నా దగ్గరకి ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నాకు తెలిసిన వాడొకడు. “మీరే ఎలాగైనా సాయం చేయాలి. ఎంతోమందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థంచేసుకోలేకపోయారు.” “ఏమిటోయ్ నీ కష్టం?” “పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి, ఇంతవరకూ పేరు పెట్టలేకపోయాం. నెట్ సెర్చ్ చేశాం, పుస్తకాలు వెతికాం. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీ దగ్గరకెళ్ళమన్నారు. మీరు తెలుసు కనక మీ దగ్గరకొచ్చాను.” “ఎలాంటి పేరు కావాలి?” “ఆ పేరు మా […]
ఈయన పేరు జగన్… తను జయలలిత కాదు… అప్పట్లో ఏం జరిగిందీ అంటే..?!
‘‘…. అంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మనుషులా..? పనిచేసినా, చేయకపోయినా, లంచాలతో తెగబలిసినా, పనిచేయడమే తెలియకపోయినా సరే, వాళ్లను మిగతా ప్రజలందరూ అల్లుళ్లలాగా మేపాలా..? ఈ కరోనా సంక్షోభంలో ఎన్నివేల ప్రైవేటు కొలువులు పోయాయి..? ఎన్ని వేల కుటుంబాలు బజార్నపడ్డాయి… వ్యవసాయం దెబ్బతిని ఎన్ని ఆత్మహత్యలు జరగడం లేదు..? ఏం..? వాళ్లంతా మనుషులు కారా..? ఒక్కసారి ప్రభుత్వ కొలువు వస్తే ఇక చచ్చేదాకా మేపే బాధ్యత సమాజానిదేనా..? అసలు జగన్‌కు దమ్ముందా..? తన వైఖరి మీద నిలబడే […]
ఖర్మకాలి ఈ దిక్కుమాలిన ఆంధ్రజ్యోతి కథనం చదవబడితిని…!!
పొద్దున్నే ఓ దిక్కుమాలిన వార్త చదవబడితిని… నిజానికి ఇతర తెలుగు పత్రికల్లో వచ్చే రాజకీయ వార్తలతో పోలిస్తే ఆంధ్రజ్యోతి కథనాలు మంచి దమ్ బిర్యానీ టైపులో ఉండునని ప్రతీతి… (తెలుగు రాజకీయ వార్తలు మినహా.., ఎందుకనగా, అవి పసుపు రంగులో చిక్కగా అదోమాదిరి వాసన వేస్తుండును)… కానీ ఈ ఉత్తరప్రదేశ్ కథనమొకటి చదివాక ఆంధ్రజ్యోతి మీద అపారముగా జాలికలిగెను… అసలు రాధాకృష్ణుడు తన పత్రికలో, తన టీవీలో, తన సైటులో ఏం వార్తలు వస్తున్నాయో వెనుతిరిగి చూసుకుంటున్నాడా […]
చివరకు రష్మి, సుధీర్ లవ్వుకూ కత్తెర..? ఈమెతో కొత్త కథ మొదలెట్టేశారా..?!
