ఓ వార్త చదువుతుంటే… ఇలాంటి మనోభావులు ఇన్నేళ్లూ ఎక్కడ నిద్రిస్తున్నారబ్బా అనిపించింది… ముందుగా ఆ వార్తేమిటో చదవండి… ‘‘బాలీవుడ్ నటులు సిద్ధార్థ మల్హోత్రా, అజయ్ దేవగణ్ నటించిన తాజా చిత్రం పేరు థాంక్ గాడ్… ఇందులోని కొన్ని సంభాషణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ న్యాయవాది హిమాంశు శ్రీవాత్సవ యూపీలోని జానపూర్ కోర్టులో ఓ పిటిషన్ వేశాడు… ఓ కేసు నమోదైంది… ‘‘అజయ్ దేవ్‌గణ్ సూటు వేసుకున్నాడు.., చిత్రగుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశాడు… చిత్రగుప్తుడు అంటే […]
పెద్దత్తకు భర్తా… రాచ్చస మావయ్యా… తెలుగు ప్రేక్షకులపై ఇనుప గుగ్గిళ్ల వాన…
మనకు అలవాటైన భాషలో… బాణీకి సరిపడా అందమైన పదాల పొదగడం ఎవరైనా చేయగలరు… యూట్యూబ్ పుణ్యమాని ఊరికిద్దరు పుట్టుకొచ్చారు… ఏక్‌సేఏక్… అవీ జానపదాలు, ఆధునికాలు, మిశ్రమాలు, కాలుష్యాలు, విషాలు, కషాయాలు… నానా రకాలు… కానీ అచ్చమైన తెలుగు పదాల అల్లిక ఓ రిథమ్‌లో వినిపిస్తూ అలరిస్తాయి, రక్తికడతాయి… ఎటొచ్చీ ఏదేని పరభాష గీతానికి అనువాదం రాయడమే అతి పెద్ద పరీక్ష, ఏ గీత రచయితకైనా… ప్రత్యేకించి తమిళ గీతాలు మరీ ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం టైపు… […]
పోయిందే, ఇట్స్ గాన్… ఎహె., బండ్ల బుర్రలో చిప్ కాదు… ఆ తిక్క ట్వీట్…
తెలుగు ఇండస్ట్రీలో రెండు ఎక్స్ట్రీమ్, ఫుల్లు కంట్రాస్ట్ కేరక్టర్లు… కాదు, కాదు, యూనిక్ కేరక్టర్లు కనిపిస్తాయి…. రాంగోపాలవర్మకేమో తన గుజ్జుకు తగినంత బుర్ర లేకపోవడంతో, ఓవర్ ఫ్లో అయిపోయి, ఎప్పుడూ మత్తడి దూకుతూ ఉంటుంది బయటికి… బండ్ల గణేష్కేమో చిన్నప్పుడే చిప్ కొట్టేసిందా, లేక చిప్ లేనేలేదా అనిపిస్తుంది… ఎప్పుడైనా వేదిక ఎక్కినప్పుడు చేసే ప్రసంగాలు చూస్తే, వింటే ఇండస్ట్రీ మీదే జాలేస్తుంది… అంతెందుకు..? తనను కూడా మీడియా ఓ కేఏపాల్‌ను చూసినట్టే చూస్తుంది… జోకర్‌గా పరిగణిస్తుంది… […]
నారాయణ నారాయణ… ఆ లవ్వు ట్రాకుల ముద్దులాటలేవి..? హగ్గులాటలేవి..?
ప్చ్… సీపీఐ నారాయణ నాగార్జున మీద మళ్లీ ఓ కౌంటర్ వేశాడు… బిగ్‌బాస్ హౌజ్ వ్యభిచార్ల కొంప అని ఒకటే మొత్తుకుంటున్నాడు… మనం ఆ రచ్చలోకి మళ్లీ వెళ్లడం ఎందుకులే గానీ… నిజానికి ఈసారి బిగ్‌బాస్ హౌజులో అంత పెద్ద సీనేమీ కనిపించడం లేదు నారాయణా..? తిడుతూనే నువ్వూ చూస్తుంటావుగా… రెండోవారం నామినేషన్ల ప్రక్రియ కూడా అయిపోయింది… ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క లవ్ ట్రాకూ స్టార్ట్ కాలేదు… ఇక థ్రిల్ ఏమున్నట్టు కామ్రేడ్..? గత సీజన్లలోనైతే ఇలా […]
జైళ్లు కిటకిట… కానీ ఎందుకలా లక్షల్లో కుక్కేస్తున్నారు… ఏవీ సంస్కరణలు..?
