సినిమా అన్నాక ప్లాపులుంటయ్, హిట్లుంటయ్…. కాకపోతే తెలుగు సినిమాకు ఆదాయాన్ని భారీగా తీసుకొచ్చే మార్గాలు పెరిగాక… రేంజ్ పెరిగింది… సినిమా ఎంత చెత్తగా ఉన్నా సరే, మరీ ఎక్కువ నష్టాలతో నిర్మాతలు ఏమీ తలపై తువ్వాలేమీ కప్పుకోవడం లేదు… ఒకేసారి ఇతర భాషల్లో రిలీజ్ చేయడం, శాటిలైట్ టీవీ హక్కులు, ఓటీటీ హక్కులు, ఓవర్సీస్ హక్కులు గట్రా చాలా రూట్లలో రెవిన్యూ వస్తోంది… కానీ కరోనా దెబ్బకు ఇండస్ట్రీ కకావికలం అయిపోయింది… థియేటర్లు దివాలా తీసే దుస్థితి… […]
‘‘దీదీ చాప్టర్ క్లోజ్… ఈ దాదా కథ స్టార్ట్… కాబోయే బెంగాల్ సీఎం…’’
వాట్సప్ యూనివర్శిటీకి దూకుడు ఎక్కువ… బుర్ర తక్కువ…! వేరే వాళ్లు నిరూపించనక్కర్లేదు… దానికదే ఆవిష్కరించుకుంటూ ఉంటుంది… అకస్మాత్తుగా కొన్ని ప్రచారాలను తెర మీదకు తీసుకొస్తూ ఉంటుంది… దానివల్ల నష్టం జరుగుతుంది బాబూ అని చెప్పినా సరే వినదు… దాని పోకడ దానిదే… హఠాత్తుగా ఈ చర్చ, ఈ ప్రస్తావన ఏమిటీ అంటారా..? ఒకసారి ఈ ఫోటో చూడండి… ఈయన పేరు స్వామి కృపాకరానంద మహారాజ్… అసలు పేరు, అనగా తను సన్యాసం స్వీకరించక ముందు పేరు దేవతోష్ […]
అబ్బఛా… ఇంటి వద్దకు థియేటరట… చెప్పారులే సోది… రాశారులే బోడి…
మీ ఇంటికే సరుకులు… మీ ఇంటికే కూరగాయలు… అని ప్రచారం సాగుతుంటే ఏమిటీ అర్థం..? హోం డెలివరీ చేస్తారు అనే కదా…! కానీ సినిమా వాళ్ల ప్రచారానికి అర్ధాలు వేరుంటాయి… అసలు కొన్నిసార్లు అర్థాలే ఉండవు… ఆ పైత్యానికి మనమే ఏదో ఒక అర్ధాన్ని ఊహించుకుని.., మన దిక్కుమాలిన మెయిన్ స్ట్రీమ్ ‘కవర్లు’ తీసుకుని రాసిన వార్త కదా అని గౌరవించి… మనలోమనమే నవ్వుకుని, వాళ్లను క్షమించేయాలన్నమాట… ఈ వార్త ఓసారి చదవండి… వీళ్లెవరో మనకు పెద్దగా […]
వర్మ మెచ్చిన ఇంటర్వ్యూ… రొటీన్ బూతులు కాదు.., లోతుగా కూడా..!
రాంగోపాలవర్మ వ్యాఖ్యలు చాలా చిరాకు పుట్టిస్తాయి… తన సినిమాలు చూస్తున్నట్టుగానే…! తనను ఇంటర్వ్యూ చేసేవాళ్లను కూడా ఓ అబ్జెక్టుగా చూస్తూ ఏవో పిచ్చి, అసభ్య కామెంట్లు చేస్తాడు…. తన సినిమాల్లోని బూతులాగే…! మాట్లాడితే తొడలు, తుపాకులు… వివాదాలు…! ఈమధ్య తనను ఇంటర్వ్యూ చేసేవాళ్లు కూడా తిక్క ప్రశ్నలు వేసి, ఏవో తిక్కర్, తిక్కెస్ట్ సమాధానాలు ఆశించి, వాటినే ప్రమోట్ చేసుకుని, ప్రోమోలు కట్ చేసుకుని, నాలుగు ఎక్కువ వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు… మరీ శృతి మించి..! రీసెంటుగా […]
ఆమె మళ్లీ వచ్చిందిరోయ్…! ఔనూ, బిగ్‌బాస్ ఓ కొత్త కుట్రకు తెరలేపాడా..?!
