ఏనుగు బాధ… ఎందుకు ఒక్కసారిగా కనెక్టయ్యానంటే… ఆ ఏనుగు కోసం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం… రాష్ట్ర […]
మేల్ సావిత్రి..! అప్పటి హీరోయిన్ల కలల ప్రేమికుడు చివరకు గ్లాసుకు బలి..!!
ఐనా ఎవరికి గుర్తుంటాడులే… తన జయంతిని ఎందరు స్మరించుకుంటారులే… ఒక ఏఎన్నార్ అవుతాడు, ఒక ఎన్టీయార్ అవుతాడు అనిపించుకున్న ఓ అందాల నటుడి పుట్టినరోజు ఈరోజు… పేరు హరనాథ్… అసలు పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు… నిజంగానే ఓ దశలో చాలా పాపులర్ హీరో తను… రూపం, నటనతో మెప్పించాడు… ఎన్టీయార్‌కే సొంతం అనుకునే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రల్లోనూ ఒప్పించాడు… అంతెందుకు..? ఎన్టీయార్ దర్శకత్వంలోనే వచ్చిన సీతారామకల్యాణం సినిమాలో రాముడు హరనాథే… తరువాత ఎన్టీయార్ చెబితేనే […]
థియేటర్లలో థండర్ స్ట్రయిక్… టీవీల్లో మాత్రం మరీ బిచ్చపు రేటింగ్స్…
ఒకటికి పదిసార్లు కళ్లు నులుముకుని చూడాల్సి వచ్చింది… నిజమా..? కేజీఎఫ్-2 సినిమా రేటింగ్స్ మరీ అంత దయనీయమా..? హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ పరిశీలిస్తుంటే… కేజీఎఫ్- చాప్టర్2 సినిమా రేటింగ్స్ జస్ట్, ఆరున్నర మాత్రమే… ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే 6.53 మాత్రమే… ఏ దిక్కుమాలిన టీవీ సీరియల్ రేటింగ్స్ చూసినా దీనికన్నా బెటర్ అనిపిస్తాయి… హాశ్చర్యం ఎందుకంటే… ఇటీవల కాలంలో దేశంలోకెల్లా సూపర్ హిట్ సినిమా కేజీఎఫ్-2… థియేటర్లు దద్దరిల్లిపోయాయి… ప్రత్యేకించి సౌండ్ బాక్సులు… ఎగ్జిబిట్లర్లు, బయ్యర్లు, ప్రొడ్యూసర్ల […]
నాకు వేరే పులిట్జర్ అవార్డు అవసరమా..? ప్రభుత్వ పురస్కారం కావాలా..?
Taadi Prakash…………. ఎడిటర్ నండూరికి నివాళి, గతకాలపు మంచితనాన్ని మరొక్కసారి తలుచుకుంటూ …. నండూరి వారితో వదంత వీజీ కాదు!…. An Uphill Task at AndhraJyothi daily ______________________________________ జర్నలిజంలో పదేళ్లు పూర్తి చేశాను. 1974-75లో వచ్చిన ‘ఈనాడు’ తెలుగు జర్నలిజంలో భూకంపం పుట్టిస్తే, 1984-85లో వచ్చిన ‘ఉదయం’ సునామీ సృష్టించింది. ఈ రెండు దినపత్రికలూ రూల్స్ ఆఫ్ ది గేమ్ ని పూర్తిగా మార్చేశాయి. నిజానికి నేను ఈనాడుకీ ఉదయానికీ పుట్టిన అక్రమ సంతానాన్ని. […]
అసలు ఇజ్జత్ పోయింది ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదే కదా…!!
