వినదగునెవ్వరు చెప్పిన…. అన్నారు పెద్దలు..! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొన్ని హితవచనాలు పలుకుతున్నాడు… జగన్ మారీచసంతతి అని యెల్లో ద్వేషంతో నిందించవచ్చుగాక… కేసీయార్ శిబిరం సైతం ఆంధ్రజ్యోతిని పలుసార్లు తూలనాడవచ్చుగాక… కానీ కొన్ని పలుకుల్ని పరిగణనలోకి తీసుకోవాలి… ప్రత్యేకించి తమ తెలుగుదేశం శిబిరం అనుభవాలనే ఉదహరిస్తున్నందున… చంద్రబాబు తప్పుడు అంచనాలతో వేసిన అడుగులతో ఎలా నష్టపోయాడో చెబుతున్నందున కేసీయార్ తన చిరకాల సన్నిహితుడు రాధాకృష్ణ పలుకుల్ని విని, చదివి, ఆలోచించవచ్చుగాక… అందరికీ తెలుసు… కాంగ్రెస్ పుంజుకుంటున్నదనే తప్పుడు అంచనాలతో […]
రాములోరి లగ్గం పూట మామిడి సద్ది..! కంగాళీ చేయకండి, ఇలా చేస్తేనే అసలు రుచి…!!
శ్రీరామనవమి అనగానే… గుర్తొచ్చేవి పానకం, వడపప్పు… కొన్నిచోట్ల చలిమిడి… ప్రసాదం వరకూ ఇవి వోకే… కొత్త జనరేషన్ వాటి జోలికి పోవడం తగ్గిపోయింది, కొబ్బరికాయ కొట్టేసి, నాలుగు ఊదుబత్తీలు ముట్టించేసి దండం పెట్టేస్తున్నారు… అందరికీ పూజ తంతు తెలియాలని ఏముంది..? భక్తి మాత్రమే ముఖ్యం కదా… దేవుడు కూడా తప్పుపట్టడు… కానీ ఆత్మారాముడి కడుపు నింపే మెయిన్ కోర్స్..? పండుగపూట, అదీ రాములోరి లగ్గంపూట… నాలుకకు తీపి తగలకపోతే ఎలా..? అందుకే చాలామంది తమకిష్ఠమైన పాయసం చేసుకుని, […]
ఎంతసేపూ ఆ ‘‘వెంట్రుకలు పీకే’’ డిబేట్లేనా..? సొసైటీకి అవే అత్యంత ప్రాముఖ్యమా..?!
జాతికి అత్యంత అరిష్టదాయకాలు ఏవి..? ఇంకేముంటయ్..? క్షుద్ర రాజకీయాలు..! మీడియా, సోషల్ మీడియా కూడా నాయకుల ప్రేలాపనలకు, అజ్ఞానపు ప్రవచనాలకు ఇస్తున్న ప్రాధాన్యం ఇతరత్రా వార్తలకు ఇవ్వదు కదా… డిబేట్ జరపదు కదా… మన రాజకీయాలు, మన మీడియా రేంజ్ ‘‘వెంట్రుక పీకడం’’ డిబేట్ల దాకా వెళ్లిపోయింది… సంతోషిద్దాం… సరే, ముందుగా ఓ వార్త చదవండి… రాజస్థాన్ హైకోర్టు ఓ ఆసక్తిదాయకమైన ఉత్తర్వులను వెలువరించింది… అదేమిటీ అంటే… ఒక భార్య కోర్టుకు మొరపెట్టుకుంటే జీవితఖైదు అనుభవిస్తున్న భర్తకు […]
పనికిమాలిన ఉద్యోగుల కోసం… ప్రత్యేకంగా ‘‘పనిలేని ప్రభుత్వ శాఖ…!!
చాలామందికి పనిలేదు… ఉన్నా సరే చాలామందికి పనిరాదు… పనివచ్చినా సరే చాలామంది పనిచేయరు… చాలామంది చేస్తారు కానీ తమకు పనికొచ్చే పని అయితేనే చేస్తారు… అర్థం కాలేదా..? ప్రభుత్వ ఉద్యోగుల గురించే… సమాజానికి అల్లుళ్లు… వీళ్ల జోలికి ప్రభుత్వాలు పోవు, వణుకు… వాటి ప్రతాపం సామాన్యుడిపైనే… ఆర్గనైజ్డ్ ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు, వల్లెవేసే హక్కులు ఖజానాలకు, తద్వారా సొసైటీలకు జరిగే ఆర్థిక నష్టాల మీద అప్పుడప్పుడూ చర్చ సాగుతూ ఉంటుంది… కరోనా దెబ్బకు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు […]
నాటి అర్జున్ జెంటిల్మన్ సినిమా గుర్తుందా..? ఇదుగో ఆనాటి శుభశ్రీ…!!
