ఒక్కసారిగా హడావుడి… హైదరాబాద్ నెటిజనమంతా స్మార్ట్ ఫోన్లలో, కెమెరాల్లో ఈ సీన్లను బంధించడానికి పోటీలు పడ్డారు… అరుదైన దృశ్యాల్ని చూస్తూ సంబరపడిపోయారు… వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ షేర్లు, ఇన్‌స్టా పోస్టులు మొత్తం ఇవే ఫోటోలతో నిండిపోతున్నయ్… కొందరికి ఇదేమిటో తెలుసు, కొందరికి తెలియదు… మొత్తానికి ఓ చర్చ… ఇళ్ల నుంచి బయటికి వచ్చి అనువైన కోణాలు వెతికి ఫోటోలు తీయడంలో బిజీ అయిపోయారు చాలామంది… నిజానికి ఏమిటిది..? ఇదొక వింత కాదు, విడ్డూరం కాదు… ఒక […]
అంతటి సుబ్బన్నే చెప్పేశాడుగా… అది ఉత్త దండుగ మందేనట…
నో, నో, ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదట, కరోనాకు పనిచేయదట, అందుకని మేం తయారు చేయబోం, ఒకవేళ కేంద్రం అనుమతిస్తే అప్పుడు సీఎంతో మాట్లాడి ఆలోచిస్తాం…….. ఇదీ టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పత్రిక ప్రకటన… ఇది చదివాక ఆశ్చర్యం, ఆనందం, ఆందోళన, అనుమానం గట్రా చాలా ఫీలింగ్స్…. జగన్ ఈయన్ని కేవలం టీటీడీకి పరిమితం చేయడం పట్ల ఒకింత ఆనందం, ఇప్పటికీ ఆయన అదేతరహాలో మాట్లాడుతున్న తీరు పట్ల ఆశ్చర్యం… టీటీడీ పరిస్థితి పట్ల ఆందోళన… ఇలాగన్నమాట…. […]
‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
ముందుగా ఈ ప్రేమకథను సంక్షిప్తంగా, సూటిగా చదవండి… విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ 2010 ఇంజనీర్ కోర్స్ పాసవుట్… 2015లో బెంగుళూరులోని హూవాయ్ టెక్నాలజీస్‌లో కొలువు… తనతో పాటు పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో పరిచయం… కొద్దిరోజుల్లోనే ఆమెకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది… అప్పటికే ఆమెపై మనసు పారేసుకున్నాడు ప్రశాంత్… ఉద్యోగం పక్కన బెట్టి, ఆ యువతి జాడ కోసం, మనసులోని మాట చెప్పడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆశ్రమాల్లో అక్కడక్కడా ఉంటూ ఆ యువతి […]
సరైన చర్య…! తప్పనిసరైన చర్య…! మోడీకి చేతనైతే ఈ దొరకు జైలే గతి..!!
బెంగాల్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ మీద కఠిన చర్యలకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం నోటీసుల్ని జారీ చేసింది… అది సరైన అడుగేనా..? అని చాలామంది మిత్రుల ప్రశ్న… సరైనదే కాదు, తప్పనిసరైనది కూడా..! ప్రభుత్వాలు వస్తుంటయ్, పోతుంటయ్… మమత వంటి ముఖ్యమంత్రులు, మోడీ వంటి ప్రధాన మంత్రులు కూడా వస్తుంటారు, పోతుంటారు… కానీ సిస్టం ఓ క్రమపద్ధతిలో నడుస్తూ ఉండాలి… కీలకమైన కేంద్ర సర్వీసు అధికారులు దానికి తోడ్పడాలి… రాజకీయాల ప్రభావం, ఒత్తిళ్లు […]
ఇద్దరు కాదు, ముగ్గురు పిల్లలు… చైనా కొత్త పాలసీ వెనుక అసలు లెక్క ఇదీ…
చైనా అంటేనే అంత..! అబ్బే, జీవాయుధాలుగా వైరసులను ప్రపంచం మీదకు వదలడం గురించి కాదు… ఏ విషయంలోనైనా అంతే… ప్రతి పాలసీలోనూ బోలెడంత కాంట్రడిక్షన్, కంట్రాస్టు ఎట్సెట్రా… ఉదాహరణకు… పర్లేదు, ఇకపై ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కన్నా సరే అని సంతాన ఆంక్షల్ని సడలించింది కదా… కానీ ఒక్క జింజియాంగ్ ప్రావిన్సులో మాత్రం పూర్తి విరుద్ధంగా వెళ్తుంది… ఎక్కువ పిల్లలుంటే జరిమానాలు, నిర్బంధ అబార్షన్లు వగైరా ప్రయోగిస్తూ ఉంటుంది… ఎందుకంటే అక్కడ ముస్లింల జనాభా పెరగకూడదని..! […]
పోనీ… మీరు చెప్పండి… ఆ స్థితిలో ఎవరిని బతికించాలి, ఎవరి ప్రాణం విలువైంది..!?
