రాంగోపాలవర్మ అంటే వినోదం, వివాదం కాదు… వికృతం..! తన సినిమాలు అంతే, తన రాతలు అంతే, తన చేష్టలూ అంతే… చివరకు తను ఇచ్చే చిల్లర ఇంటర్వ్యూలను కూడా వల్గర్ పీసులుగా మార్చి, ఫిమేల్ ఇంటర్వ్యూయర్లను కూడా తన మార్క్ అశ్లీలంలోకి లాగి వినోదించే వికటుడు..!! నాలుగైదేళ్లుగా తను తీసే సినిమాలే తన ప్రజెంట్ స్టేటస్‌ను బయటపెడుతున్నయ్… పవన్ కల్యాణ్‌పై తను తీసిన ఓ షార్ట్ ఫిలిం వర్మ పైత్యానికి చక్కని ఉదాహరణ… ఇక మూడునాలుగు వికార […]
చేయి విదల్చని పాకిస్థానీలు..! ఔదార్యంలో ‘స్థాయి’ చాటిన ఇండియన్స్…!!
మన జీవితాలు ఎంత బుద్భుదమో కరోనా స్పష్టంగానే చెప్పింది… ఒక టైం వస్తే ఆస్తులు, అంతస్థులు, సంపద, హోదా, తెలివి, పాపులారిటీ, ఏవీ పనిచేయవని తేల్చేసింది… మరీ కొందరిది దిక్కులేని చావు, మున్సిపాలిటీ దహనాలు… అంతులేని వైరాగ్యాన్ని నింపింది కొన్నాళ్లు… ఇప్పుడిక కరోనా భయం తగ్గిందిగా… మళ్లీ మామూలే… మనిషి మారడు……….. అయితే ఈ సంక్షోభంలో కనీసం ఒక మనిషి తోటి మనిషికి అండగా నిలబడ్డాడా..? సాయం చేశాడా..? ఇలాంటి విపత్తుల్లో కాకపోతే ఇక సమాజం ఔదార్యం […]
ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
ఎడ్లు పోయాయని స్థానిక పోలీసు స్టేషన్లో కేసు పెట్టేందుకు చేసే ప్రయత్నంతో సినిమా మొదలవుతుంది. పూచేరీ అనే ఊరులోని కున్నిముత్తు (మిథున్ మానిక్కం), వీరాయి (రమ్య పాండియన్) దంపతులు తప్పిపోయిన ఎడ్ల కోసం పడే తపన, వాటితో వీరి అనుబంధం, ఎడ్లు పోయేందుకు రాజకీయ కారణాలు, దీనిపై ఇతర పార్టీల రాజకీయ డ్రామాలు, మీడియా తీరు, అధికారుల అవినీతితో గ్రామాల్లో వెనుకబాటు ఇలా ఉంటాయి రామే… రావణే మూవీలో… నేటివిటి అంటేనే తమిళ సినిమా. దీంట్లో ఇంకా […]
ఫీల్‌గుడ్ పరిణయమే… కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి… ఆ పాత స్వాతితో పోల్చితే…!!