తెలుగు టీవీ తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్… తను ఏ సీరియళ్లలోనూ నటించడు… ప్రతి షోకు యాంకరింగు చేస్తానంటూ ముందుకురాడు… కానీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది తనకు… తను ఆ ఆదరణకు అర్హుడే… డౌన్‌టుఎర్త్… స్కిట్ కోసమే అయినా సరే, తన మీదే సెటైర్లు పేల్చినా సరే, లైట్ తీసుకుంటాడు… కానీ మల్లెమాల కంపెనీ తాలూకు వర్గకలహాల్లో పడి నలుగుతున్నాడు, ఒక్కో షోలో అడ్డంగా కత్తిరించుకుంటూ వెళ్తున్నారు… అది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం… పండుగ […]
కొడిగడుతున్న ‘కార్తీకదీపం’… ఎహె, ఫోఫోవమ్మా అనేస్తున్నారు ప్రేక్షకులు…
ఒక చిన్న డిస్‌క్లెయిమర్ :: ఈ కథనంలో చెప్పబోయే ఏ సీరియలైనా సరే… ఓ రీతి, రివాజు ఉండదు… తలాతోకా లేని కథనం, లాజిక్కుల్లేని కథ, దిక్కుమాలిన దర్శకత్వం, తలకుమాసిన కేరక్టరైజేషన్స్, ప్రేక్షకులు ఎడ్డోళ్లు అనే క్రియేటివ్ పొగరు, ప్రత్యేకించి తెలుగు ఆడవాళ్లకు బుర్రల్లేవనే పైత్యం… ఇత్యాది అవలక్షణాలతో కునారిల్లుతున్న సీరియల్సే… ఒక్కటీ మినహాయింపు కాదు… మరీ ప్రత్యేకంగా మగ వేషాలన్నీ ఆలోచనల్లో, అడుగుల్లో హిజ్రా తరహా… ఇంకా చెప్పుకుంటే పోతే దిమాక్ ఖరాబ్… కానీ కోట్ల […]
దిగ్దర్శకులు శ్రీశ్రీశ్రీ రాజమౌళి గారి దివ్యసముఖమునకు రాయునది ఏమనగా…
అల్లూరి సీతారామరాజు కథను దారుణంగా వక్రీకరించారనీ, ఒక ఆరాధ్యుడైన వ్యక్తి చరిత్రకు తప్పుడు బాష్యాలు చెబుతున్నారనీ మొన్న ఎవరో కోర్టులో ఆర్ఆర్ఆర్ సినిమా మీద కేసు వేశారని చదివాను… అదేరోజు సోషల్ మీడియాలో ఓ వీడియో కనిపించింది… కంటికింపుగా ఉంది… తమ ఆచారాల్ని, తమ నమ్మకాల్ని, తమ దేవుళ్లని కొన్ని మానవసమూహాలు పదిలంగా కాపాడుకునే తీరు అబ్బురంగా కూడా ఉంది… గోండులు నాగోబా జాతర కోసం గోదావరి గంగను తీసుకురావడానికి వెళ్లే దృశ్యం అది… ముందుగా ఆ […]
ఆత్మలు ఆవహించే కేరక్టర్ కాదు… మంత్రగత్తె అసలే కాదు… మహేంద్రజాలిని…!!
వయస్సు పాతికేళ్ల నుంచి ముప్ఫయిలోపు… కాస్త పొట్టిగా, బక్కపలుచగా… అందంగా ఉన్న ఓ అమ్మాయి… ప్రతి కదలికలో అంతులేని ఆత్మవిశ్వాసం, నిబ్బరం, మొహంలో కళ… ప్రత్యేకించి ఆ కళ్లు… మనస్సుల లోతుల్లోకి తీక్షణంగా చూస్తున్నట్టుగా…! ది ఫేమస్ ఇండియన్ ఐడల్ షో వేదిక మీదకు వచ్చింది… కంటెస్టెంట్లకు ప్లస్ యాంకర్‌కు తలా ఓ కాగితం, పెన్ను ఇప్పించింది… ఓసారి అలా చూసి, మీ మనస్సులో బొమ్మ గీయండి అని చెప్పింది… ముగ్గురు జడ్జిలు… ఒకరు అందరికీ తెలిసిన […]
ఇది కోపం కాదు… కడుపులో నుంచి తన్నుకొచ్చిన దుఃఖం… ఆందోళన, అసహాయత…
అవునూ, ఈ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు కనిపించలేదు… అంటే తండ్రి ఆవేశంతో, కోపంతో ఏదైనా ఘాతుకానికి పాల్పడితే తప్ప మెయిన్ స్ట్రీమ్‌కు వార్త కాదా ఏం..? నిజానికి ఇది వార్తే… తప్పకుండా రాయదగిన వార్త… సొసైటీలో చర్చ జరగాల్సిన వార్త… ఎందుకంటే..? కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో ఒక తండ్రి తన కూతురికి దినకర్మ పెట్టాడు… అంటే కర్మకాండ జరిపించేశాడు… అంటే తన దృష్టిలో మరణించినట్టు లెక్క… అంటే జస్ట్, […]
యదువంశంలో ముసలం… చిన్నమ్మపై అఖిలేష్ మంట… బీజేపీ పెట్రోల్…
నువ్వు నా పార్టీలో మంట పెడితే… నేను నీ ఇంట్లోనే చిచ్చు రాజేస్తా…… అలాగే ఉంది యూపీలో బీజేపీ కౌంటర్ పాలిటిక్స్ తీరు..! యదువంశంలో ముసలం పుట్టినట్టు… ఇప్పుడు ములాయంసింగ్ యాదవ్ ఇంట్లో లుకలుకలు, కైలాట్కాలు ముదిరిపోయాయి… కుతకుతలాడటమే కాదు, చీలిక స్పష్టంగా కనిపించి, అవి పార్టీ రాజకీయాల్నే బజార్న పడేస్తున్నయ్… మొన్న మనం చెప్పుకున్నాం కదా… ములాయంసింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరబోతోంది అని… దానికి కారణాలేమిటో, కుటుంబం మీద కులం […]
మరో బ్రేకప్..! ఇదీ ఓ పాపులర్ జంటే… ఇద్దరికీ రెండో పెళ్లి, అదీ పెటాకులు..!!