అస్సోం సీఎం హిమంత విశ్వశర్మను ఈ విషయంలో మెచ్చుకోవాలి… నిజానికి యూపీ సీఎం యోగీ చేయాల్సిన పని ఇది… తన బుర్రలోకి ఈ ఆలోచన ఎందుకు రావడం లేదో తెలియదు… అస్సోంలో 4 లక్షల పెండింగ్ కేసులున్నయ్… జైళ్లు నిండిపోయినయ్… ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నయ్… తీసుకొచ్చి జైళ్లలో కుక్కుతున్నారు… నేరాలు పెరిగిపోతున్నాయనేది కాదు ఇక్కడ ఇష్యూ… చిన్నాచితకా కేసుల్లో కూడా వేలాది మందిని జైళ్లలోకి తోసేస్తున్నారు… తద్వారా… జైళ్లపై భారం, కిటకిట, అనారోగ్యాలు, వాళ్లను ప్రజల […]
హతవిధీ… చివరకు టీవీ ప్రేక్షకులు కూడా తిరస్కరించేశారు…
ఈమధ్యకాలంలో దిల్ రాజుకు చేతులు కాలిన పెద్ద సినిమా బీస్ట్… కళానిధి మారన్‌తో కలిసి విజయ్ హీరోగా నిర్మించిన ఈ సినిమా నిజానికి డిజాస్టర్… కానీ తమిళ మీడియా మాత్రం 150 కోట్ల బడ్జెట్ పెడితే 250 కోట్లు వసూలు చేసింది అని తెగరాసేసింది… తమిళ పెద్ద హీరోల సినిమాలన్నీ తెలుగులోకి డబ్ చేసి వదిలేస్తున్నారు కదా… సేమ్, దీన్ని కూడా అలాగే వదిలారు… తొలిరోజు కలెక్షన్లు కుమ్మేశాయి… కారణం తెలుసు కదా… తమిళంలో సన్ నెట్వర్క్, […]
లూసిఫర్ సినిమాను తెలుగులోకి చిరంజీవీకరిస్తే… దాని పేరు గాడ్‌ఫాదర్…
మొన్నామధ్య బ్రహ్మాస్త్ర ప్రి-రిలీజ్ రద్దయ్యాక ప్రెస్‌మీట్ పెట్టారు కదా… అందులో జూనియర్ మాట్లాడుతూ ‘ఇంటెన్స్’ అనే పదాన్ని పదే పదే వాడాడు… సరే, ఆ సందర్భం, తను చెప్పాలనుకున్న ఉద్దేశం వేరు కావచ్చుగాక… కానీ అదేసమయంలో ఎక్కడో ‘సీతారామయ్యగారి మనమరాలు’ అనే సినిమా వస్తోంది ఎందులోనో… విగ్గు లేకుండా, మేకప్ లేకుండా, ఓ తాత పాత్రలో అక్కినేని ఎంత సమర్థంగా జీవించాడో కదా, ఒక్కటి… ఒక్కటి… కెరీర్లో ఇలాంటి పాత్రలు ఒక్కటైనా చేసి, మెప్పించకపోతే ఇక నటుడిగా […]
మురళీ శర్మ అంత తోపా..? ఆల్టర్నేట్స్ లేరా..? అసలు తప్పు నిర్మాతలదే..!!
