అన్సవ్వ… తెలంగాణ భాషలో అలాగే అంటారులే… చనువు ఉన్నవాళ్లయితే అన్సీ అని కూడా ప్రేమగా పిలుస్తారు… సూపర్ తెలుగు టీవీ యాంకర్ అనసూయ ఇంటర్వ్యూ ఒకటి కనిపించింది ఏదో పత్రికలో పొద్దున్నే… దిక్కుమాలిన ‘కవరేజీ’… సందర్భం ఏముంది అని కూడా ఆలోచించకుండా గీకడమే సినిమా వార్తల కవరేజీ కదా అని నిందించవద్దు… మస్తు రాసేశాడు ఎవరో… ఫాఫం, పొట్టతిప్పలు తప్పవు కదా… కానీ… చదువుతుంటే భలే నవ్వొచ్చింది… ఈమె సంగతి తెలుసు కదా… ఏదేదో చెబుతూ పోయింది… […]
గన్ బాసూ..! అన్నీ సెట్ చేసేది, డిసిప్లిన్ అమలు చేసేదీ అదే బాసూ..!
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా! బుల్లెట్ దిగిందా లేదా అన్నది లెక్క!………… By….. పమిడికాల్వ మధుసూదన్ తెలంగాణాలో గన్ లైసెన్సులు తొమ్మిది వేలే ఉన్నాయని ఒక వార్త. వెనకటికి శివ ధనుస్సు విరిగిన సందర్భాన్ని చెబుతూ కరుణశ్రీ ఒక పద్యంలో…ఒక్క నిముషంలో నయము; జయము; భయము, విస్మయము కదురా! అన్నాడు. అలా ఈ తుపాకుల వార్తను మనం కూడా క్రమాలంకారంలో పూరించుకుందాం. నయం:- నాలుగు కోట్ల తెలంగాణ జనాభాకు ఒక శాతం లెక్క వేసినా నాలుగు లక్షల తుపాకి లైసెన్సులు […]
రైతు ‘ధర’హాసం..! ఎంత మంచి వార్త…! చదువుతుంటేనే ఎంత స్పైసీ…!!
చిన్నప్పుడు ఏదో పాఠ్యపుస్తకంలో చదివినట్టు గుర్తు… ఓ పాపులర్ పెద్దమనిషి తాను రోజూ పత్రికల్ని తిరగేస్తాను తప్ప చదవననీ, కానీ ఒకరోజు ఒక రైతుకు ఉత్తమరైతు పురస్కారం ఇచ్చి, తలపాగా బహూకరించిన వార్త మాత్రం తనను బాగా ఆకట్టుకున్నదనీ రాస్తాడు… తోటి రైతుల్లో ఆ తలపాగా తనకు ఎంత గర్వం..? ఆ ఫీలింగే ఆనందాన్ని కలిగించింది అంటాడు… నిజమే… రైతు బతుకులు మరీ ఘోరంగా ఉన్న ఈరోజుల్లో రైతులకు ఆనందాన్ని కలిగించే ఒక చిన్న వార్త అయినా […]
హమ్మయ్య, క్లారిటీ వచ్చింది… కేసీయార్ అందుకేనా ఇలా చేస్తున్నది..?!
హమ్మయ్య… క్లారిటీ వచ్చేసినట్టే ఇక…! కేసీయార్ ఎందుకిలా చేస్తున్నాడో నిజానికి కేసీయార్‌కు క్లారిటీ ఉందో లేదో తెలియదు గానీ… ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పూనుకుని.., ‘‘‘తమ్ముడూ కేసీయారూ… నువ్వు ఎందుకిలా చేస్తున్నావో తెలుసా..? ఇదుగో నేను చెబుతాను విను, క్లారిటీ తెచ్చుకో, అసలే నీ తత్వం నీకు తెలియదు…’’’ అన్నంత ఇదిగా రాసిపారేశాడు… సారు గారు ఢిల్లీకి వెళ్లొచ్చాక, మోడీ మీద పోరాటానికి పదునుపెట్టించిన కత్తులన్నీ స్టోర్‌రూంలో పారేసి, రాష్ట్రంలో ఉన్నది కాషాయ ప్రభుత్వమా అన్నట్టుగా బోలెడు […]
అందుచేత అన్ని గుళ్ల ధర్మకర్తలు రాత్రిళ్లు విగ్రహరక్షణకు బయల్దేరాలహో…!!
