సినిమాలకు సంబంధించిన బేసిక్ సూత్రం ఒకటే… కొత్త ఆసక్తికర విషయం చెప్పాలి లేదా తెలిసిన విషయాన్నే ఆసక్తికరంగా చెప్పాలి… ఓ నాసిరకం చెత్త కంటెంటును జనం ఆమోదించేలా చేయడం రాజమౌళికి తెలుసు… కానీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హిందూ పురాణాలకు లింకై ఉన్న కంటెంటు ఉండీ అక్షయ్ కుమార్ ఓ చెత్త సినిమాను జనం మీదకు వదిలాడు… నిజానికి చెత్త సినిమా అనే స్ట్రెయిట్ వ్యాఖ్య సరికాదు… రామసేతు సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని అనుకున్నారు, దాంట్లో […]
రిషి శునాక్ మూలాలు పాకిస్థానీ గడ్డమీద..! కాకపోతే అప్పటికి పాకిస్థాన్ లేదు..!
ఎన్నడూ లేనిది ఓ బ్రిటన్ ప్రధాని గురించి ఇంతగా చర్చించుకుంటున్నాం దేనికి..? మనవాడు కాబట్టి… ఇక్కడ మనవాడు అంటే ఏమిటి నిర్వచనం..? ఇండియాలో పెద్ద ఎత్తున తన గురించి చర్చ జరుగుతోంది… ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, మనవాడు అని ఓన్ చేసుకుంటున్నాం, కానీ నిజానికి తన రూట్స్ ఇండియావేనా..? కావు..! పాకిస్థాన్‌వి..!! నిజమే… గుజ్రన్‌వాలా అని ఓ ఊరు… ఇండియా- పాకిస్థాన్ విభజన వేళ పాకిస్థాన్‌లో ఉంచారు… మరి అక్కడ చడీచప్పుడు లేదేం..? ఉండదు.,. ఎందుకంటే..? రిషి జన్మతః […]
ఓహ్… కాంతార సూపర్ హిట్ వరాహరూపం పాట ఈ ప్రైవేటు పాటకు కాపీయా..?
కాంతార సినిమా ఎంత హిట్టో తెలుసు కదా… అందులో చివరలో వచ్చే వరాహరూపం ఆ సినిమాకు ప్రాణం… ఇప్పుడు ఆ పాట వివాదంలో చిక్కుకుంది… కేరళలో చాలా పాపులర్ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ మాతృభూమి కప్పా టీవీ 2017లో రిలీజ్ చేసిన నవరసం పాటకు వరాహరూపం కాపీ అనేది తాజా వివాదం… దీనిపై సదరు కంపెనీ కాంతార నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్‌పై, దర్శకుడిపై కేసులు వేయాలని భావిస్తోంది… 2 మిలియన్ల సబ్స్క్రయిబర్లున్న ఈ యూట్యూబ్ మ్యూజిక్ చానెల్‌కు […]
శ్రీముఖితో కాసేపు ఆడుకున్న రమ్యకృష్ణ… శేఖర్, యశ్ మాస్టర్స్ సరేసరి…
మనకున్న టీవీ యాంకర్లలో సీనియర్, ఫుల్ ఎనర్జిటిక్ శ్రీముఖి… ఎదుటోడు ఏమైనా అంటే, వెంటనే మీద పడి గాయి పట్టేసేంత టెంపర్మెంట్, స్పాంటేనిటీ కూడా…! కాకపోతే కయ్య కయ్య హైపిచ్చులో అరవడమే యాంకరింగు అనే దుర్ భ్రమల్లో ఉంటుంది… ఆమెతో రకరకాల ప్రోగ్రామ్స్ హోస్టింగ్ చేయించేవాళ్లూ అదే కోరుకుంటున్నారేమో బహుశా… పాపం డ్రెస్సింగు విషయంలో కూడా గతంలో ప్రోగ్రామ్‌ను బట్టి, పద్దతిగా డ్రెస్ సెన్స్‌తో కనిపించేది… ఆమధ్య బిగ్‌బాస్ షోకు వెళ్లివచ్చిన తరువాత కాస్త గాడితప్పినట్టుంది… ఎప్పుడూ […]
అది 1979… చిరంజీవికి గుర్తుందో లేదో… మోహన్‌బాబు కూడా సహనటుడు…
Bharadwaja Rangavajhala….. 2014 లో అనుకుంటా …. ప్రముఖ సినీ దర్శకుడు ఐఎన్ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు అనే వార్త చూశాను. అప్పటికి ఆయన వయసు సుమారు 89 సంవత్సరాలు. ఎవరీ ఐఎన్ మూర్తి అనుకుంటున్నారా … ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సీతారామకళ్యాణం చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వ్యవహరించారాయన. నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం ఎన్టీఆర్ అని టైటిల్ కార్ట్స్ లో పడదు. అయినా అన్నగారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం అదే. […]
ఇదుగో ఇందుకే సోనియా ‘ట్రస్టుల’ లైసెన్సులను పీకేసింది హోం శాఖ..!!
