తెలుగు ప్రజల్లో ప్రాంతీయ చిచ్చు పెట్టినవి ఏమిటి..? ఉద్యోగాలు, అడ్మిషన్లు… ఎవరు స్థానికుడు, ఎవరు స్థానికేతరుడు అనే పంచాయితీలే… జై ఆంధ్రను, జై తెలంగాణను రగిలించాయి… మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కూడా హైదరాబాద్ ఫ్రీజోన్ అనే తగాదాతోనే…! చివరకు విడిపోయాం… ఎవరి బతుకు వాళ్లదే… కాదు, విభజన తగాదాలు సాగుతూనే ఉంటయ్… ఉన్నయ్… పోతిరెడ్డిపాడు పొక్కను ఇంకా తవ్వీ తవ్వీ, నీళ్లను జగన్ ఎత్తుకెళ్తానంటున్నాడు… నిధులు మాయమైపోయి రెండున్నర లక్షల కోట్ల అప్పు చేతికొచ్చింది… […]
పైత్యపు వేడుకలు..! ప్రి-వెడ్ షూట్లలో పీక్స్… నయం, ఇక్కడే ఆపేశారు…
ఏవగింపు… వెగటు… జలదరింపు… ఈ పదాలకు మించి ఇంకా ఏమైనా ఉంటే గుర్తుకుతెచ్చుకొండి… మన పెళ్లి వేడుకల్ని ఎటు తీసుకుపోతున్నామో తలుచుకుని సిగ్గుపడదాం అందరమూ… ప్రివెడ్ షూట్లు మరీ నీచమైన ధోరణుల వైపు వెళ్తున్నాయి… ఉదాహరణగా బోలెడు ఫోటోలు… అసలు ఈ తలతిక్క పైత్యాలకన్నా రిజిష్టర్ మ్యారేజీలు, స్టేజ్ మ్యారేజులు, సింపుల్‌గా గుళ్లల్లో పెళ్లిళ్లు చాలా చాలాా బెటర్ కదా… ఈ ఫోటో చూడండి ఓసారి… ఇది ప్రి వెడ్ షూటట… ఆదిమమానవుల కాన్సెప్టు అనుకుంటా… ఇంకాస్త […]
ఓ చెత్తా సినిమా… బీ గ్రేడ్ నేలక్లాసు సినిమా… దర్శకుడి టేస్టులాగే…
ఒక బయోపిక్… అదీ ఓ అడల్ట్ స్టార్ స్టోరీ… దాన్ని సినిమాగా తీయాలంటే ఎంత వర్క్ జరగాలి, స్క్రీన్ ప్లే, కథ, టేకింగ్, డైలాగ్స్,… ఎంత స్టడీ జరగాలి..? అదేమీ లేకుండా సినిమా చుట్టేస్తే ఎలా ఉంటుంది…? కచ్చితంగా షకీలా మార్క్ బీ గ్రేడ్ సినిమాాలాగే ఉంటుంది… అవును, అదే జరిగింది… షకీలా బయోపిక్ సినిమా చూస్తే అదే అనిపిస్తుంది… ఆమె జీవితం మీద కాదు, ఆమె జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పే ఈ సినిమా మీద జాలి […]
సారు కొనడు… అంతే… ఎలాగైనా, ఎక్కడైనా అమ్ముకొండి… ఇలా కూడా…!!