అప్పట్లో… అంటే దాదాపు 30 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది… అర్జున్, మధుబాల హీరోహీరోయిన్లు… పేరు జెంటిల్మన్… అప్పట్లో బాగా హిట్టయ్యింది సినిమా… ఈ సినిమా పేరు వినగానే గుర్తొచ్చేది ప్రభుదేవా, గౌతమి సాంగ్ ‘‘చికుబుకు చికుబుకు రైలే’’… ఎవరి నోట విన్నా ఆ పాటే అప్పట్లో… అంత హిట్… ఇదోరకం ఐటం సాంగ్… అంటే సినిమా కథకు సంబంధం ఉండదు… సినిమా పేరు వింటే గుర్తొచ్చే మరో పేరు శుభశ్రీ… ఆమె అల్లరిచిల్లర ఆటలు […]
మంచి మానవాసక్తి కథనం… జీవం చంపేసిన ఈనాడు పాత్రికేయం…
ఈ వార్త చదివేకొద్దీ అసహజంగా తోచింది… ఏదో ఉంది… అదేమిటో అర్థం గాకుండా ఉంది… సాధారణంగా ఈనాడు ఒక సంస్థను గానీ, ఓ కమర్షియల్ ఆర్గనైజేషన్‌ను గానీ ఓ వాణిజ్య ప్రకటన తరహాలో ప్రమోట్ చేస్తున్నట్టుగా వార్తల్ని అనుమతించదు… ఇదేమో దానికి భిన్నంగా ఉంది… డెస్క్ కూడా వార్తలో ధ్వనించే సందేహాలకు నివృత్తి ప్రయత్నం కూడా చేసినట్టు లేదు… ఏదో వార్త వచ్చింది, వేసేశాం అన్నట్టుగా ఉంది… అదీ మెయిన్ పేజీలో… విషయం ఏమిటంటే..? మంచిర్యాలకు చెందిన […]
చద్దన్నం వేరు… పెరుగన్నం వేరు… పాచిపోయిన కథనాలు వేరు…
ఎంతటి ప్రయోజనకరమైన, సులభ అంశమైనా సరే… సంక్లిష్టం చేసి, నానా అబద్ధాలూ జతచేసి, సొంత పైత్యాలను తాళింపు వేసి, రుచీపచీ లేని వంటకంగా మార్చడంలో మన మీడియా తరువాతే ఏదైనా..! యూట్యూబర్లు, సైట్ల చెఫులను ఆడిపోసుకుంటారు గానీ, నిజానికి ఈ చెడగొట్టు విద్యలో మెయిన్ స్ట్రీమ్ మీడియా తరువాతే ఎవరైనా..! ఉదాహరణకు… చద్దన్నం..! ఈ చద్దన్నం గురించి మనం గతంలో కూడా రెండుమూడుసార్లు ముచ్చటించుకున్నాం… మళ్లీ ఎందుకు గుర్తుచేసుకోవడం అంటే… చద్దన్నం గురించి ఎవరికి తోచినట్టు వాళ్లు […]
అబ్బాయ్ వరుణుడా… ఏ ఖనిజ సంపదా లేని ఈ గని దేనికి స్వామీ…
సినిమా సంగతి తరువాత… నిర్మాత, దర్శకుల ఓ కొత్త ఆలోచన మాత్రం డిఫరెంటుగా అనిపించింది…. ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా… అంటే మరేమీ లేదు, తెలుగు, కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషలు మాత్రమే… మార్కెట్ ఈ భాషల్లో మాత్రమే ఉంటుంది… నాలుగు డబ్బులు రాలతయ్… జస్ట్, ఆయా భాషల్లోకి డబ్ చేసి మార్కెట్ మీదకు వదిలేయడమే… అయితే ఒకే భాష సినిమాలకు చెందిన నటులైతే వేరే భాషల వాళ్లకు పరాయి సినిమా చూస్తున్నట్టు ఉంటుంది… […]
మామిడికాయ పప్పుచారు… యూట్యూబ్ వంటల వీడియోలతో జాగ్రత్త సుమీ…