భారీ వర్షాలు, వరదలు, ప్రవాహాలు ఉధృతం… ఓ కుటుంబం ఒక తెప్ప మీద కొట్టుకుపోతోంది…. ఒకరిద్దరు పిల్లలు కొట్టుకుపోయారు, పోతేపోయారు, మళ్లీ కనొచ్చు అనుకున్నారు,,. ప్రాణాలకు మించిన స్వార్థం ఏముంటుంది..? అసలు సగటు జీవలక్షణమే అది కదా… ఓ క్షణం, ఓ సందర్భం వచ్చింది… భార్య, ఒక కొడుకు, తను మిగిలారు… తాము ఏ తెప్ప మీద ఉన్నారో అది ఒకరికే ఆశ్రయం ఇవ్వగలదు, లేకపోతే ముగ్గురూ మునిగిపోతారు… భార్యను తోసేశాడు… బతికి బట్టకడితే మరో భార్య, […]
ఆనందయ్య మందుకు ఆ చట్టమే శ్రీరామరక్ష… లేకపోతే లోపలేసేవారేమో…
నానారకాల నిందలతో, వెటకారాలతో, ఉద్దేశపూర్వక దుష్ప్రచారాలతో, ‘అతి జ్ఞాన’ మీడియా ప్రసారాలతో, వక్రీకరణలతో ఆనందయ్య మందుకు అడ్డం పడటానికి సాగిన ప్రయత్నాలను కాసేపు పక్కన పెడదాం… పోనీ, అది పనిచేస్తుందా, ప్రభుత్వం అనుమతించడం కరెక్టేనా అనే డిబేట్‌ను ఇక పక్కన పెట్టేయొచ్చు… ఎందుకంటే.., హైకోర్టు చెప్పింది, ప్రభుత్వం అనుమతించింది… దీన్ని ఆనందయ్య ఎలా సద్వినియోగం చేస్తాడో వేచి చూడాల్సిందే… సోకాల్డ్ టీవీ మేధావులు, అకస్మాత్తుగా తెరమీదకు వచ్చిన మేధావులు, సంప్రదాయ వైద్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే సైన్స్ మేధావులు […]
భళా స్టాలినూ..! మళ్లీ ఓ మంచి పనిచేశావు… మెచ్యూరిటీ కనిపిస్తోంది…!
ఓ నాస్తికుడు… దేవుడిని నమ్మనివాడు… పైగా హిందూ మతద్వేషి… ఆ డీఎంకే బాస్, ఆ డీఎంకే ప్రభుత్వ ముఖ్యమంత్రి స్టాలిన్ వచ్చాడు కదా… ఇంకేముంది..? గుళ్లకు, హిందూ ఉత్సవాలకు ఇబ్బందులే అనే అపోహ కొంత ఏర్పడింది… అపోహ అనే పదమే కరెక్టు… ఎందుకంటే..? స్టాలిన్ సీఎం అయ్యాక ఈరోజు వరకూ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ మెచ్యూరిటీ కనిపిస్తోంది… ప్రత్యర్థి పార్టీలపై కక్షసాధింపులు గానీ, పాత పథకాల రద్దు గానీ, విచక్షణారహితంగా కొత్త పథకాల ప్రకటనలు గానీ ఏమీ […]
టీకా మందుతో మోడీ సర్కారును కడిగేసిన సుప్రీం… అన్నీ విలువైన ప్రశ్నలే…
లోపభూయిష్టమైన కేంద్ర కరోనా టీకాల విధానాన్ని సుప్రీంకోర్టు సోమవారం విచారణలో దాదాపు కడిగేసింది… అది అడిగిన ఏ ప్రశ్నకూ కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు… ప్రతి ప్రశ్నా విలువైనదే… జనంలో చర్చ జరుగుతున్నవే… ముందుగా టీకాల ధరలు… జాతీయ స్థాయిలో ఒకటే ధర ఎందుకు ఉండకూడదు..? ప్రభుత్వం తను ధరల్ని ఖరారు చేయకుండా కంపెనీలకు ఎందుకు వదిలేసింది..? అని ప్రశ్నించింది… నిజమే, ఇదే కదా సగటు మనిషి కూడా తీవ్రంగా తప్పు పడుతున్నది..! ఒక […]
‘‘శాస్త్ర పంథా’’లోనే అనుమతి..! కానీ జగన్ చేయాల్సింది ఇంకా ఉంది…!!
