Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన చుట్టూ కనిపించే బతుకులే ఈ సినిమా కథ… కుడుంబస్తాన్…

March 12, 2025 by M S R

kudumbastan

. ( Ashok Pothraj )…… “కుడుంబస్తాన్” తమిళం (తెలుగు డబ్బింగ్ జీ5 OTT లో స్ట్రీమింగ్)… మన దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు. దానికి కారణం “ఫైనాన్సియల్ నాలెడ్జ్”… రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినిమా హీరోలు, వ్యాపార వేత్తలు యూ ట్యూబ్ లో కానీ, ఏ ఇతర సోషల్ మీడియాలో కానీ “ధనవంతుడు కావటం ఎలా…”? “డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ పెరుగుతాయి…?” అని వెతకరు, వాళ్ళే స్వయంగా […]

ట్రంపు వ్యాపారి, మస్క్ వ్యాపారి… మోడీ మెడపై ఒప్పందాల కత్తి…

March 12, 2025 by M S R

modi n musk

. స్టార్ లింక్ కు అనుమతులు రాక ముందే జియో, ఎయిర్ టెల్ ఒప్పందాలు… అప్పుడు అభ్యంతరాలు చెప్పిన సంస్థతోనే జట్టుకట్టిన సంస్థలు… అసలు ఇండియాలో ఇప్పటి వరకు శాటిలైట్ ఆధారిత డేటా సేవలు అందించేందుకు విధివిధానాలే లేవు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దీనికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు సిద్ధం చేయాల్సి ఉంది. కానీ ఈ లోగానే దేశంలోని దిగ్గజ టెలికం సంస్థలు అయిన రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ అమెరికాకు […]

పుష్ప2 లాభాలపై పిల్… ఆసక్తికరమైన కేసు… చర్చ జరిగితే మంచిదే…

March 12, 2025 by M S R

pushpa2

. ఇది మొన్నటి వార్త… నిజానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైన వార్తే… కానీ పెద్దగా డిస్కషన్ జరిగినట్టు కనిపించలేదు… మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకో మరి… హైకోర్టులో ఒక పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది… పుష్ప-2 లాభాలను చిన్న బడ్జెట్ చిత్రాల రాయితీలకు, జానపద కళాకారుల పింఛన్లకు వినియోగించాలని న్యాయవాది నరసింహారావు ఆ పిల్ వేశాడు… బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వల్ల ఆ సినిమాకు అపరిమిత లాభాలు వచ్చాయనీ, హోం శాఖ […]

ఈ జర్నలిస్టు అరెస్టు దుర్మార్గమే… కానీ ఆ జర్నలిజాన్ని ఏమందాం…?!

March 12, 2025 by M S R

. జర్నలిస్టు రేవతి మీద నిన్న కేసు నమోదు చేసినట్టున్నారు… ఉదయం అరెస్టు చేశారు… వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖండిస్తూ పోస్టులు… ఆ వెంటనే హరీష్ రావు, కేటీయార్ ఖండనలు… సర్కారు ఫాసిజం, దుర్మార్గం అంటూ… నిజమే, అసలు ఈ సత్వర స్పందనలు హాహాకారాల వెనుక నిజమేమిటో అర్థమవుతోంది గానీ… జర్నలిస్టులపై కేసుల్ని ఖండిద్దాం గానీ… దుర్మార్గమే గానీ… కానీ..? నిజానికి కొన్ని విషయాలు చెప్పుకోవాలి… అప్పట్లో ఈమె రవిప్రకాష్ సొంత చానెల్ మోజో టీవీని […]

గణతంత్రం, ఆ పోరాటాలు విఫలం… రాజరికమే మళ్లీ కావాలట…

March 12, 2025 by M S R

nepal

. సుమారు పదిహేడేళ్ల క్రితం.., మే 28, 2008న నేపాల్ 239 ఏళ్ల హిందూ రాజరికాన్ని రద్దు చేసింది. ఆ సమయంలో జ్ఞానేంద్ర షా రాజుగా ఉన్నాడు. 16,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన దశాబ్దకాలపు అంతర్యుద్ధానికి ఇది ముగింపు పలికింది. హిందువులు అధికంగా ఉన్న ఆ దేశం సమాఖ్య, లౌకిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆదివారం, వేలాది మంది గుమిగూడారు… దేశంలోని రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేమిపై […]

ఈ సారక్క ఎవరు మహాప్రభూ…? ఏదీ తెలియకుండానే పేర్లు పెట్టేస్తారా..?!

