ముందుగా ఓ చిన్న విషయం… ఇన్ని రోజులైంది కదా కాంతార తెలుగులో కూడా విడుదలై… థియేటర్ల సంఖ్య డబుల్ చేసుకుంది… ప్రస్తుతం తెలుగు మార్కెట్లో స్టడీగా వసూళ్లు రాబడుతున్న సినిమా అదే… మొన్నటి శనివారం హైదరాబాద్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో 2.25 లక్షలు కలెక్టయ్యాయట… ఆదివారం కూడా అంతే… ఈమధ్యకాలంలో ఇది అరుదైన ఫీటే అంటున్నారు హైదరాబాద్ ఎగ్జిబిటర్లు… కాంతార స్టిల్ ఎంతగా జనాన్ని కనెక్టవుతోంది అని చెప్పడానికి తాజా ఉదాహరణ అన్నమాట… […]
చిరంజీవి బదులు బాలయ్య… అరవింద్ తాజా ధోరణితో అందరికీ ఆశ్చర్యం… కానీ…?
ఆహా ఓటీటీ… తెలుగు ఇండియన్ ఐడల్ షో… పోటీలు ముగిశాయి… టాప్ ఫోర్ లేదా టాప్ ఫైవ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు బాలయ్య ముఖ్య అతిథి… ఫినాలే అని ప్రకటించలేదు గానీ అది ఫినాలేలాగే సాగింది… నిజానికి అదే ఫినాలే గానీ, అంతకుముందే చిరంజీవికి కోపమొచ్చింది… అల్లు అరవింద్‌కు ఫోనొచ్చింది… దాంతో చిరంజీవితో ఫినాలే షూట్ చేసి, ప్రసారం చేశారు… మమ అనిపించారు… బాలయ్య తొలిసారి బుల్లితెరకొచ్చాక ఆహాలోనే అన్‌స్టాపబుల్ షో… అది మరో బాలయ్యను ఆవిష్కరించింది… షో […]
జగన్‌పై పీకే అసంతృప్తి, పశ్చాత్తాపం… అసలు ఏది గాంధీ కాంగ్రెస్..?!
అసలు సమస్య… పర్వర్టెడ్ మేధావులతోనే..! ఇలాంటి ఎన్నికల దందారాయుళ్ళతోనే..! కేసీయార్‌తో నాలుగు రోజులు కూడా ఇటీవల కలిసి పనిచేయలేక, మళ్లీ ఏపీకి పారిపోయిన ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా..? ‘‘జగన్, నితిశ్ వంటి నేతల పదవీకాంక్షలు తీరడానికి సహకరించాను, కానీ గాడ్సే విధానాలను ఓడించాలంటే గాంధీ కాంగ్రెస్ మాత్రమే ఈ దేశానికి శరణ్యం…’’ బీహార్‌లో 3500 కిలోమీటర్ల జనసురాజ్ పాదయాత్రలో ఉన్న ఆయన జగన్‌పై చేసిన వ్యాఖ్యల్ని కావాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేసుకున్నాయి, […]
సమంత ఆల్రెడీ డయాబెటిక్… కొత్తకాదు, మయోసైటిస్తోనూ చాన్నాళ్లుగా ఫైట్…
మీకు గుర్తుందా..? పోనీ, ఆర్కైవ్స్‌లోకి వెళ్లి వెతికినా కనిపిస్తుంది… అది డిసెంబరు 13, 2021…. సమంతకు బాగా అస్వస్థత… ఎఐజీ ఆసుపత్రిలో పరీక్షలు, చికిత్స… తరువాత ఇంట్లో విశ్రాంతి… ఈ వార్త దాదాపు ప్రతి మెయిన్ సైటులోనూ వచ్చింది… కానీ అంతకుముందు పలు సోషల్ సైట్లు ఆమె అనారోగ్య కారణాలపై ఏదేదో రాసేయడంతో ఆమె మేనేజర్, పీఆర్వోలు అది మామూలు దగ్గు, జలుబు మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నారు… కానీ అప్పటి నుంచే చాలామందికి తెలుసు ఆమె ఓ […]