ఆనందయ్య మందు… ఈమధ్యకాలంలో ఇంత చర్చ ఏ విషయంలోనూ జరగలేదు… వేలాది మంది కరోనా బారిన పడుతూ.., కార్పొరేట్, ప్రైవేటు వైద్యం రోగుల ఒంటిని, ఇంటిని దివాలా తీయిస్తున్న దుర్దినాల్లో… ఉచితంగా ఆనందయ్య పంపిణీ చేసిన మందు వేల మందికి రిలీఫ్ ఇచ్చింది… కానీ ఒక్కసారిగా మెడికల్ మాఫియా పడగవిప్పింది… నెగెటివ్ క్యాంపెయిన్‌కు దిగింది… కార్పొరేట్, వేక్సిన్, డ్రగ్, మెడికల్ మాఫియాల మీద పల్లెత్తు మాట రాని టీవీ9, ప్రజాశక్తి తదితర మీడియా ఓ క్యాంపెయిన్ నడిపించాయి… […]
కెన్యా టీకాఫీ సాయం వోకే… తీసుకుంటే నామోషీ కాదు… మరి అప్పుడేం చేశాం…?!
ఊళ్లో ఓ మోస్తరు రైతు… ఊరంతా జ్వరాలే కమ్మేసినప్పుడు తనకు చేతనైన సాయాన్ని చేశాడు… దాదాపు ప్రతి ఇంటి యోగక్షేమాలు తెలుసుకున్నాడు… తన దగ్గరున్న మందూమాకూ సమకూర్చాడు… ఇప్పుడు తనకే జ్వరమొచ్చింది, నీరసపడిపోయాడు… పాపం, సమయానికి, అవసరానికి డబ్బు ఏమైనా ఉందో లేదో అని ఇరుగూపొరుగు రైతులు బియ్యం, ఉప్పు, పప్పు, సాయిత్యం పంపించారు… అదే ఊళ్లోని కొందరు కూలీలు కూడా సాయం చేశారు… ఊరంతా సంఘీభావం ప్రకటించింది… నీకు అండగా మేమున్నాం అన్నాయి… స్థూలంగా చూస్తే […]
హేయ్ ఫ్యామిలీమెన్… ఇదే రేంజ్లో ఓ తెలుగు సినిమా తీసిపెట్టకూడదా..?!
ఫ్యామిలీ మ్యాన్ స్థాయికి టాలీవుడ్ చేరుతుందా.? సిరీస్ ఒక్కటి, ఎపిసోడ్లు పది, ఒక్కోటి 50 నిమిషాలు… ఇది ఆమెజాన్ ప్రైంలో ఫ్యామిలీ మాన్ గురించి… ఇద్దరు తెలుగు కుర్రాళ్లు.., తిరుపతికి చెందిన నిడుమోరు రాజు, చిత్తూరుకు చెందిన దాసరి కొత్తపల్లి కృష్ణ.. ఇద్దరు కలిసింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజీ, తిరుపతిలో. మంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ లో స్థిరపడ్డా.. మనసెందుకో మళ్లీ ఇండియా వైపే లాగింది. నిడుమోరు రాజు కాస్తా రాజ్‌గా, దాసరి […]
వాళ్ల మనోభావాలు మళ్లీ దెబ్బతిన్నాయట… ఎప్పుడూ ఇదే దందా..?!
