Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కిక్కుమనని టాలీవుడ్… జగన్ మార్క్ షాక్… జుత్తు పట్టేసుకున్నాడు…

September 9, 2021 by M S R

tollywood

కులం కంపులో బతుకుతూనే, బయటికి మాత్రం కులం పేరు ఉచ్చరించడానికి మస్తు నాగరికతను నటించే ప్రపంచం మనది… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ… మరీ ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ… ఇది ఇప్పుడు ఎందుకు మళ్లీ చర్చల్లోకి వస్తున్నదీ అంటారా… ? జగన్ ప్రభుత్వం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ మీద అంకుశం ప్రయోగిస్తోంది కాబట్టి… తెలుగు సినిమా పెద్దలు కిక్కుమనడం లేదు కాబట్టి… తమ జోలికి ఎవరైనా వస్తే గాయిగత్తర చేసే సినిమా పెద్దతలకాయలు సైలెంట్… సో, కాస్త నిజంనిజంగానే […]

తెలుగు మాస్ సినిమా గీతాలకు ‘చక్రవర్తి’..! వందల సినిమాలకు స్వరసామ్రాట్..!!

September 9, 2021 by M S R

chakravarthy

……… By……. Bharadwaja Rangavajhala……….   నిన్న చక్రవర్తి జయంతి. మాస్ సినిమా పాటకూ చాలా కాలం పెద్దదిక్కు ఆయన. జానపదం నీడల్లో నడిస్తేనే సినిమా పాటలు జనం హృదయాల్లోకి దూసుకెళ్లిపోతాయి అనే సూత్రం ఆయన నమ్ముకున్నారు… చక్రవర్తికి ఈ నమ్మకం కలిగించినది మాత్రం బుర్రకథ నాజర్. నాజర్ దగ్గర చేరడానికి కాస్త ముందు మహావాది వెంకటప్పయ్య గారి దగ్గర ఓకల్ నేర్చుకునే ప్రయత్నం చేశారు గురువుగారు. మహావాది క్రమశిక్షణ తట్టుకోలేక ఇటొచ్చేసారు… అది వేరు సంగతి… మహదేవన్ […]

ఇటు పులిహోర, అటు ఏడ్పులు… అప్పుడే మొదలెట్టేశాడు బిగ్‌బాసోడు..!!

September 8, 2021 by M S R

rj kajal bb5

ఏ టీవీ కార్యక్రమం చూసినా సరే…. యాంకర్ల మధ్య, యాంకర్లు-జడ్జిల మధ్య లవ్వు ట్రాకులు పెట్టేసి, నానా కథలు పడుతూ ఆపసోపాలు పడుతున్నయ్… మళ్లీ మళ్లీ ఎందుకు ఉదాహరణలు గానీ… సుధీర్- రష్మి దగ్గర నుంచి నిన్నామొన్నా రంగుపూసుకున్న కొత్త కమెడియన్ల దాకా… డాన్సర్లు, జడ్జిలు కూడా అతీతులు ఏమీ కాదు, అతీతంగా ఉండనివ్వరు షో నిర్వాహకులు, పత్తిత్తుల్లా ఉంటాము అంటే గేటు చూపిస్తారు… వీళ్లకు డబ్బు కావాలి, వాళ్లకు ఈ లవ్ ట్రాకులు కావాలి… అవే […]

కేరళలో అంతే…! నొక్కు కూలీ పేరిట రౌడీ మామూళ్లు…!! ఇస్రోనూ వదల్లేదు..!!

September 8, 2021 by M S R

isro truck

2014… టీవీ అనుపమ… ఓ ఐఏఎస్ అధికారిణి… తనది కూడా కేరళే… కన్నూరు సబ్‌కలెక్టర్‌గా చేసి టూరిజం, ఫుడ్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్‌గా ట్రివేండ్రం బదిలీ అయ్యింది… ఓ వెహికల్‌లోకి సామాను ఎక్కించుకుని ట్రివేండ్రం చేరింది… సమయానికి ఎవరూ లేబర్ దొరకలేదు… ఆమె, కుటుంబసభ్యులు, ఆ వెహికిల్ డ్రైవర్, హౌజ్ ఓనర్ అందరూ కలిసి సామాను అన్‌లోడ్ చేశారు, చివరలో ఓ వాషింగ్ మెషిన్ మిగిలింది… అప్పుడక్కడికి వచ్చిన సీఐటీయూ కూలీలు దాన్నలాగే ఆపేసి, మొత్తం లోడ్‌కు […]