జెర బైఠీయే… అని పదే పదే బీహార్ సీఎం నితిశ్‌ను తెలంగాణ సీఎం కేసీయార్ చేయి పట్టుకుని కూర్చోబెట్టడం… అరె, వాళ్ల ట్రాప్‌లో పడకయ్యా స్వామీ, ఇప్పటికే బోలెడు టైం తీసుకున్నాం, పద, లే, పోదాం అని నితిశ్ పదే పదే వారించడం… నిన్నంతా నవ్వు పుట్టించింది… దాన్ని కూడా బీజేపీ రాజకీయం చేసేసి, ఏదో విమర్శకు ప్రయత్నించింది గానీ అది పెద్దగా పేలలేదు… నిజానికి అందులో కేసీయార్‌ను రెండు భిన్నరకాల్లో చూడొచ్చు… 1) జర్నలిస్టులను వెక్కిరిస్తూ, […]
ఘోరంగరంగ వైభవంగా..! మరో సినిమా మరో తోకపటాకులా ఫట్..!!
మెగా కుటుంబ శిబిరం… అది హీరోల ఫ్యాక్టరీ… ఎన్ని హిట్లు, ఎన్ని ఫ్లాపులు అనే లెక్కేమీ ఉండదు… సినిమాలు వస్తూనే ఉంటాయి… తెలుగు ఇండస్ట్రీని తరతరాలుగా శాసించిన ఓ సామాజికవర్గ పెత్తనాన్ని పెకిలించేస్తోంది ఈ మెగా శిబిరం… అందుకే ఆ క్యాంపులో ఏది జరిగినా అది వార్తే… కుటుంబ వ్యహారాలు గానీ, సినిమాలు గానీ… వ్యక్తిగతాలు గానీ… ఆ శిబిరంలోనే వేర్వేరు కుంపట్లు… అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా హీరోగా బాగా ఎదిగిపోయాక అల్లు అరవింద్ […]
20 నిమిషాలు నరికేశారు సరే… అసలు కథే పెద్ద గందరగోళం, దాన్నేం చేయాలి..?!
2001 సంవత్సరం… కృష్ణవంశీ అప్పట్లో ఫుల్లు పాపులర్… మహేష్ బాబుతో సినిమా… మురారి… పాటలన్నీ అద్భుతంగా వచ్చినయ్… కామెడీ భలే కుదిరింది… బావామరదళ్ల సరసం కూడా చక్కగా గిలిగింతలు పెట్టేలా అమిరింది… కానీ ఏదో ఓ మూఢ నమ్మకం చుట్టూ సినిమా కథ… ఉంటే ఉండనివ్వండి, మన ప్రేక్షకులు ఏదైనా భరిస్తారు… కానీ సినిమా నిడివి… మూడు గంటలు… ఓ రెండు నిమిషాలు ఎక్కువే… అనేకచోట్ల ప్రేక్షకులకు నచ్చలేదు… కాస్త కట్ చేద్దామయ్యా అంటే దర్శకుడు ఒప్పుకోడు… […]
అదే ఆంటీకి రష్మికి నడుమ తేడా… ఓ ట్రోలర్‌కు జబర్దస్త్ జవాబు…
ఇద్దరూ బూతు షో జబర్దస్త్ యాంకర్లే మొన్నటివరకూ… అవకాశాల్ని బట్టి సినిమాల్లో బోల్డ్ కేరక్టర్లలో నటించినవాళ్లే… కానీ ఎంత తేడా..? అనసూయ అనసూయే… రష్మి రష్మియే… కొన్ని వేల మంది అనసూయ మీద డిజిటల్ దాడికి దిగితే ఒక్కరంటే ఒక్కరూ టీవీ ఇండస్ట్రీ నుంచి గానీ, సినిమా ఇండస్ట్రీ నుంచి గానీ తన సపోర్టుకు రాలేదు… అదీ తను సంపాదించుకున్న క్రెడిబులిటీ… పైగా ఎవరి జోలికీ వెళ్లని బ్రహ్మాజీ కూడా ఓ సూపర్ సెటైర్ వేసి పరువు […]
లాల్‌సింగ్‌చద్దా వింత క్షమాపణ… అమంగళం అంతా తొలగిపోవుగాక…