మీ ఇష్టమొచ్చిన చోట పంట అమ్ముకొండి… నేనయితే కొనను, ఇప్పటికే చేతులు కాలినయ్… అసలు పంటలు కొనడం ప్రభుత్వం పనే కాదు… ఊళ్లల్లో కొనుగోలు కేంద్రాల్ని మూసేయండి………. ఇదే కదా, కేసీయార్ నిర్ణయం… అదే కదా చెప్పింది… సరే, వ్యాపారులు సరైన ధరకు కొనరు, అసలు కొన్నిసార్లు ఏ ధరకూ కొనరు… మరోవైపు మిత్తీలు, ఖర్చులు తరుముతుంటాయి… మరి రైతు ఏం చేయాలి..? హహహ… దానికి మార్గం సారు గారి సొంత పత్రిక నమస్తే తెలంగాణ రాసేసింది […]
కేసీయార్‌కు క్రెడిట్స్ ఇవ్వరు సరే… కానీ మంచి మార్పును గుర్తించాలి కదా…
కేసీయార్ ఏదో గొప్ప సాధించాడు అని రాయడానికి మనసొప్పకపోతే పోనీ… కానీ నిజాన్ని రాయాలి కదా…! ఆనందపడే ఓ సామాజిక మార్పును తెలియజెప్పాలి కదా..! కేసముద్రంలో ఒక కుటుంబం ఆడపిల్లను కన్న తమ కోడలికి అపూర్వంగా స్వాగతం పలికిన వార్తను దాదాపు అన్ని పత్రికలూ వేశాయి… (అందులోని విశేషాన్ని గుర్తించలేని ఓ పెద్ద దరిద్రం తప్ప)… అది దేనికి సూచిక..? తెలంగాణ సమాజం ఆడపిల్లను మహాలక్ష్మిగానే భావిస్తోంది… ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్లు చేయడాలు, పుట్టగానే చంపేయడాలు […]
నేను భారతీయుడినే..! మరి నేను వాడే వస్తువులేమిటంటే…?
రానున్న 2021 కొత్త సంవత్సరంలో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడుతామని మనకు మనం సంకల్పించుకుని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని మన ప్రధాని మన్ కీ బాత్. ఈ వార్తను ఎలా అన్వయించుకోవాలో? ఎలా అర్థం చేసుకోవాలో? తెలియక తికమకపడుతున్నాను. కడప జిల్లా తాళ్ళపాక పక్కన పల్లెలో పుట్టి, అనంతపురం జిల్లా లేపాక్షిలో పెరిగి- ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో; ఎస్ కె యు, ఉస్మానియా, తెలుగు యూనివర్సిటీల్లో చదువుకున్న నేను పూర్తిగా స్వదేశీనే. భారతదేశం, […]
ఉల్టాపల్టా..! కేసీయార్ చేసిన తప్పేమిటి… పీఛే ముడ్ దేనికి…
మనసుంటే మల్లి… లేకపోతే ఎల్లి…. కేసీయార్ చాలాసార్లు చేసేది ఇదే… ఉదాహరణకు నియంత్రిత సాగు… పంటల కొనుగోళ్లు… తను తాజాగా తీసుకున్న నిర్ణయం ఏమిటి..? ఇకపై నియంత్రిత సాగు ఉండదు, మీ ఇష్టం వచ్చిన పంట వేసుకొండి… ప్రభుత్వం పంటలు కొనదు… 7500 కోట్లు లాస్ అయ్యింది ప్రభుత్వం… మీ ఇష్టం వచ్చినచోట మీ ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకొండి… ఇదీ ఆ నిర్ణయం… అంటే గ్రామ స్థాయి వరకూ అద్భుతమైన నెట్వర్క్ అని ప్రచారం చేసుకున్న రైతు […]
దత్తపుత్రిక ప్రత్యూషకు కేసీయార్ పెట్టిన పెళ్లికట్నం ఏమిటో తెలుసా..?