ఓ మిత్రుడి సోషల్ వాల్ మీద కనిపించింది… సారాంశం ఏమిటంటే..? ‘‘నువ్వు-నేను’’ అనే హిట్ సినిమా… అందులో ఓ సన్నివేశం… క్లాస్ రూం… కమెడియన్ సునీల్ లేచి నిలబడి ఏదో చెబుతుంటే, ఓ అమ్మాయి తన మొహం చాటుచేసుకుంటూ… ‘మూసుక్కూచోరా పూలచొక్కా’ అంటుంది… ఎవరన్నారో తెలియదు సునీల్‌కు… ‘‘ఇక్కడ ఎవరో నన్ను పూలచొక్కా అన్నారు, లెక్చరర్ వచ్చి నాకు క్షమాపణ చెప్పేదాకా ఊరుకునేది లేదు’’ అని కస్సుమంటాడు… ‘‘ఓహోహో, ఇది మరీ బాగుంది… కొత్త టెన్షన్లు పెట్టకు […]
అప్పట్లో ప్రతి పాటా ఓ ప్రయాస… ఓ ప్రయోగం… ఈ పాట కూడా అంతే…
ఏనాడు గెలిచింది వలపు..? తానోడుటే దాని గెలుపు…. ఎంత బాగా చెప్పేశాడు రచయిత సూటిగా… ప్రేమ ఎప్పుడు గెలిచిందని, అసలు ఓడిపోవడమే కదా దానికి తెలిసిన గెలుపు…. అంటూ ప్రేమ వైఫల్యాల గురించి నిర్వేదంగా ఒకే వాక్యంలో తేల్చేస్తాడు… అవును, ఇలాంటి రాయాలంటే ఆత్రేయే కదా… సరళమైన పదాలతో అనంతమైన భావాల్ని నింపుతూ నింపుతూ సాగిపోతుంటయ్ పాటలు… నిజానికి ఇది కథ కాదు అనే బాలచందర్ సినిమాలోని అన్ని పాటలూ బాగుంటయ్… ఎంఎస్ విశ్వనాథన్ ప్రతి పాటనూ […]
రాముడి తలనరికిన రావణాసురుడు పకపకా నవ్వుతున్నాడు ఎక్కడో దాక్కుని..!!
రామతీర్థం రగులుతోంది…. హిందూధర్మానికో, హిందూదేవుడికో శిరోభంగం కలిగినందుకు కాదు… అసలు అదెవడికీ పట్టడం లేదు… జగన్ విసిరేసే దయాధన దృష్టులతో చల్లగా ఉన్న జాతీయ హిందూ పార్టీలు, సంస్థలతోపాటు రాష్ట్ర పార్టీలూ అంతే… కులం, దాని ఆధారంగా ఉన్న రాజకీయం… దాని ముందు రాముడు, దేముడు బలాదూర్… పాపం చేసినవారు వాళ్ల పాపాన వాళ్లే పోతారులే అంటాడు జగన్… మరి రాజధర్మం మాటేమిటి..? ఆ మాటకు తనకు అర్థం తెలియదు… బొచ్చెడు సంఘటనలు జరిగినా సరే, ఈరోజుకూ […]
టాటా, ఈనాడు… సేమ్ సేమ్… అగ్నిని అవరోధిస్తాయి అలవోకగా…. ఇలా..!!
