ఒక వార్త ఎందుకో పెద్దగా తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశం కాలేకపోయింది… బహుశా ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేకపోవడం వల్ల కావచ్చు… ఆ వార్త ఏమిటంటే..? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆ పార్టీని వదిలేసి, తిరిగి తన మాతృసంస్థ ఆర్ఎస్ఎస్లోకి వెళ్లిపోవడం… చాలా నిశ్శబ్దంగా… ఏదో ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు బదిలీ జరిగినంత సాఫీగా జరిగిపోయింది… సరే, ఆర్ఎస్ఎస్ చెట్టుకు బీజేపీ కూడా ఒక శాఖే కదా… అయితే ఒక జాతీయ […]
దండాలు సామీ..! ఖజానా ఊడ్చేసి, జీతాలిచ్చినా సరిపోదంటారేమో…!!
సాధారణంగా ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించవు… ఎందుకంటే వాళ్లతో కంటు కావడం ఇష్టం లేక… వాళ్లతో పెట్టుకుంటే నష్టం అనే భావన బలంగా ఉంటుంది గనుక..! నిజానికి కేసీయార్ పైకి ఎన్ని చెప్పినా తను కూడా అంతే కదా… 30 శాతం ఫిట్మెంట్, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు నిర్ణయాలపై అనేకచోట్ల ఉద్యోగసంఘాలు కేసీయార్ చిత్రపటాలకు పాలాభిషేకాలు కొనసాగిస్తున్నాయి… కానీ నిజానికి పీఆర్సీ మీద వేసిన కమిటీ ఏం […]
వెంకటకృష్ణ ఎందుకు ఏబీఎన్ వదిలేసినట్టు..? ఇంతకీ తనేమంటున్నాడు..?
ఎవరో అడిగారు… జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులేనా అని..! దీనికి సమాధానం… అవును..! మీడియా సంస్థలు, వాటిల్లో పెట్టుబడులు, వాటి పొలిటికల్ ధోరణులు గట్రా ఎలాగైతే వార్తాంశాలు అవుతున్నాయో… తమ రాతల ద్వారా, తమ డిబేట్ల ద్వారా జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులు అవుతున్నారు…! ఆ ఆర్నబ్ గోస్వామి దగ్గర నుంచి మన రవిప్రకాష్ దాకా… అంతెందుకు..? మన తెలుగు చానెళ్ల సంగతుల్ని కూడా ‘ముచ్చట’లో బోలెడు చెప్పుకున్నాం… తెలుగు న్యూస్ చానెళ్ల డిబేట్లు అనగానే కొమ్మినేని, […]
మోడీ బంగ్లాదేశ పర్యటన..! అక్కడి నుంచి ఇక్కడి బెంగాలీ వోట్లపై వల..!!
మోడీకి స్వదేశంలో కాలు నిలవదు… గిరగిరా దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు…. ఇది కరోనాకు ముందు మాట… కరోనా ధాటికి సారు గారి విదేశీ పర్యటనలు కూడా ప్రభావితమయ్యాయి ఫాఫం… ఇప్పుడొక దేశం వెళ్లకతప్పడం లేదు… అబ్బే, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచార బిజీలో ఉన్నాడు, అటూ ఇటూ ఏం తిరుగుతాడులే అని తేలికగా తీసేస్తే ఎలా..? ఆ విదేశీ పర్యటనలోనూ తన బెంగాలీ ఎన్నికల లబ్ధి చూసుకుంటున్నాడు… అర్థం కాలేదా..? ఓ విదేశీ గడ్డ మీదకు […]
రాజు సుందరం..! జాతీయ అవార్డుకు కొత్తేమీ కాదు, అనర్హుడు కాదు… కానీ..?
ప్రభుత్వం ఇచ్చే అవార్డుల వెనుక చాలా పైరవీలు, సిఫారసులు, కొన్నిసార్లు ప్రభుత్వ పొలిటికల్ ఈక్వేషన్లు, మన్నూమశానం ఉంటయనే అపప్రథ ఉన్నదే కదా… పద్మపురస్కారాలూ అంతే… అయితే ఈసారి (2019) జాతీయ సినిమా అవార్డుల్లో కంగనా రనౌత్‌కు మణికర్ణిక, పంగా సినిమాలకు గాను ఉత్తమ నటి అవార్డు వరించడం పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు… ఆమె బీజేపీ మనిషే కదా… పైగా మహారాష్ట్రలో సినిమా మాఫియా, శివసేన సర్కారుతోనూ ఫైటింగ్ చేస్తోంది… అయితే… జాతీయ ఉత్తమనటి అవార్డును పొందే స్థాయిలో […]
నవీన్ నూలి..! చంద్రబాబు గారి క్యాంపు ప్రొడక్టే..! జాతీయ అవార్డు కొట్టాడు…!!
పీవీసింధుకు బ్యాడ్మింటన్ నేర్పింది ఎవరు..? నాదెళ్ల సత్యను మైక్రోసాఫ్ట్ వైపు అడుగులు వేయించింది ఎవరు..? ఆయనే… ఆయనే తెలుసు కదా… ఎక్కడ ఎవరికి ఏ ఘనత దక్కినా అందులో తన వాటా వెతుక్కుని, ఓన్ చేసుకుని, వీలయితే నేను అసలు కారకుడిని అని ఢంకా బజాయించే ఆయన తెలుసు కదా… ప్చ్, చాలారోజులైంది ఆయన నోటి వెంట ఇలాంటి మాటలు విని… ఏదో మిస్సవుతున్నాం… నిజానికి చంద్రబాబు ఇప్పుడు ఓ విషయాన్ని ఓన్ చేసుకోవచ్చు స్వేచ్ఛగా… కాలరెత్తుకుని […]
వామ్మో… జీటీవీ చంపేసింది..! గతితప్పిన సరిగమప గ్రాండ్ ఫినాలే..!!
జీతెలుగు చానెల్ బాధ్యులు ఒక్కసారి గనుక పాత పాడుతా తీయగా వీడియోలు గానీ… మన తెలుగు టీవీల్లోనే వచ్చిన సూపర్ సింగర్ ఎపిసోడ్లు గానీ…. పోనీ, ఇప్పటి ఇండియన్ ఐడల్ గానీ చూసి ఉన్నట్టయితే బాగుండు…! సరిగమప గ్రాండ్ ఫినాలే ఇంత పేలవంగా ఉండి, ఇంతగా ఇజ్జత్ పోయేది కాదు..! ఈమధ్యకాలంలో ఏ టీవీ ప్రోగ్రాం ఫినాలే కూడా ఇంత బేకార్ ఫినాలేగా ముగియలేదేమో… మూడున్నర గంటలపాటు ఇంతటి నిస్సారమైన ఫినాలేను ప్రసారం చేయడానికి నిజానికి జీవాడు […]
KCR కత్తెర నిజం… ఈటల అసంతృప్తి నిజం… ఎక్కాలు తప్పిన లెక్కలు…
ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయి… నాటి ఉద్యమ వ్యతిరేకులను చేర్చుకుని, అందలాలు ఎక్కించి… దేశంలోని అనేకానేక ప్రాంతీయ పార్టీల్లాగే తన నడతను, తన నడకను ప్రజాబాహుళ్యం నిజ ఆకాంక్షలకు భిన్నంగా మార్చేసుకున్న పార్టీ టీఆర్ఎస్… ఈమాట వాళ్లో వీళ్లో కాదు, పార్టీలో ఉన్నవారే చెబుతుంటారు… అసంతృప్తిని వెళ్లగక్కుతుంటారు… ఇప్పుడు విషయం ఏమిటంటే ఈటల మళ్లీ తిరుగుబాటు స్వరం వినిపించాడు… ఇదేమీ కొత్త కాదు… గతంలోనూ కనిపించింది… ఎప్పుడంటే..? కేసీయార్ తనను దూరం పెట్టిన […]
అమెరికా పాలిస్తోందట… తీర్థసింగ్ చెప్పాడుగా, మహాప్రసాదం…
నిజమే! అమెరికానే మనల్ను పాలిస్తోంది! ——————- భాషలో ప్రతి మాటకు అభిదార్థం, లక్ష్యార్థం అని రెండు రకాల అర్థాలుంటాయంటుంది వ్యాకరణం. ఉదాహరణకు- నిప్పులు వేడిగా ఉన్నాయి- అన్న మాటలో “నిప్పులు” అభిదార్థం. దాని అర్థం నేరుగా అలాగే వాడడం. నిప్పులు చెరుగుతున్నాడు- అన్న మాటలో “నిప్పులు” లక్ష్యార్థం. నిజానికి అక్కడ నిప్పులు లేనే లేవు. నిప్పు గుణాన్ని ఇంకో వ్యక్తీకరణకు ఆపాదించడం. ఇంతకంటే లోతుగా వెళ్ళడానికి ఇది వ్యాకరణ పాఠం కాదు. ఒకవేళ వెళ్లినా తెలుగు వ్యాకరణం […]
చంద్రబాబు అర్జెంటుగా హార్డ్‌కోర్ విలన్ అయిపోవాలి… లేకపోతే పార్టీ మిగలదు…
రాజకీయ పార్టీల అధినేతలపై, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అభిమానం, గౌరవం అయినా ఉండాలి లేదా భయం ఉండాలి. చంద్రబాబు విషయంలో తెలుగుదేశం శ్రేణులకు ఈ రెండూ లేవు. గుంటూరు నగర పాలక సంస్థలో ‘‘మాకు ఒక పది డివిజన్లు వదిలేయండి. మిగతాచోట్ల మేం బలహీనులనే పోటీకి పెడతాం’’ అని తెలుగుదేశం నాయకులే అధికార పార్టీ వారితో రాజీ కుదుర్చుకోవడం నిజం కాదా? పోటీ చేసిన పది డివిజన్లలో తొమ్మిది గెలుచుకోలేదా? నిలబడి […]
ఇంకా నయం… నిమ్మగడ్డ వారు ఇంటర్ పోల్ దర్యాప్తు అడగలేదు…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వారి వార్త ఒకటి చదివితే నవ్వొచ్చింది, తరువాత జాలేసింది… అవలక్షణ రాజకీయ వాతావరణం అందరినీ ప్రభావితం చేస్తుంది సహజంగానే… పైగా ప్రపంచంలో ఎవరికీ అంతుపట్టని తెలుగు రాజకీయాలు కదా మరి… ఉద్యోగధర్మంగానే కావచ్చుగాక, తెల్లారిలేస్తే రాజకీయ నాయకులతో తిరిగీ తిరిగీ బ్యూరోక్రాట్లు కూడా అలాగే తయారవుతున్నట్టున్నారు… ఈమధ్య ప్రతి చిన్న విషయానికీ సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేయడం ఓ అలవాటుగా మారిపోయింది రాజకీయ నాయకులకు… అక్కడికి సీబీఐ అంటే ఆకాశం నుంచి […]
గెలుపు, వాపు, బలుపు, తెగింపు… ఎమ్మెల్సీ బరిలో చివరకు ఎవరెక్కడ తేలారు..?
ఓ వార్త కనిపించింది… కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయబోననీ, డబ్బులు పంచలేని వాళ్లు పోటీలో ఉండలేని స్థితి వచ్చేసిందని ఏదో అన్నాడు… రకరకాల వైరాగ్యాల్లాగే ఇదీ ఓ వైరాగ్యం… దీన్ని ఎన్నికల వైరాగ్యం అంటారు… ఆయన బాధలో కొంత నిజముంది… ఐతే కొంత మాత్రమే… ఎందుకంటే..? అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన తీన్మార్ మల్లన్న డబ్బులేమీ పంచలేదు కదా… డబ్బును కాదు కదా తను నమ్ముకున్నది… ఎస్, ఎన్నికల్లో డబ్బు పనిచేస్తుంది కానీ, […]
భారతం నాటి ఆ దివ్యాస్త్రాల పరిజ్ఞానం ఏమైంది..? ఎలా అంతరించింది..?
కురుక్షేత్రంలో అనేకమంది అతిరథులు, మహారథులు మరణించారు కదా… తరువాత కొన్నేళ్లకు యాదవులు, పాండవులు కూడా గతిస్తారు కదా… కురుక్షేత్రంలో మరణించకుండా మిగిలినవాళ్లలో కురుగురువు కృపాచార్యుడు, ధర్మరాజు సవతిసోదరుడు యుయుత్సు, యాదవ వీరులు సాత్యకి, కృతవర్మ కూడా కాలం చేస్తారు… అశ్వత్థామ కృష్ణుడి శాపానికి గురై, కుష్టు వ్యాధిగ్రస్తుడై, పిచ్చోడై దేశాలు పట్టిపోతాడు… ఈలోపు కలియుగం వచ్చేస్తుంది… మరి అనేకానేక దివ్యాస్త్రాల పరిజ్ఞానం అంతటితో అంతరించిపోయిందా..? అవి తెలిసిన వీరుడెవ్వడూ కలియుగంలోకి ప్రవేశించలేదా..? ఓ చిన్న చర్చ… మూలకథలో […]
కాశ్మీర్లో ఓ కొత్త భయం… స్టికీ బాంబ్..! ఇదీ ఉగ్రవాద పాకిస్థాన్ పుణ్యమే..!!
సాయుధ బలగాలు ఉన్న వాహనాల కాన్వాయ్ కదులుతోంది… అకస్మాత్తుగా అందులో ఒక వాహనం భారీ శబ్దంతో పేలిపోయింది… శకలాలు ఎగిరిపడ్డాయి… ఆ విధ్వంసం కాన్వాయ్‌లోని ఇతర వాహనాలనూ దెబ్బతీసింది… మరణాలు… రక్తం… గాయాలు… తెగిన అవయవాలు… అయితే అది మందుపాతర వల్ల జరగలేదు… ఏ సూసైడ్ టీం దూసుకురాలేదు… కనుచూపు మేరలో ఉగ్రవాదుల టీమ్స్ కూడా కనిపించలేదు… మరి ఆ పేలుడు ఎలా సంభవించింది..? దానికి కారణం… ‘స్టికీ బాంబ్’..! అవును… తాలిబన్ల చేతుల్లోని ప్రధాన ఆయుధం… […]
మీ దుంపతెగ..! ఆ ప్రఖ్యాత రచయితను తీసుకొచ్చి చంద్రబాబుకు జతచేస్తారా..?!
తెలంగాణలోని ఓ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థికి తీన్మార్ మల్లన్న అనే ఇండిపెండెంట్ దీటైన పోటీ ఇవ్వడంతో ఇప్పుడు ‘‘ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం’’ అనేది మళ్లీ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిపోయింది… ఎందుకంటే..? మల్లన్న ప్రధానబలం అదే కాబట్టి… తనకంటూ ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుని, పకడ్బందీగా, సెటైర్‌తో కూడిన విమర్శల్ని చేస్తూ పోయాడు… ప్రజల్లో ఆసక్తిని పెంచుతూ పోయాడు… ఈ కార్యాచరణ తనను తెలంగాణ ఉద్యమ సంధానకర్తగా వ్యవహరించిన కోదండరాంనూ దాటిపోయేలా చేసింది ఫస్ట్ […]
నో, నో… మన ఆనందం అర్థాలే వేరు… ఐరాసకు అర్థమై చావలేదు…
మన ఆనందం ముందు ఫిన్లాండ్ ఏపాటి? ——————- పొద్దున్నే ఒక వార్త భారతీయుడిగా నా మనో భావాలను గాయపరిచింది. ప్రపంచంలో అత్యంత ఆనందమయ జీవనానికి ఫిన్లాండే ఈసారి కూడా మొదటి ఎంపికగా 149 దేశాల ప్రజలు ఏకగ్రీవంగా అంగీకరించారట. మన హైదరాబాద్ జనాభాలో సరిగ్గా సగం- యాభై అయిదు లక్షల జనాభా ఉన్న ఫిన్లాండ్ ఆనందం కాసేపు పక్కన పెడదాం. విశ్వనగరం హైదరాబాద్ లో మన ఆనందానికి ఏమి తక్కువయ్యింది? మన ఆనందం విశ్వ వేదిక మీద […]
జై జోగిపేట..! ఏడు సినిమా గండాల్ని దాటేసి పకపకా నవ్వుతున్న ‘జాతిరత్నాలు’..!
కంటెంటులో కొత్తదనం… కథనంలో ప్రయోగం… నిర్మాణంలో సాహసం… తొక్కాతోలూ ఏమీ అక్కర్లేదు ఇప్పుడు… థియేటర్ దాకా వెళ్లాలంటే అది రెండు గంటలపాటు నవ్వించి, ఎంటర్టెయిన్ చేయాలి… పెట్టిన టికెట్టు ధరకు న్యాయం జరగాలి… లేకపోతే ఈ కాలుష్యంలో, ఈ ట్రాఫిక్ జాముల్లో, ఇంతలేసి పెట్రోల్ ధరల్లో, ఆ క్యాంటీన్-పార్కింగ్ దోపిడీల్లో థియేటర్‌కు వెళ్లి ఎవడు చూస్తాడు సినిమా..? నాలుగు రోజులు ఆగితే ఏదో ఓటీటీలో కనిపిస్తే, ఎంచక్కా ఇంట్లోనే టీవీ ముందు కూర్చుని చూడలేమా ఏం..? అప్పటికప్పుడు […]
టోల్ గేట్లు తీసేస్తాం… జీపీఎస్ ద్వారా ఒక్కొక్కడి తోలు తీస్తాం…
టోల్ గేట్లు మాయం! కానీ టోల్ ఫీజు యథాతథం!! ——————– గుళ్లో దేవుడి దర్శనం అయ్యాక బయటికి వచ్చే ముందు ఆ గుడి మంటపంలో ఒక్క సెకెను అయినా కూర్చోవాలి. అదొక ఆచారం. అనాదిగా పాటిస్తున్న సంప్రదాయం. అలా కూర్చున్నప్పుడు కోరుకోవాల్సిన కోరిక- “అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం” భగవంతుడా! నాకు ఎలాంటి నొప్పి లేని చావు ఇవ్వు. ఒకరిదగ్గర చెయ్ చాచాల్సిన లేదా దయనీయమయిన రోజులు రానివ్వకు. […]
దొంగ లంజడికొడుకా..! సాయిపల్లవి ఎర్రెర్రని ఆ తిట్ల వెనుక ఏముంది..?!
…….. By….. Gurram Seetaramulu ………………. దొంగ లంజడి కొడకా ? !! “వారసత్వ శాస్త్రాల్లో తల్లికూడా పుల్లింగమే మరి ! శీల రాజకీయాల్లో నేను లంజా కొడుకునే గానీ లంజడి కొడుకుని కాదు కదా” అంటూ తన ‘తల్లి రాయని వీలునామాలో’ ప్రసేన్ భాషా రాజకీయాలలో తిష్టవేసిన భారత దేశ సంస్కృతీ పరిరక్షణ నాటక సమాజాన్ని నడి బజార్లో నిలేసాడు. నువ్వే లంజడివిరా అన్నాడు చండీదాసు… ఇప్పుడు వేణు తన విరాట పర్వాన్ని లంజడి కొడకా […]
తెలంగాణ భాష అంటే ఈరోజుకూ టీవీల్లో అదే వెక్కిరింపు, అదే చీదరింపు…
తెలంగాణ వచ్చాక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ భాష మీద, యాస మీద, సంస్కృతి మీద వివక్ష, వెక్కిరింపు తగ్గిపోయినయ్… తెలంగాణ కళాకారులకు అద్భుతమైన ప్రాధాన్యం లభిస్తోంది… తెలంగాణ కథ, తెలంగాణ పాట, తెలంగాణ ఆట, తెలంగాణతనానికి మస్త్ విలువ పెరిగినయ్… దుమ్మురేపుతున్నారు, తెలంగాణ ప్రతిభ వెలుగుతోంది……….. ఇది కదా ఇప్పుడిప్పుడే అందరూ వ్యక్తపరుస్తున్న భావన… నిజమేనా..? తెలంగాణ భాష పట్ల ఏహ్యమైన వెక్కిరింపు, తూష్ణీభావం, చిన్నచూపు పోయినట్టేనా..? కోట్ల మందికి రీచయ్యే దిక్కుమాలిన తెలుగు టీవీ […]
- « Previous Page
- 1
- …
- 405
- 406
- 407
- 408
- 409
- …
- 448
- Next Page »