సీనియర్ ఐఏఎస్… కానీ బుర్ర తిరుగుడు… లేడీ జర్నలిస్టు పట్ల చిల్లర ప్రవర్తన…

September 8, 2021 by M S R

prasanth

….. ఈ సారు గారి పేరు ప్రశాంత్ నాయర్… 2006 యూపీఎస్సీ ఫోర్త్ ర్యాంకు కొట్టాడు… కేరళ కేడర్ ఐఏఎస్… పెళ్లయింది, ఇద్దరు పిల్లలు… కానీ కాస్త తిక్క కేసు… ఎంత తిక్క అంటే తనకే లెక్క తెలియనంత తిక్క… కాకపోతే ఆ తిక్కకు ఓ వుమెన్ జర్నలిస్టు బజారుకెక్కాల్సి వచ్చింది… ఆమధ్య Sudden Sensorineural Hearing Loss (SSHL) ప్రాబ్లం తలెత్తి అకస్మాత్తుగా వినికిడి శక్తి కూడా కోల్పోయాడు… సరే, తన కెరీర్‌‌లో, తన సర్వీసులో […]

బోలెడు భాషల్లోకి తర్జుమా…! ఈ వైరల్ సాంగ్ అసలు అర్థం తెలుసా..?

September 8, 2021 by M S R

manike mage

డుగ్గు డుగ్గు పాట మన తెలుగులోనే సూపర్ హిట్… ప్రస్తుతం దాన్ని కొట్టే పాట లేదు… ఏమో సారంగదరియా వీడియో సాంగ్ వస్తే చెప్పలేం… కానీ ఓ సింహళీ పాట ఆ దేశంలోనే వైరల్ కావడం కాదు, భారత దేశంలోని పలు భాషల ప్రేక్షకుల్ని కూడా మంత్రముగ్దులను చేస్తోంది… దాని సంగతి మనం ‘ముచ్చట’లో ఇంతకుముందే చెప్పుకున్నాం… దాని పేరు మానికె మాగే హితె… పాడింది యోహని… ఈ పాటకు ఎన్ని కోట్ల వ్యూస్ అనేది కాదు […]

నమస్తే తెలంగాణను కొట్టేసిన దిశ… నెక్స్ట్ ఆంధ్రజ్యోతి… తర్వాత సాక్షి…!!!

September 7, 2021 by M S R

alexa

నమస్తే తెలంగాణ దినపత్రికను దిశ అనే డిజిటల్ పేపర్ కొట్టేసింది… ఇక తరువాత టార్గెట్ ఆంధ్రజ్యోతే… ఆ తరువాతే సాక్షి, ఈనాడు…… ఆశ్చర్యపోకండి… దిశ డెయిలీ అలెక్సా ర్యాంకు స్టేటస్ ఇదీ అంటూ, ఇతర పత్రికల ర్యాంకులతో పోలిస్తూ ఓ చిన్న చార్ట్ వాట్సప్‌లో కనిపించింది… దాన్ని చూస్తే అలాగే అనిపించింది… కాస్త చిత్రంగా కూడా తోచింది… అంటే అది అబద్ధమని కాదు… ఆ ప్రచారమూ తప్పు అని కాదు… అవి నిజమైన ర్యాంకులే… కానీ దిశ […]

కలెక్టర్ కారు కదా… ఛట్, దానికి కూడా రూల్సేమిటి..? చలానాలు ఏమిటి..?

September 7, 2021 by M S R

challans

ఈరోజు పత్రికల్లో ఒక్కసారిగా కనెక్టయ్యింది ఈ వార్తే… ఒక కలెక్టర్ కారుపై ఏకంగా 23 చలానాలు పెండింగ్… ఎలాగూ ఖజానా నుంచే కట్టేస్తారు, వాళ్ల జేబుల్లో నుంచి కట్టేది లేదు కదా… అది కాదు అసలు విషయం… రవాణా చట్టాల్ని అమలు చేయాల్సిన ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తే, ఏ భయమూ భక్తి లేకపోతే, ఇక మామూలు మనిషికి ఎందుకు ఉండాలి..? కలెక్టరే చలానా కట్టకపోతే మామూలు మనిషి ఎందుకు నిజాయితీగా, చట్టానికి లోబడి ఉండాలి.., అతివేగం, ప్రమాదకరంగా […]

మోదీ… యోగీ… దాదాపు అందరిదీ అదే ‘భక్తి పర్యటన’ దారి..!