డౌటేముంది..? తెలుగు నిర్మాతకే బుద్ధి లేదు… ఎక్కడో మురళీశర్మ గురించి చదువుతుంటే మరోసారి గట్టిగా అనిపించింది ఇదే… నిజానికి ఆ వార్తలో మురళీశర్మ పైత్యం గురించి మొత్తం రాయలేకపోయారు ఎందుకో… నిజానికి దాన్ని పైత్యం అని కూడా అనలేం, పిచ్చి నిర్మాతలు దొరికారు, తను అనుకున్నట్టు నడిపించుకుంటున్నాడు… తన తప్పేం ఉంది..? డిమాండ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనేది కూడా కొత్త సామెత… తను కూడా అంతే… తను కేవలం కేరక్టర్ ఆర్టిస్ట్… నో డౌట్, మంచి నటుడు… […]
చివరకు ఆ దిక్కుమాలిన టీవీ సీరియళ్ల ప్రమోషనూ వదలవా మహేశా…!!
రెండేళ్ల క్రితం కావచ్చు బహుశా… హఠాత్తుగా మహేశ్ బాబు జీతెలుగు తెర మీద కనిపించాడు… యాంకర్ ప్రదీప్ ఉన్నాడు, త్రినయని సీరియల్ నటి ఆషికా ఉంది… మూడు సీరియళ్లకు ఒకే యాడ్‌లో ప్రమోషన్ చేసేశాడు… వాటి పేర్లు త్రినయని, ప్రేమ ఎంత మధురం, తూర్పుపడమర… అందులో త్రినయని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లది… వాటిల్లో త్రినయని, ప్రేమ ఎంత మధురం సవాలక్ష వంకర్లతో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి… నెత్తిమాశిన సీరియళ్లు అవి… వివరంగా చెప్పడానికి స్పేస్ సరిపోదు ఇక్కడ… […]
ఈనాడు, జ్యోతి భారీ ఫాల్… హైదరాబాద్‌లో ఈనాడును కొట్టేసిన సాక్షి…
కరోనా సమయంలో ప్రతి పత్రిక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంది… పేపర్ బాయ్స్‌ను అసలు చాలా లొకాలిటీల్లోకి ప్రజలు రానివ్వలేదు… చాలా పత్రికలు అనివార్యంగా తమ సర్క్యులేషన్‌ను తగ్గించుకున్నాయి… అనగా తాము ప్రింట్ చేసే కాపీల్ని కట్ చేసుకున్నాయి… కొన్ని పత్రికలు ప్రింటింగ్ మానేసి, నామ్కేవాస్తే ప్రభుత్వ ప్రకటనల కోసం కొన్ని కాపీలు ప్రింట్ కొడుతూ, వాట్సప్ ఎడిషన్లు పెట్టేసుకున్నాయి… పెద్ద పెద్ద మీడియా సంస్థలే అన్నీ మూసుకుని, డిజిటల్ ఎడిషన్ల వైపు మళ్లిపోయాయి… మరి అప్పుడెప్పుడో 2019లో […]
‘‘తెలంగాణ తల్లి అంటే గడీల్లో దొరసాని కాదు… రూపాన్ని కూడా మార్చేస్తాం…’’
తెలంగాణ తల్లి అంటే… తెలంగాణ ప్రభుత్వం ప్రతిచోటా ప్రతిష్టించిన విగ్రహాల్లో… ఒక చేతిలో బతుకమ్మ… మరో చేతిలో మక్క కంకి, జొన్న కంకి… తలపై కిరీటం… పట్టు చీరె… బంగారు హారాలు, వడ్డాణం, గాజులు… సర్వాలంకార శోభిత స్వర్ణ తెలంగాణ ఆమె… ఇన్నేళ్లూ ఆమెకే ప్రణమిల్లుతున్నాం కదా… నిజానికి తెలుగు తల్లికీ తెలంగాణ తల్లికీ పెద్ద తేడా ఏమీ ఉండదు… తెలుగు తల్లి అయితే ఒక చేతిలో కలశం, మరో చేతిలో వరికంకులు ఉంటయ్… అంతే తేడా… […]
అక్కినేనిని అంతగా అనగలిగాడు… అందుకే అతను ఆత్రేయ…