జైనుల ప్రార్థనల్లో తరచూ వినిపించేది మిచ్చామి దుఃఖడం… అంటే ఉజ్జాయింపుగా అర్థం… ‘‘అమంగళం అంతా తొలగిపోవుగాక…’’ అంటే చెడు, బాధాకరమైనవి వెళ్లిపోవుగాక అని..! మనో ప్రక్షాళన ఇది… భావి వైపు ఆశావాదపు చూపు… అమీర్‌ఖాన్ తీసిన లాల్‌సింగ్‌చద్దా అత్యంత ఘోరమైన డిజాస్టర్‌ను చవిచూసిన సంగతి తెలుసు కదా… ఇదుగో ఈ వాక్యంతో ఓ క్షమాపణ వీడియో అమీర్‌ఖాన్ ప్రొడక్షన్‌కు సంబంధించిన సోషల్ మీడియా వేదికల మీద ప్రత్యక్షమైంది… నిజంగానే ఓ విశేషమే… చాలామంది నమ్మడం లేదు… బహుశా […]
చైనాతో నేపాల్‌కూ తలబొప్పి… ఆ రెండు హైడల్ ప్రాజెక్టులూ ఇండియా చేతికి…
పార్ధసారధి పోట్లూరి ……… చైనాది ఎంత విషకౌగిలో హంబన్‌తోట పోర్టుతో శ్రీలంకకు అర్థమైంది… నాసిరకం ఆయుధాలతో బంగ్లాదేశ్‌కు అర్థమవుతోంది… ఇప్పుడు నేపాల్‌కు కూడా అర్థమైపోయింది… చైనా అర్థంతరంగా వదిలేసిన రెండు విద్యుత్ ప్రాజెక్టుల పనుల్ని భారత్ కి ఇచ్చింది నేపాల్ ! నేపాల్ దేశం కోసం రెండు విద్యుత్ ప్రాజెక్ట్స్ ని నిర్మించమని భారత్ తో ఒప్పందం చేసుకున్న నేపాల్ ప్రభుత్వం… హిమాలయ రాజ్యం అయిన నేపాల్ పశ్చిమ భాగంలో సేటి హైడ్రో పవర్ ప్రాజెక్టు [West […]
హీరో గాడు బాగానే ఉంటాడు… నిర్మాతల కోపమంతా చిన్న ఆర్టిస్టుల మీదే…
ఒక సమాచారం ఆసక్తికరంగా అనిపించింది… నిర్మాతల మండలి సభ్యులు ఇటీవల సమావేశమై నిర్మాణవ్యయం తగ్గింపు మీద చర్చించారట… ఆర్టిస్టులు ఉదయం 7 గంటలకే సెట్‌కు వచ్చేయాలని నిబంధన పెట్టబోతున్నారట… నిజానికి అదికాదు ఆకర్షించింది… నటులు సాయికుమార్, మురళీశర్మలను పిలిచి, నిర్మాతలకు కాస్త సహకరించాలని కోరారట… ఎందుకు..? ఎస్, ఈమధ్య మురళీశర్మ చాలా పాపులర్… విలన్ కమ్ కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే నటులు కొందరే ఉన్నారు… ప్రకాష్‌రాజ్ ఎట్సెట్రా విలన్లకు క్రేజ్ పడిపోయింది… మొనాటనీ దానికి కారణం… ప్లస్ […]
కటకటా… చూడబుల్ సినిమాల్లేక, చూసేవాడు లేక… థియేటర్ల మూత…
ఏదేని ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు… కరోనా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు వ్యాపారసంస్థలు మూసేయడం సహజం… సినిమా కూడా వ్యాపారమే కాబట్టి థియేటర్లు కూడా మూసివేతకు గురవుతాయి… పైగా ఇదేమీ నిత్యావసరం కాదు… కానీ ప్రేక్షకులు రావడం లేదని బాగా పేరున్న పెద్ద థియేటర్లు కూడా మూసుకుంటున్నారంటే… అది ఖచ్చితంగా ఓ ప్రమాదసంకేతం… ప్రేక్షకులు థియేటర్ల వైపే రావడం లేదు దేనికి..? చాలా పెద్ద ప్రశ్న… ప్రస్తుతానికి థియేటర్ల వద్ద కూడా జవాబు లేదు… ఏడుపు తప్ప… తెలుగు […]
సుధీర్, రష్మి విడిపోయారు సరే… ఇమ్ము- వర్ష ఆ జంటకు ఆల్టర్నేటివా..?!
