ప్రతి ఏటా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ… మందు ప్రేమికులు మద్యం తాగుతూనే ఉంటారు… ఈసారి కరోనా భయం లేదు కాబట్టి చిన్న చిన్న గెట్‌టుగెదర్స్ జరిగాయి… అయితే ఆంధ్రా ప్రజలు 142 కోట్లు తాగేశారు… తెలంగాణలో ఏకంగా 215 కోట్లు తాగేశారు… అని ఎడాపెడా పత్రికలు రాసిపారేశాయి… నిజానికి తాగడం కాదు వార్త… ఆ ఒక్కరోజు డిపోల నుంచి తీసుకొచ్చిన మద్యం విలువను రాశారు గానీ అంతకుముందే ఉన్న స్టాక్స్ విలువ మాటేమిటి..? పైగా తెలంగాణలో రెండుసార్లు […]
ఈ డజను సౌత్ సినిమాలతో ఈ ఏడాదీ బాలీవుడ్ బాక్సాఫీసు దోపిడీయేనా..?!
సౌత్ సినిమా ఇండస్ట్రీ 2022 బాలీవుడ్ బాక్సాఫీసును శాసించింది… కొల్లగొట్టింది… యశ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, రాం చరణ్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి తదితరుల సౌత్ హీరోలకు ఇప్పుడు హిందీలో కూడా ఫ్యాన్స్ ఏర్పడిపోతున్నారు… కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, కాంతార సినిమాల్లాగే 2023లో ఓ డజన్ సౌత్ సినిమాలపై ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది..? అవి 2023లో హిందీ బాక్సుల్ని కొల్లగొట్టబోతున్నాయా..? పొన్నియిన్ సెల్వన్-2 :: బాహుబలి, కేజీఎఫ్ […]
సేమ్ మహానటి సావిత్రిలాగే… వైభోగం నుంచి ఓ అనామక మరణం వరకూ…
భరత్ భూషణ్… 1920లో మీరట్‌లో పుట్టాడు… తండ్రి రాయ్ బహదూర్ మోతీలాల్ ఓ లాయర్… కొడుకు కూడా తనలాగే లాయర్ కావాలని కోరిక… కానీ భూషణ్‌కు సినిమా నటుడు కావాలని కోరిక… అలీగఢ్‌లో డిగ్రీ అయిపోగానే ముంబైకి వచ్చాడు… ఫేమస్ డైరెక్టర్ మెహబూబ్ ఖాన్‌కు ఇవ్వడానికి ఓ రికమండేషన్ లెటర్ కూడా పట్టుకొచ్చాడు… అలీబాబా్ చాలీస్ చోర్ అనే సినిమా పనిలో సదరు మెహబూబ్ ఖాన్ బిజీ… భూషణ్ కష్టమ్మీద ఆయన్ని పట్టుకుని ఈ లెటర్ చూపించాడు… […]
‘‘నో, నో… మా చంద్రబాబు పరమ పావనుడు… ఆ చావులతో సంబంధమే లేదు… ’’
ఒక విఫల ప్రయత్నం… నిన్నటి గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతికి అసలు కారకుడు చంద్రబాబును, ఆ పాతకం నుంచి బయటపడేయటానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ విఫల ప్రయత్నం చేశాడు… అబ్బే, చంద్రబాబుకు అస్సలు సంబంధం లేదు, అసలు అది టీడీపీ కార్యక్రమమే కాదు, అదంతా ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన జనోద్ధరణ మాత్రమే, వాళ్ల నిర్వాకం కారణంగానే ఆ ముగ్గురూ మృతిచెందారు… అని కవరింగు ఇవ్వడానికి నానాపాట్లూ పడింది… మొన్నటి కందుకూరు దుర్ఘటనలో సంభవించిన మరణాలు రాష్ట్రవ్యాప్తంగా […]
మన ‘ఏడుకొండల్లా’గే జార్ఖండ్‌లో పార్శ్వనాథ్ గుట్టలు… అగ్గిపెట్టిన సర్కారు…
సంఖ్యాబలమున్న మైనారిటీలను మచ్చిక చేసుకోవాలి… వోటు బ్యాంకుగా చూసుకోవాలి… వాళ్లు చెప్పినట్టు సై అనాలి… ఇదేకదా, భారతదేశంలో ప్రతి సెక్యులర్ పార్టీ చేసేది… మరి మైనారిటీలు అంటే, నిజంగానే సంఖ్యాబలం లేని మైనారిటీలను ఎవడు పట్టించుకోవాలి..? అదే కదా మన దరిద్రం… మన రాజకీయ పార్టీలు, మన ప్రభుత్వాల అడుగులు అలా ఉంటాయి… మన దేశ మైనారిటీల్లో క్రిస్టియన్లు, ముస్లింలే కాదు… పార్శీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా ఉన్నారనే సోయి రాజకీయ పార్టీలకు ఉండదు… ఇవి […]
ఓహ్… ఈ సుపారీ హత్యల వెనుక ఇంత చరిత్ర ఉందా..? ఇంట్రస్టింగు…
పార్ధసారధి పోట్లూరి …… సుపారీ అనే పదం తరుచూ మనం సినిమాలలో మరియు పత్రికలలో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ! సుపారీ అనేది కాంట్రాక్ట్ హత్యలకి మారు పేరుగా వాడుతుంది అండర్ వరల్డ్ మాఫియా ! అయితే ఈ ‘సుపారీ ‘ అనే పదానికి అర్ధం ‘తాంబూలం ‘! డబ్బులు తీసుకొని చేసే హత్యలకి పర్యాయపదంగా సుపారీ అనే పేరు ఎలా వాడుకలోకి వచ్చింది ? ఈ సుపారీ అనే పదానికి చారిత్రిక నేపధ్యం ఉంది […]
సాక్షి కదా… అదంతే… పాఠకుల్ని పిచ్చోళ్లను చేయడంలో నెంబర్ వన్…
పొద్దున్నే టీవీల్లో కొందరు స్వాములు రంగురంగుల పూసల దండలు వేసుకుని, ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఓ విరుగుడు చెప్పేస్తుంటారు… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు… మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు… వాళ్లను చూస్తుంటేనే ఓ అలర్జీ… సేమ్, సాక్షిలో ఈరోజు వచ్చిన హాఫ్ పేజీ ఐటం కూడా అలాగే అనిపించింది… ఐటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే… అది యాడ్‌లా అనిపించలేదు, యాడ్ అనీ రాయలేదు… స్పాట్ వార్త కాదు, స్పెషల్ స్టోరీ కాదు… ఫ్యామిలీ పేజీ […]
‘‘ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే… ఈ దేశ చట్టాల్ని గౌరవించాల్సిందే…’’
ముందుగా ఒక వార్త…ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన ట్విట్టర్ ఖాతాలో ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించే ఓ కొత్త సంవత్సరపు గ్రాఫిక్ పోస్ట్ చేసింది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాలు లేని మ్యాప్ అది… ఇది గమనించిన వెంటనే కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియసయ్యాడు… ‘‘డియర్ వాట్సప్, వెంటనే ఆ తప్పును సరిదిద్దండి, లేకపోతే బాగుండదు… ఈ దేశంలో వ్యాపారం చేయాలని అనుకునే ఏ సంస్థయినా భారతదేశ చట్టాల్ని […]