ఈ మోనాల్ హౌస్‌లోకి మళ్లీ వచ్చిందిరోయ్…..!! భయపడకండి… ఏ నర్మదా నదీ శోకసుందరి ప్రవేశం గురించి ఆందోళన చెందకండి… జస్ట్, ఓ గెస్టులా వచ్చింది… పాత కంటెస్టెంట్లు కొందరిని మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చి, ఇక ఫినాలే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు… గతంలో కూడా చేసిందే… కానీ ఈసారి కరోనా కారణంగా… స్వేచ్ఛగా అనుమతించలేరు కాబట్టి… ఓ అద్దాల చాంబర్లోకి తీసుకొచ్చి, మాటామంతీ ఏర్పాటు చేశారు… సేమ్, కుటుంబసభ్యులను కలిసినట్టుగానే…! లాస్య, కల్యాణి, మోనాల్ గట్రా వచ్చారు… మోనాల్ […]
TV9… మళ్లీ రవిప్రకాష్ చేతుల్లోకి..! సాధ్యమేనా..? ఏం జరుగుతోంది అసలు..?
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు… – త్రివిక్రమ్ శ్రీనివాస్ . ఏదో ఓ పాపులర్ సినిమాలో డైలాగ్ ఇది… నిజమే… కానీ టీవీ9 మళ్లీ రవిప్రకాష్ చేతుల్లోకి వస్తే..? అది అద్భుతమే కదా… అరె, స్థూలంగా పైపైన చూస్తే అది అసాధ్యమనీ, తప్పుడు రాతలు, ఫేక్ కూతలు అనిపిస్తుంది… టాప్ గాసిప్ అనేలా ఉంటుంది… కానీ రాజకీయాల్లో… రాజకీయాలతో వ్యభిచరించే మీడియా పోకడలను చూస్తుంటే… అది పెద్దగా అసాధ్యం […]
బాబు బాగుంటేనే జగన్‌కు బలం… వింతగా ఉన్నా అదే సరైన సమీకరణం…
చంద్రబాబుకు తల్నొప్పి వంటి వోటుకునోటు కేసు మళ్లీ కదులుతోంది… ఉదయసింహా అరెస్టు… రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారని అనుకుంటున్న తరుణంలో… తెలంగాణలో కాంగ్రెస్‌ను, ఏపీలో చంద్రబాబును ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో బీజేపీ బిజీగా ఉన్నట్టుంది… జగన్‌తో, కేసీయార్‌తో అమిత్ షా మాటామంతీలో ప్రధానంగా ఇవి కూడా చర్చకొచ్చినట్టు ఓ సమాచారం… చంద్రబాబుకు సపోర్టుగా ఉండే సెక్షన్లను క్రమేపీ బీజేపీ ఫిక్స్ చేస్తోంది… అదే పని జగన్ కూడా చేస్తున్నాడు… బీజేపీతో సత్సంబంధాల కోసం చంద్రబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా […]
డిగ్నీక్రసీ..! అనగా అత్యంత డిగ్నిఫైడ్ డెమోక్రసీ అని అర్థం…