పార్ధసారధి పోట్లూరి…… రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి FCRA అనుమతిని రద్దు చేసిన కేంద్ర హోమ్ శాఖ ! భారత హోమ్ మంత్రిత్వ శాఖ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి విదేశాల నుండి తీసుకునే విరాళాల మీద నిషేధం విధించింది ! రాజీవ్ ఫౌండేషన్ మరియు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ రెండూ కూడా NGO లు. ఈ రెండు సంస్థలు విదేశాల నుండి విరాళాలు సేకరించడం కోసం FCRA [Foreign Contribution (Regulation) Act] […]
నో బీఫ్… నో లిక్కర్… ఒకటీరెండు రోజులు ఉపవాసం… కానీ మస్తు వివాదాలు…
మనవాడు… అంటే..? మన కులం వాడా..? మన రాష్ట్రం వాడా..? మన గోత్రీకుడా..? ఎవరు మనవాడు..? మనవాడు బ్రిటన్ ప్రధాని అవుతున్నాడు అని కన్ఫరమ్ అయ్యేసరికి ఇక అందరూ మన సహజమైన అలవాటుకొద్దీ కులగోత్రాల అన్వేషణలో పడ్డారు… అక్కడికి తనకేదే పిల్లనిస్తున్నట్టు..! తను ప్రాక్టీసింగ్ హిందూ… అంటే ఆచరణాత్మక హిందువు… చివరకు పార్లమెంటులో ప్రమాణస్వీకారం కూడా భగవద్గీత సాక్షిగా చేశాడు… అంత ఆస్తికుడు… తన రూట్స్ మరిచిపోనివాడు… పేరు రిషి సునాక్… తల్లి, తండ్రి పేర్లు కూడా […]
దీపావళి షాపింగ్ మొత్తం ఆపేసిన విరాట్ కోహ్లీ… ఓ అరుదైన చార్ట్…
కొన్నిసార్లు అంతే… మామూలుగా చెబితే నమ్మం… కానీ అధికారిక గణాంకాల్లో చెబితే ఇక నమ్మక తప్పదు… అలాంటి నమ్మలేని నిజమే ఇది… నిన్నటి పాకిస్థాన్- ఇండియా టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచులో విరాట్ కోహ్లీ చేసిన పరుగుల తీరు, వాటి ప్రాధాన్యం, ప్రత్యేకించి ఆ చివరి ఓవర్ మీద ఈరోజుకూ ప్రపంచ క్రికెట్లో చర్చలు సాగుతూనే ఉన్నయ్… పాకిస్థాన్‌తో ఆట అంటే ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు ఓ ఆట కాదు… ఓ ఉద్వేగం… చాన్నాళ్లుగా క్రికెట్ […]
మనవాడే తెల్లవాళ్లకు ప్రధాని… ఏదో ఈగో హేపీ… కానీ తను అంత పవర్‌ఫుల్లా..?!