…… Reviewer :: Prasen Bellamkonda……….. అప్పుడెప్పుడో 1984 లో శారద, సుహాసిని తల్లీ కూతుళ్లుగా నటించిన క్రాంతికుమార్ సినిమా స్వాతి గుర్తొచ్చింది ఆహాలో పరిణయం మూవీ చూస్తుంటే. కూతురే స్వయంగా తల్లి పెళ్లి చెయ్యడం అనే కథాంశం అప్పట్లో మహావిప్లవం కావచ్చు కాక ఇప్పుడది మామ్మూలేలే అనుకుని దర్శకుడు దానిచుట్టూ మరికొన్ని భావోద్వేగాలను కూడా అల్లుకున్నాడు. ఫీల్‌గుడ్ సినిమాలేవీ ఈ మధ్య రాలేదో లేక నేను మిస్సయ్యానో తెలీదుగానీ పరిణయం చూసాక నేను తెలుగులో […]
బుల్లి ఠాక్రే వారి చిత్తపైత్యం… ఆ కొరియన్ పెంగ్విన్లకు ప్రాణగండం…
2015… ప్రధాని మోడీ అప్పట్లో రోజుకు రెండుమూడు దేశాల్ని చుట్టేస్తున్న కాలం… ఎక్కడికి వెళ్లినా ఆ డ్రెస్సులు ధరించి, ఆ దేశాధ్యక్షుల్ని కౌగిలించుకుంటూ, వాళ్ల సంస్కృతిని, ఆతిథ్యాన్ని రుచిచూస్తూ ప్రపంచమంతా ప్రదక్షిణలు చేస్తున్న పర్యాటకశకం… పనిలోపనిగా మంగోలియా వెళ్లాడు… వ్యూహాత్మకంగా దానికి చేరదీయడం, డబ్బులిచ్చి బుజ్జగించడం, మన ఫోల్డ్‌లో ఉంచుకోవడం మన అవసరం… వెళ్లగానే అక్కడి డ్రెస్సు వేశాడు, ఫోటోలు దిగాడు, వీడియోలు తీశారు… విల్లంబులు పట్టుకుని ఫోజులిచ్చాడు… మనం ఉదారంగా ఆర్థికసాయం ప్రకటించడంతో అక్కడి ప్రభుత్వం […]
జగన్ స్పూర్తా..? కేసీయార్ స్పూర్తా..? ఆయన ఆంధ్రా రైతా… తెలంగాణ రైతా..?!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… ఆల్మోస్ట్ వర్కింగ్ సీఎం కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్… ఏదైనా మనసుకు నచ్చినట్టయితే, రాజకీయాలకు అతీతమైనా సరే స్పందిస్తుంటాడు… ఈరోజు ఉదయం (24.09.2021) 9 గంటలకు ఓ ట్వీట్ కనిపించింది… చెక్ చేస్తే అది తన అఫీషియల్ అకౌంటే… రెండు ఫోటోలు షేర్ చేశాడు… ఒకటి ఖమ్మం జిల్లా, మరొకటి సిరిసిల్ల జిల్లా అని రాశాడు… ఆరోగ్య సిబ్బంది నిబద్ధతకు, కృషికి ఇవే నిదర్శనాలు అన్నాడు… పనిలోపనిగా ఇవి కేసీయార్ నాయకత్వంలోని పంట […]
…. బహుశా ఈ అంశాలే లవ్ స్టోరీ మూవీకి మైనస్ కాబోతున్నాయేమో…!!
శేఖర్ కమ్ముల సినిమా అంటే..? అశ్లీలత ఉండదు, వెకిలి కామెడీ ట్రాకులుండవ్, అసభ్య సీన్లు, ఐటం సాంగ్స్ ఉండవ్, హీరోల స్వకుచమర్దనాలు ఉండవ్, ఇమేజీ బిల్డప్పులు, ఫార్ములా హీరోయిజాలు, వంశకీర్తనలుండవ్ వంటి ఏ చెత్తా ఉండదు… మంచి హైజినిక్ సినిమాలు, ఆర్గానిక్ సినిమాలు… కథలు కూడా లైటర్ వీన్లో సున్నితంగా నడుస్తూ సాగుతయ్… నేలవిడిచి సాము చేయడు, డబ్బు కోసం ‘వెకిలితనాన్ని’ తన సినిమాల్లోకి రానివ్వడు……… ఎస్, అదే తన బలం, ఓ కుటుంబం తమ పిల్లలతోపాటు […]
ఏం తెలివిరా బాబూ… ఆ గాంధీ తాతను సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చుకున్నారు…
బతుకమ్మ పండుగ పుట్టింది ఎమ్మెల్సీ, కేసీయార్ బిడ్డ కవిత ఆలోచనల్లో నుంచి కాదు… ఒకవేళ ఏ విద్యాధికారి వికృత అత్యుత్సాహమో, స్వామిభక్తో ఆమె ఫోటోల్ని బతుకమ్మ పాఠ్యాంశాల్లో చేర్చినా జనం నవ్వుకుంటారు… బతుకమ్మ పండుగ మాత్రమే కాదు, పాటల రూపంలో ఆటల రూపంలో తెలంగాణ మహిళ కష్టసుఖాల కలబోత… వెల్లబోత..! అది శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంత మహిళల విశిష్ట సాంస్కృతిక ఉత్సవం… అంగీకరిస్తారు కదా…! కేఆర్ నాగరాజన్ అనే ఓ తమిళ వస్త్ర వ్యాపారి ఉన్నాడు… చేనేత […]
నవీన్ పట్నాయక్ సైలెంట్ వర్క్…! Good Work On Unique Animal Breeds..!