ప్రజాస్వామ్యమా! చూస్తున్నావా తోపుడుస్వామ్యం? ———————- “మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పై పైకి! కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంత రాళం గర్జిస్తూ, పదండి పోదాం” ఇది శ్రీ శ్రీ కవిత అని చెప్పాల్సిన పనిలేదు. తెలుగు కవితను ఊరించి, ఊగించి, ఊరేగించి, శ్వాసించి, శాసించిన కవి శ్రీ శ్రీ. తెలుగు కవిత శ్రీ శ్రీ కి ముందు శ్రీ శ్రీ తరువాత అని […]
బిగ్ సర్టిఫికెట్..! అభిజిత్‌కు బిగ్‌బాస్ అనూహ్యమైన, అరుదైన ప్రశంస…
సర్ప్రయిజ్… బహుశా ఇప్పటివరకూ నాలుగు సీజన్లలో కలిసి బిగ్‌బాస్ తనంతటతాను ఒక కంటెస్టెంటుకు ఇంత పెద్ద సర్టిఫికెట్ ఇచ్చినట్టు గుర్తులేదు… అనూహ్యం… అభిజిత్ దానికి అర్హుడా కాదా అనేది వేరే సంగతి… అందరూ అనుకుంటున్నట్టు చివరకు తను విజేతగా నిలుస్తాడా లేదా అనేది వేరే ముచ్చట…. కానీ బిగ్‌బాస్ స్వయంగా అభిజిత్‌కు ఓ దండ వేసి, పేద్ద శాలువా కప్పి సత్కరించేశాడు… ఇక ఆ ట్రోఫీ తన చేతికి వచ్చినా రాకపోయినా జానేదేవ్… ఇంతకీ తను ఏం […]
వారెవ్వా… లెఫ్ట్ ఫ్రంట్ ఈ ఇకారాలకూ పాల్పడుతుందా కామ్రేడ్..?
ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించడమే కాదు ముఖ్యం… ఎక్కువ మెజారిటీ నెగ్గడమూ ఓ తృప్తి… కానీ కేరళలో జరిగిన ఓ ఎన్నికల వింతగా ఉంది… ప్రత్యర్థి కాని ప్రత్యర్థికి ఒక్క వోటు పడకుండా చేయడం…! కొడువళ్లిలో కరాట్ ఫైసల్ అంటే ఓ ఊరమాస్ లీడర్… సీపీఎం… అక్కడ తనకు ఓ గ్యాంగు, ఓ క్రేజ్… అక్కడ ఫైసల్ చెప్పిందే శాసనం… పినరై విజయన్ కాదు కదా, సీతారాం ఏచూరి వచ్చినా సరే, ఫైసల్ చెప్పిందే జరుగుతుంది అక్కడ… తన […]
సోయిలేని పత్రిక..! జగన్ పుత్రిక ఏదైనా రాసేయగలదు… ఇలా…
మందు అంటే మగాడి సొత్తా..? పొరపాటున మగువ మద్యం ముడితే పాపమా..? అదేదో పాపకార్యం అయినట్టు..? చేయరాని ద్రోహమేదో చేసినట్టు..? హేమిటో ఈవార్త …? మందు కొడితే మైలపడినంత బిల్డప్..!! ఒక పత్రిక కీలక స్థానాల్లో ఉండేవాళ్లకు ఓ సోయి, చారిత్రిక, నైతిక అంశాలపై ఓ లైన్ అంటూ ఉంటే కదా… దిగువ స్థాయి వరకూ పాత్రికేయులకు ఓ లైన్ ఇవ్వగలిగేది… ఆలోచనల్లో క్లారిటీ, క్వాలిటీ ఉన్న ఓ క్వాలిటీ సెల్ ఉంటే కదా ఓ డైరెక్షన్ […]
టూత్ పేస్టు, సబ్బుల్లో రసాయనాలు! నాడీ వ్యవస్థ సర్వనాశనం!