టాటా తలుపులు పెట్టుకోండి! అగ్ని అవరోధిస్తుంది!……… by…. -పమిడికాల్వ మధుసూదన్ ———————- తెలుగు భాష ఎప్పటికీ చచ్చిపోదు అని నమ్మకం కలిగించడానికి అప్పుడప్పుడూ కొన్ని దృష్టాంతాలు ఎదురవుతుంటాయి. అలాంటి దృష్టాంతాల్లో కార్పొరేట్ ప్రకటనల తెలుగు అనువాదం ఒకటి. తెలుగు భాషను ఎంతగానో ప్రేమించే ఈనాడు పలక అక్షరాల మాస్ట్ హెడ్ కింద The largest circulated Telugu daily అని ఇంగ్లీషులో ఉండడంలో ఏదో జర్నలిస్టిక్ లింగ్విస్టిక్ అంతరార్థం దాగి ఉండవచ్చు! అవుటర్ రింగ్ రోడ్డకు- బాహ్యవలయ […]
నో ప్రాబ్లం, ఎంతటి పాపులనైనా పవిత్రుల్ని చేయగలం, సంప్రదించగలరు…
హహహ… కేసీయార్‌కు పగ్గాలు వేయడానికి బండి సంజయ్ దూకుడు ఎంత ఉపకరిస్తుందో… తన మాటల తీరు చూస్తే బీజేపీ శ్రేణులే బెంబేలెత్తిపోతున్నయ్… తనకు కొత్త విద్యుత్తు చట్టాలు, ఆయుష్మాన్ భవ, కేంద్ర వ్యవసాయ చట్టాలు, కేసీయార్ తీరుతో తెలంగాణ జనానికి వాటిల్లే నష్టాలు, పోతిరెడ్డిపాడు పొక్కలు, మెడికల్ సీట్లు, కాలేశ్వరం కథలు గట్రా ఏమీ పట్టవు… ఊఃఁ అంటే చాలు చార్మినార్ భాగ్యలక్ష్మి… చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు… ఆ కరీంనగర్ గల్లీ పాలిటిక్సు నుంచి బయటికి వచ్చి, కాస్త […]
కాంగ్రెసే నయం… బండి సంజయ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు..?
తెలంగాణ వచ్చాక కూడా… పిల్లల సీట్లు, అందులోనూ మెడికల్ సీట్ల విషయంలో అదే అన్యాయం..? ఒకవైపు ఆంధ్రా ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చుకుని, ఆంధ్రా పిల్లలకు ప్రయోజనకరంగా వ్యవహరిస్తుంటే… తెలంగాణ సీట్లలో కూడా ఆంధ్రా పిల్లలే నిండుతుంటే కళ్లప్పగించి తెలంగాణ ఆరోగ్య యూనివర్శిటీ చూస్తూ ఊరుకుంది… ఇది అసమర్థతా..? నిర్లక్ష్యమా..? కుట్రా..? కేసీయార్ సర్కారుకు ఎందుకు పట్టలేదు..? పాలనానుభవం లేని జగన్ అంతగా చాకచక్యంగా జాగ్రత్తపడి, ఆంధ్రా సీట్లు తెలంగాణ పిల్లలకు పోకుండా చేసుకోగలిగితే… ఆ పని […]
ఫాఫం శ్రీముఖి..! జబర్దస్త్ వీడినవాళ్ల గతేంటి..? రోజాయే గెలిచిందా..?
బిగ్‌బాస్ మస్తు పైసలు ఇచ్చింది శ్రీముఖికి..! కానీ కెరీర్‌కు ఊపునివ్వలేదు… ప్రస్తుతం ఖాళీ… దిక్కులు చూడటమే…! నిజానికి అప్పట్లో మస్తు జోకులు పడేవి… ఏమనీ అంటే..? యాంకర్ పళ్లికిలిస్తేనే షో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాడేమో నాగబాబు… అందుకే అదిరింది నవ్వుల షోకు ముందుగా సమీరను తీసుకున్నాడు… షో క్లిక్ కావడం లేదని ఆమెను మధ్యలోనే తరిమేశాడు… భానుశ్రీని, రవిని తీసుకొచ్చాడు… వాళ్లనూ వెళ్లగొట్టేశాడు… అసలు షోలో దమ్ముండాలి మాస్టారూ అంటే వినడు… ఈయన్ని అనవసరంగా ఈటీవీ నుంచి […]
తడి ఎండిన తెలుగు కలాలు..! కన్నీటి సిరాకు దూరదూరంగా…!!