భలే మూవీ… డ్రామా, ఫార్ములా దశల్ని దాటేసి… హఠాత్తుగా ఆత్మాన్వేషణ బాటలోకి…
Sunitha Ratnakaram….. రేవా (REVA)… ప్రతీ సినిమాలో హీరోకి ఒక లక్ష్యం వుంటుంది ఎక్కువగా ఒక అమ్మాయి వైపో ఏదో సాధించడం వైపో ప్రయాణమూ అందులో భాగంగా రకరకాల ఆటంకాలు; అవన్నీ ఎట్లా దాటేసి సాధించాడూ, లేదూ అన్నదే ఫార్మాట్ సినిమా. సాధారణమైన ఫార్మాట్. ఈ సినిమా కూడా ఆ లెక్కలో ఏమీ అసాధారణం కాదు. ఫక్తు commercial ఫార్మాట్, అందులోనూ పెద్ద ఊహించలేని రైటింగ్ కూడా కాదు. కానీ, ఒకానొక దశలో ఈ సినిమా మనతో […]
పూరీ జగన్నాథ్ బాధలో నిజాయితీ ఉంది… కానీ తోడుగా నిలబడేవాడే లేడు…
శరత్ కుమార్ చింత……… డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. కెరీర్ లో ఎన్నో హిట్లు, ప్లాపులు చూసిన దర్శకుడు.. ఇప్పుడు లైగర్ అనే ఒకే ఒక్క సినిమా డిజాస్టర్ తో ఎప్పుడు లేనంత నెగెటివిటీని ఫేస్ చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియర్ల మీద పోలీస్ కేసు దాకా వెళ్లడం, విషయాన్నీ ఇంతదాకా తీసుకొచ్చినందుకు ఇకపై అతని సినిమాలు కొనకుండా బ్యాన్ చేయాలని […]
‘‘ఒకవేళ పంజూరి వదిలినా సరే.., తప్పు చేస్తే నిన్ను గుళిగ మాత్రం వదలడు…’’
కాంతారా.., ఒక గొప్ప అనుభూతి! (సంస్కృతంలో, కన్నడంలో అర్థం: రహస్యమైన అరణ్యం) నేను మీకు స్థూలంగా కథ చెప్పదలుచుకోలేదు. ఆ మార్మికారణ్యం బోధించిన శివతత్వం ఏమిటో చెప్పదలిచాను… ఈ చిత్రం మూడింటి మధ్య సంఘర్షణ: సహజ ప్రకృతి సంపదను తన్నుకుపోయే భూస్వాములు, అమాయక గిరిజన ప్రజలు, అటవీ సంరక్షణ శాఖ… మూడింటిని కలుపుతూ, వాళ్ళకతీతంగా ఆ ప్రకృతి దేవత పార్వతి దేవి ఈ నేల మీ ముగ్గురిదీ కాదు, నాది అని చెప్పి సమతుల్యత తేవటం (ecological balance […]
కేసీయార్ ఎంత గోకినా, రక్కినా… కేంద్ర హోంకు ఉలుకూపలుకూ లేదేం..?!
కేసీయార్ ఇంత చెలరేగిపోతున్నాడు, బట్టలిప్పుతున్నడు, బట్టకాల్చి మీదేస్తున్నడు, బజారుకు గుంజుతున్నడు… ఐనా ఢిల్లీ బీజేపీ నుంచి రియాక్షన్ లేదు, భయపడుతున్నరా..? ఇందిరమ్మే ఉండి ఉంటే, రెండు నిమిషాల్లో ఖతం చేసేది సర్కారును…… అని చెప్పుకుంటూ పోతున్నాడు ఓ మిత్రుడు… సరే, మనం ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్లడం లేదు గానీ… బీజేపీ నిజంగా గవర్నర్లను ముందుపెట్టి, దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వాల మీదకు పోతోందా..? రాజకీయ ప్రత్యర్థుల ప్రభుత్వాల్ని కుట్రలు పన్ని కూల్చేస్తోందా..? అంత సీన్ లేదు… అదొక […]
కేసీయార్ ‘‘వ్యూహాత్మక మౌనం’’ వెనుకా బోలెడు జవాబుల్లేని ప్రశ్నలు..!!