నిజంగా ప్రత్యూషది ఓ కథే… ఆమె కథ ముందు పదీపన్నెండు టీవీ సీరియళ్లు, తెలుగు సినిమాలు కూడా సరిపోవు… ఆమె పాత విషాదం గురించి ఇక్కడ చెప్పుకోవడం వద్దు గానీ… ఒక ప్రభుత్వ శాఖ మొత్తం ఆమెను సొంత బిడ్డలా పరిగణించడం… చదివించి, కొలువు ఇప్పించి, పెళ్లి చేస్తుండటం… సాక్షాత్తూ ముఖ్యమంత్రి సతీమణి వెళ్లి, పెళ్లికూతురిని చేసి, ఆశీర్వదించడం… అవును, ఓ కలలాంటి, ఓ కథలాంటి వార్త… ఈ ఫోటో బాగా నచ్చేసింది… ముఖ్యమంత్రి సతీమణి ప్రత్యూషకు […]
ఢీఅంటేఢీ… జీటీవీ అదరగొట్టిన స్లాటులో… మాటీవీ ఓంకార్ ఫ్లాప్ షో…
స్టార్ మాటీవీ… దీని క్రియేటివ్ ఒకప్పుడు ఫేమస్… కానీ ఇప్పుడు వట్టిపోయినట్టుంది… క్రియేటివ్తనం కాస్తా జీతెలుగు వైపు ప్రవహించినట్టుంది… పైగా మాటీవీతో జీటీవీ ఢీఅంటేఢీ అంటోంది… ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి జరిగిన ఓ పోటీలో మాటీవీ చేతులెత్తేసింది… చతికిలపడింది… జీటీవీ జనాన్ని బాగా ఎంటర్టెయిన్ చేసింది… అఫ్కోర్స్, మాటీవీకి చేతనైన రేటింగ్స్ మాయలో మళ్లీ అదే పైచేయి సాధించినట్టు వచ్చే బార్క్ ర్యాంకింగులో కనిపించవచ్చుగాక… కానీ ఈ నాలుగైదు గంటల పోటీలో జీటీవీ గెలిచింది […]
ఫాఫం హిందూ..! ఈమె ఎదుట చేయిచాచి, చివరకు తనే బజారునపడింది…
దిహిందూ దగ్గర ఏ ఆన్సరూ లేకుండా చేసిందీమె… అంతటి ప్రఖ్యాత పత్రికకు దిక్కతోచని స్థితి… తన రిపోర్టర్‌ను సమర్థించుకోలేదు, అలాగని ఈమెపై కక్షనూ ప్రదర్శించలేదు… లెంపలేసుకుంటుందా..? కిక్కుమనకుండా మూసుకుంటుందా..? ఇంట్రస్టింగు… విషయం ఏమిటంటే..? మాన్సాస్ ట్రస్టు కొత్త బాస్ సంచయిత గజపతిరాజు తెలుసు కదా… కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి ధర్మకర్త ఆమె ఇప్పుడు… సోకాల్డ్, చంద్రబాబు, అశోకగజపతిరాజుల చట్రం నుంచి తమ తండ్రుల, తాతల బాపతు ట్రస్టును బయటికి లాగి… ఎవరేం మాట్లాడినా, బెదిరించినా, వణకకుండా, […]
అసలే చలి… మందు వద్దంటావురా చీప్ లిక్కర్ మొహమోడా..?
కుక్క పని కుక్క చేయాలి… గాడిద పని గాడిద చేయాలి… ఇక్కడ కుక్క ఎవరు, గాడిద ఎవరు అనేది కాదు సమస్య… తమది కాని పని చేయడమే అసలు ఇష్యూ…….. ఈ మాట గట్టిగా అన్నామనుకొండి, సోషల్ మీడియాలో వెంటనే ఉల్టా దాడి మొదలవుతుంది… కుక్కకు పనిచేతకానప్పుడు గాడిద ఆ పనిచేస్తే తప్పేమిటట అంటారు… కోకిల రాగం శృతి తప్పుతోందని గమనించినా సరే, కాకి ఆ పాట అందుకోకూడదు కదా… సేమ్, ఈ వార్త చదివితే అదే […]
‘‘సోనియా కూటమిలోకి కేసీయార్, జగన్’’…! మహాశ్చర్యంగా ఉందా..?!
‘‘హాఁ… హేమిటీ… సోనియా సారథ్యంలోని కూటమిలోకి జగన్, కేసీయార్ వచ్చి చేరాలా..?’’ అని హెడ్డింగు చదివి హాశ్చర్యపోయాచా..? అంతేలెండి… ఆ సంపాదకీయం రాసినవాడు, ఆ పత్రిక బాసు తప్ప దేశంలో ప్రతి ఒక్కరూ నోళ్లు వెళ్లబెట్టాల్సిందే… విషయం ఏమిటంటే..? ఊరందరిదీ ఓ దారి అయితే ఉలిపికట్టెది మరోదారి అన్నట్టుగా… శివసేన రాజకీయాల రూటే వేరు… అప్పుడంటే బాల్ ఠాక్రే ఉండేవాడు… చాలా కథలు పడేవాడు… హిందుత్వ చాంపియన్ అనే పేరుండేది… ఆ కథ వేరే ఉండేది… ఈ […]
మనసుకింపు వార్త.. ఆడబిడ్డ పుడితే ఆ ఇంట అపురూప సంబరం..!