నిజమే, ఓ మిత్రుడు బాధపడినట్టు…. కరోనా ఎన్ని పాఠాలు నేర్పింది మనిషికి..? నేర్పిస్తూనే ఉంది..? మళ్లీ మనం చూస్తామో చూడమో ఇలాంటి విపత్తును… ప్రపంచం మొత్తం వణికిపోయింది… పోతున్నది… ఈ భూగోళానికి కుదిపేసే ఇలాంటి విపత్తు వస్తే… మతం ఏమిటి..? కులం ఏమిటి..? ప్రాంతం ఏమిటి..? అసలు దేశం ఏమిటి..? మనిషన్నవాడే మిగుల్తాడా మిగలడా అన్నంత కలవరం… కానీ ఒక్క కలమూ కదల్లేదేం..? ఒక దర్శకుడికీ, ఒక్క నిర్మాతకూ మనసు కదల్లేదేం..? ఇన్ని సీరియళ్లు, ఇన్ని పత్రికలు, […]
హేమిటీ దీపికా.. అంత పనిచేసేశావ్..? కారణమైనా చెప్పలేదు…
ఈమె తత్వం కాస్త వింతగా కనిపిస్తున్నది… సెలబ్రిటీలు అందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్ని వీలైనంత లైవ్‌గా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు జనాన్ని తమవైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు… పెద్ద పెద్దోళ్ల ఖాతాల్ని మెయింటెయిన్ చేయడానికి సోషల్ మీడియా టీమ్స్ ఉంటయ్… ఇండియన్ టాప్ సినిమా హీరోయిన్ దీపిక పడుకోన్ మాత్రం అందరికీ కొత్త సంవత్సరం వేళ షాక్ ఇచ్చింది… ఏమిటో తెలుసా..? తన సోషల్ మీడియా ఖాతాల్ని ఖాళీ చేసింది… అర్థం కాలేదు కదూ… ప్రధానంగా […]
రామోజీ సారూ… ఈటీవీని కూడా గాలికి వదిలేశారా..? ఏమిటిలా…!!
ఈనాడు పత్రికను గాలికి వదిలేసినట్టే… ఈటీవీని కూడా వదిలేశాడా రామోజీరావు…! ఈ మాట పరుషంగా ఉన్నాసరే, అంకెలు అబద్ధం ఆడవు… తను దీటుగా గేమ్ ఆడుతున్న ఫీల్డులో కూడా ఆటను వదిలేస్తున్న తీరు సహజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది… ఆయన తప్పు ఎక్కడయ్యా అంటే…? సరైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించకపోవడం..! ఈటీవీ పేరిట చాలా చానెళ్లున్నయ్… ఈటీవీ, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్… ఇంకేమైనా ఉన్నాయో తెలియదు… ఇందులో నడిచేది […]
అబ్బ.., ఎంత మంచి కలెక్టరో అనుకున్నారు పిచ్చిజనం… ఆహాఓహో అన్నారు…
ముందుగా ఓ కథ చదువుదాం… మనం ‘ముచ్చట’లో రాసుకున్నదే… 2018 నాటి మాట… కొన్ని హఠాత్తుగా తమిళనాడులో, సోషల్ మీడియాలో మస్తు ప్రశంసలతో ప్రచారానికి వస్తయ్… అందులో ఒకటి మనం అలా పికప్ చేసి రాసుకున్నది… ఆహా, ఇంత మంచి కలెక్టర్ అసలు ఉంటాడా…? ప్రభుత్వ ఉద్యోగులకే తలమానికం కదా ఈ ధర్మప్రభువు అనిపించేలా ఉంటుంది కథ… నిజానికి 99.99 శాతం బ్యూరోక్రాట్లు ఇలా ఉండరు… ఉంటే ఈ భారతదేశ అధికార వ్యవస్థలకే అవమానం కదా… సరే, […]
ఈయనేం పోలీసు..? అసలు ఎంత నామర్దా..? ఎంత నామోషీ..? శిక్షించాలె…!!
అమీన్ సాబ్… అంటే సబ్ ఇన్స్పెక్టర్… ఎంత ఖదర్ ఉండాలె… గబ్బర్‌సింగ్ లెక్క ఎంత అధికారం ఉండాలె… అరె, మరీ గిట్ల చేసుకుంట, మొత్తం పోలీసు అనే పదానికే నామర్దా… నామోషీ… ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అని పెద్ద పోలీసులు చెప్పగానే, ఇంత అరాచకమా..? అబ్బే, పోలీస్ అనే పదానికే అవమానం… అసలు ఏందివయ్యా నువ్వు..? అంత కడక్ కడక్ ఖాకీ డ్రెస్సు వేసుకున్నవ్… చేతికి లాఠీ ఇచ్చిండ్రు… పైగా గన్ ఉంది… ఎంత జోష్ ఉండాలె […]
సీపీఎం చేస్తే సూపర్… బీజేపీ చేస్తే బ్లండర్… అసలు పంచాయితీ ఏంటంటే..?
