ఔనా..? నిజమేనా..? అవి లతా మంగేష్కర్ చివరి మాటలేనా..? ఇవీ ప్రశ్నలు… ఎందుకంటే… రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలోనే కాదు, కొన్ని మీడియా సంస్థలు కూడా లతా మంగేష్కర్ చివరి మాటల వైరాగ్యం అని కథనాలు రాస్తున్నయ్, ఏవేవో చూపిస్తున్నయ్… నిజంగా ఆమె మాట్లాడిన మాటలేనా అవి..? ఎవరితో..? ఎవరు వెల్లడించారు ఈ మాటల్ని బయటికి..? ఆ వివరాలు మాత్రం ఏమీ కనిపించవు… ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా షేర్ చేసేయడం, అబ్బ, ఎంత బాగా చెప్పింది […]
ప్రదీప్, చంద్రబోస్ ఔట్… కొత్తగా శ్రీముఖి, అనంతశ్రీరామ్… ప్లస్ స్మిత…
టీవీ రియాలిటీ షోలలో జడ్జిలను మారిస్తే… యాంకర్లను మారిస్తే టీఆర్పీలు పెరగవు, ఆదరణ దక్కదు… చేయాల్సింది షోను జనానికి కనెక్టయ్యేలా నడపడం… మాస్టర్ చెఫ్, ఎవరు మీలో కోటీశ్వరులు షోలతో రీసెంటుగా జెమిని టీవీకి కళ్లు తెరుచుకున్నయ్… అదిరింది షోతో జీటీవీకి తెలిసొచ్చింది… కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్ షోలతో మాటీవీ పాఠం నేర్చుకుంది… స్వరాభిషేకం, పాడుతాతీయగా షోలతో ఇప్పుడు ఈటీవీకి అనుభవం అవుతోంది… షోలో దమ్ముండాలే తప్ప ఈ యాంకర్లు, జడ్జిల మార్పులతో రేటింగుల్లో జంప్ […]
కేసీయార్ పంచాంగం లెక్కలన్నీ వేరు… ఏ ప్రముఖ జ్యోతిష్కుడూ పనికిరాడేమో…!!
అకస్మాత్తుగా కేసీయార్ ఎందుకింతగా బీజేపీపై విరుచుకుపడుతున్నాడు..? ఏం సెగ తగులుతోంది..? రాజకీయంగానా..? కేసుల వాసన ఏమైనా వస్తోందా..? ఆ చర్చను వదిలేస్తే చాలా అంశాల్ని ఎందుకు, ఎలా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు, ఎవరినీ ప్రశ్నించనివ్వడు, మీడియా మీట్లో ఎవరైనా ఆ ప్రశ్న వేస్తే ఇక ఆ విలేఖరి పనైపోయినట్టే… కేసీయారే ట్రోలింగుకు దిగుతాడు… నిన్నటి సుదీర్ఘమైన ప్రెస్‌మీట్ అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓ వింత విషయం చెప్పుకొచ్చాడు తను… ఆంధ్రజ్యోతిలో కనిపించింది ఆ […]
ఫాఫం కొనఊపిరితో ఉందేమో… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది…
ఆస్కార్ అవార్డుల పరిశీలనకు కూడా మన సినిమాలు పనికిరావా..? ఈ ప్రశ్న ఎప్పటిలాగే చర్చనీయాంశమవుతోంది… సోషల్ మీడియాలో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నయ్… ఆస్కార్ దాకా ఎందుకు..? అసలు జాతీయ అవార్డుల పరిశీలనకు కూడా మన తెలుగు సినిమాలు పనికిరాకుండా పోతున్నయ్ కదా, మరి ఈ దరిద్రం మాటేమిటి..? ఏవో అరకొర అవార్డులు తప్ప మనం జాతీయ స్థాయిలోనే మన ముద్ర వేయలేకపోతున్నాం కదా అనే నిజం గుర్తొచ్చి, బాధ కాదు, నవ్వొచ్చింది… ఇదేసమయంలో సోషల్ మీడియాలో ఒక […]
బాబు గారూ… కాళ్లు మొక్కితేనే మర్యాద ఇచ్చినట్టా..? ఓ నమస్కారం సరిపోదా..?