Bharadwaja Rangavajhala….. అక్కినేని మీద ఆత్రేయ వ్యాసం… సెప్టెంబరు 20 అక్కినేని జన్మదిన సందర్భంగా … ఎవరీ అక్కినేని? ….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు. నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఉన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు.అమ్మాడు. […]
తప్పుడు వార్తలకు అది చిరునామా… కొన్ని నిజాలు రాయకతప్పడం లేదు…
పార్ధసారధి పోట్లూరి ……. ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గేమిటి నాకు ? ఆ పత్రిక ధోరణి అదే… భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు వ్రాసే న్యూయార్క్ టైమ్స్ ఆ మాటకొస్తే డబ్బులు తీసుకొని ఎవరు ఎలా చెపితే అలా వ్రాస్తుంది న్యూయార్క్ టైమ్స్. చివరకి భారత దేశ ఆర్ధికాభివృద్ధి ఈ సంవత్సరం 7% ఉండబోతున్నది అంటూ బాధతో వాపోయింది గతి లేక… ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్ధికంగా దిగజారుతున్న సమయంలో ఒక్క భారత దేశమే […]
నిజమే… బ్రాహ్మణ యువకుడి పాత్రను రక్తికట్టించడం అంత వీజీ కాదు…
అబ్బే, నానితోనే కాలేదు, నాగశౌర్యతో అవుతుందా..? అనే ఓ వార్త ఎక్కడో చదవబడితిని… సదరు వార్తా రచయిత బాధేమిటయ్యా అంటే… ఆమధ్య నాని ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో బ్రాహ్మణ యువకుడి వేషం వేసెను కదా, అది కాస్తా తుస్సుమని పంక్చర్ అయిపోయింది కదా… తనతోనే బ్రాహ్మణ పాత్రను క్లిక్ చేయడం సాధ్యం కాలేదు, ఇక నాగశౌర్యతో అవుతుందా అని ఫిలిమ్ సర్కిళ్లలో చర్చ సాగుతోందిట… నిజానికి అది చదవగానే హఠాత్తుగా జూనియర్ ఎన్టీయార్ నటించిన అదుర్స్ […]
సింపుల్ స్టోరీయే… అంబానీ వదిలేశాడు… అదానీ గుప్పిట పట్టాడు…
హరి క్రిష్ణ ఎం. బి……. NDTV – Adani కథ.. టూకీగా… NDTV అంటే New Delhi TeleVision .. ఇది 1994-95 ప్రాంతంలో పెట్టారు… ప్రణయ్ రాయ్ (PR) రాధికా రాయ్ (RR) కలిసి పెట్టారు… తర్వాత పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయ్యింది… NDTV లో ఇద్దరూ తమ సొంత పేర్ల మీద తలా 12% అలాగే ఇంకో holding company (RRPR holding ltd) పేరు మీద ఒక 26% ఉంచుకున్నారు.. మిగతాది వేరే […]
బిగ్‌బాస్‌తో కెరీర్ గ్రోత్ అనేది ఓ భ్రమ… అవకాశాలేమీ తన్నుకురావు…
నవ్వొచ్చింది… వీజే సన్నీ అని ఓ నటుడు… బిగ్‌బాస్ వల్ల నాకు ఒరిగిందేమిటి..? అని ఏదో ఇంటర్వ్యూలో బాగా బాధపడిపోయాడట… ముందుగా తను ఏమన్నాడో చదవండి ఓసారి… ‘‘బిగ్‌బాస్ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు… బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పుకోవడం కూడా మానేశాను… ఎవరినైనా కలిసినప్పుడు బిగ్‌బాస్ విన్నర్‌ను అని చెబితే ‘అంటే ఏమిటి’ అనడుగుతున్నారు… బిగ్‌బాస్ వల్ల నాకు ఫేమ్, నేమ్ వచ్చిన మాట నిజమే… నా కెరీర్‌కు ఉపయోగపడిందేమీ లేదు… అందుకే ఇవన్నీ చెప్పడం […]