హైదరాబాద్ లో 2012లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన శాస్త్రవేత్తలు మూడు రోజులపాటు జీవ వైవిధ్య పరిరక్షణ గురించి శాస్త్రీయంగా వివరించారు. శాస్త్రీయ విషయాలను జనసామాన్యంలోకి తీసుకెళ్లడంలో మన నిర్లక్ష్యం హిమాలయంకంటే ఎత్తయినది. దీపంలో ఒత్తి కుడి వైపు ఉండాలా? తూర్పును చూడాలా ? ఒక ప్రమిదలో రెండు ఒత్తులు వేయాలా? రెండు ప్రమిదల వెలుగు ఎదురెదురుగా చూసుకోవాలా? అన్నవే మనకు పరమ శాస్త్ర, ప్రాణాధార విషయాలు. భక్తి ఛానెళ్లు, యూ ట్యూబులు వచ్చాక […]
బీజేపీ పుట్టిన తొలిరోజుల్లో… నిఖార్సయిన గెలుపు కేవలం ఒక్క సీటులోనే…
‘‘వీళ్లిద్దరితోనే భారతీయ జనతా పార్టీ యాత్ర మొదలయ్యింది…!! ఒకరు చందుపట్ల జంగారెడ్డి గారు,? మరొకరు డాక్టర్ AK పటేల్ గారు, జంగారెడ్డి గారు హన్మకొండలో పీవీ గారి మీద ఎంపీగా గెలిచారు. AK పటేల్ గారు? గుజరాత్ రాష్ట్ర మెహసానా నుండి ఎంపీగా గెలిచారు. 2 సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర నేడు 303 సీట్లకు చేరి?అప్రహతిహాతంగా? కొనసాగుతున్నది….!!’’ ………. ఈ మెసేజ్ వాట్సప్ గ్రూపుల్లో తెగ షికారు చేస్తోంది… దీని ప్రయోజనం ఏమిటో ఆ […]
మేఘా కాకపోతే మరొకడు..! పనిమంతుడిని వదిలేసి పనివాడిని తిడితే ఎలా..?!
బాస్ బీజేపీ కాబట్టి కాషాయం పులుముకుంది ఆ పత్రిక… తప్పులేదు, బాసును మించిన ధర్మం ఏముంటుంది..? పైగా ప్రతి పత్రికకూ ఓ పొలిటికల్ లైన్ ఉంటుంది… బాసు నడిచే లైనే పత్రిక లైన్… అదంతే… ప్రస్తుతం వివేక్ బీజేపీలో ఉన్నందున తన వీ6, వెలుగు కూడా అర్జెంటుగా కాషాయం అంగీలు తొడుక్కున్నయ్… టీఆర్ఎస్, కేసీయార్, కేటీయార్, ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజానికే శత్రువుల్లా కనిపిస్తున్నారు… అదీ సహజమే… సో, ప్రతి ప్రత్యేక కథనమూ ఆ కలర్లోనే వెలిగిపోతుంది… […]
ఈటీవీ, మల్లెమాలకు ఫెళ్లుమనేట్టు… మాటీవీలో అవినాష్ కొత్త కామెడీ షో…
అవినాష్… బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చేశాడు కదా… అప్పటివరకూ తనకు ఉపాధి ఆధారంగా ఉన్న జబర్దస్త్ షో కూడా పోయినట్టే కదా… మరి ఏం చేయబోతున్నాడు..? అసలే కదిలిస్తే చాలు, బొచ్చెడు సినిమా కష్టాలు చెప్పుకుని శోకాలు పెట్టే అవినాష్ భవిష్యత్తు ఏమిటి…? వీటికి జవాబులు కావాలా…? అంతకుముందు అవినాష్ రీసెంట్ కథ ఓసారి చదవాలి… చాలామంది కమెడియన్లలాగే అవినాష్ కూడా ఈటీవీ జబర్దస్త్ ద్వారా మెరిశాడు… బిగ్‌బాస్ అవకాశం వచ్చింది… కానీ జబర్దస్త్ షో దగ్గర […]
కొవ్వెక్కిన కోపం… కోపమెక్కిన రోగం… రోగమెక్కిన మంచం… మంచమెక్కిన..??
ఎంత కొవ్వుకు అంత కోపం! ———————— “శేషం కోపేన పూరయేత్” అని సంస్కృతంలో ఒక గొప్ప మాట. ఒక సమస్యనో, చర్చనో, వివాదాన్నో తుదిదాకా ఓపికగా హ్యాండిల్ చేయడం చేతకానివారు మధ్యలోనే కోప్పడి- ఆ కోపంతోనే ఆ శేషాన్ని పూరించినట్లు అనుకుంటారట. సాధారణంగా పేదవాడి కోపం పెదవికి చేటు. పెద్దవారి కోపం పెదవికి చేటు కాదు అని దీనికి అర్థం మనం గ్రహిస్తే- సామెత కాదనదు. తెలుగులో కోపతాపాలు విడదీయడానికి వీల్లేని ద్వంద్వ సమాసం. కోపం వల్ల […]
జయహో ప్రజాశక్తి…! ఈ బ్యానర్ స్టోరీ కొట్టినవాళ్లకూ శౌర్యచక్ర ఇవ్వాలి…!!