సినిమా, టీవీ ఇండస్ట్రీలో కాళ్లు మొక్కించుకుని ఆత్మానందాన్ని పొందే సంస్కృతి ఇప్పుడు కొత్తేమీ కాదు… ఎప్పటి నుంచో ఉన్నదే… అదొక వింత ఆధిపత్య ప్రదర్శన… పాపులర్ దర్శకులు, హీరోలు తమను తాము దైవాంశ సంభూతులనే భ్రమల్లో బతుకుతూ, తమ ఫ్యాన్స్ కీర్తనలతో తాము ఉన్నతులమని పరమానందం పొందుతూ… ఇండస్ట్రీ జనం నుంచి కూడా ఆ కృత్రిమ గౌరవాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటారు… షూటింగుకు వచ్చే సహనటులు, ఇతర క్రియేటివ్ సిబ్బంది నుంచి కూడా ఈ మర్యాదను, మన్ననను […]
హవ్వ… అంతటి గుర్తింపు ఉన్న రాజమౌళినే జగన్ గుర్తుపట్టలేదా..?!
అది 1982-83… పాకిస్థాన్‌లో ఇండియా క్రికెట్ టెస్ట్ సీరీస్ ఆడుతోంది… పాకిస్థాన్ మంచి జోరు మీదుంది… ఓసారి లాహోర్‌లో గెట్టుగెదర్ ఏర్పాటు చేశారు, క్రికెటర్ల గౌరవార్థం… అక్కడికి పాకిస్థానీ సింగర్ నూర్జహాన్ వచ్చింది… జట్టు మేనేజర్ ఆమెకు ‘‘తెలుసు కదా, ఈయన మా కెప్టెన్ సునీల్ గవాస్కర్’’ అంటూ పరిచయం చేయబోయాడు… ఆమె పెద్ద మెంటల్ కేసు… ‘’ఓహ్, అలాగా… నాకు ఇమ్రాన్ ఖాన్ తెలుసు, జహీర్ తెలుసు’’ అన్నదామె… అసలే ఇమ్రాన్ పరుగులు, జహీర్ వికెట్లతో […]
ప్రత్యేక హోదా..! నిజంగా నిలువరించే సీన్ చంద్రబాబుకు ఉందా..?!
నిన్న ఓ వైసీపీ నాయకుడు ధాటిగా చెప్పేస్తున్నాడు… ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే జగన్‌కు క్రెడిట్ వస్తుంది కాబట్టి చంద్రబాబు తన పలుకుబడి అంతా ఉపయోగించి, ఆపేయించాడు, రాష్ట్ర వ్యతిరేకి’’ అంటూ గాలికిపోయే కంపను చంద్రబాబు ఇంటివైపు మళ్లిస్తున్నాడు… హహహ, పాపం చంద్రబాబుకు నిజంగా ఢిల్లీలో అంత పలుకుబడి ఉందా..? ఉండి ఉంటే జగన్‌ను ఎప్పుడో జైలులో వేయించేవాడు కదా… కనీసం మోడీ దగ్గర అపాయింట్మెంట్ సంపాదించేవాడు కదా… ఏదో అప్పట్లో బాగా బతికి, చితికిపోయిన జీవితం, […]
ఆ ఇద్దరి సంవాదం ముదురుతోంది… అందరూ సైలెంటుగా చదువుతున్నారు… అంతే…
సాధారణంగా సొసైటీలో అనామకులు ఎవరో సోషల్ మీడియాలో ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటే… వాళ్ల మిత్రవర్గం అటోఇటో స్టాండ్ తీసుకుని, సంవాదంలోకి దూరిపోతుంటారు… చిన్న చిన్న విషయాలు కూడా రచ్చ రచ్చ అయిపోతుంటాయి…. కానీ ఇది పూర్తి భిన్నంగా, కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది… ఒకాయన దేవులపల్లి అమర్… జగన్ ప్రభుత్వంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారు… జాతీయ స్థాయిలో వేలాది మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న ఐజేయూ నాయకుడు… ఆమధ్య అధ్యక్షుడు కూడా… సో, సొసైటీలో ఓ […]
అంతన్నాడు ఇంతన్నాడే టిల్లు గాడు…! నిజానికి నేహాయే ప్రైమరీ అట్రాక్షన్..!!