ఏదైనా పెద్ద సినిమా ప్రాజెక్టు ప్రారంభమైతే చాలు… అందులో ఏదో ఒకటి పట్టేసుకుని, ఉద్దేశపూర్వకంగా ఓ వివాదాన్ని క్రియేట్ చేసి, మనోభావాల్ని దెబ్బతీసుకుని, రచ్చ చేసుకుని, చివరకు ఎక్కడో ఓచోట సెటిల్ చేసుకునే ఉదంతాలు బోలెడు ఈరోజుల్లో..! ఒక్క తెలుగులోనే కాదు, దేశమంతటా ఇదే తంతు… ప్రతి భాషలోనూ ఇదే దందా..!! కరోనా లాక్ డౌన్ల కాలం కదా, షూటింగులు ఆగిపోయి, చాలామంది ‘మనోభావాల వ్యాపారం’ పడిపోయింది… ఐనా ఏదో ఒకటి దొరక్కపోదు అని కాచుకుని కూర్చుంటారు… […]
గుడ్డి చట్టాల్ని వదిలేద్దాం… మీరు చెప్పండి, ఈ తండ్రి చేసింది తప్పా..? ఒప్పా..?!
……. By ….. Ashok Vemulapalli……….. తప్పెవరిది..? అవును … వాడిని చంపింది నేనే.. వాడు చేసిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి, నా పొలంలో పూడ్చిపెట్టా.. ఇది తప్పే అయితే నన్నూ ఊరితీయండి.. కానీ ప్రేమ పేరుతో చిన్నపిల్లలని వల్లో వేసుకునే ఇలాంటి కామాంధుల్ని మాత్రం బతకనీయకండి.. ఒక ఆడపిల్లను కన్న తండ్రిగా ఆవేదనతోనే హత్య చేశాను.. చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసుల ముందు పెంగరకుంటకు చెందిన రైతు సున్నపుబాబు అన్నమాటలివి.. హత్య చేసేంత నేరం […]
ప్రధాని మోడీ స్థానంలో ఇందిరాగాంధీ ఉండి ఉంటే..! బెంగాల్ కథ వేరే ఉండేది..!!
మంచి జరుగుతుందా..? చెడు జరుగుతుందా..? అనేది వదిలేయండి……… మోడీ స్థానంలో గనుక ఇందిరాగాంధీ ఉండి ఉంటే మమత బెనర్జీ ప్రభుత్వం ఉండేది కాదు… ఇప్పుడు కాదు, మొన్నటి ఎన్నికలకు ముందే ఉండేది కాదు… చీఫ్ సెక్రెటరీని రీకాల్ చేస్తాం, ఐపీఎస్ అధికారుల్ని రీకాల్ చేస్తాం వంటి పనికిమాలిన చిల్లరమల్లర చర్యలు ఉండేవి కావు… ఇది ఓ మిత్రుడి అభిప్రాయం… నిజమే… అక్షరాలా నిజమే…. మమత బెనర్జీ అప్పుడప్పుడు రహస్యంగా మోడీకి పంపించే డ్రెస్సులు, రసగుల్లాలు పనిచేస్తున్నాయేమో గానీ, […]
ఈ కరోనా గడ్డు దినాల్లోనూ కరుణ లేని మోడీ… పరుషంగా ఉన్నా సరే సత్యమిదే…
కరోనా కష్టకాలంలో ప్రభువుల వారికి కాస్త కరుణా దృక్పథం ఉండాలి… తీసుకునే నిర్ణయాల్లో మానవీయ కోణం ఉండాలి… నా ప్రజలు అనే భావన కనిపించాలి… దురదృష్టవశాత్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అవేవీ లేవు… కరోనా మృతుల కుటుంబాలకు విపత్తు పరిహారం కింద చెల్లించే స్కీం కూడా ఎత్తిపారేయడం దీనికి పక్కా నిదర్శనం… 27 లక్షల కోట్ల ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ శుష్కఫలితం మరో నిదర్శనం… బోలెడు… మిగతా కరోనా పాలసీ వైఫల్యాల గురించి రాస్తూ పోతే గ్రంథాలే… […]
…. అంతట శోభనుడు ఖంగారుపడి ఆ ఎన్టీవోడి దగ్గరకు పరుగు తీసెను…