March 12, 2025 by M S R

medaram

. (శంకర్‌రావు శెంకేసి- 79898 76088) ….. ‘సమ్మక్క సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ’- తెలంగాణలో ఏకైక గిరిజన విశ్వవిద్యాలయం. ములుగు జిల్లా కేంద్రంలో ఉంది. రాష్ట్ర విభజన హామీల అమలులో భాగంగా.. 2023 డిసెంబర్‌ నెలలో పార్లమెంట్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీల చట్టం-2009కి సవరణ చేయడం ద్వారా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎలాంటి మౌలిక సౌకర్యాలు సమకూర్చకముందే ఓ పాత భవనంలో ఏకంగా జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 357 ఎకరాలు […]

ఆ ఒక్క సినిమా డైలాగ్‌కు… ఇప్పటికీ సొసైటీకి జవాబు దొరకలేదు…

March 12, 2025 by M S R

ntr

. Subramanyam Dogiparthi ………. కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ! 42 ఏళ్ల తర్వాత కూడా జనం మరచిపోకుండా ఉపయోగిస్తున్న డైలాగ్ . యన్టీఆర్- దాసరి- శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ బొబ్బిలి పులి సినిమా ఐకానిక్ డైలాగ్ . మరో సర్దార్ పాపారాయుడు . 39 సెంటర్లలో వంద రోజులు , రెండు సెంటర్లలో 175 రోజులు ఆడిన సూపర్ డూపర్ హిట్ […]

ఆమెకు పాఠం నేర్పిస్తానన్నాడు… తనే ఓ గుణపాఠం నేర్చుకున్నాడు…

March 12, 2025 by M S R

rashmika

. కులం… అవును, రాజకీయం పిచ్చి ప్రేలాపనలకు దిగితే, బెదిరిస్తే కులం అండగా వచ్చింది… కులం ఎదిరించేసరికి రాజకీయం వెనక్కి తగ్గింది, ఏదో విఫల సమర్థనకు దిగింది… రష్మిక మంథాన… ప్రస్తుతం దేశంలో టాప్ రేటెడ్ హీరోయిన్… నేషనల్ క్రష్ అంటారా, ఇంకేమైనా పిలుస్తారా మీ ఇష్టం… కానీ హైలీ పెయిడ్, మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఆమె ప్రస్తుతం… పుష్ప, యానిమల్, చావ్లా సినిమాలు ఆమెను ఎక్కడికో తీసుకుపోయాయి… ఆమెకు ఎందుకో శాండల్‌వుడ్‌తో ప్రాబ్లం ఉంది… ఆమెది […]

సెల్ఫ్ రోడ్ రిపేర్…! లండన్‌లో కొత్త డాంబర్ డెవలప్ చేశారట..!

March 12, 2025 by M S R

bitumen

. మనం రకరకాల పన్నులు కడుతూనే ఉంటాం. “పన్నుమీద పన్నున్నవారు ఇంటి మీద ఇల్లు కడతారు” అని సామెత కూడా ఉంది. ఈ సామెతలో నిజమెంతో కానీ… ఇంటిమీద ఇల్లు కట్టిన ప్రతివాడూ ప్రభుత్వానికి పన్ను మీద పన్ను కట్టడం మాత్రం నిజం. పన్నులో అంతర్భాగంగా ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్ లాంటి సమసమాజ నిర్మాణానికి అవసరమైన ఎన్నెన్నో ఉప పన్నులు జత అయి ఉంటాయి. చెవిలో జోరీగ; చెప్పులో ముల్లు; కంటిలో నలుసు, ఇంటిలో పోరు […]