రష్యా ఎక్కడ తప్పు చేసింది..? ఉక్రెయిన్ యుద్ధం ఓ గుణపాఠం… (పార్ట్-2)
రష్యన్ వ్యూహకర్తల వెన్నుపోటు ? ముందుగా చరిత్రలోకి వెనక్కి వెళ్ళి, ఒక సంఘటనని ప్రస్తావిస్తే కానీ ఇప్పటి రష్యా వెనకబాటుకి కారణం అర్ధం అవదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అడాల్ఫ్ హిట్లర్‌తో యుద్ధ వ్యూహాలని చర్చించే ఒక జనరల్ ఫెడోర్ వాన్ బాక్ [Fedor von Bock] హిట్లర్‌తో గొడవపడ్డాడు. అది ఆపరేషన్ బ్లూ కేస్ [Operation Blue Case (Stalingrad and the Caucasus) కి సంబంధించి వ్యూహ రచన సందర్భంగా… ఈ ఆపరేషన్ రష్యాలోని […]
ఉక్రెయిన్ను మింగలేక రష్యా సైన్యం వెనక్కి…! పుతిన్‌కు తలబొప్పి… (పార్ట్-1)
పార్ధసారధి పోట్లూరి ………. ఉక్రెయిన్‌లోని ఖారఖీవ్ నుండి తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్న రష్యా ! దాదాపుగా 6 నెలలకి పైగా కొనసాగుతున్న రష్యన్ స్పెషల్ ఆపరేషన్ ఇన్ ఉక్రెయిన్ తుది దశకి చేరుకుంటున్నది! చేయాల్సిన యుద్ధం ఆయుధాలతో కాదని ఆర్ధికంతో అని పుతిన్‌కి తెలిసి వచ్చినట్లుంది ! *************** 8 ఏళ్ల క్రితం క్రిమియాని ఎలాంటి ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్న పుతిన్ గత ఫిబ్రవరిలో కూడా అదే రీతిలో డోన్బాస్ [Donetsk and Luhansk] […]
‘కృష్ణంరాజు మరణ వార్తల’ కవరేజీకి తెలుగు మీడియా సొంత లెక్కలు..!!
మహావృక్షం నేలకొరిగింది… వంటి పదాల్ని నేను వాడదల్చుకోలేదు… కానీ కృష్ణంరాజు మరణం తప్పకుండా మీడియాకు ప్రయారిటీ వార్తే… తన మరణం తాలూకు కవరేజీని తక్కువ చేయడానికి నిన్న అంత పెద్ద కొంపలు మునిగే అధిక ప్రయారిటీ వార్తలు ఏమీలేవు కూడా… పైగా నిన్నంతా టీవీలు, సైట్లు, ట్యూబ్ చానెళ్లు రకరకాల వార్తలతో హోరెత్తించాయి… పాత సంగతులన్నీ పూసగుచ్చాయి… మరి తెల్లవారి పత్రికల్లో ఏముండాలి..? కొత్తగా ఇంకేం చెప్పాలి..? ఎప్పటిలాగే ఈ ప్రశ్న తెలుగు మీడియాను వేధించింది, ఎప్పటిలాగే […]
కుమారస్వామీ… నీ జేడీఎస్‌ను మా కేసీయార్ పార్టీలో విలీనం చేస్తవా..?!
పారడాక్స్… అంటే ఒక వాక్యంలో రెండు వేర్వేరు అర్థాలు పరస్పరం వ్యతిరేకించుకుంటాయి… నిన్న కుమారస్వామి వచ్చి కేసీయార్‌తో సుదీర్ఘంగా చర్చించాడు… కమాన్, జాతీయ పార్టీ పెట్టెయ్, దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంటోంది, నేను సంపూర్ణంగా మద్దతునిస్తా, ప్రాంతీయ పార్టీల సమాఖ్యే ఇప్పుడు దేశానికి అవసరం అని కేసీయార్‌ను ప్రోత్సహించాడు… దేశ్‌కీనేతా కేసీయార్ అని నినదించినట్టే… మీడియా సహజంగానే ఫుల్ కవరేజీ ఇచ్చింది… ఐతే, ఇక్కడ చాలా విషయాలు, వాళ్ల మాటలు పారడాాక్స్… కేసీయార్ అడుగులు అంత త్వరగా […]
- « Previous Page
- 1
- …
- 317
- 318
- 319
- 320
- 321
- …
- 482
- Next Page »