అమ్మలగన్న అమ్మ! ముగురమ్మల మూలపుటమ్మ! By పమిడికాల్వ మధుసూదన్ ———————- “వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం కవికులగురువు లాంటి కాళిదాసు కుమారసంభవం కావ్యంలో మొదట అన్న మాట ఇది. సాగరసంగమం సినిమాలో ఈ శ్లోకాన్ని పాటకు వాడుకున్న వేటూరి మొదట “పార్వతీపరమేశ్వరౌ” అని, రెండో సారి “పార్వతీప రమేశ్వరౌ” అని విడదీశాడు. మొదటిది శివపార్వతులు; రెండోది లక్ష్మీనారాయణులు అన్నది వేటూరి విరుపులో ఉద్దేశం. కానీ- […]
ఇద్దరూ మన విశాఖ తరంగాలే… ఉత్తరాది వేదికను హోరెత్తిస్తున్నారు…
హిందీ మన మాతృభాష కాదు… పైగా మన తెలుగువారికి లేదా దక్షిణ భారతీయులు హిందీ మాట్లాడినా, పాడినా మన యాస వద్దన్నా వినిపిస్తూ ఉంటుంది… అన్నింటికీ మించి హిందీ సంగీతంలో మనవాళ్ల ఉనికిని, ప్రగతిని నార్త్ ఇండియన్స్ అస్సలు సహించరు… ఈ యాసను సాకుగా చెబుతారు… కానీ ఆ రోజులు పోయినయ్… హిందీ మాతృభాషగా కలిగిన సింగర్స్‌ను మనవాళ్లు కొట్టేస్తున్నారు, పక్కకు నెట్టేస్తున్నారు… వాళ్లను మించి మనవాళ్లు పాడుతున్న తీరు చూస్తుంటే… పాటల పోటీల్లోని న్యాయమూర్తులే నోళ్లు […]
తిరుపతిలో KCR, బండి సంజయ్ భుజంభుజం కలిపి… షూట్ చంద్రబాబు…
హమ్మయ్య, ఓ క్లారిటీ వచ్చేసింది… ఆప్టరాల్ అమిత్ షా… మరింత ఆఫ్టరాల్ కేసీయార్, జగన్… ఎంత దాచుకుంటేనేం..? ఢిల్లీలో జరిగిన వరుస ఆంతరంగిక, రహస్య, అత్యున్నత భేటీల పరమార్థం ఏమిటో కనిపెట్టడానికి ఆంధ్రజ్యోతులు, ఆంధ్రప్రభలు లేవా ఏం..? ఆ భేటీల్లో జగన్‌కు, కేసీయార్‌కు తిరుపతి ఉపఎన్నిక విషయంలో రెండు ప్రభుత్వాలూ ఎలా సహకరించాలో ఆదేశించి.., తెల్లారే బండి సంజయ్‌ను కూడా అర్జెంటుగా పిలిచి, దుబ్బాకలో బాగా చేశావోయ్, సేమ్, తిరుపతిలో అలాగే చేయి.., కేసీయార్, జగన్ సపోర్ట్ […]
ప్లాటు చూపి, సరిపోయే చెక్కిస్తే చాలు… రెండు రోజుల్లో గృహప్రవేశం…
48 గంటల్లో ఇల్లు కట్టి చూపిస్తా! ———————— యంత్రం మాయలో పడిన తరువాత మనిషి కూడా యంత్రంలా మారిపోతాడని వందేళ్ల క్రితమే- మోడరన్ టైమ్స్ సినిమాలో చార్లీ చాప్లిన్ నిరూపించాడు. మనిషి నోట్లో అన్నం పెట్టి, మూతి తుడిచే మిషన్‌ను చాప్లిన్ ఎగతాళిగా ఆనాడే ఆవిష్కరించాడు. యంత్రభూతాల పళ్ల చక్రాల మధ్య చిక్కుకుని మనిషి కూడా జీవంలేని నట్టులో నట్టుగా, బోల్టులో బోల్టుగా మీట నొక్కితే కదిలి, మళ్లీ మీట నొక్కగానే ఆగిపోయే మరబొమ్మగా ఎలా మారిపోయాడో […]
చావు చదివింపులు..! మనం మరిచిపోయిన మన మంచి ఆనవాయితీ…
Nagaraju Munnuru…………….. ఈ విషయం చెప్పడానికి ఇది సరిఅయిన సందర్భమో కాదో తెలియదు కానీ చెబితే నలుగురికి ఉపయోగపడుతుందని చెబుతున్నా… పెళ్ళిళ్ళలో సాధారణంగా బంధుమిత్రులు కట్నాలు చదివించడం చూస్తుంటాం.. తెలంగాణలో ఇలాంటి దృశ్యం సాధారణం… పట్టణాల్లో, హైటెక్ పెళ్ళిళ్ళలో గిఫ్టులు స్టేజి మీదే వధూవరులకు అందజేస్తున్నారు, కానీ పల్లెల్లో ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు కులపెద్దలు ఒక నోటు బుక్కు పెట్టుకుని బంధుమిత్రులు ఇచ్చే నగదును వారి ఇంటి పేర్లతో సహా రాసి, ఆ కుటుంబ సభ్యులకు అందజేస్తారు… […]
ఒరేయ్ బుజ్జిగా..! ఫాఫం… టీవీ తెరపైనా ఫ్లాప్… ఘోరమైన రేటింగ్స్..!!