ఆహా… మనల్ని ఎన్నోఏళ్లు నిర్దయగా పాలించిన ఆ తెల్ల దొరలను ఇప్పుడు మనం పాలించబోతున్నాం… ఇదేనా మీ ఆనందం..? రుషి సునాక్ బ్రిటన్ ప్రధాని అవుతున్నాడు… కింగ్ చార్లెస్ సంతకం చేయడమే తరువాయి రుషికి ప్రధాని కిరీటం అధికారికమవుతుంది… ప్రస్తుతం పోటీదారులు లేరు, పాత ప్రధానులు బోరిస్ తదితరులు కూడా పోటీ నుంచి విరమించుకున్నారు… సో, రుషి కుర్చీ ఎక్కడమే తరువాయి… ఇప్పటికీ తన హిందూ రూట్స్ మరవని మనిషి… ఇండియన్ కల్చర్ అంటే ప్రేమించే మనిషి… […]
ఇది కాదురా పండుగ అంటే..! ఫాఫం, కృష్ణంరాజుకు ఓ నాసిరకం నివాళి…!!
మిగతా టీవీలకు ఎలాగూ చేతకాలేదు… యాడ్స్ రాలేదేమో గానీ, ఎవ్వడూ దీపావళి స్పెషల్ షో ప్లాన్ చేయలేదు… మాటీవీ వాడు బిగ్‌బాస్ దీపావళి స్పెషల్ ప్లాన్ చేసి, ఆదివారం సాయంత్రం ఎలా భ్రష్టుపట్టించాడో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ… కాస్త ఇలాంటి షోలలో కాస్త సీనియారిటీని, తన అనుభవాన్ని చూపే ఈటీవీ పూర్తిగా పండుగ ఉత్సాహాన్ని నాశనం చేసింది ఈసారి… ఇదికదా పండుగ అంటే శీర్షికతో 3 గంటల షో… యాంకర్లు ఎవరూ దిక్కులేరు కాబట్టి రష్మిని, ఆడవాళ్లూ […]
మహా ఉత్కంఠ… ‘ఆ 3’ పరుగులు గుర్తున్నాయా..? వాటి చెల్లుబాటు వెనుక కథ ఇదీ…!
ఆట అన్నాక ఎవరో ఒకరు గెలుస్తారు… ఒకరు ఓడిపోతారు… కానీ ఇండియా, పాకిస్థాన్ నడుమ ఆట అంటే… అదీ ఓ యుద్ధమే… అంత ఎమోషన్ ఆటకు ముందే ఆవరించిపోతుంది… ప్రత్యేకించి రెండు దేశాల్లోనూ క్రికెట్ అంటే పిచ్చి… మరిక రెండు దేశాల నడుమ మ్యాచ్ అంటే, ప్రతి బంతీ ఓ ఓ క్షిపణి… రెండు దేశాల్లో ఎక్కడా మ్యాచ్ నిర్వహించడానికి కూడా వీలు లేనంతగా దూరం… ఉద్రిక్తతలు ఎప్పుడూ… ఏదో ఓ తటస్థ వేదిక దొరికినప్పుడు ఇక […]
ఈ కాంతార ‘హీరో’కు నిజమైన పరీక్ష ముందుంది… అదేమిటంటే..?