మనిషి భవిష్యత్తుకై… మంచు కొండల్లో ఓ బృహత్తర విత్తన భాండాగారం…

March 12, 2025 by M S R

seed vault

. Raghu Mandaati …….. ప్రాచీన సంపదను మోసుకెళ్లే విత్తన భాండాగారం – స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్… అనాదికాలం నుంచి మనిషి జీవన విధానంలో విత్తనాలకు ఎంతో గొప్ప స్థానం ఉంది. వేదకాలంలోనూ, మహాకావ్య యుగంలోనూ విత్తనాలను భవిష్యత్తు సంరక్షణ కోసం ఎంతో విశిష్టంగా చూసేవారు. అప్పుడు పంటల రకాలను ఒక రహస్యంగా భావించి, తరం నుంచి తరానికి బదిలీ చేసుకుంటూ వచ్చారు. అటువంటి ప్రాచీన సంపదనే మళ్లీ మోసుకెళ్లేందుకు ఆధునిక కాలంలో ఏర్పాటుచేసిన ఒక […]

విజయ సంబరాల వేళ… విశేషంగా అందరి దృష్టీ ఈమెపై… ఎవరీమె..?!

March 12, 2025 by M S R

rivaba

. మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు Murali Buddha ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం రాసిన ఓ పోస్టు చదవండి ముందుగా… నాకు క్రికెటర్ల పేర్లు తెలియవు, నేను క్రికెట్ చూడను … కానీ నిన్న ఒక దృశ్యానికి సంబంధించిన వీడియో తెగ నచ్చింది … కెమెరామెన్ సరిగా క్యాప్చర్ చేయలేదు కానీ … అసలైన దృశ్యం ఇదేకదా అనిపించి, బాగా నచ్చింది … విజయం తరువాత గ్రౌండ్‌లో క్రికెట్ జట్టు మీద రంగురంగుల మెరుపు కాగితాలు వేశారు కదా… […]

రియల్ హీరో ఆఫ్ ది నేషన్… ఛావాను మించి హిట్టు కొట్టాల్సిన కథ… కానీ…

March 12, 2025 by M S R

bangla

. విక్కీ కౌశల్ నటించిన ఛావా ఎంత బ్లాక్ బస్టరో తెలుసు కదా… 800- 900 కోట్లు దాటిపోనున్నయ్ వసూళ్లు… రొటీన్ ఫార్ములా సినిమాల్లో హీరో ధీరోదాత్తుడై విలన్లను, గ్యాంగులను ఒక్కడే కాలర్ మాసిపోకుండా తెగనరుకుతాడు… కానీ ఈ సినిమాలో తనకే రక్తాలు కారుతుంటాయి, కళ్లు తీసేయబడతాయి, చర్మం వలిచేయబడుతుంది… ముక్కలుగా నరికేయబడతాడు… కానీ జనం ఉద్వేగంతో కదిలిపోయి ఏడ్చేస్తున్నారు థియేటర్లలో… అందుకే అన్నది స్టార్ హీరోలూ కలలు కనండిరా… ఇలాంటి ఒక్క పాత్ర కోసం… నిజానికి […]

Karma Returns… ఉగ్రవాదుల అడ్డా దేశానికి ఉగ్రవాద వణుకు…

March 11, 2025 by M S R

rail

. Pardha Saradhi Potluri …… 2029 లో పాకిస్తాన్ ని నాలుగు ముక్కలుగా విభజించాలని డీప్ స్టేట్ ప్రణాళిక అని వికీ లీక్స్ పత్రాలు బయటపెట్టి నాలుగేళ్లు అవుతున్నది! జూలియస్ అసాంజే బయటపెట్టిన రహస్యాలలో పాకిస్థాన్ కంటే ఇతర విషయాలు ఎక్కువ ప్రాముఖ్యత కలిగినవి ఉండడంతో ఈ వార్త అప్పట్లో పెద్దగా వైరల్ అవలేదు! జాగ్రత్తగా గమనించండి! సిరియాలో తిరుగుబాటు జరిగి, అధికార మార్పిడి రక్తపాతం లేకుండా జరిగింది అనుకొని మూడు నెలలు కాలేదు, కానీ […]