మంద బర్రె… మరీ స్పెషల్……….. పబ్లిసిటీ లేని మన పొడ తూర్పు మనుగడ పరంపరలో… ప్రకృతి, పరిసరాలు ఏమైనా ఫర్వాలేదు అన్నట్లుగా మనిషి ముందుకు సాగుతున్నాడు. ఉపయోగపడే వాటిని రక్షించుకుంటూ, అవసరం లేని వాటిని గతంలోకి కలిపేస్తూ వస్తున్నాడు. ఆహార అవసరాలను తీర్చే జంతువులను, పక్షులను కాపాడుకుంటూ (తింటూనే)… వీటిలోనూ మేలు రకం వాటి మనుగడ ఉండేలా చేస్తున్నాడు. ఎక్కడ ఏ పరిశోధనలు చేసినా ఇదే పరమార్థం. ప్రపంచంలో మాంసం, పాల అవసరాలు తీర్చే ఎన్నో జీవాలు […]
మౌనం ఓ రహస్య సమ్మతి… అది ద్రోహం… అంటే నేరం… అనగా మౌనమూ శిక్షార్హమే…
‘‘ప్రశ్నించాల్సిన చోట, ప్రశ్నించే స్థోమత ఉన్నచోట… ఒక తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించకుండా నిశ్శబ్దంగా ఉండిపోవడం… ఒక తప్పుకు రహస్య సమ్మతి తెలిపినట్టే… అంటే ధర్మానికి ద్రోహం చేసినట్టే… ద్రోహం అంటే తప్పు… తప్పు అంటే నేరం… మరి నేరానికి శిక్ష తప్పదు కదా…’’ Silence is connivance.. Connivance is betrayal.. Betrayal is sin.. Sin is a punishable offence…… మనం బతుకుతున్న వాతావరణంలో మనకు నచ్చని అనేకానేక మౌనాల్ని గమనిస్తున్నప్పుడు ఇలా ఎప్పుడైనా అనిపించిందా..? […]
ఆ మృగాలకు సర్కారీ లాంఛనాలతో సీఎం సాక్షిగా దహసంస్కారం..!!
రినో… అంటే ఖడ్గమృగం… ముట్టె మీద మొలిచి, పెరిగే ఖడ్గం వంటి కొమ్ముతో ఆ పేరొచ్చింది… ఆ కొమ్మును చైనా సంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు మందుగా వాడతారనీ, బ్లాక్ మార్కెట్లో అందుకే దానికి భారీ రేటు పలుకుతుందనీ ఎన్నాళ్లుగానో వింటున్నదే… ఏటా ఆ డబ్బు కోసం ఖడ్గమృగాలను వేటాడుతున్నారు, మరణించిన మృగాల కొమ్ములను కోసుకుంటున్నారు, కొందరు కొమ్ముల్ని కోసేసుకుని తిరిగి వదిలేస్తున్నారు… ప్రత్యేకించి మన ఈశాన్య రాష్ట్రాల్లో ఇది అధికం… వేటగాళ్ల దగ్గర స్వాధీనం చేసుకున్నవీ, […]
లక్ష రూపాయలు..! ప్రత్యేక ఏసీ రైలులో 16 రోజుల చార్ధామ్ యాత్ర..!
