. సిరివెన్నెల కలం “ఎప్పుడూ ఒప్పుకోని ఓటమి” కావ్యకన్య, కవితాకన్య అంటారు. ఏ కవికైనా తాను రాసిన కావ్యమో, కవిత్వమో నిజంగానే కన్న కూతురిలా ఉంటుంది. అలాంటిది సిరివెన్నెలలాంటివారికైతే నవమాసాలు మోసి…కన్న ప్రసవవేదన ఇంకా ఎక్కువ ఉంటుంది. సినిమా కథలో పాట సందర్భం ఆయనకొక అవకాశం- అంతే. తన తాత్విక దృక్పథంతో ఆ సందర్భమే ఆశ్చర్యపోయేలా, పొంగిపోయేలా, కలకాలం నిలిచిపోయేలా పాట రాస్తారాయన. రాయడానికి ముందు తనలో తానే ఆలోచనల మథనంతో చాలా రగిలిపోతారు. నిద్రపోరు. తిండి […]
మద్దతులో నిజాయితీ లేదు… పైగా బీసీలపై హరీష్ రావు వెటకారాలు..!!
. ఒకరకంగా బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు బీసీల ఆకాంక్షలను, ఆందోళనలను, ఆశలను అవమానిస్తున్నట్టేనా..? ఈ ప్రశ్న ఎందుకో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి… నిన్న ఎక్స్‌లో ట్వీటుతూ… ‘‘ఆ రెండు పార్టీలది కపట ప్రేమ, బీసీలపై చిన్నచూపు, ఢిల్లీలో కొట్లాడాల్సిన పార్టీలు గల్లీలో డ్రామాలు’’ అన్నాడు… ఏ పార్టీలు…? బీజేపీ, కాంగ్రెస్ అట… బీసీలపై చిన్నచూపు అట… గల్లీలో డ్రామాలు అట… ఏదో నేను ఆ రెండు పార్టీలనూ భలే తిట్టాను అనుకుని సంబరపడుతున్నాడేమో… కానీ […]
గుజరాత్ అమిత్ షా..! ఇంతకీ ఎవరు ఈ హర్ష్ రమేష్ భాయ్ సంఘవి..?
. గుజరాత్ తాజా మంత్రివర్గ విస్తరణ అనంతరం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల దృష్టిలో ఒక పేరు పడింది… తన పేరు హర్ష్ రమేష్ భాయ్ సంఘవి… సింపుల్‌గా హర్ష్ సంఘవి… గుజరాత్ రాజకీయాల్లో హర్ష్ సంఘవి శకం… అతి పిన్న వయస్కుడైన ఉప ముఖ్యమంత్రిగా రికార్డు! ఇవీ చాలా పత్రికల్లో వచ్చిన హెడింగులు… అవును, తన వయస్సు 40 ఏళ్లు… ఇప్పుడు తను గుజరాత్‌కు ఉపముఖ్యమంత్రి… తాజా మంత్రివర్గ విస్తరణలో హర్ష్ సంఘవికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, […]
శేద్య చంద్రికా..! తొలి తెలంగాణ తెలుగు పత్రిక… దొరికిన తీరు ఏమనగా..?
. Bhavanarayana Thota… సుప్రసిద్ధ పరిశోధకుడు బండి గోపాల రెడ్డి (బంగోరె), మద్రాసు రేడియో స్టేషన్ అధికారి డాక్టర్ పి ఎస్ గోపాలకృష్ణ మిత్రులు… ఒక సందర్భంలో వాళ్ళిద్దరూ మద్రాసులో ఉన్న ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ (ప్రాచ్య లిఖిత గ్రంథాలయం) లో మరేదో పుస్తకం కోసం వెతుకుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యవసాయ పత్రిక వాళ్ళ కంటబడింది. అది నిజంగా ఆసక్తికరంగా అనిపించినా, వాళ్ళ దృష్టి మరో విషయం మీద ఉండటం వల్ల దాని సంగతి తరువాత చూద్దామనుకున్నారు. […]
అగ్లీ కేరక్టర్..! సీనియర్ నరేష్ చీదర పాత్ర..! ఇదేం టేస్టురా బాబూ…!!