ఏది సానితనం… ఏది సంస్కారపక్షం… చూసే కళ్లను బట్టే టేస్టు గోచరం…

March 11, 2025 by M S R

kannappa

. నిన్నటి నుంచీ ఒకటే ఊదరగొడుతున్నయ్ సైట్లు, ట్యూబులు ఎట్సెట్రా… ఏమనీ అంటే..? నితిన్ వీరోగా ఏదో రాబిన్‌హుడ్ అనే సినిమా వస్తోందట… అందులో ఓ ఐటమ్ సాంగ్, కేతిక శర్మ అని ఓ ఐటమ్ బాంబు డాన్సు… అదిదా సర్‌ప్రయిజు అని పాట… ది గ్రేట్ ఆస్కారుడు చంద్రబోసుడు రాశాడు పాటను… ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు… ఐటమ్ సాంగుకు అర్థాలేమిటోయ్, ఏవో పిచ్చి కూతలు, ఎర్రి రాతలు తప్ప, సంభోగ పారవశ్య మూలుగులు తప్ప […]

అక్కడికక్కడే బహుమతి మొత్తం రెట్టింపు… స్పాన్సర్ అనూహ్య ఔదార్యం…

March 11, 2025 by M S R

etv

. ఈటీవీ పాడుతా తీయగా రజతోత్సవ సీజన్ అంటే 25వ సీజన్ గురించీ రాసుకున్నాం… ఈసారి కీరవాణి కూడా జడ్జిగా వచ్చాడు… కానీ 24వ సీజన్ ఫినాలే మూడు పార్టుల వీడియోలు చూస్తుంటే, చివరలో స్పాన్సర్ కనబరిచిన ఔదార్యం ఆశ్చర్యానికి గురిచేసింది… నిజంగానే చెప్పుకోవాల్సిన సంగతి… క్రేన్ వక్కపొడి, దుర్గా నెయ్యి ఓనర్ గ్రంథి కాంతారావు… ఆయనే స్పాన్సర్… మామూలుగా ఇలాంటి ఫినాలేలు నాలుగు గోడల నడుమ స్టూడియోలో కానిచ్చేస్తుంటారు… కానీ ఈటీవీ కర్నూలులో బహిరంగంగా నిర్వహించింది… […]

ప్రతి టీవీ రియాలిటీ షోలోనూ… ఆయా చానెళ్ల ఆస్థాన ఆర్టిస్టులేనా..?!

March 11, 2025 by M S R

sudheer

. తెలుగులో ఉన్నవే నాలుగు టీవీ వినోద చానెళ్లు… జెమిని టీవీని వదిలేయండి… అదెవడూ పెద్దగా చూడటం లేదు…  ఇక మిగతావి మూడు… ఈటీవీ, మాటీవీ, జీతెలుగు… మరీ పాడుతా తీయగా, ఢీ, జబర్దస్త్ వంటి కామెడీ, డాన్స్, మ్యూజిక్ స్పెసిఫిక్ షోలను వదిలేస్తే ఇక చాలా షోలు ఒకే మూసలో సాగుతున్నాయి… వాళ్ల టీవీ సీరియళ్ల నటీనటులను తీసుకురావడం… వాళ్లతో చాట్ షో, కిట్టీ పార్టీల్లాంటి గేమ్స్ ఎట్సెట్రా… సీరియళ్ల నడుమ పోటీలు పెట్టడం, జోకులు […]

ఫాఫం తెలంగాణ కాంగ్రెస్… బీఆర్ఎస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయింది…

March 11, 2025 by M S R

brs

. ఇది సోషల్ మీడియా యుగం… మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఎవడూ పట్టించుకోవడం లేదు… సో, రాజకీయ పార్టీల సమరానికి కూడా సోషల్ మీడియాయే వేదిక… ఎవరు ఎంత ఎఫెక్టివ్‌గా ఈ మీడియాను వాడుకుంటాడో వాడే తోపు ఈరోజుల్లో… ఐతే క్వాలిటేటివ్ టీమ్స్ ఉండాలి, పార్టీల సోషల్ మీడియా క్యాంపెయిన్లను ఆర్గనైజ్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి… ఎదుటి పార్టీ మీద బలమైన దాడులు చేయలేకపోయినా, ఎదుటి పార్టీ చేసే క్యాంపెయిన్‌ను కౌంటర్ చేయలేకపోయినా, తన ప్లస్సులు ప్రాపగాండా […]