September 7, 2021 by M S R

shiva

ప్రజాస్వామ్యంలో ఓట్లే ముఖ్యం. అవి వస్తేనే సీట్లు. సీట్లు వచ్చిన వారిదే అధికారం. రాష్ట్రం ఏదైనా, ఎన్నిక ఎక్కడైనా ఇదే ప్రధాన సూత్రం. ఓటు కోసమే రాజకీయం. ఓటు చుట్టే రాజకీయం. ఏం చేస్తే ఓట్లు వస్తాయో అదే చేయడం. విధానాలు, సిద్ధాంతాలు ఏం లేవు. ఏం చేస్తే ఓట్లు పడతాయో అదే విధానం. ట్రెండ్‌కు తగ్గట్లు రాజకీయం చేయడమే ఇప్పుడు గెలుపు విధానం. ఉత్తరప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ సీట్లు […]

ఓహ్… తాలిబన్లకు ముందుంది ముసళ్ల పండుగ… అప్పుడే ‘శాంపిల్’ రుచిచూశారు…

September 7, 2021 by M S R

baradar

….. By… పార్ధసారధి పోట్లూరి………..  మా జైల్లో ఉండి మా బిర్యానీ తిని మాకే ఎదురుచెప్తావా ? అంటూ హాక్కానీ నెట్వర్క్ నాయకులు తాలిబాన్ల మీద విరుచుకుపడి బాగా కొట్టారు. చివరకి కాబోయే అధ్యక్షుడు బారాదరిని కూడా బలంగా నెట్టి వేశారు దాంతో కింద పడి గాయపడ్డాడు బారాదరి. గత శుక్రవారం ఉదయం పదవుల పంపిణీ విషయమై తాలిబన్లు, హాక్కానీ నాయకులు అధ్యక్ష భవనంలో సమావేశం అయ్యారు. ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలో బారాదరి లిస్ట్ చదవడం […]

నిజంగా టీవీ9 దేవిని అంతగా తిట్టిపోయాలా..? క్షమార్హం కాని తప్పు చేసిందా..?!

September 6, 2021 by M S R

tv9

టీవీ9 దేవి మీద విపరీతంగా ట్రోలింగ్ సాగుతోంది… తెలుగు నెటిజనం తీవ్ర స్థాయిలో వెక్కిరిస్తున్నారు… ఎందుకు..? ఆమె ఆకాశం అనే పదానికి కాస్త గంభీరంగా ఉంటుందనే భావనతో రుధిరం అనే పదాన్ని వాడి, ఎడాపెడా ఒక న్యూస్ ప్రజెంట్ చేసింది నిన్నోమొన్నో… తప్పు, తప్పున్నర… ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పేమీ కాదు… అయితే ఏ స్థాయిలో ఆమెపై ట్రోలింగ్ నడుస్తున్నదో ఆ స్థాయిలో సపోర్ట్ ఏమీ దొరకడం లేదు ఆమెకు… కొన్నిగొంతులు తప్ప..! ఎందుకు..? […]

ఓ అడల్ట్ అండ్ డర్టీ షో స్టార్టయింది…పేరు బిగ్‌బాస్-5… ప్రయోక్త నాగార్జున…

September 6, 2021 by M S R

bb5

ఎవరో సరయు అట… ఆమె గురించి పెద్దగా తెలియదు… కానీ బోల్డ్‌గా, పచ్చిబూతులతో యూట్యూబ్‌లో రసిక ప్రేక్షకులను అలరిస్తుందని గూగుల్‌లో సెర్చితో ఎవడో సైటు వాడు చెప్పాడు… సరయు రాయ్… తండ్రి బెంగాలీ, తల్లి తెలుగు… నోరు విప్పితే బూతులు… పైగా తెలంగాణ యాక్సెంట్‌‌లో వెకిలిగా మాటలు… వామ్మో… డుగ్గు డుగ్గు హ్యాంగోవర్ నుంచి తెలంగాణ యాస ప్రేమికులందరినీ ఒక్కసారిగా నేలమీదకు దింపింది ఈ వెగటు కేరక్టర్ బిగ్‌బాస్ లాంచింగ్ చూడగానే… 19 మంది కంటెస్టంట్లలో ఈ […]

రావణరాజ్యంలో అలోలక్ష్మణా..! చైనాను నమ్మిన శ్రీలంకలో ఆకలికేకలు..!!

