అద్భుత హిందూ ఆధ్యాత్మిక కట్టడంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య గుడిని చేరుకోవడానికి రైలు, విమానం, రోడ్డు మార్గాల్ని అభివృద్ధి పరిచే ప్రణాళికల గురించి యోగీ ఆదిత్యనాథ్ అప్పుడప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాడు… ఇప్పుడు తాజాగా ఓ ప్రణాళిక వేస్తున్నాడు… జలమార్గాన్ని కూడా అయోధ్యకు అనుసంధానించాలనేది దాని సారాంశం… రఫ్‌గా చెప్పాలంటే… యూపీ చుట్టుపక్కల నదుల నుంచి అయోధ్యకు లింక్ ఏర్పాటు చేయడమే కాదు, అంతిమంగా సముద్రానికి కలిపి, ఇతర దేశాలకూ సముద్రమార్గాన్ని డెవలప్ చేయాలి… స్థూలంగా చూస్తే బాగానే అనిపించినా, […]
నాసా నాన్సెన్స్… ఆలులేదు, చూలులేదు, అదుగో ఏలియెన్స్ అన్నాడట..!!
‘‘వేరే గ్రహాలపై జీవం ఉనికికి అవకాశం తక్కువ… ఒకవేళ భూమ్మీద జీవం పుట్టిన పరిస్థితుల్లోనే ఏదైనా గ్రహం మీద కూడా పుట్టి ఉంటే, ఆ జీవం మన భూగ్రహం మీద ఉన్న జీవంతో పోలి ఉండే అవకాశాలు తక్కువ… ఏ వైరస్ వంటి ప్రొటీన్ పోగుగానో మొదలైన జీవం ఏకకణజీవి నుంచి మనిషిగా పరిణామం చెందడానికి లక్షల ఏళ్లు పట్టింది… భూవాతావరణం, సవాళ్లు, విపత్తులు, సంతానవ్యాప్తి, చలనం, ఆహారం, పోషణ, రక్షణ అంశాలే గాకుండా అనేకానేక ఉత్పరివర్తనాలకు […]
సన్నీలియోన్, 3 రోజులే టైమ్, చెంపలేసుకో, చెప్పినట్టు చెయ్యి, లేదంటే జైలే..!
ఒక వీడియో సాంగ్… అదీ ఐటమ్ సాంగ్… తెలుగులో మొన్న సమంత ‘‘ఊ అంటావా, ఊఊ అంటావా’’ అని ఇరగదీసింది కదా… పాపం, ఒళ్లు దాచుకోకుండా బాగా కష్టపడింది కదా.., అదే స్టయిల్… అదే కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య… అందులోనూ సన్నీ లియోన్ డాన్స్… ఇక వేరే చెప్పేదేముంది..? యూట్యూబ్‌లో కోటి దాటేసిన వ్యూస్… దేశంలోకెల్లా ప్రఖ్యాత మ్యూజిక్ కంపెనీ సరిగమ… సీన్ కట్ చేస్తే… యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్ మొత్తం డిసేబుల్ చేసుకుంది… ఒకటీరెండు […]
ఈటీవీకి భయపడిపోయిన జీతెలుగు… ఇయర్ ఎండ్ పోటీ నుంచి పరుగోపరుగు…
ఎహె, తెలుగు వినోద చానెళ్లలో రెండో స్థానంలో ఉండి, ప్రథమ స్థానం కోసం కష్టపడుతున్న జీతెలుగు చానెల్ వాడు ఆఫ్టరాల్ మూడో ప్లేసులో ఉన్న ఈటీవీ చానెల్ వాడికి భయపడటం ఏమిటి..? శీర్షిక చూడగానే ఈ ప్రశ్న స్ఫురించిందా మీకు..? జీతెలుగు ఈరోజు మాంచి ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేసిన ‘ఇయర్ ఎండ్’ స్పెషల్ షో దావత్ చూస్తే మీకు కూడా ఇదే అభిప్రాయం వస్తుంది… అసలు ఇయర్ ఎండ్ ప్రోగ్రామ్ అయిదు రోజుల ముందే ప్రసారం […]
బాడీ షేమింగ్..! మన రాజకీయాల్లో ఈ వెగటు అవలక్షణం కొత్తేమీ కాదు..!!