జాగ్రత్తగా గమనిస్తే… చాలామంది సీనియర్ పాత్రికేయులు సైతం ‘‘నిజంగానే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నించింది, కేసీయార్ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు కానీ… ఆ ఆడియో క్లిప్పులు నిజమే… వీడియోలు కూడా బయటికొస్తాయి’’ అని నమ్ముతున్నారు… దొంగకోళ్లు పట్టుకునే బ్యాచ్‌లా కనిపిస్తున్న సదరు మధ్యవర్తులు ఎవరు అసలు..? వాళ్లు ఏది చెబితే అది అల్టిమేటా..? అసలు వాళ్ల వెనుక ఉన్నదెవరు..? వాళ్ల లక్ష్యమేమిటి..? ఎవరినిపడితే వాళ్లను ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ఎంగేజ్ చేస్తుందా..? ఇవి […]
పచ్చి బాలింతపై సర్కారు తప్పుడు పోలీసు కేసులు… ఎవరికీ బుర్రల్లేవు…
గతంలో…. ఇంట్లోనే పురుటినొప్పులు… దగ్గరలో ఎవరైనా మంత్రసాని దొరికితే సాయం… లేదంటే ఇంట్లోని ఆడవాళ్లే సాయం… కాసేపటికి కెవ్వుమని శిశువు ఏడుపు… బొడ్డుతాడుకు ముడి… లోకంలోకి మరో జీవికి స్వాగతం… చాలా ప్రసవాలు ఇవే… కానీ శిశుమరణాలు, బిడ్డ అడ్డం తిరగడాలు, ధనుర్వాతాలు ఎట్సెట్రా ఎన్నో విషాదాలు… ఇప్పుడు… రెగ్యులర్ చెకప్స్… ముహూర్తం గట్రా చూసుకుని చెబితే ఆ టైంకు లేడీ డాక్టర్ సిజేరియన్ చేస్తుంది… ఆపరేషన్ పెయిన్స్ తప్ప లేబర్ పెయిన్స్ ఉండని స్ట్రాటజిక్, ఇన్స్టిట్యూషనల్ […]
ట్విట్టర్ పిట్టను ఏం చేయబోతున్నాడు ఎలాన్ మస్క్..? ఓ నిశిత విశ్లేషణ..!
పార్ధసారధి పోట్లూరి ……….. స్పేస్ X, టెస్లా అధిపతి టెక్ జెయింట్ ఎలాన్ మస్క్ ట్విటర్ ని స్వాధీనం చేసుకున్నాడు ! గత 6 నెలలుగా సస్పెన్స్ డ్రామా నడిపాడు ట్విటర్ టేక్ ఓవర్ మీద ! ముందు ట్విటర్ ని కొనుగోలు చేస్తున్నాను అని ఎలాన్ మస్క్ ప్రకటించగానే ట్విట్టర్ షేర్ ధర అమాంతం పెరుగుదలని సూచించింది ! మళ్ళీ ఏమైందో ఏమో కానీ నేనేంటి, ఆ టెక్స్ట్ మెసేజ్ లు చేసే సంస్థని కొనడమేమిటీ […]
రిషబ్ శెట్టికి ఇదేమీ కొత్త కాదు… గతంలోనూ ఓ పాట పంచాయితీతో తలబొప్పి…
కాంతార సినిమాకు బలమే వరాహరూపం పాట… అసలు ఆ పాట లేకపోతే సినిమాయే లేదు… కానీ ఓ ప్రైవేటు మలయాళ మ్యూజిక్ కంపెనీ కేసు వేసింది… తమ ప్రైవేటు వీడియో నవరసం పాటకు వరాహరూపం కాపీ అని..! సినిమాలో ఆ పాట తీసేయాలనీ, అన్ని ప్లాట్‌ఫామ్స్ మీద ఆ పాట నిలిపివేయాలనీ తీర్పు పొందింది… నిజానికి ఆ రెండు పాటల నడుమ పెద్ద పోలికలు లేవు… పాటల కంటెంటు వేరు, వాటిల్లో చూపించిన కళారూపాలు వేరు… సరే, […]
‘‘నా మనమరాలు పెళ్లి గాకుండానే తల్లి అయితే తొలి ఆశీస్సు నాదే…’’
గుర్తుందా..? పెళ్లికి ముందు శృంగారం తప్పేమీ కాదని ఖుష్బూ అప్పట్లో అన్నందుకు ఆమెపై సంప్రదాయవాదులు భగ్గుమన్నారు… గుడికట్టి ఆరాధించిన వాళ్లే కనిపిస్తే ఖతం చేస్తామంటూ వీరంగం వేశారు… ఒకప్పుడు అది సంప్రదాయ విరుద్ధం… కానీ ఇప్పుడు అలా ఎవరైనా వ్యాఖ్యానిస్తే ఎవరూ పట్టించుకోరు… సమాజం దాన్ని ఆమోదించిందని కాదు… దాన్ని ఓ ప్రాధాన్యాంశంగా పరిగణించడం మానేసింది… జయాబచ్చన్ తెలుసు కదా… లెజెండ్ అమితాబ్ బచ్చన్ భార్య… తనూ ఒకప్పుడు హీరోయినే… రాజ్యసభ సభ్యురాలు… సమాజ్‌వాదీ పార్టీ తరఫున… […]
స్త్రీవాదం అంటే ఇదా..?! అనైతికతను, అక్రమ నడతను బోధించడమా..?!