మునుపు… నాలుగు బట్టలు సంచీలో కుక్కుకుని, బస్సెక్కి కూర్చుంటే చాలు… సంపూర్ణ తీర్థయాత్ర, దక్షిణభారత యాత్ర, ఉత్తర భారత యాత్ర అంటూ రకరకాల సర్వీసులు నడిపించేవారు… తిండీతిప్పలు, సత్రాల గోల అంతా నిర్వాహకులే పడేవాళ్లు… ఇప్పుడు కూడా ఒకటీఅరా అక్కడక్కడా ఈ సర్వీసులు ఉండొచ్చు… నిజానికి అది చాలా సుఖం… ఒకసారి డబ్బు చెల్లిస్తే చాలు, నిర్వాహకులే మొత్తం ఆర్గనైజ్ చేసేవాళ్లు… ఎక్కడో రోడ్డు పక్కన బస్సు ఆపుకోవడం, కట్టెలు అంటించడం, ఎంచక్కా మన తిండినే వండిపెట్టడం… […]
మందాకిని..! గొంతులోకి నాటుగా, ఘాటుగా..! కలర్సారా కాదు, కళ్లుతిరిగే సారా…!!
మొన్న ఒకాయన ఓ ఫంక్షన్ చేశాడు… ఈమధ్య కామనే కదా, మందు కూడా పెట్టాడు… మంచి స్కాచ్ సీసాలు టేబుళ్లపై పెట్టాడు… కొందరు ఫుల్ బాటిళ్లు ఖాళీ చేసి కూడా అసంతృప్తిగా మొహాలు పెట్టారు… వాళ్లకు ఆనలేదు… మళ్లీ వాళ్లకు చీప్ లిక్కర్‌కు ఎక్కువ, ప్రీమియంకు తక్కువ బాపతు సీసాలు తెప్పిస్తే తప్ప వాళ్ల మొహాలు తేటపడలేదు… ఎస్, నాటు అలవాటైనవాడికి నీటు ఎక్కదు… కాదు, కడుపులోకే దిగదు… మన కేసీయార్ సర్కారు ప్రజల మీద అత్యంత […]
ఎహె ఊరుకొండి… మోహన్‌కు పుట్టినరోజులు, గిట్టినరోజులు ఉంటాయా..?!
……… By…. Raghuramulu Thummalapally…………. మోహన్‌కు పుట్టినరోజులుంటాయా….. జననమరణ నరక నాక సబ్ సూపర్ రియాలిజంలో… నలుగురిలో ఉన్నా తానొక్కడే అనంత ఏకాంతంలో మునిగి తేలేవాడికి పుట్టినరోజులేమిటి….అసలు నాకు తెలిసి మోహన్ ఇంకా పుట్టనే లేదు. అమ్మతోడు. సరస్పత్తోడు. ఒకవేళ తెలిసో తెలియకో పుట్టినా కన్ను తెరవనే లేదు. అతీతాగతావస్థలనెరుగని పెండులమ్లా ఊగుతూ జోగుతూ కాలం గడుపుతున్న మోహన్ అసలు పుట్టాలో లేదో ఇంకా తేల్చుకోనేలేదు. అప్పుడే అరవైమూడా బుద్ధి లేకపోతే సరి. ఎవడ్రా కూసింది. ఓ […]
కర్ణ-కృష్ణ సంభాషణ… కౌగిలించుకున్న రెండు సమాంతర రేఖలు…
భాగవతం, రామాయణం తదితర హిందూ పౌరాణికాలకన్నా… మహాభారతం భిన్నమైంది… అదొక సముద్రం… లోతుల్లోకి వెళ్లేకొద్దీ అనేకానేక జీవితపాఠాలు… అయితే అవన్నీ ఈ కాలానికి వర్తిస్తాయా, మనం వాటిని ఎలా స్వీకరిస్తాం అనేది వేరే విషయం… కానీ వేల ఉపకథలు, వేల పాత్రలు, వేల వ్యక్తిత్వాలు… వాటి నడుమ సంఘర్షణ, బంధాలు, మోసాలు, వ్యూహాలు… భారత కథలకు సంబంధించి వచ్చినన్ని కళారూపాలు వేరే ఏ గ్రంథంపైనా రాలేదేమో బహుశా… చివరకు పాత్రల నడుమ సంభాషణలు కూడా విస్తృత రచనావస్తువులయ్యాయి… […]
దేవీ రెడీయా..? రజినీ రెడీయా..? మీకు సవాల్ విసిరే మహా వంశీ వచ్చేశాడు..!!