థియేటర్లకు వెళ్లే రోజులు కావివి… అవి దోపిడీ కేంద్రాలు… బయట వినోదపార్కులు, రిసార్టుల ఖర్చు జేబుకు చిల్లు పెట్టేదే… అందుబాటులో ఉన్న ఏకైక వినోదం టీవీ… అందులోనూ న్యూస్ చానెళ్లు చూడలేం, ప్రత్యేకించి వాటిల్లో చెత్త డిబేట్లు చూస్తే ఎర్రగడ్డే దిక్కు… అసలు ఆ ప్రజెంటర్లే పెద్ద వైరసులు… సీరియళ్లకన్నా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నయం… కాస్తోకూస్తో నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ షోలే కాస్త చూడబుల్… వాటిని సైతం సినిమా ప్రమోషన్ల వేదికలుగా మార్చాక అవీ చూడబుద్దేయడం […]
హేట్సాఫ్ బీహారీస్… బతుకు విలువ తెలుసు, బతకడమూ తెలుసు…
ఒక సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయీ అంటే… ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయీ అంటే… దాన్ని ఏరకంగా విశ్లేషించుకోవాలి..? అక్కడి మానవసమూహం సంక్షుభితంగా ఉన్నట్టా..? అభివృద్ధిరాహిత్యంలో ఉన్నట్టా..? భద్రత, బతుకు సమస్యలు పెరిగిపోయినట్టా..? మరి వాటికి ప్రధాన కారణాలు ఏమిటి…? ఇవి కొన్ని చిక్కు ప్రశ్నలు… నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఎప్పటిలాగే 2021 సంవత్సరానికి ఆత్మహత్యల సంఖ్యను క్రోడీకరించింది… చిన్న జిల్లాలతో సమానంగా ఉండే సిక్కిం, అండమాన్, పుదుచ్చేరిలను వదిలేస్తే… కేరళ, తెలంగాణ అగ్రస్థానంలో […]
కోబ్రా… ఉల్టా విక్రమ్‌నే కాటేసింది… అరె, ఇదేం సినిమా తీసినవ్ర భయ్…
విక్రమ్… అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్… క్రిస్టియన్ ఫాదర్, హిందూ మదర్… పుట్టిన ఊరు రామనాథపురం జిల్లా, పరమకుడి… ఆ ఊరు జాతీయ అవార్డు గ్రహీతల ఊరు… కమల్‌హాసన్, చారుహాసన్, సుహాసిని పుట్టిన ఊరు… వాళ్లే కాదు, విక్రమ్ కూడా జాతీయ అవార్డు గ్రహీతే… నటన అంటే పిచ్చి… ప్రయోగాలు అంటే పిచ్చి… సేమ్, కమల్‌హాసన్, రకరకాల వేషాల కోసం దేహాన్ని ఎన్నిరకాలుగానైనా హింసించుకోగలరు… ఆ కమల్‌హాసన్ దశావతారం చూశాం కదా… ఏకంగా పది పాత్రలు […]
చైనా ఆయుధాలు అంటే అంతే మరి… ఎంతకూ పేలవు, కాలవు, ఎగరవు…
పార్ధసారధి పోట్లూరి ………. చైనా ఆయుధాలు కొని మోసపోయిన బంగ్లాదేశ్ ! చైనా బాధితుల లిస్టులోకి తాజాగా బంగ్లాదేశ్ కూడా చేరిపోయింది! చాలా కాలంనుండి భారత్ చుట్టూ ఉన్న దేశాలకి ఆయుధాలు అమ్మడం ద్వారా భారత్ ని ఇబ్బంది పెట్టాలనే దురాలోచనతో ఉంది చైనా ! ఆ ఆలోచనని భారత్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆచరణలో పెట్టింది గుట్టుచప్పుడు కాకుండా ! అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు […]
- « Previous Page
- 1
- …
- 303
- 304
- 305
- 306
- 307
- …
- 466
- Next Page »