ఎంతసేపూ ఆ చెత్తా రాజకీయాలు, నేరాలు, ఘోరాలేనా..? కాస్త ఆత్మారాముడి సంగతీ చూద్దాం… మొన్నొక ఫేస్బుక్ దోస్తు బాధపడిపోయాడు… యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసి వంటలు చేయడం చాలా కష్టం సుమీ అని…!! కానీ చాలామందికి కాస్తోకూస్తో వంటలు నేర్పిస్తున్నది యూట్యూబే… కాకపోతే సదరు వీడియోల్లో చూస్తూ మక్కికిమక్కీ చేయాలని ప్రయత్నించడంతో వస్తుంది సమస్య… ఓ ప్రధాన సూచన, సలహా ఏమిటంటే… యూట్యూబ్ వీడియోల నుంచి వివిధ పంటల బేసిక్స్ తెలుసుకోవాలే తప్ప యథాతథంగా అనుసరించొద్దు… ప్రత్యేకించి […]
పొలిటికల్ టార్గెట్ వేరు… మరీ తల్లి మరణించినప్పుడూ అమానవీయ ధోరణేనా..?!
‘‘మేమెక్కడ అవమానించాం..?’’ అని కేటీయార్ అడుగుతున్నాడు… కానీ అవమానం అనేది నిజం… చివరకు ‘‘ఎక్కడ అవమానం జరిగిందో చెబితే వింటాం, అర్థం చేసుకుంటాం’’ అనే వ్యాఖ్యల్లో కూడా వెటకారం ధ్వనిస్తోంది… అయితే అర్థం కాని ప్రశ్న ఏమిటంటే..? కేసీయార్ ఎందుకు ఆమెను టార్గెట్ చేసి అవమానిస్తున్నాడు..? దీనివల్ల కేసీయార్‌కు వచ్చేదేముంది..? ఒక లేడీ గవర్నర్‌ను మరీ సంస్కారరహితంగా అవమానిస్తున్నారనే చెడ్డపేరు తప్ప..!! గవర్నర్ తల్లి మరణిస్తే విమానం వాడుకోవడానికి అనుమతించకపోవడం, ఎవరూ రాకపోవడం, కనీసం పరామర్శించకపోవడం అమానవీయం… […]
అమాత్యుల్ని అమాంతం పీకేశారు సరే… అసలు జగన్ ఆశించే ఫాయిదా ఏంటి..?
ఏపీ మంత్రుల మొహాలు మాడిపోయాయి, వాడిపోయాయి, కళాకాంతుల్లేవు, మూడీగా ఉండిపోయారు… అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దాదాపు సేమ్ కథనాల్ని ప్రచురించాయి… రెండూ ఒకే జన్యుసంతతి పత్రికలు కాబట్టి, ఒకే వేవ్‌లెంగ్త్, ఒకే తరహా ప్రయోజనాల కోసం పనిచేస్తాయి కాబట్టి సేమ్ కథనాలు రావడం పెద్ద విశేషం కాదు గానీ… మంత్రిపదవులు ఊడబీకబడిన నాయకుల మొహాలు వాడిపోయి గాకుండా… హుర్రే నా మంత్రి పదవి ఊడిపోయిందోచ్ అని గంతులేస్తారా..? కొత్త వెలుగులతో మొహాలు తళుక్కుమంటాయా..? రెండున్నరేళ్ల తరువాత అందరినీ […]
బుల్లితెర మీద కూడా ‘గల్లా’ చిరిగిపోయింది… సూపర్ డూపర్ డైనమిక్ ఫ్లాప్…
మస్తు డబ్బుంది… సో వాట్..? పొలిటిషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్ గల్లా జయదేవ్ కొడుకు… సో వాట్..? మహేశ్ బాబు మేనల్లుడు… సో వాట్..? ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించారు గల్లా అశోక్ అనే ఓ వారస హీరోను…! పెద్ద తెర మీదే కాదు, బుల్లి తెర మీద కూడా బోల్తాపడ్డాడు… ఏదేదో నేపథ్యం ఉంది కదాని, తెరను చించేస్తామని వచ్చేస్తే సరిపోదు,… అలా చాలామంది వచ్చారు, పోయారు… నిలబడింది కొందరే… అందుకే ఇదే అశోక్ తాత, అనగా సూపర్ […]
మరో వివాదంలో ఇళయరాజా..! పాటకు తొలిహక్కుదారుడు ఎవరు..?!
ఒక నిర్మాత… డబ్బు ఖర్చు పెడతాడు… లాభానికి, నష్టానికి రిస్క్ తీసుకుంటాడు… అందరికీ రెమ్యునరేషన్లు ఇస్తాడు, పనిచేయించుకుంటాడు… అనేక విభాగాలు, అనేకమంది, బోలెడంత ఖర్చు, రిలీజయ్యే వరకూ డౌటే… సక్సెసయితే డబ్బు, లేకపోతే నెత్తి మీద తుండుగుడ్డ… అయితే సినిమా టైటిల్ దగ్గర నుంచి రీమేక్, డబ్బింగ్, టీవీ హక్కుల దాకా మొత్తం నిర్మాత సొంతమే కదా… ఒక్క సినిమా సంగీతం విషయంలోనే తేడాలు ఎందుకు వస్తున్నట్టు..? సంగీత దర్శకుడికీ హక్కులుంటాయట… గాయకులకూ రాయల్టీలు ఉంటాయట… రికార్డింగ్ […]
ఫాఫం… అంతటి సంగీత సరస్వతి సైతం… గతి తప్పి… శృతి తప్పి…
ఆమె ఎవరో తెలుసా..? కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షురాలు… పద్మశ్రీ గ్రహీత… వయస్సు డెబ్బయ్ ఏళ్లు… పెప్సికో సీఈవో ఇంద్రా నూయికి మేనత్త… మంచి సంగీత కుటుంబం… పెద్ద పెద్ద వాళ్ల దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంది… నేర్చింది కర్నాటక సంగీతమే అయినా అన్నిరకాలూ పాడగలదు… ఎనిమిదో ఏటనే ఓ బంగారు పతకం పొందిన ఆమె అప్పట్నుంచీ పాడుతూనే ఉంది… ఆమె చరిత్ర చదువుతూ పోతే ఇలా చాలా చాలా విశేషాలు కనిపిస్తయ్… ఆమె పేరు […]
అది కరోనా XE కాదు… మీడియాకు, ఫార్మాసురులకు భారీ నిరాశ…
రెండేళ్లుగా మన మీడియా కరోనా మీద రకరకాల కథనాలతో భయపెడుతూనే ఉంది… భరోసా నింపే వార్తలు అక్కర్లేదు… ఫార్మాసురుల అబద్ధపు ప్రచారాలు, భీతిగొలిపే కుట్రవార్తల మీదే మన మీడియాకు ప్రేమ… అదుగో నాలుగో వేవ్, వచ్చె, వచ్చె, మళ్లీ ఎంత మంది చచ్చిపోతారో అన్నట్టుగా రకరకాల వార్తల్ని అయిదారు నెలలుగా రాస్తూనే ఉన్నాయి… చివరకు ఏ సంబంధమూ లేని ఎస్బీఐ, ఐఐటీల పిచ్చి లెక్కలను కూడా కాలాల కొద్దీ పేర్చి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి… తాజా ఉదాహరణ […]
ఆ అధికారి పొర్లుదండాలు సరే… కానీ ఏది క్షుద్రపూజ, ఏది ‘‘శాస్త్రపూజ’’…
అవును… ఆయన ఒక రాష్ట్ర వైద్య విభాగానికి డైరెక్టర్… అదీ ప్రజారోగ్యానికి సంబంధించిన విభాగం… శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి గానీ మూఢనమ్మకాలు, పూజలు ఏమిటనేది రచ్చ నిన్న సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్‌లో జోరుగా సాగింది… తనకు మానవాతీత శక్తులున్నట్టుగా వ్యవహరించే ఓ ఎంపీపీ దగ్గరకు వెళ్లిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఆమె చుట్టూ తిరుగుతూ, చెప్పిన మిరపకాయల పూజేదో చేశాడని ఆరోపణ… అవి క్షుద్ర పూజలు అంటూ ఓ టీవీ చానెల్ చిత్రీకరణ… పదిమందికీ […]
ఆ ‘వాలి’ మళ్లీ పత్తాలేడు… ఈ కొత్త లేడీ కేరక్టర్ తెరమీదకు వాలిపోయింది…
అయిపోయింది… రష్యా కథ ఖతం… నెల దాటింది ఉక్రెయిన్ అధ్యక్షుడు నెత్తి మీద వెంట్రుక ముక్కను కూడా రష్యా పీకలేకపోయింది… వేలాది మంది సైనికులు మరణించారు… ట్యాంకులు అప్పగించి భయంతో లొంగిపోతున్నారు… యుద్ధవిమానాలు కూలిపోతున్నాయి… రష్యా ఆయుధాగారం నిండుకుంది…… ఇలా బోలెడు వార్తల్ని పాశ్చాత్య మీడియా ప్రచారంలోకి తీసుకొస్తోంది… ఎవడిష్టం వాడిది… ఖండించేవాడు లేడుగా… చివరకు పుతిన్ అజ్ఞాతంలోకి పారిపోతాడు అన్నంత స్థాయిలో కథలు వండబడుతున్నయ్… గుర్తుందా..? ఆమధ్య వాలి అనే ఓ స్నైపర్ గురించి ఇదే […]
ఇదేం కామెడీరా బాబూ..? వికటిస్తున్న లవ్ ట్రాకులు… కుళ్లు జోకులు…!!
టీవీ షోలలో రేటింగుల యావతో కృత్రిమంగా సాగే లవ్ ట్రాకులు చాలా సహజం… బోలెడు చూశాం… షోల నిర్మాతలు, స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్టర్లు కావాలనే ఈ కాగితపు ప్రేమల్ని క్రియేట్ చేస్తుంటారు… తెలుగు టీవీ చానెళ్లలో ఎవర్ గ్రీన్ లవ్ ట్రాక్ సుధీర్, రష్మిలదే… పదేళ్లపాటు సాగుతూనే ఉన్నా, అది అబద్ధం అని తెలిసినా, వాళ్లే చెప్పినా సరే… ప్రేక్షకులు వాళ్ల కెమెస్ట్రీని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు… ఆ జంటను చూసి ఎన్నో జంటల్ని క్రియేట్ చేసి, […]
ఆంధ్రజ్యోతి కథనం భేష్..! మెయిన్ స్ట్రీమ్ చేయాల్సిన పని ఇదే..!!
కేంద్రం మీద రాష్ట్రం… రాష్ట్రం మీద కేంద్రం విమర్శలు కురిపిస్తున్నారు… బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా ఒకరినొకరు తూర్పారబట్టుకుంటున్నయ్… ఇప్పటికే కేంద్రం వైఖరి మీద రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది… 11న ఢిల్లీలో ధర్నా అంటోంది… చూసుకుందాం నీ పెతాపమో, నా పెతాపమో అనే రేంజులో గుర్రుగా చూసుకుంటున్నయ్… నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ ధాన్యం విషయంలో తన వైఫల్యాల్ని బీజేపీ మెడకు వేయాలని చూస్తోంది… మరోవైపు ధాన్యం రైతు దిక్కులు చూస్తున్నాడు ఇక… […]
అమ్మ… ఆమె చేతిలో అదే పాత చీపురు… అదే పని… నిర్వికారంగా…
పంజాబ్… బర్నాలా జిల్లాలోని ఉగోకే… ఆమె పేరు బల్దేవ్ కౌర్… ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్… అదీ కంట్రాక్టు పద్ధతిన… 22 ఏళ్లుగా కంట్రాక్టు జీతమే… ప్రతి ఏటా క్రమబద్ధీకరణకు ఆమె దరఖాస్తు చేసుకుంటుంది, ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుంది… భర్త కూలీ… ఆ ఇంటికి ఆమె తీసుకొచ్చే జీతమే ప్రధాన ఆధారం… పొద్దున్నే ఓ చీపురు తీసుకుని స్కూల్ వెళ్లడం, ఆవరణతోసహా గదులన్నీ క్లీన్ చేయడం, లాంగ్ బెల్ కొట్టేదాకా అక్కడే ఉండి, ఇంటికి వచ్చేయడం… అదే […]
- « Previous Page
- 1
- …
- 319
- 320
- 321
- 322
- 323
- …
- 447
- Next Page »