. సీనియర్ నరేష్ (వీకే నరేష్)… ఒకప్పుడు హీరో… సరే, ఏం పాత్రలు చేశాడో, ఎన్ని నిలబడ్డాయో, ఎన్ని కొట్టుకుపోయాయో వదిలేస్తే…. కేరక్టర్ ఆర్టిస్టుగా మారాక మంచి మంచి పాత్రలు ఎంచుకుంటున్నాడు… పాత్రల స్వభావానికి తగ్గట్టు మంచి నటననే కనబరుస్తున్నాడు… (వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్లు, వివాదాలు గట్రా సమాంతరంగా మరో కథ)… అయితే ఒక్కసారిగా కే-ర్యాంప్ అనే తాజా సినిమాలో పోషించిన పాత్ర మాత్రం తన పాత్రల ఎంపికలోని విజ్ఞతను కాలరాచినట్టయింది.,. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లోనే ఎవరో […]
సొంత ఇల్లే ఓ లాడ్జి… పేరు హోమ్ స్టే… ఇప్పుడు రోడ్డున పడుతున్నారు…
. ఊటీ, కొడైకెనాల్లో హోమ్ స్టే వ్యథలు భారత దేశంలో కొండాకోనలకు చెప్పుకోలేని కష్టం వచ్చింది. “అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండాకోనలకొదిలేశాడా?” అని స్వాతిముత్యంలో సి నా రె మనిషి బాధకు కొండాకోనలను ప్రస్తావించారు. పాపం ఇప్పుడా కొండాకోనల బాధలను ప్రస్తావించడానికి ఎందరు సినారె లు పుట్టాలో! ఒకవేళ ఎవరైనా చెప్పినా కొండాకోనల బాధలు వినే గుండెతడి ఉన్న మనుషులు ఉండాలి కదా! పర్యాటకం, చార్ ధామ్ భక్తి యాత్రల […]
పక్కా టైంపాస్ పల్లీ బఠాణీ సినిమా… జయసుధ ఎందుకు ఒప్పుకుందో…
. Subramanyam Dogiparthi….. సినిమా పేరు గాంధీనగర్ రెండవ వీధి… ఓ నిరుద్యోగి , ఓ బడ్జెట్ పద్మనాభం కష్టాల కధ . చంద్రమోహన్ , రాజేంద్రప్రసాద్ స్నేహితులు . చంద్రమోహన్ తల్లీచెల్లెలుతో బడ్జెట్ బతుకుని లాక్కొచ్చుకుంటూ ఉంటాడు . పైసా పైసా లెక్కేసి ఖర్చు పెడుతూ ఉంటాడు . మూలిగే నక్క మీద తాటికాయలా స్నేహితుడు రాజేంద్రప్రసాద్ ఊడిపడతాడు . ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా జిడ్డు లాగా వదలడు . నేపాల్ గూర్ఖా అని అబధ్ధమాడి […]
ఒక చంద్రసేనుడు… కొడుకు రామసేనుడు… అల్లుడు హరిసేనుడు…
. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్-2 అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంలో చెప్పిన “బావా- బావమరిది” కథ… లీగల్ ఇష్యూస్ రాకుండా, కొన్ని హింట్లతో… అసలు వ్యక్తులు ఎవరో తెలిసేలా జర్నలిస్టులు కొన్ని కథనాలు రాస్తుంటారు కదా… అలా చెప్పాడు… ఎవరి గురించి..? కేసీయార్, హరీష్ రావు, కేటీయార్ గురించి… మీరు ఏం అర్థం చేసుకుంటారో… దేనికి వర్తింపజేసుకుంటారో మీ ఇష్టం… రేవంత్ చెప్పిన కథ ఇదీ… సారాంశం…. ఇది పూర్తి ఎఐ సహకారం… […]
వై ఓన్లీ హిమాంశు…? వై నాట్ ఆదిత్య…? కాచుకో కేటీయార్… నెక్స్ట్ తరమూ రెడీ…
. కేటీయార్… కవితక్క తగ్గేదేలా… నువ్వేనా కేసీయార్ వారసుడివి..? ఏం మగ వారసత్వమేనా..? ఆడ వారసత్వం పనికి రాదా ఈ దేశంలో..? ఠాట్, వీల్లేదు… మహిళల రిజర్వేషన్ల గురించి కొట్లాడిన కవితక్క అస్సలు ఊరుకోదు… రాజకీయ వారసత్వంలో కూడా మహిళలకూ సమాన హక్కులు ఇవ్వాల్సిందే… నో, ఇవ్వకూడదు, అంటే మీ బీఆర్ఎస్ రాజ్యాంగం మార్చుకొండి… ప్రజలకు చెప్పండి, మాది మగవారస పార్టీ మాత్రమే అని… హమ్మా… ‘‘చూస్తుండు, ఈ తరమే కాదు, భవిష్యత్తు తరానికీ నీకు పోటీ […]
జూనియర్… ఈ సమాజం నీకు ఏం తక్కువ చేసింది, ఇదేం కక్కుర్తి..?!