……… By…. Bharadwaja Rangavajhala………… ఎన్టీఆరూ ముందస్తు స్క్రిప్టులూ నిడమర్తి మూర్తి గారు భాగస్వాములతో కల్సి బాపు గారితో సంపూర్ణ రామాయణం తీయాలనుకున్నప్పుడు జరిగిన కథ…. రాముడుగా శోభన్ బాబును తీసుకోవాలని కూడా నిర్ణయం జరిగిపోయింది. సరిగ్గా అప్పుడు … ఈ విషయం విన్న ఓ పెద్దమనిషి వీళ్లని కల్సి … అమాయకులారా … ఆల్రెడీ ఎన్టీఆర్ దగ్గర సముద్రాల గారు రాసిన సంపూర్ణ రామాయణం స్క్రిప్టు ఉంది. ఆయన ఏ క్షణంలో తీస్తాడో తెలియదు … […]
అది ఉత్త ఫేక్… కానిస్టేబుల్‌ను చితకబాదిన వీడియోకూ సిటీకి లింకే లేదు…
కరోనా ప్రళయం ముంచెత్తవచ్చుగాక… వందలాది శవాలు లేస్తుండవచ్చుగాక… జనం వేలాదిగా హాస్పిటళ్లలో రోదిస్తుండవచ్చుగాక… ఓ చిన్న సాయం చేద్దామని లేదు… నిర్మాణాత్మక కార్యాచరణ లేదు….. ఎంతసేపూ ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలతో సోషల్ మీడియాను నింపేయడమే పని కొందరికి…! హైదరాబాదులో ఓ అమాయక పోలీసును ముస్లింలు చితకబాదారని, అడిగేవాడు లేడని పొద్దున్నుంచీ ఓ వీడియో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు… ఉద్దేశపూర్వకంగానే దీన్ని బాగా పుష్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది… ప్రధానంగా కాషాయం గ్రూపుల్లో ఎక్కువ సర్క్యులేట్ చేస్తున్నారని టీఆర్ఎస్ […]
భేష్ సాక్షి..! నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ఈ ఔదార్యం ఏది..?
సగటు జర్నలిస్టు బతుకు మరీ నరకప్రాయం అయిపోయింది… ఈ కరోనాకు చాలామంది బలైపోయారు… జర్నలిస్టే కాదు, పత్రికల్లో పనిచేసే ఇతర సిబ్బంది కూడా..! హఠాత్తుగా మనిషి చనిపోతే, ఆ కుటుంబం బజార్న పడితే అయ్యో అని ఆదుకునేవాడు లేడు… ఉండడు, ఈ ఫీల్డే అలాంటిది… ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇతోధికంగా, ఉదారంగా స్పందించి సాయాన్ని ప్రకటిస్తున్నయ్… డీఎంకే స్టాలిన్ ఏకంగా 10 లక్షల పరిహారాన్ని ప్రకటించాడు… మమ్మల్ని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి మహాప్రభో అని మొరపెట్టుకుంటుంటే […]
రోజా మళ్లీ వచ్చింది బాబోయ్… కామెంట్లలో ఈటీవీ జబర్దస్త్ ప్రేక్షకుల గగ్గోలు…
అబ్బా… ఈమె మళ్లీ వచ్చిందిరా బాబూ… ఈమధ్య రెండు సర్జరీలు చేయించుకుంది, ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా… లేకపోతే తన నియోజకవర్గంలో కరోనా స్థితిగతులపై కాస్త జనానికి సాయం చేయడంపై దృష్టి పెట్టొచ్చుగా……….. ఇలా కామెంట్లు పోటెత్తుతున్నయ్… అర్థం కాలేదా..? ఈటీవీలో జబర్దస్త్ అనే ఓ వెగటు కామెడీ షో వస్తుందిగా… దానికి రోజా జడ్జి… అసలు తనను గెలిపించిందే జబర్దస్త్ అన్న స్థాయిలో ఆ షోను ఓన్ చేసుకుంటుంది రోజా… నాగబాబు కో-జడ్జిగా ఉన్నన్నాళ్లూ కాస్త […]
- « Previous Page
- 1
- …
- 389
- 390
- 391
- 392
- 393
- …
- 447
- Next Page »