నిజమే… రిషబ్ శెట్టికి ముందుంది ముసళ్ల పండుగ… హార్ష్‌గా ఉన్నట్టుంది కదా వ్యాఖ్య… కానీ నిజమే… ఇన్నాళ్లూ తీసిన సినిమాలు వేరు, ఇప్పుడిక కాంతార తరువాత తీయబోయే సినిమా వేరు… తనకు తాను ఓ హైరేంజ్ బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు… హీరోగా, దర్శకుడిగా, కథకుడిగా..! ఎక్కడి 15 కోట్ల సినిమా… ఎక్కడి 250- 300 కోట్ల వసూళ్లు… డబ్బు సంగతి ఎలా ఉన్నా సరే, ఆ సినిమాయే ఓ ఊపు ఊపేస్తోంది… తన నటనను […]
కోహ్లీ కంటనీరు… ఎన్నాళ్ల బాధ బద్ధలై బయటికి వచ్చిందో… సింహం ఏడ్చింది…
విరాట్ కోహ్లీపై దేశమంతటా ప్రశంసల వర్షం… ప్రజలందరిదీ ఒకే ఎమోషన్… ప్రపంచకప్ వస్తే ఎంత..? పోతే ఎంత..? కానీ పాకిస్థాన్ మీద మ్యాచులో మాత్రం గెలవాలి… క్లిష్టమైన స్థితిలో ఆ గెలుపును తీసుకొచ్చి, దేశ ప్రజలకు, క్రికెట్ ప్రేమికులకు దీపావళి కానుకగా ఇచ్చాడు కోహ్లీ… కానీ ఎన్నాళ్లుగానో గూడుకట్టుకున్న ఏదో బాధ ఒక్కసారిగా బద్ధలైనట్టుంది… కన్నీరు ఆపుకోలేకపోయాడు… నిజానికి కోహ్లీ కంటనీరు అనేది చాలా అరుదైన విషయం… అంటే ఇప్పటిదాకా ఎంతటి బాధను లోలోపల అనుభవించాడో అనడానికి […]
4 గంటలు కాలినా… పండుగ స్పెషల్ తోకపటాకు పేలలేక తుస్సుమంది…
ఈసారి బిగ్‌బాస్ సీజన్ ఓ చెత్త… అది రేటింగ్స్‌లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది… సర్ప్రయిజులు లేవు, సడెన్ ఎంట్రీలు లేవు, రీఎంట్రీలు లేవు, అసలు ఈసారి సీజన్ మీద నిర్వాహకుల్లో ఎవడికీ ఇంట్రస్టు లేదు… దాదాపు నాలుగు గంటలపాటు ఆదివారం సాయంత్రం దీపావళి స్పెషల్ అని ప్రత్యేకంగా షో నడిపించారు… అసలే పాతాళంలో రేటింగ్స్ ఉన్నప్పుడు వీకెండ్ షో, అదీ పండుగ స్పెషల్ షో అంటే ఎంత క్రియేటివ్ వర్క్ జరిగి ఉండాలి… ప్చ్, ఏమీలేదు… […]
‘‘పసుపుతో 21 బియ్యపుగింజలు ఎర్రటిబట్టలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి…’’
ధన త్రయోదశి సందర్భంగా అందరూ ఎంతోకొంత బంగారం కొనాలని కొన్నేళ్లుగా మన తెలుగు మీడియాలో సాగుతున్న ప్రచారం.., బోలెడు స్టోరీలు రాస్తారు… ఫోటోలు వేస్తారు… ధన్‌తేరాస్ పేరిట ఈరోజుకు అత్యంత పవిత్రతను కట్టబెట్టి తెలుగు మీడియా తమ వ్యాపార ప్రయోజనాల కోసం పాఠకులకు చేస్తున్న ద్రోహం… కేవలం బంగారం దుకాణాలకు గిరాకీ పెంచే ఓ పిచ్చి ప్రయత్నం… మనం ఆమధ్య విపరీతంగా మీమ్స్, పోస్టులు, సోషల్ చెణుకులు చదివాం గుర్తుందా…? పర్సులో అయిదు యాలకులు పెట్టుకోవడం, బీరువాలో […]
గల్ఫ్ జలాల్లో అమెరికా అణు సబ్మెరెన్లు ప్రత్యక్షం… సౌదీకి బెదిరింపులు…
పార్ధసారధి పోట్లూరి …… గల్ఫ్ జలాలు వేడెక్కుతున్నాయి ! సౌదీ అరేబియాని బెదిరిస్తూ అమెరికన్ న్యూక్లియర్ జలాంతర్గాములు సౌదీ అరేబియా సముద్రంలో ప్రత్యక్షo అయ్యాయి! గత కొన్ని నెలలుగా సౌదీ రాజు అమెరికాని లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ! రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా విధించిన ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుదల సూచీ ఆకాశం వైపు చూస్తున్న తరుణంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచి ధరలు […]
