Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రభుత్వ ఉద్యోగి రిటైరయితే… అకౌంట్ సెటిల్ చేయలేని దురవస్థ..!!

February 28, 2025 by M S R

telangana

. ముందుగా ఓ వార్త చదవండి… తెలంగాణ ఆర్థిక స్థితికి అద్దం పట్టేదే… పెద్ద విశ్లేషణలూ, విపుల వివరణలూ అక్కర్లేదు… వార్త చదవగానే పాఠకుడికి అర్థమైపోతుంది… ఇదీ వార్త… తొర్రూరు విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి: హైకోర్టు ఆదేశం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది వారాల్లోగా (రెండు నెలల్లోపు) చెల్లించాలని తెలంగాణ హైకోర్టు గురువారంనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది… పదవీ విరమణ చేసి ఏడు […]

కాజల్, తమన్నా… నిందితులు కాదు… ఆ స్కామ్‌కు బాధ్యులూ కాదు…

February 28, 2025 by M S R

crypto scam

. తమన్నా, కాజల్ అగర్వాల్… క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో ఇరుక్కున్నారు… పోలీసులు ప్రశ్నిస్తున్నారు… ఈ వార్తలు చాలా తెలుగు సైట్లలో కనిపిస్తున్నాయి… సెలబ్రిటీలు కదా, పైగా పాపులర్ పర్సనాలిటీస్… కానీ ఈ క్రిప్టోకరెన్సీ కేసు పాతదే… 2024లోనే ఈడీ వాళ్లను విచారణకు పిలిచింది… కానీ నిందితులుగా కాదు… స్కామ్, బాధ్యుల మరిన్ని వివరాల కోసం..! అంతేతప్ప వాళ్లు చేసిన నేరం కాదు, ఆ స్కామ్ చేసిన కంపెనీ వీళ్లది కాదు… 2022లో అనుకుంటా… ఓ కంపెనీ మీరు పెట్టుబడులు […]

పదే పదే అదే సుధీర్, అదే రష్మి… అదే కావ్య, అదే నిఖిల్…

February 28, 2025 by M S R

kavya

. టీవీ షోలకు, ప్రేమాయణాలు, బ్రేకప్పులకు సంబంధించి ఏదైనా ఇష్యూ దొరికితే ఇక దాన్ని పదే పదే చూపించి, చెప్పించి పెంట పెంట చేస్తుంటారు… కావ్య, నిఖిల్ ఇద్దరూ కన్నడిగులే… కలిసి ఏదో పాపులర్ తెలుగు సీరియల్ కూడా చేశారు… ఐదారేళ్లుగా కలిసే తిరిగారు, ప్రేమబంధంలో ఉన్నారని కొందరు, లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని కొందరు రాసుకొచ్చారు, వాళ్లేమీ ఖండించలేదు… త్వరలో పెళ్లి చేసుకుంటారు అనుకునే దశలో ఏమైందో ఏమో గానీ బ్రేకప్… నిఖిల్ వైపే […]

ఫాఫం ప్రభాస్..! అదేమిటి, ఈమె అంత మాట అనేసిందేమిటి..?!

February 28, 2025 by M S R

prabhas

. సెలబ్రిటీలకు గానీ, ఇతరులకు గానీ కొన్నిసార్లు ఫ్లోలో మాటలు జారుతాయి… వాటిని ఎవరైనా గుర్తుచేసినప్పుడో, తనకే తప్పు అర్థమైనప్పుడో లేక విమర్శలు మొదలైనప్పుడో సరిదిద్దుబాటు అవసరం… బిగ్‌బాస్ ఫేమ్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి కనిపించిన ఓ రీల్ చూస్తే ఆశ్చర్యమేసింది… అందులో ఓ పెద్ద దున్న దగ్గర నిలబడి ఏదో చెబుతోంది… దేశంలోనే బాగా ఎత్తయిన, పొడవైన దున్నపోతు అన్నమాట ఇది, మంచిగున్నవ్, బాహుబలి, ప్రభాసన్న లెక్క ఉన్నవ్ దిట్టంగా… ఇవీ ఆమె మాటలు… దున్నపోతును […]