September 6, 2021 by M S R

food

………..  By…. పార్ధసారధి పోట్లూరి………..  మన పొరుగు దేశం శ్రీలంక తీవ్ర సంక్షోభం లో చిక్కుకుంది ! కరొన వల్ల దెబ్బతిన్న దేశాల సరసన శ్రీ లంక కూడా చేరబోతున్నది. దిగుమతుల మీద ఆంక్షలు విధించింది శ్రీలంక ప్రభుత్వం. అత్యవసరం అయితే తప్పితే ఎలాంటి దిగుమతులకి అనుమతి ఇవ్వబోమని ఒక ప్రకటనలో దేశ పౌరులని, పారిశ్రామికవేత్తలని ఉద్దేశించి తెలిపింది. గత సంవత్సరం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉండగా శ్రీ లంక ప్రభుత్వం ఒక కీలక […]

గుడ్ టీచర్ అంటే..? తరగతి గదిలో మాయమైన ఓ రిస్ట్ వాచీ కథ…!

September 5, 2021 by M S R

stolen watch

అనుకోకుండా ఓ ముసలాయన్ని ఓ యువకుడు పలకరించి కాళ్లు మొక్కాడు… ‘సర్, నన్ను గుర్తుపట్టారా..?‘ ఆయన గుర్తుపట్టలేదు అన్నాడు… ‘సర్, నేను మీ స్టూడెంట్‌ను…’ ‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తులేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?’ ‘నేను టీచర్ అయ్యాను మాస్టారూ…’ ‘గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?’ ‘అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి’ ‘అదేంటి..?’ ‘బహుశా మీకు గుర్తుండదు, నేను చెబుతా వినండి…’ —— ‘‘ఓసారి నా దోస్త్ […]

డియర్ మేఘా… ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు… ఈ కథ ఇంతకీ ఎక్కడిదబ్బా…

September 5, 2021 by M S R

dear megha

ఓ హీరోయిన్… ఒక హీరో… ఇద్దరూ ఇంట్రావర్టులే… ఒకరి పట్ల ఒకరి ప్రేమను కూడా వ్యక్తీకరించుకోలేరు… సిగ్గరులు… కొన్నేళ్లకు బండి గాడిన పడుతుంది… ప్రేమించుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అనే సూత్రాన్ని, పెళ్లే ప్రేమకు అంతిమ గమ్యం అనే తత్వాన్ని సినిమాలు, సాహిత్యం మనకు ఏళ్లకేళ్లుగా బాగా ఎక్కించాయి కదా… ఆ ప్రేమతత్వం మేరకే పెళ్లిచేసుకోవాలని వాళ్లు కూడా అనుకుంటారు… ఈలోపు హీరోకు ప్రమాదం జరుగుతుంది, ఆమె హతాశురాలవుతుంది… ఇక రెండో కృష్ణుడు ఆమె జీవితంలోకి వస్తాడు, […]

డియర్ ఆర్కే… జగన్ ఇప్పట్లో శశికళ కాలేడు, టీడీపీ డొల్ల ఆశలూ నెరవేరవు…!!

September 5, 2021 by M S R

aj

 ‘‘జగన్‌కు అక్రమాస్తుల కేసులో శిక్ష పడాలి, లేదా తన బెయిల్ రద్దు కావాలి, తను జైలు పాలవ్వాలి, ఇదే అదునుగా మోడీ కొరడా పట్టుకుని రంగంలోకి దిగాలి… దిక్కూ దివాణం లేకుండా…. సేమ్, శశికళను జైల్లోపారేసి, అన్నాడీఎంకేను గుప్పిట్లో ఉంచుకుని, పళనిస్వామిని చెప్పుచేతల్లోకి పెట్టుకుని నడిపించినట్టుగా ఏపీ ప్రభుత్వాన్ని నడిపించాలి… జగన్ భార్య భారతీరెడ్డి కాదు, ఏ పళనిస్వామో, ఏ పన్నీర్ సెల్వమో ముఖ్యమంత్రి కావాలి… జగన్ కుటుంబసభ్యుల్లో విభేదాలు రగులుకోవాలి….’’ ఇదే టీడీపీ క్యాంపుకి మిగిలిన […]

ఈ ‘కిన్నెర మెట్ల’ మొగులయ్యకు కేసీయార్ ఏమీ సాయం చేయలేదా..?!