అప్పట్లో మహాభారత్ దూరదర్శన్ సీరియల్ ఓ సంచలనం… ఆమధ్య కరోనా ఫస్ట్ వేవ్, లాక్ డౌన్ సందర్భంగా మళ్లీ ప్రసారం చేస్తే మళ్లీ టీఆర్పీల్లో రికార్డ్ క్రియేట్ చేసింది… అందులో శ్రీకృష్ణ పాత్రధారి పేరు నితిశ్ భరధ్వాజ్… దాంతో బాగా పాపులర్ అయిపోయాడు… ఇప్పుడు ఆయన ప్రసక్తి ఎందుకంటారా..? 59 ఏళ్ల వయస్సులో పెళ్లానికి విడాకులు ఇచ్చాడు… ఇప్పుడు అంతా సెలబ్రిటీల పెటాకుల వార్తలే కదా ట్రెండింగ్… ఆ జాబితాలోకి ఆయన కూడా చేరిపోయాడు… పన్నెండేళ్ల బంధానికి […]
ఓహ్… చంద్రబాబుకు కూడా ఎన్టీయార్ ఆత్మ మార్గనిర్దేశం..!! క్షమించేసి ఉంటాడా..?!
ప్చ్… అడ్డెడ్డే… ఎంత పనిచేస్తివి లక్ష్మిపార్వతీ… ఇంత లేటుగా ఈ విషయం వెల్లడిస్తే ఎలా..? ఎన్టీయార్ మరణించి 26 ఏళ్లయ్యాక హఠాత్తుగా ఈ ఆత్మబాంబు ఎందుకు పేల్చినట్టు తల్లీ..? ఇదేదో ముందే చెప్పి ఉంటే, వర్మ తీసిన సినిమా కథ వేరే ఉండేది… అసలు ఎన్టీయార్ చెప్పిన వివరాలతో రెండుమూడు సినిమాలు అలా అలా అలవోకగా చుట్టేసి, అవతల పారేసేవాడు… హెబ్బే… ఇప్పుడు ఏం చెప్పినా ఏం లాభం..? పోనీ, నువ్వయినా ఆత్మకథలో ఈ ఆత్మ ఎపిసోడ్ […]
వైశ్యులు మండిపడ్డారు… జగన్ నిషేధించాడు… కానీ చింతామణి అసలు కథేంటి..?!
ఏదో చింతామణి అనే నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిందట… ఓహ్, అలాగా… దేనికి..? అందులో ఆర్య వైశ్య సామాజికవర్గంపై రీతిలేని కూతలు, అవమానించే వెకిలి రాతలు ఉన్నాయి కాబట్టి అట…! ఆ దిక్కుమాలిన నాటకాన్ని నిషేధించాలని సదరు సామాజికవర్గం కోరుతోంది కాబట్టి సకలకుల వల్లభుడైన జగన్మోహనుడు (ఆ ఒక్క కులం తప్ప) వెంటనే స్పందించి, ఠాట్, నా రాజ్యంలో మళ్లీ ఎవడూ ఆ నాటకాన్ని వేయకూడదనీ, వేస్తే మర్యాద దక్కదనీ అధికారికంగా హుకుం జారీ చేశాడుట… సరే, […]
అవునూ.., ముందుగా మందు ఏ బ్రాండ్లతో మొదలుపెడితే బెటరబ్బా..!?