. ముందుగా ఓ విషయం చెప్పుకుని మిగతా స్టోరీలోకి వెళ్దాం… అదేమిటంటే..? బిగ్ బీ… ది గ్రేట్ అమితాబ్ బచ్చన్… తన టీమ్ తన కళ్లు గప్పి ఓ యాడ్ చేయించారు… అది ఓ గుట్కా యాడ్… సరోగేట్ యాడ్… అంటే సదరు గుట్కా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే దుర్మార్గపు యాడ్… అమితాబ్‌కు నిజం తెలిసింది… తను గడ్డి తినే రకం కాదు… పెంట మీద కాసులను ఏరుకునే రకం కాదు… అన్నింటికీ మించి ఉచ్ఛం నీచం […]
ఒకరు యోగి సిస్టర్, మరొకరు మోడీ సిస్టర్… ఈ ఫోటో చెప్పే నీతి ఏమనగా..!!
. భారత దేశ రాజకీయాల్లో అతి పెద్ద కంపు యవ్వారం… కుటుంబ పార్టీలు… వ్యక్తి కేంద్రిత పార్టీలు… అవినీతి, అక్రమాలు, అరాచకాలు, బంధుప్రీతి, తరాలకు సరిపడా కక్కుర్తి సంపాదన, శూన్య నైతికత… పైగా పెత్తనాలు, డాంబికాలు, పటాటోపాలు, చిన్న స్థాయి లీడర్ అయినా సరే… కాన్వాయ్స్, అనుచరగణం, అట్టహాసాలు, ఆడంబరాలు… పైగా మగ వారసత్వాలు, యధావిధి వారస పోకడలు… కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా… ఈ దుర్వాసన మెజారిటీ ప్రాంతీయ పార్టీల్లో ఉన్నదే… ఈ నేపథ్యంలో ఓ […]
ముద్దాయిల సంస్కరణ సగటు తెలుగు సినిమా తీసినంత వీజీయా…!!
. Subramanyam Dogiparthi…. సినీ జగత్తులో కొన్ని made for each other కాంబినేషన్లు ఉంటాయి . అవి హీరో హీరోయిన్లు కావచ్చు , హీరో నిర్మాతలు కావచ్చు , హీరో దర్శకులు కావచ్చు . అలాంటి వాటిల్లో కృష్ణ కె. యస్. ఆర్. దాస్ కాంబినేషన్ ఒకటి . కృష్ణ హీరోగా దాస్ సుమారు 30 సినిమాలకు దర్శకత్వం వహించారు . వాటిల్లో ఒకటి 1987 లో వచ్చిన ఈ ముద్దాయి . 26 కేంద్రాలలో వంద […]
మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
. మొన్నామధ్య ఎక్కడో చదివాను… త్రిశూలం సినిమాలో జయసుధ పోషించిన పాత్ర కోసం ముందుగా స్మితా పాటిల్‌ను అనుకున్నాడట నిర్మాత మురారి… కానీ తీరా వెళ్లి అడిగితే మీ సౌత్ సినిమాల్లో మహిళలకు అసభ్యంగా చూపిస్తారు, నేను నటించనుపో అన్నదని… ఆమె కొడుకు పేరు ప్రతీక్ బబ్బర్… తనను కన్నప్పుడే ఆమె మరణించింది… తను కూడా నటుడే… మొన్నటి నెత్తుటి కమురు వాసన సినిమా హిట్-3లో విలన్… ఆ వార్తకన్నా స్మితాపాటిల్ ఓ సినిమాను, ఓ పాత్రను […]
నా చిన్నప్పటి ప్రియురాలు ఆమె… ఈరోజుకూ కలలోకి వచ్చి పలకరిస్తుంది…
. నా చిన్నప్పటి ప్రియురాలు…! ఆమే అందరికన్నా గొప్ప అందగత్తెయా..? కాదు…! సెవెన్టీస్‌లో అందరికీ హేమమాలిని డ్రీమ్ గాళ్… కానీ ఆమె ఏమైనా అత్యంత అందగత్తె అయిన దేవతా..? నిజంగానే కాదు…! జీనతే పెద్ద అందగత్తె…! పోనీ, ఇండస్ట్రీలో ఆమె ఏమైనా పర్ఫెక్ట్ దేహమా..? కానే కాదు…! పర్వీన్‌ను అందులో మించినవారు లేరు…! కానీ ఎందుకో… నాకు స్మితా పాటిల్ మాత్రమే అందంగా, ఆకర్షణీయంగా కనిపించేది…! నాకు ఇప్పటికీ గుర్తుంది… దూరదర్శన్‌లో జైత్ రే జైత్ సినిమా […]
KCR పాలనలో లక్ష మంది బోగస్ ఉద్యోగులు… వేల కోట్ల ప్రజాధనం గోవిందా…
. కేసీఆర్ అరాచక పాలనలోని మరో ఘోర వైఫల్యం, దాదాపు 18 వేల కోట్ల ప్రజాధన దుర్వినియోగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది… పరిపాలనలో అడుగడుగునా సాగిన అడ్డదిడ్డపు యవ్వారం ఇది… ఒకసారి ఓ మాట గుర్తు చేసుకుందాం… కంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే దశలో… ఇకపై రాష్ట్రంలో కంట్రాక్టు ఉద్యోగి గానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గానీ కనిపించడని కేసీయార్ గంభీర ప్రకటన చేశాడు గతంలో… ఉత్తదే… అదెంత డొల్ల యవ్వారమో, కంట్రాక్టు ఉద్యోగులు కొనసాగడమే కాదు, […]
కన్నుమూసి అప్పుడే 39 ఏళ్లు..! ఇంకా కళ్లల్లోనే కదలాడే జ్ఞాపకం..!!
. స్మితా పాటిల్…! నిన్నటికి సరిగ్గా 39 ఏళ్లు ఆమె కన్నుమూసి..! ఆమె సినిమాలు చూసిన ప్రేక్షకుల కళ్లల్లో ఆమె నటనా ప్రతిభ మెరుస్తూనే ఉంది… నిజం, ఆమె కనుమరుగైంది గానీ ఎప్పుడూ కళ్లల్లోనే ఉంటుంది… అలా మరుపుకు రాని మహానటి… అసలు మహానటి అనే పేరుకు అసలైన ఐకన్ ఆమె… బతికి ఉంటే 68 ఏళ్ల వయస్సు… కానీ 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది… ఇండియన్ సినిమా తెర మళ్లీ ఇలాంటి నటిని చూడలేదు అంటే […]
తుపాకీకి జ్ఞానోదయం… విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం!
. సూరజ్ వి. భరద్వాజ్…. విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం! #LeftismMarkNeoExploitation మావోయిస్టు పార్టీలో అప్రకటిత మేధో, శ్రామిక వర్గాల నడుమ సంఘర్షణ కొనసాగుతోంది. కార్మికుల కోసం మేడేల పేరిట లిబరల్ తాటాకు చప్పుళ్లు ఎన్ని వినిపించినా తాడిత పీడిత జనం పక్షాన నిలబడే మిషలో దశాబ్దాల క్రితమే ఈ నయా వర్గ విభజనకు నాంది పడిందన్నది నిర్వివాదాంశం! ప్రాణాలకు సైతం తెగించి చెట్టు పుట్టా తిరుగుతూ విపరీతంగా శ్రమిస్తూ అణగారినవర్గాల [#OppressedClass] పక్షాన నిలబడి […]
కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్!
. బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్! ఓటర్ల గుట్టు లీక్ చేసిందా? ECIకి తెలంగాణ CEO సీక్రెట్ లెటర్! అబ్బో… ఈ వార్త తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 16 వేల మంది ఓటర్ల ఫోటోలు, వివరాలు తప్పుగా వాడుకుందని (Misuse) తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి (CEO) కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) […]
డ్యూడ్… ఎవడ్రా నీకు సర్టిఫికెట్ ఇచ్చేది… ఖచ్చితంగా హీరో మెటీరియలే..!!
. ఎవరో ఓ తిక్క ప్రశ్న, కించపరిచే ప్రశ్న వేశారు కదా… ప్రదీప్ రంగనాథన్ హీరో మెటిరియలా అని..! ఆ ప్రశ్న వేసిన జర్నలిస్టు అసలు జర్నలిజం మెటీరియాలేనా అనే ప్రశ్నను పక్కన పెడితే… నాగార్జున చెప్పినట్లు… రజినీకాంత్, ధనుష్, విజయ్ సేతుపతి చూడటానికి హీరో మెటీరియల్సా..? కానీ అద్భుతాలు సాధించలేదా..? అసలు హీరో మెటీరియల్ అంటే ఏమిటి..? లుక్కా..? సిక్స్ ప్యాకా..? నటన బేసిక్స్ కూడా తెలియకుండా ఏళ్ల తరబడీ వారస హీరోలు ఇండస్ట్రీని దున్నేయడం […]
Dirty Tollywood… మీ పీకుడు సంస్కార భాష ఏమిట్రా కుయ్యా..!!
. సిగ్గూశరం ఏమాత్రం లేకుండా పీకుడు భాష వాడుతున్నారు కదా… ఎహె, నేను ఆమె బిడ్డ గురించి కాదు మాట్లాడేది.., టాలీవుడ్లో చాలామంది క్రీచర్స్ గురించి… తాజాగా బన్నీ వాసు అట, ఎవరో… అసలు పేరేమిటో… అత్యున్నత సంస్కారంతో పెరిగిన ఆ కేరక్టర్ పూర్వరంగం ఏమిటో తెలియదు… సినిమా హీరోయిన్ల సైజుల గురించి కూడా తాగిన కూతలు కూసిన వాళ్లనూ చూశాం కదా… వెధవలు, వాళ్ల సినిమాల్లాగే వాళ్ల మాటలు… అదేదో ఓ చెత్తా సినిమా తీశాడు బన్నీ […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- …
- 390
- Next Page »


