అంతటి కంతారాలోనూ కొన్ని వెకిలి సీన్లు… కానీ ఈ సప్తమి భలే వెనకేసుకొచ్చింది…
లీల గుర్తుందా..? ఫారెస్ట్ గార్డ్ పాత్ర… కాంతార సినిమాలో రిషబ్ శెట్టి అలియాస్ శివ పాత్ర ప్రేమికురాలు… లీల పాత్రకు మరీ పెద్దగా ప్రాధాన్యం ఏమీ ఉండదు సినిమాలో… కానీ హీరోయిన్ హీరోయినే కదా… తన సినిమాలోని లీల పాత్రకు పనికొచ్చే ఫేస్ కావాలని రిషబ్ వెతుకుతూ, అనుకోకుండా ఇన్‌స్టాలో ఈమె ఫోటోలు చూశాడు… ఆల్రెడీ ఏదో సినిమాలో నటించింది… సో, ఆడిషన్‌కు రమ్మన్నాడు… తరువాత వోకే అన్నాడు… ఆమె పుట్టింది, పెరిగింది బెంగుళూరు… తండ్రి అసిస్టెంట్ […]
అమెరికాను నమ్మితే మనకు మునకే గతి… అది పాకిస్థానీ దోస్త్… తాజా ఉదాహరణ…
పార్ధసారధి పోట్లూరి …………. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ని CIA కి అప్పచెప్పినప్పుడే చెప్పాను పాకిస్థాన్ ని FATF నుండి బయటికి తెస్తుంది అమెరికా అని! నిన్న అదే జరిగింది ! FATF నుండి పాకిస్థాన్ కి ఉన్న గ్రే లిస్ట్ లో నుండి తీసేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గా పిలవబడే టెర్రర్ ఫండ్ ని అడ్డుకునే సంస్థని అమెరికా శాసిస్తుంది అని! పేరుకే జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు […]
వెన్నువిరిగిన రామోజీ..! హఠాత్తుగా ‘‘పెద్ద ఎండీ’’ కన్నుమూత..!!
ఈనాడు రామోజీరావుకు పెద్ద దెబ్బ… ఒకరకంగా తన వెన్నువిరిగినట్టే..! తన అప్పాజీ మరణించాడు… ఆయన పేరు ‘‘పెద్ద ఎండీ’’… నిజం, నిత్యవ్యవహారంలో ఆయన హోదా అదే… రామోజీరావు ఛైర్మన్ అయితే, ఆయన ఎండీ… అది ఏ సంస్థయినా అంతే… అంటే అర్థమైందిగా రామోజీ ఆర్థిక సామ్రాజ్యంలో ఆయన కీలక పాత్ర ఏమిటో… ఆయన పేరు అట్లూరి రామ్మోహనరావు… ఈ వార్త రాసే సమయానికి తన మరణవార్తను ఈనాడు సైట్, న్యూస్ యాప్ కూడా పబ్లిష్ చేయలేదు… లేకపోతే […]
డొల్లతనం..! ఒకప్పుడు ప్రపంచానికి నీతులు, పాఠాలు నేర్పిన బ్రిటన్ ఎడ్డిమొహం…
పార్ధసారధి పోట్లూరి ……… మేము ప్రపంచానికి నాగరికత నేర్పాము ! మేము ప్రపంచానికి ప్రజాస్వామ్యం ఇచ్చాము ! ప్రపంచంలో ఉన్న అన్ని జాతులలోకెల్లా భారతీయులు నీచ జాతి ! భారతీయులకి స్వాతంత్ర్యం ఇచ్చినా వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోలేరు…..-1947 లో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్ స్టీన్ చర్చిల్! మొన్న బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేసింది ! రాజీనామా చేయకపోతే 1922 లో చేసిన చట్టాన్ని మార్చి అయినా అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ దించేస్తాము […]
- « Previous Page
- 1
- …
- 305
- 306
- 307
- 308
- 309
- …
- 482
- Next Page »