అంతన్నాడు, ఇంతన్నాడే…. అన్నట్టుగా… డీజే టిల్లు అనే సినిమా మీద హైప్ ఫుల్లు క్రియేటైంది… జొన్నలగడ్డ సిద్దూ… గతంలో చిన్నాచితకా సినిమాలతో కాస్త పరిచయం… తనదే కథ, తనదే స్క్రీన్‌ప్లే సహకారం… ఇంకేముంది..? ఫుల్లు తన కేరక్టర్ మీదే కాన్సంట్రేషన్… ఓవర్ యాంబిషన్స్… అచ్చం వంద కోట్ల సినిమా రేంజ్‌కు చేరాలనే తన వ్యక్తిగత ఆకాంక్షలాగే… ఈ పాత్ర కూడా ఓ ఆశావాది… అత్యాశావాది అనలేం, ఎవరి లక్కు ఏమిటో చెప్పలేం ఓ తలతిక్క మెగా జర్నలిస్టు […]
2 పేపర్లు… 2 ఫస్ట్ పేజీలు… ఈనాడు కొత్త ప్రయోగమా..? మోసమా..? ధనాపేక్షా..?
ఈనాడు హైదరాబాద్ పాఠకులకు రెండేసి పేపర్లు వచ్చాయ్… అదేమిటని ఆశ్చర్యపోకండి… రెండు ఫస్ట్ పేజీలు, రెండు బ్యాక్ పేజీలు… రెండు ఫస్ట్ పేజీల్లో కూడా వేర్వేరు వార్తలు, వేర్వేరు ప్రయారిటీలు… చివరకు వేర్వేరు యాడ్స్ కూడా… రొటీన్ పేజీలు, ఎడిట్ పేజీలు, బిజినెస్, నేషనల్, ఫీచర్స్ పేజీలు, వసుంధర, సినిమా, బిజినెస్, స్పోర్ట్స్ పేజీలన్నీ అందులో కొన్ని, ఇందులో కొన్ని పరిచేసి… మొత్తానికి ‘‘రెండు పేపర్లు’’ ఇచ్చారు… అసలే న్యూస్ ప్రింట్ కాస్ట్ విపరీతంగా పెరిగి, మీడియా […]
3 దేశాల్లో ఎఫ్ఐఆర్ బ్యాన్… హీరో నటన వోకే… మిగతా అంశాల్లో మాత్రం వీకే…
విష్ణు విశాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏముంది..? నిజానికి ఏమీ లేదు… తను పూర్తిగా తమిళనటుడు… ఆమధ్య రానాతో కలిసి అరణ్యలో కనిపించాడు… చాలామంది తమిళ హీరోల్ని తెలుగు ప్రేక్షకులు తమ సొంత హీరోల్లాగే అభిమానిస్తారు, ఆదరిస్తారు… కానీ ఈ విష్ణు పెద్దగా తెలుగు ప్రేక్షకులతో కనెక్టయిన హీరో ఏమీ కాదు… అంతెందుకు, తమిళంలోనే 2009 నుంచీ కష్టపడుతుంటే ఇప్పటికి స్కోర్ 16 మాత్రమే… అందులో నాలుగు తను సొంతంగా డబ్బులు పెట్టి తీసుకున్న సినిమాలే… రాక్షసన్ […]
భామాకలాపం..! ఈమె ఓటీటీ వంటలక్క… ప్రియమణి సరదాగా లాగించేసింది..!!
అదేదో ఢీ అనే డాన్స్ షోలో చూపించినట్టు… ఏదో హైపర్ ఆది అలా చెప్పగానే, అలాగే బావా అని పిలిచి గట్టిగా ఓ హగ్గు ఇచ్చేస్తుంది పాపం అనుకోకండి… మరీ అంత అమాయక కేరక్టర్ ఏమీ కాదు ప్రియమణి బయట… ఫీల్డులో స్ట్రగుల్ అయ్యీ అయ్యీ రాటుదేలి, కూలిపోయిన కెరీర్ గోడను ఎలాగోలా తిరిగి పేర్చుకుంటోంది… భామాకలాపం అనే ఓటీటీ సినిమా (ఆహా) చూస్తున్నంతసేపూ ఆమె మాత్రమే కనిపిస్తుంది… ప్లజెంట్‌గా ఉంది ఆమె… ఎహె, అందం చందం […]
ఖిలాడి..! రవితేజకు చివరి ప్రమాదహెచ్చరిక… ఐనా మారతాడనే ఆశే దండుగ..!!