ఒరేయ్ బుజ్జిగా… ఈ సినిమా నిర్మాత ఎవరో గానీ… వెంటనే ఓ వంద థియేటర్లు దొరకబుచ్చుకుని రిలీజ్ చేసేసుకోవడం బెటర్… ఇప్పట్లో పెద్ద కొత్త సినిమాలు వచ్చేవి ఏమీ లేవు… ఏదో వచ్చేవాళ్లు చూస్తారు, చూసేవాళ్లు చూస్తారు… కొన్ని డబ్బులైనా రికవరీ అవుతాయి… ఏం..? సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు ఏం తక్కువ..? అదే కామెడీ… అదే టైంపాస్ పల్లీ బఠానీ బాపతే కదా… ఆఫ్టరాల్ సాయితేజ సినిమాలో ఒక్కతే హీరోయిన్… […]
అది అసలే అపోలో..! అందుకే డౌటు… ఎన్నికలవేళ ఏమిటీ మిస్టరీ…?
రజినీకాంత్ ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు… సంతోషం… మొన్ననే కరోనా నెగటివ్ రిజల్ట్ వచ్చింది… మరీ సంతోషం… కానీ ఇంతలోనే బీపీ ఒడిదొడుకులు ఏమిటి..? అసలు ఏం జరుగుతోంది..? ఆఫ్టరాల్ బీపీ ఫ్లక్చువేషన్స్కి తనను ఐసోలేట్ చేసి, ఎవరూ చూడనివ్వకుండా చేయాలా..? సరే, కరోనా సిట్యుయేషన్ కాబట్టి, అవాయిడ్ చేస్తున్నారు సరే… కానీ అది అసలే అపోలో… దాని క్రెడిబులిటీ ఏమిటో జయలలిత కేసులో చూశాం… రోజుల తరబడీ సాగిన డ్రామాలు చూశాం… అన్ ఫెయిర్, అన్ […]
సోలో బ్రతుకు..! ఇది ఓ ఉద్యమం..! జపాన్ తాజా ధోరణులు తెలుసా మీకు..?
గొప్పవాళ్లు కాబట్టే అలా పెళ్లీపెటాకులు లేకుండా ఉండగలిగారా..? లేక వైవాహిక బంధంలో ఇరుక్కోలేదు కాబట్టే గొప్పవాళ్లు అయ్యారా..? మరి మిగతా గొప్పవాళ్ల సంగతేమిటి..? ఒకటికాదు, ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు కూడా గొప్పవాళ్లు అయ్యారు కదా… పోనీ, ఏ పెళ్లిబంధంలో ఇరుక్కోకపోయినా గొప్పవాళ్లు కాలేకపోయిన వారి సంగతేమిటి..? అన్నీ పిచ్చి లేపే ప్రశ్నలు కదా…… నిన్న రిలీజ్ అయిన తెలుగు కొత్త సినిమా ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ నిర్మాత గానీ, హీరో గానీ, దర్శకుడు గానీ ఈ […]
- « Previous Page
- 1
- …
- 424
- 425
- 426
- 427
- 428
- …
- 440
- Next Page »