Rajan Ptsk…………. తెలుగు “కోరా”లో ఓ అపరిచిత వ్యక్తి అడిగిన ప్రశ్న: నేను (25) ఇప్పటి వరకూ మద్యం సేవించలేదు. మానసిక ఒత్తిడి తో ఆరోగ్యం చెడగొట్టుకునే కన్నా మద్యం సేవించి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నా. నేను దేనితో (మద్యం రకం) మొదలు పెడితే మంచిది? . రాజన్ పి.టి.ఎస్.కె సమాధానం: మానసిక ఒత్తిడితో ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే మద్యం సేవించడమే ఉత్తమం. కానీ మీరు ఎంచుకునే బ్రాండ్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందుగా […]
నచ్చింది వార్త..! పెళ్లిళ్ల భారీ ఖర్చులపై ‘క్యాంపెయిన్’ ఇలాగే సాగాలి..!!
కొన్ని వార్తలు అసలు ఎందుకు మెయిన్ స్ట్రీమ్‌కు కనిపించవో, అవి వార్తలుగా ఎందుకు పరిగణనలోకి తీసుకోరో అర్థం కాదు… సొసైటీకి మంచి జరిగే ఆలోచనలు, వార్తలు మెయిన్ స్ట్రీమ్‌కు అస్సలు అక్కరలేదా..? ఈ వార్త ఫేస్బుక్లో ఓ మిత్రుడి వాల్ మీద కనిపించింది… వేములవాడలో ముస్లిం కమ్యూనిటీ ఓ భేషైన నిర్ణయం తీసుకుంది… అదేమిటో మీరే చదవండి… Mujahid Pasha…………. అమ్మాయి పెళ్లిలో విందు భారం వద్దు వేములవాడ గ్రామస్థుల తీర్మానం నికాహ్ (పెళ్లి) ఖర్చు అమ్మాయి తల్లిదండ్రులకు […]
ఆ అక్క కన్నీటిలాగే… ఆంధ్రజ్యోతి జర్నలిజమూ ఎండిపోయినట్టుంది…
ఒక హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తను ప్రజల్ని కనెక్టయ్యేలా రాయడం ఒకెత్తు… దాన్ని బరువైన హెడ్డింగ్‌తో, మంచి శైలితో రీరైట్ చేసి, పాఠకులకు ప్రజెంట్ చేయడం మరో ఎత్తు… మొదటిది రిపోర్టర్ పని… రెండోది డెస్కులో సబ్ఎడిటర్ పని… ప్రస్తుతం జర్నలిజం ప్రమాణాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి, ఆ చర్చలోకి వెళ్లకుండా… ఈ ఒక్క వార్త సంగతే ఆలోచిద్దాం… నిజానికి మనల్ని కదిలించే వార్త… గుండెల్ని కొన్నివార్తలు మెలితిప్పుతాయి… ఇదీ అలాంటిదే… విధివంచిత కుటుంబాలు, జీవితాలు… […]
చెన్నైలో రజినీ బిడ్డ ఐశ్వర్య… హైదరాబాదులో చిరంజీవి బిడ్డ శ్రీజ… ఒకేరోజు..?!
రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య… హీరో ధనుష్ విడాకుల వార్త ఇప్పుడు గాసిప్ కాదు, రూమర్ కాదు… హఠాత్తుగా అది అధికారికం అయిపోయింది… ధనుషే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు కాబట్టి…. కానీ ఒకవైపు తమిళ సుప్రీం మెగా స్టార్ రజినీకాంత్ బిడ్డ విడాకుల వార్త టాంటాం అయినరోజే… తెలుగు సుప్రీం మెగా స్టార్ చిరంజీవి బిడ్డ విడాకుల వార్త కూడా ఒక్కసారిగా టాంటాం అయిపోతోంది… సరే, ధనుష్ విడాకుల వార్త అధికారికం… మరి చిరంజీవి బిడ్డ సంగతి..? […]
ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయినట్టు..? 18 ఏళ్ల బంధం ఎందుకు తెగినట్టు..?!