తలుచుకుంటే ఆడది ఇంటి గడపకు కూడా తెలియకుండా వ్యభిచరించగలదు…. అని ఓ వెగటు, చిల్లర నానుడి తరచూ వినబడేది… నిజానికి అక్రమ సంబంధాలు అనేది పెద్ద సబ్జెక్టు… అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయి, ఉన్నాయి… వయస్సు, అవకాశం, ఆకర్షణ, ఆవేశం, అవసరం వంటివి ఎన్నో చర్చకు వస్తాయి ఆ చర్చలోకి వెళ్తే… కాకపోతే గతం వేరు… అవకాశం ఉన్నంతవరకే అక్రమ బంధాలు… ఇప్పుడు కొన్నాళ్లుగా నేరరికార్డులు చూస్తే విస్మయం… అక్రమ బంధాల సుడిలో పడి, ప్రియుళ్లతో కలిసి […]
అల్లు అరవింద్ తప్పు చేస్తున్నదెక్కడ..? అసలు టార్గెట్ కొట్టాల్సిందెక్కడ..?
ఒక టీవీ వినోద చానెల్ వేరు… ఓటీటీ వేరు… ఓటీటీ అనగానే ప్రేక్షకులు సినిమాలు, ఆయా ఓటీటీల ఎక్స్‌క్లూజివ్ వెబ్ సీరీస్ ఎట్సెట్రా చూస్తారు… అవి ఎప్పుడైనా చూసేలా ఉంటయ్… మళ్లీ వాటికి సబ్‌టైటిళ్లు, సపరేట్ భాషల ఆడియో అదనం… కేవలం సబ్స్క్రిప్షన్ మీద ఆధారపడి అంత కంటెంట్ క్రియేట్ చేసి, డంప్ చేయడం కష్టం… టీవీ వేరు… సీరియళ్లు అనబడే ఫిక్షన్ కేటగిరీ ఉంటుంది, నాన్-ఫిక్షన్లో రియాలిటీ షోలు, ఇతర ప్రోగ్రాములు ఉంటయ్… రెగ్యులర్ యాడ్స్ […]
గరికపాటిపై చిరంజీవి పరోక్ష వ్యాఖ్య మళ్లీ వైరల్… ఇంకా చల్లారినట్టు లేదు…!!
ముందుగా సందర్భం ఏమిటో చూద్దాం… సినిమా జర్నలిస్టు ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకం ఆవిష్కరణ… ముఖ్య అతిథి చిరంజీవి… కార్యక్రమం ముగిశాక కొందరు మహిళలు బొకే ఇచ్చి, సెల్ఫీ అడిగారు… ఈ సందర్భంగా చిరంజీవి ‘ఇక్కడ వారు లేరు కదా’ అన్నాడు… అంటే గరికపాటిని పరోక్షంగా ఉద్దేశించి… అక్కడున్నవాళ్లంతా పడీ పడీ నవ్వారు… మొన్నమొన్నటిదాకా వివాదం నడిచిందే కదా… దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ ప్రోగ్రాంలో వివాదం రేగిందే సేమ్, ఇలా మహిళల […]
చేతిలో 10 సినిమాలు..! అబ్బురమే… మిగతా పాత రక్తానికీ గిరాకీ ఉందండోయ్…!!