హమ్మయ్య, వీడియో చూశారు కదా… ఏమనిపించింది… గూస్బంప్స్ అంటారు కదా, అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయా..?
ప్రియకు మూడినట్టేనా..?! లేక పాత సీజన్ తమన్నాలాగే పింకీని తరిమేస్తారా..?!
ఈరోజు ఎలిమినేట్ జాబితాలో చేరబోయేది అయిదుగురు… మానస్, ప్రియ, ప్రియాంక అలియాస్ పింకీ, లహరి, శ్రీరామచంద్ర… సరే, ఎవరు ఏం కారణాలు చెప్పారు అనే సోది సంగతి వదిలేస్తే… అందరూ సేఫ్ గేమ ఆడుతున్నారు… ఎలాగోలా బిగ్‌బాసోడు జుత్తు పీక్కుని ఈ అయిదుగురినీ జాబితాలో చేర్చేశాడు… అయితే ఎవరికి మూడింది..? అది ఓసారి చూడాలి… బూతు మాటలకు ప్రసిద్ధి పొందిన సరయు, ఉమాదేవి వెళ్లిపోయారు… అసలు వాళ్లను తీసుకోవడమే ఓ బ్లండర్… వాళ్ల సీన్లను చూపించడమే మరో […]
ఉడ్తా ఏపీ..! కెల్విన్లు, చార్మి జగన్నాథులు కాదు… అసలు తీవ్రత చూడండ్రా భయ్…!!
……. By…… పార్ధసారధి పోట్లూరి ………… మొదటిసారిగా ఒక తెలుగువాడి పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది ! ఆ పేరు ‘సుధాకర్ ‘ కాకినాడ వాసి! కొన్ని వేల కోెట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో విజయవాడతో పాటు కాకినాడ పేరు వార్తలలో ఉంటున్నది! 1. అయిదు రోజుల క్రితం గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ కి ఇరాన్ నుండి వచ్చిన రెండు కంటైనర్స్ ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ [DRI] అధికారులు తనిఖీ చేయగా […]
ఫాఫం పిటీ సేతుపతి..! చేజేతులా ఇమేజ్ చెడగొట్టుకునే ఓ వింత కేరక్టర్..!!
ఫాఫం, సేతుపతి…. నిన్నమొన్నటిదాకా తనపై కొంత సదభిప్రాయం ఉండేది… ఒక హీరోగా కాదు, ఒక విలన్‌గా కాదు… ఓ మంచి నటుడిగా…! ఇండస్ట్రీలో ఒకసారి మంచి పేరు వస్తే దాన్ని కాపాడుకోవడం కష్టం… ఒక మెట్టు ఎక్కడం గొప్పకాదు, ఆ మెట్టుకు మరి కొన్ని మెట్లు ఎక్కకపోయినా పర్లేదు… కానీ నిల్చున్న మెట్టు మాత్రం దిగొద్దు… దానికి చాలా జాగ్రత్తలు కావాలి… కానీ విజయ్ సేతుపతికి ఈ సోయి లేనట్టుంది… వచ్చిన పాపులారిటీని అర్జెంటుగా సొమ్ము చేసుకోవాలనే […]
కాంగ్రెస్ తెలివైన ఎత్తుగడ..! పంజాబ్ అంటే అగ్రవర్ణ సిక్కులదే కాదు…!!
పంజాబ్‌కు తొలి దళిత (రాందాసియా) సిక్కు సీఎం చన్నీ =================================== మూడు కోట్ల జనాభా ఉన్న పంజాబ్‌లో తొలి దళిత (ఎస్సీ–రాందాసియా–చమార్) సిక్కు చరణ్ జీత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణం చేస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ తరఫున, ఇంకా ఈ పదవిలో ఆరు నెలలు ఉండడానికి మాత్రమే. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు సీఎంను మార్చి జనాన్ని మాయ చేయాలని ప్రయత్నించి విఫలం కావడంలో– దేశంలో గొప్ప ముదుసలి పార్టీగా (గ్రాండ్ ఓల్డ్ పార్టీ–జీఓపీ) […]
- « Previous Page
- 1
- …
- 401
- 402
- 403
- 404
- 405
- …
- 481
- Next Page »