……. By……. Nancharaiah Merugumala……. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారి మనవడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐదు కీలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి ఒక్కగానొక్క కొడుకు హిమాంశు శరీరాకృతిని ఎగతాళి చేసే రీతిలో జర్నలిస్టు, బీజేపీ సభ్యుడు చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. రాజకీయాలతో సంబంధం లేని ఈ టీనేజి బాలుడిని ఆయన తాతదండ్రులపై ఉన్న కోపంతో ‘బాడీ షేమింగ్ ’ చేయడం దుర్మార్గం అంటూ […]
రణబీర్‌కపూర్ ఎవరు..? రణవీర్‌సింగ్ ఎవరు..? దీపికకు ఎవరేమవుతారు..?
దీపిక పడుకోన్ జీవితంలో రణబీర్ కపూర్ ఎవరు..? రణవీర్ సింగ్ ఎవరు..? ఐశ్వర్యా రాయ్ సల్మాన్ ఖాన్ల బంధం ఎన్నేళ్లపాటు కొనసాగింది..? మహేశ్ భట్ తన మొదటి ప్రియురాలు లొరేన్ బ్రైట్ మార్చుకున్న పేరేంటి..? హీరోయిన్ ఆలియా భట్ జీవితంలో ఆలి దాదర్కర్ అనే వ్యక్తి ఎవరు..? డ్రగ్స్ కేసులో పట్టుబడిన షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ను పెట్టిన జైలు పేరు..? సుమంత్‌ను వదిలేసిన కీర్తిరెడ్డికి మాజీ మిస్ ఇండియా కీర్తిరెడ్డికి రిలేషనేంటి..? సమంత, నాగచైతన్య కాపురంలో […]
ఫాఫం శ్రీదేవిని వెళ్లగొట్టారు..! బాబు గారు అడుగుపెట్టినా అంతే సంగతులు..!!
సీరియళ్లను వదిలేస్తే వినోద చానెళ్లలో హ్యూమర్ బేస్డ్ షోలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు… పూర్ అండ్ డర్టీ టేస్ట్ అయినా సరే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్సట్రా జబర్దస్త్ తదితర షోలు కాస్తోకూస్తో రేటింగ్స్ సంపాదిస్తున్నాయంటే ఈ ఆసక్తే కారణం… వేరే దిక్కులేకపోవడం మరో కారణం… మాటీవీ వాడు ఏ షో రేటింగులను ఎలాగైనా అటూఇటూ మార్చగలడేమో గానీ, అత్యంగా ఘోరంగా ఫ్లాపబడిన కామెడీ స్టార్స్ అనే షో గతిని మాత్రం మార్చలేకపోయాడు… సేమ్, […]
చదివి తీరాల్సిన ఓ భారతీయ గూఢచారి కథ… ఇప్పుడిక వెండితెరపైకి…
21 ఏళ్ల వయస్సులో లక్నో లోని ఓ జాతీయ థియేటర్ ఫెస్టివల్ లో అతనిచ్చిన మిమిక్రీ ప్రదర్శన… అతన్ని రా ఏజెంట్ ని చేసింది. అయితే దాన్ని ఎదుగుదల అనేకంటే… దేశ ప్రజలను కాపాడే సైనికులకు రక్షణగా అతను ఛాలెంజింగ్ గా చేపట్టిన ఓ గురుతర బాధ్యత అంటేనే సమంజసం! కానీ, దేశం కాని దేశంలో, అదీ భారత్ అనగానే కసికసిగా కదిలే ఆ శత్రు దేశంలో ఆ త్యాగమూర్తి రహస్యం బహిరంగమైపోయి.. జైలు ఊచలు లెక్కిస్తుంటే.. […]