September 5, 2021 by M S R

mogulayya

ఓ తెలంగాణ జానపద వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య అలియాస్ కిన్నెర మెట్ల మొగులయ్యకు పోసాని కృష్ణమురళి లక్ష ఇచ్చాడు… గుడ్… ఏబీఎన్ చానెల్ ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి కొన్ని విరాళాలు ఇప్పించే ప్రయత్నం చేసింది… గుడ్… పవన్ కల్యాణ్ 2 లక్షలిచ్చాడు… గుడ్… తెలుగు సినిమాకు ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ జానపదం రంగు, రుచి, వాసన, చిక్కదనం కావాలి కాబట్టి… ఏ పదప్రాసలు, ప్రయాసల జోగయ్యో రాసిన ఓ భజన పాటకు ఏ […]

వావ్ స్టాలిన్… టోల్ ప్లాజాలు, పరువు నష్టాలపై మరో రెండు మంచి అడుగులు…

September 5, 2021 by M S R

toll gate

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రశంసిస్తుంటే కొంతమందికి అస్సలు నచ్చడం లేదు… కారణం, స్టాలిన్ రాజకీయ ధోరణి నచ్చకపోవడం వల్ల కావచ్చు…! గుళ్లల్లో బ్రాహ్మణేతర అర్చకుల నియామకం, కేంద్ర వ్యవసాయ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం వంటి నిర్ణయాలు కొందరికి నచ్చడం లేదేమో…! విభేదించకూడదని ఎవరూ అనడం లేదు కానీ సమర్థించాల్సిన అంశాలు కనిపించినప్పుడు చప్పట్లు కొట్టకుండా ఎందుకు ఊరుకోవాలి..? ఇదీ అసలు ప్రశ్న… నిజానికి స్టాలిన్ మీద తను సీఎం అయ్యేదాకా ఎవరికీ […]

పోసానీ… నువ్వు గొప్పోడివి బ్రదర్… కడుపులో సినీ కల్మషం లేనోడివి…

September 4, 2021 by M S R

kinnera mogulayya

ఈరోజు ఏదో ఓ పాత తెలంగాణ ట్యూన్ జతకలిస్తే తప్ప అది సినిమా పాట కాదు, హిట్ కాదు… కాపీ కొట్టడంలో థమన్ గ్రేట్… ప్రాసపైత్యంలో రామజోగయ్య గ్రేట్… తెలంగాణతనాన్ని వాడుకోవడంలో తెలుగు నిర్మాతలు గ్రేట్… కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య పాటను, పదాన్ని, వాయిద్యాన్ని, దాని గానాన్ని అదేదో సినిమాలో వాడుకున్నట్టుగా వార్తలు… నిజమే, వాడేసుకున్నారు… భీమ్లానాయక్ ఆ సినిమా పేరు… పాట ఎత్తుకోవడమే ఓ లోతైన గొంతుతో మొగులయ్య హృదయ గానం… ఇక ఆ తరువాత […]

ఓ జర్నలిస్టు సంఘ నాయకుడు వర్సెస్ ఓ తెలుగు పత్రిక యజమాని..!!

September 4, 2021 by M S R

mutta

ఓ ఇంట్రస్టింగ్ ఫస్ట్ పేజీ బాక్స్ ఐటం కనిపించింది ఆంధ్రప్రభలో… సైన్డ్ ఎడిటోరియల్ అంటారు దీన్ని సాధారణంగా… ఏవైనా కీలకాంశాలను పాఠకులకు వివరించేందుకు పలు సందర్భాల్లో ఇలాంటి ‘‘సంతకం చేయబడిన ఫస్ట్ పేజీ సంపాదకీయ లేఖలు’’ పరిపాటే… అసాధారణం ఏమీ కాదు… సదరు మీడియా సంస్థ ఓనరో, ఎడిటరో, ఎండీయో, ముఖ్యమైన బాధ్యులో అలాంటివి వదులుతూ ఉంటారు… ప్రజలకు, పాఠకులకు పత్రిక ప్రముఖంగా ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు ఈ పద్ధతి పాటిస్తుంటారు… ఈరోజు ఈ ఆంధ్రప్రభ […]

  • « Previous Page
  • 1
  • …
  • 429
  • 430
  • 431
  • 432
  • 433
  • …
  • 450
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions