. నాలుగైదు రోజుల క్రితం వార్తే… ముందుగా అది చదవండి… క్రైం స్టోరీ… గుజరాత్… హిమాన్షు యోగేష్ భాయ్ పంచల్ తన పేరు… వయస్సు 26 ఏళ్లు… అహ్మదాబాద్ నివాసి… ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారిని అనీ, సబర్ సెక్యూరిటీ సెల్లో పనిచేస్తున్నాననీ చెప్పుకునేవాడు… ఫేక్… ఈమేరకు నకిలీ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేశాడు… తనకు బోలెడు ఆస్తులున్నాయని కూడా ప్రచారం చేసుకునేవాడు… ఈమేరకు మేట్రిమోనియల్ సైట్లలో రిజిష్టర్ చేసుకునేవాడు… నచ్చిన యువతులతో కంటాక్టులోకి వెళ్లేవాడు… మాటలతో […]
కౌంటర్లు చేతకావు… కనీసం పాజిటివ్ బజ్ కూడా చేతకావడం లేదు…
. హైదరాబాదులో మిస్ వరల్డ్ కంపిటీషన్స్… బయో ఆసియా సదస్సు… నిజంగా బీఆర్ఎస్ గనుక అధికారంలో ఉండి ఉంటే ఇలాంటి ఈవెంట్లను అద్భుతంగా వాడుకునేది… ప్రచారంతో హోరెత్తించేది… ఏపీలో ఇలాంటి ధూమ్‌ధామ్ ప్రచార వైఖరి చంద్రబాబు నుంచి కనిపిస్తుంది… రేవంత్ సర్కారుకు బీఆర్ఎస్ ఉధృతదాడికి కౌంటర్లు ఇవ్వడమూ చేతకావడం లేదు… కనీసం పాజటివ్ ప్రచారమూ కనిపించడం లేదు… నిస్తేజంగా, నిర్లిప్తంగా, నిరాసక్తంగా… అబ్బే, ప్రచారానికి ఖర్చు దేనికి అంటారా..? తప్పు… 1) ప్రభుత్వానికి ఇమేజ్… 2) పాలకుడికి […]
అసావరి దేవి..! శివుడి సోదరి…! పార్వతి భరించలేని ఆడపడుచు…!
. రేపు మహాశివరాత్రి… భక్తసులభుడికి అనేకరకాల పూజలు… జాగారం… అభిషేకాలు… ఐనా తనేమీ వైభోగ విష్ణువు కాదు కదా… మెడలో పాము, జటాజూటం, నెత్తిన గంగ… రుద్రాక్షలు, తోలు దుస్తులు… స్మశానాల వెంబడి పర్యటనలు… నల్లటి మెడ… నొసటన ఎర్రని మూడో కన్ను… ప్రసాదాలు, ఆడంబరాలు, అట్టహాసాలు ఏమీ కోరుకోడు కదా… జిల్లేడు, ఉమ్మెత్త పూలు… నెత్తిన నీటిధార… గుళ్లుగోపురాలు కూడా అక్కర్లేదు… అడవుల్లో, ఎడారుల్లో, పర్వతాల్లో కూడా ఎక్కడైనా సరే… ఓ త్రిశూలం, ఓ లింగరూపం […]
అనితరసాధ్యుడే… అనామకంగా మిగిలిపోయిన మహాభారత పాత్ర…!!
. ఓ మిత్రుడు హఠాత్తుగా ఓ ప్రశ్న వేశాడు… మహాభారతంలో పాత్రలన్నీ తెలుసా అని…! పెద్ద పెద్ద ప్రవచనకారులు, పురాణాలకు బాష్యాలు చెప్పే భాగవతులకు కూడా మొత్తం పాత్రలు తెలుసో లేదో సందేహమే అని జవాబిచ్చాను… నిజంగానే అదొక సముద్రం… మనకు తెలిసింది ఓ దోసిలంత…! పైగా ఒరిజినల్ కావ్యం ఇన్ని వేల ఏళ్లలో, అనేక కళారూపాల్లోకి ఒదిగి, వ్యాప్తి చెంది, పలు దేశాలకు పయనించి, రకరకాల ప్రక్షిప్తాలు, క్రియేటివ్ యాడిషన్స్తో రకరకాలుగా మారిపోయింది… ప్రత్యేకించి తూర్పుదేశాల్లో […]
లేక లేక… లేకుండా ఉండిన ఓ శాఖ… ఆప్ సర్కారు కదా, అదంతే…
. లేక లేక… లేకుండా ఉండిన శాఖ… లేని శాఖకు ఉన్న మంత్రి శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థ గాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం, ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్పడం, అత్యంత సంక్లిష్టమైన అద్వైత వేదాంత రహస్యాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అత్యంత తేలికగా చెప్పడం…ఇలా తోడుకున్నవారికి తోడుకున్నన్ని అందాలు, ఆనందాలు, అర్థాలు, పరమార్థాలు. శంకరుడు పుట్టకపోయి ఉంటే దేవుళ్ళకు ఇన్నిన్ని స్తోత్రాలే […]
దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…
. 1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది… అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్… ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి… జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు… ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు… ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు […]
నాడు జగన్ చేసిందే నేడు చంద్రబాబు చేశాడు… ఏపీలో సహజమే కదా…
. పొద్దున్నే సాక్షిలో ఓ వార్త చూడగానే… వైరాగ్యంతో కూడిన ఓ నవ్వు వచ్చింది అర్జెంటుగా..! అయితే ఆ వార్త రాసుకోకతప్పదు సాక్షికి… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..? మీడియాపైనా కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని రుద్దుతోందనీ… మీడియా స్వేచ్ఛను తొక్కేస్తోందనీ… జర్నలిస్టు సంఘాలు విరుచుకుపడ్డాయనీ… ఎన్టీవీ, టెన్‌టీవీ, టీవీ9, సాక్షి మీడియా సంస్థలను అసెంబ్లీ కవరేజీ నుంచి నిషేధించారనీ వార్త సారాంశం… అవును… ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎంత దూరమో… ఈ ఊరు […]
జస్ట్, సన్యాసిని లేదా సాధ్వి… అంతే… నాగసాధు లుక్కు వేరు…
. నాటకం కావచ్చు, సినిమా కావచ్చు, వెబ్ సీరీస్ కావచ్చు, టీావీ సీరియల్ కావచ్చు… ఏ పాత్రకైనా సరైన ఆహార్యం ముఖ్యం… వాచికం, ఆంగికం ఎంత ముఖ్యమో ఆహార్యమూ అంతే ప్రధానం… తెలుగు పదాలే ఇవి… సరే, సరళంగా చెప్పుకుందాం… పాత్రకు తగిన మేకప్పు, దుస్తులు, లుక్కు, వేషం ప్రధానం… ఉదాహరణకు మనం ఓ పూజారి పాత్రను తీసుకుంటే… ఆ భాష వేరుగా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజీ వేరే ఉండాలి… అంతకుమించి చూడగానే పూజారి అని […]
భిన్న పాత్రల్లో మమ్ముట్టి టాప్… ఏ హీరోకూ చేతకాని నటప్రతిభ కూడా..!
. Raghu Mandaati …….. నన్పకల్ నేరత్తు మయక్కం సినిమా సమీక్ష… సినిమా నిడివి అంతా ఒక మధ్యాహ్నం జరిగిన కథ. కేరళ నుంచి తమిళనాడుకు తిరిగి వస్తున్న ఒక సంఘం, మార్గమధ్యంలో ఒక గ్రామానికి చేరుకుంటుంది. ఆ సమయంలో ప్రధాన పాత్రధారి జేమ్స్ (మమ్ముట్టి) అనుకోకుండా మారిపోయి, అక్కడి వ్యక్తి సుందరేశన్లా ప్రవర్తించడం మొదలుపెడతాడు. అతని మాటలు, ప్రవర్తన పూర్తిగా ఒక తమిళ వ్యక్తిలా మారిపోతాయి. ఈ హఠాత్ మార్పు వెనుక ఉన్న రహస్యమే కథ. […]
మోడీ బ్యాన్ చేయాల్సింది చైనా యాప్స్ మాత్రమే కాదు… ఇవిగో ఇవీ…
. Ashok Kumar Vemulapalli …….. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో వైజాగ్‌కు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాగానే ఉంది.. మరి మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్ల సంగతేంటి.. డబ్బులకు కక్కుర్తి పడి.. జనాల ప్రాణాలు తీస్తున్న ఈ బెట్టింగ్ యాప్‌లను విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్నారు… ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన మాటలు నిజమనుకుని నమ్మి.. అప్పులు చేసి మరీ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు బెట్టింగ్ కాసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు… […]
ఇంట్రస్టింగ్..! ఈ ఇద్దరు షడ్డకులూ 30 ఏళ్ల తరువాత కలిశారు..!!
. ఓ వాట్సప్ న్యూస్ గ్రూపులో ఓ చిన్న వార్త ఆసక్తికరం అనిపించింది… ముందు అది చదవండి… 30 సంవత్సరాల తర్వాత చంద్రబాబునాయుడు గారి నివాసంలో (ఉండవల్లి) డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు గార్ల కలయిక… డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రచించిన “ప్రపంచ చరిత్ర” (ఆది నుండి.. నేటి వరకు..) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మరియు […]
ఇది కొత్తేమీ కాదు… అంబటి రాయుడు పిచ్చి కూతలకు ప్రసిద్దుడే…
. నిజానికి అంబటి రాయుడికి పిచ్చి వ్యాఖ్యలు, తిక్క చేష్టలు కొత్తేమీ కాదు… ఇప్పుడు కొన్నాళ్లుగా ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఎవడికీ తెలియదు కదా… అందుకని సోషల్ మీడియా, మీడియా తెర మీదకు రావడానికి ఓ శుష్క ప్రయత్నం చేసినట్టున్నాడు… నిజానికి అంత ఆలోచించేంత సీన్ ఉందానేదీ సందేహమే… విషయం ఏమిటంటే… నిన్నటి పాకిస్థాన్ మ్యాచు సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం నడుస్తున్నప్పుడు… చిరంజీవి, సుకుమార్, లోకేష్ తదితరులు మ్యాచును ఎంజాయ్ చేస్తూ కనిపించారు… చిరంజీవి ఇద్దరు తెలుగు ప్లేయర్లతో […]
కోహ్లీ తప్పు..! టైమ్‌కు పాకిస్థానీ క్రికెటర్ల మెదళ్లు పనిచేయలేదు లేకపోతే…!!
. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులో కోహ్లీ చేసిన ఓ తప్పు గురించి చెప్పుకోవాలి… అది గనుక నెగెటివ్ రిజల్ట్ చూపించి ఉంటే మ్యాచు చేజారిపోయేది… గవాస్కర్ కూడా అదే తప్పుపట్టాడు… ఎస్, కోహ్లీ బాగా ఆడాడు… చెత్తా షాట్ల జోలికి పోకుండా, నిలకడగా, సింగిల్స్ తీస్తూ, కొత్త కోహ్లీ కనిపించాడు… సెంచరీ చేసి ఇండియాకు ఓ మంచి విజయాన్ని అందించాడు… నిజమే… కానీ..? సరిగ్గా గమనించండి, గుర్తుకుతెచ్చుకొండి… అది 21వ ఓవర్… రవూఫ్ బౌలర్… […]
టెస్లా ఏ రాష్ట్రానికి వచ్చే ఛాన్స్… తెలంగాణకు తక్కేవే… కానీ ఏపీకి…?!
. అమెరికాలో ఎక్కడ టెస్లా కారు కనిపించినా అక్కడ తమిళ, తెలుగు వ్యక్తులు ఉన్నారని లెక్క… మనవాళ్లు తప్ప అమెరికన్లు, ఇతర దేశస్తులు దాన్ని లైట్ తీసుకుంటారు ఎందుకోగానీ… ఇప్పుడేమో అమెరికాకు టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అయ్యి కూర్చున్నాడు… తనకేమో ఇండియా మార్కెట్ కావాలి… కానీ మోడీ రానివ్వలేదు మొన్నమొన్నటిదాకా… చైనాలో తయారు చేసి, మా దేశంలో అమ్ముకుంటానంటే కుదరదుపో అన్నాడు… మేకిన్ ఇండియా అన్నాడు… కానీ ఏదో జరిగింది… మోడీ మెడపై […]
55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
. ఫాంటసీ కాదు, కల్పన కాదు, అతిశయోక్తి కాదు… ఇదీ చరిత్ర… నిజసంఘటనే… జాగ్రత్తగా చదవండి… చేతనైతే ఎవరైనా ఓ వెబ్ సీరీస్ తీయాల్సిన కథ… కాదు, యదార్థం… ఆమధ్య… అంటే, ఐదారేళ్ల క్రితం… ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడి హఠాత్తుగా ఓ విలయాన్ని సృష్టించిన విషాదం తెలుసు కదా… దాదాపు 150 మందికి పైనే గల్లంతు… 32 మృతదేహాలు దొరికాయి… ఎన్డీఆర్ఎఫ్తోపాటు ఐటీబీపీ బలగాలు కూడా సహాయక చర్యలు, గాలింపు పనుల్లోకి దిగాయి… భారీ హిమఫలకం […]
బురద రాజకీయం..! ప్రమాదాల సందర్భాల్లోనూ అవే తిక్క రాజకీయాలా..?!