‘‘సకల హీరోల ఫ్యాన్సూ… ఛలో కదలండి… జగన్ ఫ్యాన్ రెక్కలు విరిచేద్దాం…’’
జగన్‌రెడ్డి సినీ పరిశ్రమపై కత్తి దూస్తున్నప్పటికీ పరిశ్రమ పెద్దలు చేతులు కట్టుకుని వినయంగా వేడుకోవడానికే పరిమితం అవుతున్నారు. వేరే హీరో సినిమా ఫ్లాపయితే సంబరాలు చేసుకునే అభిమానులు కూడా ఎక్కడున్నారో కనబడడం లేదు. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని సినిమాల్లో డైలాగులు చెప్పే మహానుభావులు ప్రభుత్వం తమపై కత్తి దూస్తున్నా మౌనంగా ఉండటం క్షంతవ్యం కాదు. మీ టైం వచ్చే వరకు పారితోషికాన్ని తగ్గించుకోండి, అంతేగానీ జగన్‌రెడ్డి వంటి వారికి తలవంచితే […]
ఓ ఆసక్తికరమైన తీర్పు… ఫన్నీగా ఉండే హక్కు, నవ్వడమూ ఓ పౌరవిధి…
కొన్ని వార్తలు మన మీడియాకు అసలే పట్టవు… ఎంతసేపూ మన రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల బూతులు, కేసులు, దాడులు, కక్షలు వంటి ‘‘అత్యున్నత సంస్కారమయ రాజకీయాల’’ వార్తలు తప్ప ఇంకేమీ పట్టడం లేదు… అందుకే కొన్ని ఇంట్రస్టింగ్ వార్తలు కూడా అన్ నోటీస్డ్గా వెళ్లిపోతున్నయ్… ఉదాహరణకు మొన్న మద్రాస్ హైకోర్టులో ఓ జడ్జిమెంట్… సింగిల్ బెంచ్, న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వెలువరించిన తీర్పు… సోషల్ మీడియా పోస్టుల మీద ఈరోజుకూ దేశంలో చాలాచోట్ల కేసులు, […]
కృష్ణ డిష్యూం డిష్యూం సినిమాల వెనుక అసలు కెమెరా హీరో ఈయనే..!
…… By…… Bharadwaja Rangavajhala……….. పుష్పాల గోపాలక్రిష్ణ ఈయన పేరు క్రిష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. క్రిష్ణ గారి సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా క్రుషి చేస్తారు. ఈ ఏరియాలో పుష్పాల గోపీక్రిష్ణ కాస్త పాపులర్. విఎస్ఆర్ స్వామి తర్వాత ఈయనే క్రిష్ణ సినిమాలకు కెమేరా […]
ప్రదీప్ భయ్యా… సుమ ఆంటీ… ఓంకార్ బాబాయ్… ఇవి రియాలిటీ షోలేనా..?!
‘‘మేం ఈ స్థాయికి వచ్చామంటే..?’’ ఈ డైలాగ్ చాలాసార్లు టీవీల్లో, ప్రెస్మీట్లలో వింటూ ఉంటాం… స్థాయి అంటే..? ఈ ప్రశ్న పదే పదే మనల్ని తొలుస్తూ ఉంటుంది… ఒక టీవీ సీరియల్లో ఓ పాత్ర, ఓ టీవీలో ఓ యాంకర్, ఓ టీవీ షోలో ఓ పార్టిపిసెంట్… ఇలాంటివి కూడా గొప్ప విజయాలు అని పరిగణించాలా..? కావచ్చు, ఎందుకంటే, మన టీవీ షోలు వాళ్లను అలాగే ప్రొజెక్ట్ చేస్తాయి… జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే సోయి కూడా […]
కీరవాణి ఐతేనేం..? తప్పని కాపీ బాట..! మదనా సుందరి పాట ట్యూన్ ఎత్తేశాడు..!
వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటారు… లబ్దిప్రతిష్టులు మస్తు వర్క్ చేస్తున్నారు అంటారు… ఘనకీర్తి కలిగిన పెద్ద తలకాయలకు మస్తు క్రియేటివిటీ ఉంది అంటారు… తీరా చూస్తే ఏదో తెలంగాణ జానపద గీతం ట్యూన్‌ను కాపీ కొట్టడం, ఢమఢమ కొత్త వాయిద్యాలతో ఒరిజినల్ ట్యూన్ మధురిమను భ్రష్టుపట్టించడం… ఎందుకీ భావదరిద్రం అంటారా..? తెలంగాణ లైఫ్ ఉన్న ఫోక్ వాళ్లకు అంతుపట్టదు, కాపీ కొట్టేయడమే సులువు అనుకోవడం… ప్రస్తుతం తెలంగాణ గీతానికి ఆదరణ ఉంది కాబట్టి… తెలంగాణ వాయిద్యాలు, […]
పర్ఫ్యూమ్ పాలిటిక్స్..! ఈ వందల కోట్ల వెనుక అసలు కథలేమిటి..?!
మొన్నటి నవంబరులో మనం ఓ కథనం చదువుకున్నాం ‘ముచ్చట’లోనే…. ‘‘సమాజ్‌వాదీ సుగంధ్’’ పేరిట తయారైన పర్ఫ్యూమ్ బాటిళ్లను ఆవిష్కరిస్తూ అఖిలేషుడు ఏమన్నాడో తెలుసా..? ‘‘22 సుగంధాలతో సెంట్ తయారు చేయించేశా, దానికి ఓ పేరు కూడా పెట్టేశా, సెంట్ ఆఫ్ సోషలిజం… ఈ సెంట్ తయారు చేయించిందే పార్టీ కోసం, 2016లోనే తాజ్ మహల్, బెనారస్ ఘాట్, రుమి దర్వాజ, కన్నౌజ్ పేర్లతో నాలుగైదు రకాల సెంట్ బాటిళ్లను విడుదల చేశాను… 5 వేల బాటిళ్లను పంచిపెట్టాం… […]
డెల్మిక్రాన్ వైరస్… అది డ్రగ్, మీడియా మాఫియాల అక్రమసంతానం…
కరోనా వైరస్‌కన్నా మీడియా ఎక్కువ ప్రమాదకరం… ఈవిషయంలో ఇప్పుడు ఎవరికీ సందేహమే అక్కర్లేదు… డ్రగ్ మాఫియాకు ఊతం ఇస్తూ, జనంలో భయాందోళనల్ని పెంచుతూ, ఫలితంగా ప్రమాద తీవ్రతను పెంచుతూ, ఏది తోస్తే అది రాసేస్తూ మీడియా చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు… మళ్లీ ఓ వేవ్ రావాలి, రాకపోతే రప్పించాలి, జనం మీద పడాలి, వేక్సిన్లు అమ్మాలి, బూస్టర్లు వేయాలి, పిల్లలకూ టీకాలు కుచ్చేయాలి అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం డ్రగ్ రాకెట్ విశ్వప్రయత్నం చేస్తోంది… దానికి […]
తెలిసిన కథే ఆకట్టుకునేలా చెప్పారు… హీరో, దర్శకులు ‘83 కప్పు’ గెలిచారు…
కథ అందరికీ తెలుసు… ముగింపు అందరికీ తెలుసు… ఒరిజినల్ కథను బోలెడుసార్లు వీడియోల్లో కూడా చూసే ఉంటారు చాలామంది… అన్నీ తెలిసిన కథను చెప్పడంలో థ్రిల్ ఏముంది..? జనానికి ఆసక్తి ఏముంటుంది..? 1983లో అనూహ్యంగా భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్పు గెలిచిన కథను 83 పేరిట తెరకెక్కించే ప్రాజెక్టుపై చాలామంది సినీపండితులు ఇలాగే భావించారు… పెదవివిరిచారు… నిజానికి మంచి సినిమా కథ అంటేనే ఎవరికీ తెలియని కథను చెప్పడం లేదా అందరికీ తెలిసిన కథను కొత్తగా చెప్పడం..! […]
మేడమ్ ఉపాసనా… సదుద్దేశమైనా సరే ఇలాంటి ఏఆర్ ఫోటోలు సబబేనా..?!