ఆరుద్ర, శ్రీశ్రీ నడుమ ఒక వివాదం… అది శ్యామ్ బెనెగల్ ‘అనుగ్రహం’ …

March 11, 2025 by M S R

anugraham

… ఇది చాలా పాత వివాదం. కానీ దీని గురించి ఏమీ తెలియని నాబోటి వాళ్లకు కొత్తగానే ఉండొచ్చు. … ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ 1978లో తెలుగులో ‘అనుగ్రహం’ అనే సినిమా తీశారు. అందులో స్మితా పాటిల్, వాణిశ్రీ, అనంత్‌నాగ్, అమ్రిష్‌పురి, సులబ్ దేశ్‌పాండే, నిర్మలమ్మ, రావు గోపాలరావు నటించారు. ఏకకాలంలో అదే ఆర్టిస్టులతో హిందీలో ‘కొందుర’ పేరిట ఆ సినిమా తెరకెక్కింది. అయితే తెలుగులో రావు గోపాలరావు చేసిన పాత్ర హిందీలో శేఖర్ చటర్జీ […]

గరిమెళ్ల అన్నమయ్య..! ఒకరు రాసి, ఒకరు పాడి… వెంకన్న సన్నిధిలోకి…!

March 11, 2025 by M S R

annamayya

. “నీవలన నాకు పుణ్యము; నావలన నీకు కీరితి” అని అన్నమయ్య సాక్షాత్తు వెంకన్నకే చెప్పుకున్నాడు. నిజమే వెంకన్న కీర్తి కిరీటంలో అన్నమయ్య కలికి తురాయి. ఇంకెన్ని యుగాలయినా వెంకన్నకు అన్నమయ్యలాంటి పి ఆర్ ఓ దొరకడు. ఇంకెన్ని యుగాలయినా రక్తమాంసాలతో మనిషిగా పుట్టినవాడెవడూ ఒక జీవితకాలంలో అన్నమయ్య సృష్టించినంత అంతులేని సాహిత్యామృతధార సృష్టించలేడు. అటకెక్కిన అన్నమయ్యను రాగిరేకుల మీదినుండి కిందికి దించి, బూజు దులిపి, అక్షరమక్షరం చదివి, సంగీత సాహిత్యాలకు భంగం కలుగకుండా ఎత్తి రాసి […]

ఈ ఆలోచన, ఈ ఆచారం రష్యా నుంచి మనమూ నేర్చుకోవాలేమో…!

March 11, 2025 by M S R

russia

ఈమధ్య చాలా సోషల్ మీడియా పేజీల్లో, వాట్సప్ గ్రూపుల్లో కనిపిస్తున్న ఓ పోస్టు చదవండి… రష్యాలో వివాహ వ్యవస్థలో ” పెళ్లికంటే దేశభక్తి గొప్పది… సుధా నారాయణమూర్తి ఒక స్వీయ అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశారు: “ఇటీవల నేను రష్యాలోని మాస్కోలో ఉన్నప్పుడు… ఓ రోజు ఆదివారం అక్కడి పార్కుకి వెళ్లాను. వేసవి నెల, కానీ వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా చినుకులు పడుతున్నాయి. నేను గొడుగు కింద నిలబడి ఆ ప్రాంత అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా […]

  • « Previous Page
  • 1
  • …
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • …
  • 428
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • హరిహరా..! సమస్య లేదంటున్నావా..? నీకు సమస్య కావద్దంటావా..?
  • అసూర్యంపశ్య…! ఎండ కన్నెరుగని సుతారం బతుకులు అనారోగ్యమే..!!
  • … ఇంతకీ కుందరదన అంటే తెలుగులో అర్థమేమిటి చిరంజీవీ…
  • మిథున్ డిస్కోడాన్సర్‌తో పోలిక… బాలయ్య డిస్కోకింగ్‌కు శాపమైంది…
  • బ్రహ్మోస్ అంటేనే బ్రహ్మాస్త్రం… అది మన యుద్ధసామర్థ్య ప్రకటన…
  • ఒక నరేంద్ర, ఒక ఈటల, ఒక విజయశాంతి… సేమ్, ఒక కవిత..?!
  • స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…
  • పక్కా కమర్షియల్ చట్రంలోనే ఓ ఫిలాసఫీ చెబుతాడు త్రివిక్రముడు…
  • …. ముఖ్య అతిథి సీఎం గారి పెళ్లాం అని తెలియకపోతే ఎలా మరి..?!
  • అమ్మో… అమ్మే…! పోకడలో తేడా ఉండొచ్చుగాక, అమ్మతనంలో ఢోకా లేదు…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions