తెలుగు లిపిలో రాదగిన మార్పులు- ఆవశ్యకత అన్న అంశం మీద హైదరాబాద్ లో ఒక చర్చా గోష్ఠి జరిగింది. అంతరించబోయే తెలుగు లిపి గురించి కాబట్టి- సహజంగా మీడియాలో ఈ సమావేశానికి తగిన చోటు దొరకలేదు. దొరికినా టాబ్లాయిడ్ లో జోనల్ పేజీ ఇరుకు కాలమ్స్ మధ్య భూతద్దం వేసి చూస్తే తప్ప కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగు లిపిలో మార్పుల ఆవశ్యకత గురించి ఈ సమావేశం చర్చించింది. “దీర్ఘాలు, ఒత్తులు విడిగా రాయాల్సిన అవసరం లేకుండా- […]
దగ్గుబాటి రానా..! రీజన్ చెబితే రీజనబుల్‌గా ఉండాలి బాబు గారూ..!
నిజానికి ఇప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీ పోకడల్లో దగ్గుబాటి రానాను చాలా విషయాల్లో మెచ్చుకోవచ్చు… తను హీరో మాత్రమే కాదు.., టీవీ షోల ప్రజెంటర్, నిర్మాత, గ్రాఫిక్స్-స్పెషల్ ఎఫెక్ట్స్‌తో పరిచయం ఎట్సెట్రా చాలా ఉన్నయ్… అన్నింటికీ మించి తనకు ఏ పాత్రలు సూట్ అవుతాయో తనకు బాగా తెలుసు… వాటివైపే మొగ్గుతాడు… ఘాజి, బాహుబలి, అరణ్య, విరాటపర్వం… ఇలా అన్నీ… తనకు నచ్చిన పాత్రలయితే మనసుపెట్టి వర్క్ చేస్తాడు… లవ్ స్టోరీలు, కామెడీ కథలు గట్రా తనకు […]
ఫ్యానిజం..! బుర్రలు మోకాళ్లలోకి దిగిపోతయ్… థియేటర్లనూ కాలబెడతారు..!!
హీరో అంటే… దైవాంశ సంభూతుడు… ఎహె, కాదు… కాదు… దేవుడే… వ్యక్తిపూజలో భ్రష్టులైన వాళ్లకు ఇక చెప్పేదేమీ ఉండదు… వాళ్లంతే… ఒరేయ్, మీ హీరో పాటలో ఓ వాక్యం మొత్తం పాటే చెడగొట్టిందిరా నాయనా… ఆ గీతరచయిత మేన్షన్ హౌజు హ్యాంగోవర్లో పిచ్చి సాహిత్యం మీమొహాన కొట్టాడురా బాబూ… మీ హీరో స్టెప్పుల చిత్రీకరణలోె కొరియోగ్రాఫర్ ఫలానా తప్పు చేశాడురా… మీ హీరో పాటలోని సెట్టింగులో ఫలానా తప్పుందిరా… మీ హీరో సినిమా టైటిల్స్‌లో ఫలానా అక్షరదోషం […]
వీఆర్ అర్చనలు… ఆన్లైన్ ఆర్జితసేవలు… యూట్యూబ్ వ్రతాలు… పోస్టల్ ప్రసాదాలు…
పోస్టల్ ప్రసాదం సమర్పయామి! ——————- హమ్మయ్య. ఇక దేవుడి ప్రసాదం ఇంటికే వస్తుంది. మనం దేవుడి వైపు ఒకడుగు వేస్తే- దేవుడు మనవైపు వందడుగులు వేసి వచ్చి కాపాడతాడని కంచి పరమాచార్య మహా స్వామి చెప్పేవారు. ఆ వాక్కును నిజం చేస్తూ తెలంగాణాలో తంతి తపాలా శాఖ దేవుడి ప్రసాదాలను మన ఇళ్లకే చేర్చే బాధ్యతను నెత్తికెత్తుకుంది. తంతి ప్రసాదం బుట్టలో పడడం అంటే ఇదే కాబోలు. నిజానికి ఈ మహాప్రసాదం బట్వాడా తపాలాశాఖ ఆలోచన కాదు. […]
బాబును లైట్ తీసుకున్న మమత..! హతవిధీ… మనవి కాని రోజులొస్తే అంతే..!!
ఫాఫం మమతా బెనర్జీ… ఆ ప్రశాంత్ కిషోర్‌ను నమ్ముకుని, తనెలా చెబితే అలా ఆడుతోంది… ‘బీజేపీ వాళ్లు వస్తుంటారు, పోతుంటారు, నేను లోకల్’ అని చంటిగాడి డైలాగులు కొట్టింది.., వర్కవుట్ కాలేదు… ‘నేను పొద్దునే చండీపాఠం చదవనిదే ఇల్లు కదలను, నేను బ్రాహ్మణ మహిళను’ అంటూ హఠాత్తుగా హిందుత్వ పాఠం మొదలుపెట్టి బీజేపీ పైకి అదే కులాస్త్రం, మతాస్త్రం సంధించింది… అదీ వర్కవుట్ కాలేదు… ‘నా కాలు విరిచేశార్రా దేవుడోయ్’ అంటూ చక్రాల కుర్చీ ఎక్కి తిరుగుతోంది… […]
లాహే లాహే ఆచార్య..! విమర్శలక్కర్లేదు… మెగాస్టార్ లెక్క మారదు…!!
అప్పుడే మొదలు పెట్టేశారు చిరంజీవి సినిమా ఆచార్య మీద విమర్శలు చేయడం… చేస్తే తప్పులేదు, తప్పుపట్టాల్సిన అంశాలున్నప్పుడు..! చిరంజీవి దానికి అతీతుడేమీ కాదు… అయితే కేవలం తప్పుపట్టడం కోసం తప్పులు ఎన్నడం వేస్ట్… ఎందుకంటే..? సినిమా అనేది ఒక దందా… జనానికి నచ్చేది ఏదో చూపించేసి డబ్బులు తీసుకోవడం ఈ దందా లక్షణం… అంతే… చిరంజీవి ఒక సినిమా హీరో… సంఘసంస్కర్త కాదు ఇక్కడ… సమాజాన్ని ఉద్దరించే పనిలో లేడు తను… సినిమా ఏ రేంజ్ బిజినెస్ […]