ఎంతోమంది ఎన్నిరకాలుగా ట్రై చేసినా మోడీ అపాయింట్మెంట్ దొరకదు… అంతెందుకు, ఆయన పెద్ద పెద్ద జర్నలిస్టులకు, కీలక రాజకీయవేత్తలకే దొరకడు… అలాంటిది మోడీతో చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ ఉపాసనకు అంత టైం ఎలా ఇచ్చాడని చాలామందిలో ఆశ్చర్యం… ఆ ఫోటో చూస్తుంటేనే అబ్బురం… ఆమె స్వతహాగా వైద్య వ్యాపారి, అదేసమయంలో కాస్త డిఫరెంటుగా ఆలోచించే కేరక్టర్… పలుసార్లు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకునే పోస్టులు ఆలోచనాత్మకంగా ఉంటయ్… ఇంతకీ […]
తెలుగు టీవీ అంటే ఆ అనసూయే కాదు… ఇదుగో ఈ అనసూయ కూడా..!!
5.21, 5.17, 5.12… ఏమిటివి..? కేరాఫ్ అనసూయ అనే ఓ తెలుగు టీవీ సీరియల్ రేటింగ్స్… ఇవి హైదరాబాద్ కేటగిరీ రేటింగ్స్, బార్క్ టోటల్ రేటింగ్స్ చూస్తే 7, 8 నడుమ ఉంటయ్… సో, ఆఫ్టరాల్ ఓ తెలుగు సీరియల్, ఇది ఓ పెద్ద విశేషమా అనకండి… ప్రైమ్ టైమ్‌లో వచ్చే సీరియళ్లను సహజంగానే కాస్త ఆదరణ ఎక్కువ ఉంటుంది, ప్రేక్షకులు అధికంగా చూస్తారు… కానీ ఇది మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది… లంచవర్… నాన్-ప్రైమ్… ఐనా […]
నాని సరే.., సాయిపల్లవి మళ్లీ మెరిసింది… ఓవరాల్‌గా దర్శకుడు పాస్…
మళ్లీ ప్రేక్షకుడి దృష్టిని మొత్తం తనపైకి మళ్లించుకుంది సాయిపల్లవి… శ్యామ్ సింగరాయ్ సినిమాను నిలబెట్టిన ప్రధాన కారణాల్లో ఆమె కూడా ముఖ్యమైందే… ప్రత్యేకించి ప్రణవాలయ పాటలో నర్తన గానీ, దేవదాసి పాత్రలో తన పాత్రోచిత నటన గానీ ఆకట్టుకునేలా ఉన్నయ్… శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లో ఆమె మాట్లాడటానికి రెడీ అయినప్పుడు, ఆమె ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆహుతులు కేకలు వేస్తే తమ అభిమానాన్ని ప్రదర్శించి, కాసేపు మాట్లాడనివ్వలేదు, ఆమె కన్నీళ్లపర్యంతం అయిపోయింది… వర్తమాన తెలుగు సినిమా […]
రవిశాస్త్రికి అర్జెంటుగా లా కమిషన్, నీతిఆయోగ్ పగ్గాలు ఇవ్వడం బెటర్ మోడీజీ..!!
ఈమధ్య మనకు భలే కేరక్టర్స్ దొరుకుతున్నయ్… కిరాణాకొట్టు నానిలాగే ఇదుగో ఈ రవిశాస్త్రి… క్రికెట్ బెట్టింగ్ చట్టబద్దం చేయాలని గట్టిగా చెప్పాడు… అసలే రవిశాస్త్రి, అపరమేధావి… నిజానికి తన అపరిమిత తెలివితేటల్ని కేవలం క్రికెట్‌కే పరిమితం చేశాడు గానీ అన్నిరంగాలకూ వర్తింపజేయాల్సినంత పే-ద్ద బుర్ర… అంతేకదా రవీ… నాని చెప్పినట్టు సినిమా టికెట్ ధరల్ని తగ్గిస్తే ప్రేక్షకులకు అవమానించినట్టుగానే… ఒకవేళ బెట్టింగ్‌ను గనుక చట్టబద్ధం చేయకపోతే యావత్ క్రికెట్ ప్రేమికులనూ మోడీ ప్రభుత్వం అవమానించినట్టే అంటావ్, అంతేకదా… […]
- « Previous Page
- 1
- …
- 383
- 384
- 385
- 386
- 387
- …
- 482
- Next Page »