అలోన్, ఒలవుం తీరవుం, బర్రోజ్, రామ్ (పార్ట్-1), రామ్ (పార్ట్-2), లిజోజోస్ మూవీ (పేరు పెట్టలేదు) , వివేక్ మూవీ (పేరు పెట్టలేదు), లూసిఫర్ సీక్వెన్స్ ఎంపురాన్… ఇలా మొత్తం పది సినిమాలు ఉన్నయ్ 62 ఏళ్ల మలయాళ వెటరన్ హీరో మోహన్‌లాల్ చేతిలో…! నిజానికి సినిమాల ఫ్యాక్టరీ అంటే అక్షయ్ కుమార్ పెట్టింది పేరు… హిట్టా, ఫ్లాపా అక్కర్లేదు… ఉత్పత్తి మాత్రం ఆగకూడదు… కరోనాలు, విపత్తులు వాళ్లను ఆపవు… ఆపలేవు… మోహన్‌లాల్ కొడుకు కూడా హీరో, […]
వరాహరూపం దైవవరిష్టం… టైమ్ కూడా కలిసివచ్చి… డబుల్ థియేటర్లు…
దీపావళికి ముందు ఏం సినిమాలున్నయ్..? కొన్నిరోజులు బింబిసార, సీతారామం బాగానే నడిచాయి… వాటికి డబ్బులొచ్చాయి… రెండూ హిట్… ఇక కార్తికేయ-2 అనూహ్యమైన హిట్… హఠాత్తుగా అదీ పాన్ ఇండియా సినిమా అయిపోయింది… కోట్లకుకోట్లు నడిచొచ్చాయి… వోకే, ఇంకా..? దీపావళికి రిలీజైన నాలుగు సినిమాల్లో జిన్నాది ఓ విషాదగాథ… ఫాఫం, మా అధ్యక్షుడు మంచు విష్ణు అందులో హీరో, పాన్ ఇండియా సినిమా… సన్నీలియోన్, పాయల్ రాజపుత్ కూడా ఉన్నారు… కోన వెంకట్ కథ… ఇంకేం కావాలి..? కనీసం […]
అనుకోని ప్రయాణం… వనరులున్నా వాడుకునే సోయి కనిపించలేదు…!
చిన్న సినిమా అని తేలికగా తీసుకునే పనిలేదు… అది తప్పు కూడా… ప్రత్యేకించి ‘పెద్ద సినిమాల’కు రోజులు బాగాలేవు… స్టార్లు, బిల్డప్పులను జనం ఇష్టపడటం లేదు… అక్షయ్, అజయ్, చిరంజీవి, మోహన్‌లాల్ అందరూ ఈ ఫలితాల్ని అనుభవిస్తున్నవాళ్లే… అదేసమయంలో సరిగ్గా తీయబడిన కొన్ని చిన్న సినిమాలు తోకపటాకులు అనుకుంటే సుతిలి బాంబుల్లా పేలాయి… ఉదాహరణకు, కార్తికేయ-2, కాంతార, సీతారామం ఎట్సెట్రా… ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ వంటి గ్రాఫిక్ మసాలాల గురించి చెప్పుకోవడం దండుగ… ఇదెందుకు చెప్పుకోవడం అంటే… దర్శకుడికి […]
ఆలీ… అందరూ బాగుండాలి, అందులో తెలుగు కథకులూ ఉండాలి…
ఆలీవుడ్… టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తరహాలో ఆలీవుడ్… అనగా ఆలీ అనబడే కమెడియన్ కమ్ పొలిటిషియన్ కమ్ టీవీ ప్రజెంటర్ కమ్ కేరక్టర్ ఆర్టిస్ట్… తాజాగా నిర్మాత ఆలీ తీయబోయే సినిమాలను ఆలీవుడ్ అని పిలవాలట… పేరు బాగుంది… క్రియేటివ్‌గా ఉంది… ఓ సినిమా తీశాడు… అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి… సినిమా పేరు అదే… ఆలీ తత్వం కూడా అదే… సినిమా తీశాడు కానీ థియేటర్ల దాకా రానివ్వలేదు… అందులో అంత దృశ్యము లేదని […]
- « Previous Page
- 1
- …
- 324
- 325
- 326
- 327
- 328
- …
- 493
- Next Page »