ఏదైనా చిన్న తీగె దొరికితే చాలు…. పీకిపీకి పెంట చేయడమే…! కేరళలో క్రిస్టియానిటీ చాలా ఎక్కువ తెలుసు కదా… రెండు పెద్ద చర్చిలున్నయ్… మలంకర అర్దోడాక్స్ ఒకటి, మరొకటి జాకోబియన్ సిరియన్… ఒక్క జాకోబియన్ చర్చి పరిధిలో కేరళలోనే దాదాపు వెయ్యి చర్చిలు, వేల కోట్ల ఆస్తులున్నయ్… దీన్నుంచి అప్పుడెప్పుడో… 1934లో మలంకర గ్రూపు విడిపోయింది… అప్పట్నుంచీ చర్చిలపై, ఆస్తులపై తగాదాలు నడుస్తూ ఉన్నయ్… ఇదీ అసలు కథ… అన్ని వివాదాలను కోర్టులు, స్థానిక పెద్ద మనుషులు […]
ఆహా… ఓహో… మెగా బావ కిరీటానికే ఆ అల్లు అరవిందుడి ఎసరు..?
హబ్బబ్బ… నిన్నటి నుంచీ తెగరాసేస్తున్నారు… అదేదో ఆహా అనే ఓటీటీ ఉందిగా అల్లు అరవింద్‌కు… అందులో అక్కినేని నాగసమంత అల్లు అర్జునుడిని ఇంటర్వ్యూలాంటిది ఏదో చేసిందట… మరి దానికి ప్రొమో లేదా ప్రమోషన్ అంటూ చేసుకుని ఏడవాలి కదా… ఆ ప్రకటనల్లో సదరు అల్లు అర్జునుడు అనేబడే చిరంజీవికి అల్లుడు వరుస హీరోను మెగాస్టార్ అని రాశారట… ఇంకేముంది..? అసలే అది మెగా ఫ్యామిలీ… బొచ్చెడు మంది హీరోలు… చిన్న చిన్న అంశాలూ పెద్దపెద్దగా ప్రచారంలోకి వస్తాయి […]
ఈటీవీ సూపర్ హిట్… కొత్త సంవత్సరం ఈవెంట్… మిగతా టీవీలు చేతులెత్తేశాయి…
కొత్త సంవత్సరం… బయట పార్టీలంటూ తిరిగే సీన్ ఎలాగూ లేదు… మన సర్కారు వారు అర్ధరాత్రి దాకా మందు షాపులు ఓపెన్ చేస్తామన్నారు కదాని, ఎటెటో తిరిగి, ఏదేదో తాగి, రోడ్ల మీద పడితే, పోలీసులు టెర్రరిస్టులంటూ ఇరగదీశారు… సో, ఇంట్లో అందరికీ టీవీలే దిక్కు… అందుబాటులో ఉన్న ఏకైక వినోదం కదా మరి… కానీ మన తెలుగు టీవీలు ఏం చేశాయి..? స్ట్రెయిట్ గా చెప్పాలంటే నాలుగు టీవీల్లో ఈటీవి మాత్రమే హిట్… మిగతా వాటిల్లో […]
తుస్… నాగార్జున అట్టర్ ఫ్లాప్… మాటీవీ సూపర్ ఫ్లాప్… బిగ్‌బాస్ సుప్రీం ఫ్లాప్…
బిగ్‌బాస్ నాలుగో సీజన్…. రేటింగ్స్ మాయలో గండరగండడు అనిపించుకున్న ది గ్రేట్ మాటీవీ సైతం చేతులెత్తేసింది… తుస్… తుస్సున్నర… అరె, అన్ని వెబ్సైట్లు ఆహా ఓహో… మస్తు రేటింగ్స్, 19.5 రేటింగ్స్ వచ్చాయి, దుమ్మురేపింది, నాగార్జునా సాహో, నీకు తిరుగులేదు, మాటీవీ రేటింగ్స్ మాయామర్మానికి రందిలేదు అని చెబుతున్నవేళ ‘ముచ్చట’ ఏమిటి, తుస్సుమని చెప్పడం ఏమిటి అంటారా..? ఆధారాలతో చెబుతాం… బిగ్‌బాస్ నాలుగో సీజన్ అట్టర్ ఫ్లాప్… ఎలా అంటే..? చూశారు కదా… ఇదీ బార్క్ తాజా […]
- « Previous Page
- 1
- …
- 448
- 449
- 450
- 451
- 452
- …
- 466
- Next Page »