పెద్ద విశేషం ఏమీ అనిపించదు కొన్నిసార్లు… టీవీ, సినిమా, మోడల్ రంగుల రంగాలే కాదు… సాధారణంగానే విడాకుల కేసులు పెరిగిపోతున్నయ్… ఏళ్లపాటు కాపురాలు చేసి, పెద్ద పిల్లలు ఉన్న దంపతులు సైతం విడిపోయి, ఎవరి బతుకులు వాళ్లు బతకడానికి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు… అడ్జస్ట్మెంట్ అనేది లేదిప్పుడు… కటీఫ్ అనేస్తున్నారు… అయ్యో, రేపు పిల్లల మెదళ్లపై పడే ప్రభావం ఏమిటి అనే సున్నితమైన భావన కూడా ఎవరినీ ఆపలేకపోతోంది… కానీ కొన్ని విడాకుల వార్తలు వినగానే విభ్రమ, షాక్ […]
నాగ బాబుగారొచ్చారు కదా… శ్రీముఖి ఎగిరిపోయింది… దీపిక పిల్లిలా వచ్చి చేరింది…
1.67 …. ఏదైనా టీవీలో రియాలిటీ షోకు, అదీ భారీగా ఖర్చుపెడుతున్న షోకు ఈ రేటింగ్ వచ్చిందంటే… మూసుకోవోయ్, ఇక చాలు అని ప్రేక్షకుడు స్పష్టంగా తిరస్కరించినట్టు లెక్క… ఆ షోలో నాణ్యత లేదని తేల్చేసినట్టు లెక్క… బ్రహ్మాండమైన రీచ్, సాధనసంపత్తి ఉన్న చానెల్లో ఓ షోకు ఆ రేటింగ్ వస్తే ప్రేక్షకుడు అభిశంసించినట్టు లెక్క… ఈటీవీ వాడి జబర్దస్త్‌కు పోటీగా స్టార్‌మాటీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే షో దుర్గతి అది… హైదరాబాద్ బార్క్ రేటింగులు […]
రండి… రియల్ దోస్త్ ఒమిక్రాన్‌ను ఆహ్వానిద్దాం… పర్లేదు, కోవర్జినిటీ కోల్పోదాం…
ఏమిటి ఈ దారుణమైన స్టేట్మెంట్ అనిపిస్తోందా..? ప్రపంచంలో కొన్ని లక్షల కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేసిన చైనా వాడి నీచ వైరస్‌ను ఆహ్వానించడం ఏమిటి అని ఆశ్చర్యమేస్తోందా..? కానీ నిజంగానే ఓసారి ఆహ్వానించాలి… అది వచ్చి అలుముకుంటే ఆనందించాలి… హమ్మయ్య, దేవుడిచ్చిన బూస్టర్ డోస్, అసలైన వేక్సిన్ అని ఆనందపడాలి… అవును, ఒమిక్రాన్ వేరియంట్ వస్తానంటే అస్సలు వద్దనకూడదు… అడ్డుకోకూడదు… ఛల్ హట్, ఇంకా ఇంకా దిక్కుమాలిన బూస్టర్ డోసులు, దానికి డప్పుపాడే వుహాన్ బిడ్డల వంటి మీడియా […]
ఈ చిన్న వీడియో బిట్… మనల్నీ ఓ అవ్యక్త ఉద్వేగానికి గురిచేస్తుంది…
అతను జన్మత బ్రిటిషర్… అతని తల్లి పేరు హన్నా… ఆమెవి స్పానిష్, ఐరిష్ రూట్స్… తండ్రి చార్లెస్వి ఫ్రెంచి రూట్స్… ఇద్దరూ వృత్తిరీత్యా నటులు… ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలతో డబ్బులు బాగానే వచ్చేవి… కానీ వచ్చిందంతా తండ్రి తాగుడుకే తగలేసేవాడు… ఇంట్లో అదే పేదరికం… ఆ తండ్రి కొన్నాళ్లకు ఆ కుటుంబాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు… మరికొన్నాళ్లకి చనిపోయాడు… తల్లి అష్టకష్టాలు పడి, పిల్లలను పెంచింది… కొన్నాళ్లకి ఆమెకి మతి చలించింది.., ఉన్మాదిని కావడంతో […]
- « Previous Page
- 1
- …
- 342
- 343
- 344
- 345
- 346
- …
- 448
- Next Page »