నిజానికి 54 ఏళ్లు అనేది పెద్ద వయస్సు ఏమీ కాదు… డెబ్భయి దాటిన హీరోలే నడుముకు బద్దలు కట్టుకుని, వంగిపోకుండా, హీరోయిన్ల పిరుదులపై దరువులేస్తూ గెంతులేయడానికి ఆయాసపడుతున్నారు… పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని రౌడీలను వందలుగా, మందలుగా నరికిపారేస్తున్నారు… ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు… వందల కోట్లను తెరపైకి వెదజల్లుతూనే ఉన్నారు… హుమ్… ఒకప్పుడు ఎన్టీయార్, ఏఎన్నార్, శోభన్, కృష్ణ, కృష్ణంరాజు తదితరులు ముసలోళ్లయినా ఇంకా ఈ యూత్ వేషాలేమిటీ అని చీదరగా చిరంజీవి వైపు, రాజశేఖర్ వైపు, […]
ఐనా ఈడీ దాడులతో ఏమవుతుంది..? బేఫికర్… కేసీయార్ జోలికి మోడీ రాడు…!!
మోడీ మీద టీఆర్ఎస్ వాళ్లు సభాహక్కుల నోటీసు ఇచ్చారట, ఏమైతుంది సార్..? కేసీయార్ పై బీజేపోళ్లు అసెంబ్లీలో అలాంటి నోటీసే ఇస్తారట, ఏమవుతుంది సార్..? టీఆర్ఎస్ పెద్దల చుట్టూ ఈడీ వలలు పన్నుతోందట, నిజమేనా సార్..? …. నిన్నటి నుంచీ ఒకటే చర్చలు… బట్, ఎవరికీ ఏమీ కాదు.,. ఎవరికీ ఫికర్ అక్కర్లేదు… తెరపై కనిపించేదే సత్యం కాదు, రాజకీయాల ప్రణాళికలు అంటేనే ఓ స్పష్టాస్పష్ట భ్రమ… అది సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగు, పోస్టుల హైప్ […]
చిరంజీవికి పెద్దపీట నచ్చలేదా..? కొందరికి ఇష్యూ సెటిల్ కావడమే ఇష్టం లేదా..?!
జగన్ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల ధరలు తగ్గిస్తూ ఆమధ్య ఓ నిర్ణయం తీసుకుంది… బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేస్తే, వసూళ్లు చేస్తే తాటతీస్తాను అని చెప్పింది… ఈ నిర్ణయం వెనుక జగన్ అహాన్ని ప్రదర్శిస్తున్నాడనీ, పవన్ కల్యాణ్ మీద కోపంతో ఇండస్ట్రీని తొక్కుతున్నాడనీ, తన ముఖ్యమంత్రిత్వాన్ని గుర్తించని-గౌరవించని ఇండస్ట్రీని కాళ్ల దగ్గర మోకరిల్లేలా చేసుకుంటున్నాడనీ, ఇండస్ట్రీలో ప్రధానంగా కమ్మ పెత్తనం కాబట్టి తన కమ్మ ద్వేషాన్ని ఇండస్ట్రీ మీద కూడా ప్రయోగిస్తున్నాడనీ బోలెడు కథనాలు, ప్రచారాలు […]
అయ్యాకొడుకులు ఏక్‌సేఏక్… ఎటొచ్చీ ఆ కేరక్టరైజేషనే మహాన్ వీక్…
గరికపాటి పుష్ప సినిమాపై కోపం తగ్గినా సరే, మహాన్ అనబడే తాజా చిత్రాన్ని కూడా చూడకుండా తమాయించుకోవడం బెటర్… పుష్పలో ఆఫ్టరాల్ అక్షరమ్ముక్క రాని ఓ కూలీ పెద్ద స్మగ్లర్‌గా ఎదుగుతాడు… అంతే, కానీ ఈ మహాన్ ఇది మరోరకం అరాచకం… రెండు లీడ్ రోల్స్, ఒకటేమో తండ్రి విక్రమ్ పోషిస్తే, మరొకటి తన సొంత కొడుకు ధ్రువ్ పోషించాడు… ఒక వయస్సు మళ్లిన తండ్రి కేరక్టరేమో లెక్చరర్ నుంచి, గాంధేయవాదం నుంచి ఏకంగా దారితప్పి మద్యం […]
‘మహాన్’ తెలివి..! మూవీలో హీరోయిన్ మొత్తం సీన్లన్నీ కత్తిరించి పారేశారు..!!
‘‘ఎందువల్లనైనా’’ దర్శకుడికి సరే కోపం వస్తే… హీరోకు కోపమొస్తే… పోనీ, హీరో కొడుక్కి కోపమొస్తే… నిర్మాతకే నచ్చకపోతే… ఏం జరుగుతుంది..? చెప్పినట్టు వినని హీరోయిన్‌కు కత్తెర పడుతుంది… సీన్స్ పడిపోతయ్… పేమెంట్స్ చిక్కుల్లో పడతయ్… మౌత్ పబ్లిసిటీతో తొక్కేస్తారు… కొత్త చాన్సులు రానివ్వరు… అసలు ఇండస్ట్రీ అంటేనే అది కదా… మరీ కోపమొస్తే మొత్తం ఆమెను సినిమాలో కనిపించకుండా, ఆమె సీన్లన్నీ తీసిపారేస్తారు… అవును మరి, ఎంత పేరున్న హీరోయిన్ అయినా సరే..!! మహాన్ అనే ఓ […]
ఇక చాల్లే, ఫోఫోవమ్మా… అంతటి వంటలక్కను ఇట్టే తిరస్కరిస్తున్న ప్రేక్షకజనం…
ఫాఫం వంటలక్క… ఆమెకు నీరాజనాలు పట్టిన జనాలే ఇప్పుడు ఇక చాల్లే, ఫోఫోవమ్మా అనేస్తున్నారు… కార్తీకదీపం సీరియల్ స్థితిగతులు మరింత దిగజారినయ్… నిజానికి ఈ సీరియల్ రోజురోజుకూ రేటింగ్‌పరంగా ఎలా పతనమవుతుందో ‘ముచ్చట’ చెబుతూనే ఉందిగా… ఈ వారం బార్క్ రేటింగ్స్ చూస్తే… అసలే ఆ ఏడుపు సీరియల్ నటులకు మరింత ఏడుపొచ్చేలా ఉన్నయ్… ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల రేటింగ్స్‌ను దాటి, అబ్బో, మాటీవీ వాడి రేటింగ్ మేనేజ్మెంట్కు తిరుగులేదు, కథానాయిక ప్రేమీ విశ్వనాథ్‌కు ఎదురులేదు […]
పచ్చిపులుసు అంటేనే పచ్చిదనం… దాన్నలా పెంటదనం చేయకండి…
నో పొయ్యి, నో పోపు, నో నూనె, నో కాయగూర, నో మసాలా, నో టైమ్ టేకింగ్… ఫాస్ట్‌గా ఉండాలి, నాలుకకు రుచి తగలాలి… ఇవి చెప్పేవాడే చెఫ్ అంటే… దిక్కుమాలిన వంటలు ఎన్ని ఉంటేనేం యూట్యూబులో..?! 20, 30 దినుసులు, బోలెడంత టైమ్, ప్రయాస అవసరమయ్యే వంటలు ఎవడైనా చెబుతాడు… ఎన్నో ఏళ్లుగా మన పెద్దల కడుపులు నింపిన పాత వంటల్ని పరిచయం చేసి, చిట్కాలు చెప్పి, చేసి చూపించేవాడే నిజమైన యూట్యూబ్ చెఫ్… హలో […]
పెళ్లిసంబంధాల్లో జాతక లెక్కలపై ఓ పండితుడు భలే తేల్చేశాడు..!
జ్యోతిష్కుల బండారం జ్యోతిష్కులకే ఎరుక… చెప్పాలి, వాళ్లే చెప్పాలి, జ్యోతిష్యంలో అడుగుపెట్టే వైరసులను వాళ్లే బయటపెట్టాలి… పెడుతున్నారు కూడా కొందరు..! ఉదాహరణకు పెళ్లిళ్లలో చూడబడే వివాహపొంతన..! పూర్వకాలం నుంచి కూడా పెళ్లిళ్లు అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడమన్నారు తప్ప, ఆయా వంశాలకున్న పేరును పరిగణనలోకి తీసుకోమన్నారు తప్ప, వివాహపొంతనలో పాయింట్లు, అనగా గుణాల ఆధారంగా మాత్రమే నడుచుకొమ్మని ఎవరూ చెప్పలేదు… కొన్నేళ్ల క్రితం వరకు కూడా… ఈ పాయింట్లు, గుణాల లెక్కలేవీ […]
- « Previous Page
- 1
- …
- 371
- 372
- 373
- 374
- 375
- …
- 483
- Next Page »