ఫాఫం ప్రజాశక్తి దినపత్రిక… హఠాత్తుగా ఏమైంది దీనికి..? ఈమధ్య ప్రభుత్వ ప్రకటనలు బాగా కొట్టీ కొట్టీ… బుర్రలు ఖాళీ అవుతున్నాయా..? లేకపోతే ఫస్ట్ పేజీ లీడ్ స్టోరీ ఈరకంగానా..? కిసాన్‌కు జైకొట్టిన జవాన్… ఇదీ శీర్షిక… 25 వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారు, కేజ్రీవాలుడు దీక్ష చేస్తున్నాడు, రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు కొందరు లేఖలు రాస్తున్నారు అని ఏవేవో రాసుకుంటూ పోయారు… వోకే, సీపీఎం పార్టీ తాజా కేంద్ర వ్యవసాయ […]
టోలు నిత్యం! టోలు సత్యం! తోలు వలుచుట తథ్యం!
టోల్ అన్న మాట ఇంగ్లీషులో ఎలా పుట్టింది అని చర్చించడానికి ఇది ఇంగ్లీషు భాషోత్పత్తి శాస్త్ర పాఠం కాదు. noun:- 1. a charge payable to use a bridge or road. 2. the number of deaths or casualties arising from a natural disaster, conflict, accident, etc. verb:- charge a toll for the use of (a bridge or road). నామవాచకంగా అయితే టోల్ […]
ఎల్ఆర్ఎస్ ఊబి..! ఫాఫం… నానాటికీ కూరుకుపోతున్న కేసీయార్…!
చెప్పింది పాత పద్ధతి, రిజిస్ట్రేషన్లు చేసేది మాత్రం కొత్త పద్ధతిలో..! మొరాయిస్తున్న సర్వర్లు.రోజుకు ఒక్కటి మాత్రమే స్లాట్ బుకింగ్… అయోమయంలో అమ్మకం దారులు. కొనుగోలుదారులు… రోడ్డున పడనున్న రైటర్ లు,స్టాంప్ వెండర్స్… ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు స్టాంప్స్ అవసరం లేదు… తెల్ల పేపర్ మీదనే రిజిస్ట్రేషన్… LRS లేని ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కావు… Vacant లాండ్ టాక్స్ కడితేనే రిజిస్ట్రేషన్… రిజిస్ట్రేషన్ డాక్సుమెంట్లో పొడవు వెడల్పు కొలతలకు అవకాశం లేదు… సేల్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు… Ratification […]
నిశ్చయ్, అభిక, అవియానా, సురష్మి… ఇప్పుడంతా హైబ్రీడ్ పేర్ల ట్రెండ్…
అసలు వాళ్లకేమీ ఉండదు… మధ్యలో ఎవరో రిపోర్టరో, పేజ్ త్రీ పోర్టరో, సబ్బెడిటరో తీటకు ఏదో పేరు పెడతాడు… అంతే ఇక, అందరూ దాన్నే వాడుతూ సంబరపడిపోతారు, ఫ్యాన్స్ వాళ్లకు వాళ్లే చక్కిలిగిలి పెట్టేసుకుంటారు… మీడియా, సోషల్ మీడియా తెగ ఆనందపడిపోతూ ఉంటయ్… ఏమిటంటారా..? సెలబ్రిటీ జంటలకు పేర్లు పెట్టడం… అబ్బే, వేరే పేర్లు కాదు… ఆ ఇద్దరి పేర్లూ వచ్చేలా… హైబ్రీడ్ పేరు… అనగా ముద్దు పేరు… ఉదాహరణకు… జస్ట్, ఉదాహరణకు.,. ఇది ఆంధ్రజ్యోతి సైటు… […]
- « Previous Page
- 1
- …
- 427
- 428
- 429
- 430
- 431
- …
- 439
- Next Page »