. అనుకోని ప్రమాదం… ఎస్ ఎల్ బి సి సొరంగంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిపై ఆశలు వదిలేసుకుంటున్న విషాదం… ఆ టన్నెల్ బోరింగ్ మిషన్, ఆ ప్రాజెక్టు స్థితే ప్రశ్నార్థకం కాబోతున్న దుస్థితి… సొరంగం లోపల పరుచుకున్న బురద… అదే బురద తెలంగాణ రాజకీయాల్లో… మరింత చిక్కటి బురద… అటు ప్రమాదం జరిగిందో లేదో బీఆర్ఎస్ బురద రాజకీయం మొదలు… ఆలస్యమే లేదు… అదేదో రాజకీయంగా అప్పర్ హ్యాండ్ సాధించడం అన్నట్టుగా… కమీషన్ల కక్కుర్తితో పర్యవేక్షణ […]
నా చరిత్ర తెలుసు కదా… నాతో జాగ్రత్త సుమా… దటీజ్ మరాఠీ పాలిటిక్స్…
. ఏక్ నాథ్ షిండే అనే నేను… నాతో పెట్టుకుంటే అంతే సంగతులు! మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే ఎవరికైనా ఒక పాఠం. విస్మరిస్తే గుణపాఠం. ఈమధ్య రాజకీయ ప్రస్తావనల్లో షిండే నామజపం తగ్గింది కానీ… మొన్న మొన్నటివరకు “ఇక్కడా షిండేలు ఉన్నారు… సమయమొచ్చినప్పుడు బయటపడతారు”- అని మీసం మెలేసి చెప్పే సందర్భాలు ఉండేవి. ఏ గుంపులో ఎవరు షిండేనో తెలియక అన్ని గుంపుల్లో అందరూ షిండేలనే వెతుక్కునేవారు. రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి; ఓడలు బండ్లవుతాయి. బయటి లెక్కలు […]
మరాఠీ శివగామి..! మొఘలులకు చుక్కలు చూపించిన ధీరవనిత..!
. అవునూ… ఒక ఝాన్సీ రాణి… ఒక రాణి రుద్రమ గురించి చదివాం, విన్నాం… మన చరిత్ర పుస్తకాల్లో ఏమీ లేకపోయినా బోలెడు సాహిత్యం, ఇతర కళారూపాల ద్వారా తెలుసుకున్నాం… అలాంటి మరో ధీరవనిత, ఏకంగా ఔరంగ జేబును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఓ తారా బాయి గురించి తెలుసా..? శివాజీ గురించి బాగా తెలుసు… ప్రైడ్ ఆఫ్ హిందూగా సుప్రసిద్ధుడే… తన కొడుకు శంభాజీ గురించీ ఇప్పుడు తెలుస్తోంది ఛావా సినిమాతో… […]
వావ్ కోహ్లీ… ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు…
. సినిమాను సినిమాగా చూడాలి… ఆటను ఆటగా చూడాలి… ఈ నీతి వాక్యాలు పాకిస్థాన్‌తో ఏ ఘర్షణకూ వర్తించవు… యుద్ధం గానీ, ఆట గానీ, దౌత్యం గానీ, వ్యాపారం గానీ… ఏదైనా సరే… అదొక ధూర్తదేశం… మన మీద ఉగ్ర ద్వేషవిషం తప్ప మరేమీ చూపని చెత్తా దేశం … దాన్నే తమ స్వదేశం అనుకుంటూ అది గెలిస్తే మన దేశంలో సంబరాలు చేసుకునే కొన్ని మూకలు… సో, పాకిస్థాన్ ఆట అంటే అదొక ఎమోషన్… అంతే… […]
ఓ అరుదైన ఖగోళ దృగ్విషయంతో మహా కుంభమేళా ముగింపు
. మహా కుంభ మేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తోంది కదా… ఆ ముగింపు మరో ఖగోళ విశేషాన్ని తీసుకొస్తోంది… ఆసక్తికరమే… అరుదైన మరియు ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయం ఇది… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలూ రాత్రిపూట ఆకాశంలో కనిపిస్తాయి… వివరాల్లోకి వెళ్తే… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు – బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ – ఆ రాత్రి సమయంలో కనిపించనున్నాయి.., ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశానికి ప్రత్యేక ప్రాముఖ్యతను […]
- « Previous Page
- 1
- …
- 40
- 41
- 42
- 43
- 44
- …
- 428
- Next Page »