గ్రీన్‌కార్డు… అదేమీ అమృతాంజనం కాదు… తలనొప్పులున్నయ్…

February 28, 2025 by M S R

green card

. Jaganadha Rao ….. అమెరికా పౌరులే మెక్సికో, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, UK, స్పెయిన్ లాంటి దేశాలకి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వలసలు పోతున్నారు. 43 కోట్లు కడితే అమెరికా గోల్డ్ కార్డ్ (గ్రీన్ కార్డ్ తో సమానం, పౌరసత్వం కాదు) ఇస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించాడు. నిజానికి అమెరికా అనే కాదు, కెనడా మరియూ చాలా దేశాల్లో కొంత ఎమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉద్యోగాలు […]

అరుంధతి బంగ్లా కాదు… ఈ చారిత్రక భవంతి ఇక కాలగర్భంలోకి…

February 28, 2025 by M S R

నాయుడు గారి మేడ

. శంకర్‌రావు శెంకేసి (79898 76088) ….. గోదావరి తీరాన ‘నాయుడి గారి మేడ’: నేడో రేపో కాలగర్భంలోకి… దుమ్ముగూడెం.. గోదావరి తీర ప్రాంతం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు బ్రిటీష్‌ వారి ఏలుబడిలో ఉండేది. పచ్చని అడవులకు, విలువైన అటవీసంపదకు ఈ ప్రాంతం ఆలవాలం. దుమ్ముగూడెం అనగానే అందరికీ బ్యారేజీ గుర్తుకురావొచ్చు. కానీ చరిత్ర పుటల్లోకి ఎక్కని ‘నాయుడి గారి మేడ’ అనే మూడంతస్తుల మహల్‌ అక్కడ కొలువుదీరి కనిపిస్తుంది. చిక్కని […]

శబ్దం..! ఈ ఇద్దరు తారలు.. భిన్నమైన కథ.. బీజీఎం థమన్.. ప్లస్ ఫ్యాక్టర్స్…

February 28, 2025 by M S R

shabdam

. శబ్దం అంటే మ్యూజిక్ కంపోజర్ థమన్‌కు ప్రాణం… నిశ్శబ్దం అంటే అస్సలు పడదు… ఆ శబ్దం కూడా బాక్సులు పగిలేంత ఉంటేనే తనకు ఆనందం… బాలయ్య వంటి మాస్ హీరో, మాస్ కంటెంటు సినిమా దొరికితే మరింత పండుగ… కాపీలు కొడతాడు, దొరికిపోతాడు కానీ మనసు పెడితే మంచి కంపోజరే… ఈరోజు థియేటర్లలోకి వచ్చిన శబ్దం సినిమాయే దానికి ఉదాహరణ… ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ బీజీఎం… పాటలు ఉత్త డొల్ల, వదిలేయండి… కానీ […]

చిన్న వయస్సులోనే ‘పెద్ద’రికం… గానంలో, పరిణతిలో, మాటలో…

February 28, 2025 by M S R

keerthana

. చాన్నాళ్లయింది ఆ అమ్మాయి గురించి రాద్దామని..! వయస్సు 14 ఏళ్లు… తొమ్మిదో తరగతి… సింగర్… స్వస్థలం కాకినాడ… చాలామంది వర్దమాన గాయకులు పలు టీవీ మ్యూజికల్ షోలలో పాల్గొంటున్నారు… వెళ్తున్నారు… మరి ఈమె గురించే ఎందుకు చెప్పుకోవాలి…? మంచి విద్వత్తు ఉంది ఈ అమ్మాయిలో… అల్రెడీ యానిమల్ సినిమాలో ఓ పాట పాడింది… కాస్త వయస్సు పెరిగి, ఈమేరకు టోన్‌లో పక్వత వచ్చాక ఆమెకు వెండితెర స్వాగతం పలుకుతుంది… ఖాయం… ఈటీవీ పాడుతా తీయగా షోలో […]

బీమారు రాష్ట్రాలే పాలిస్తాయి ఇక… ఖచ్చితంగా దక్షిణ రాష్ట్రాలకు నష్టమే…

February 28, 2025 by M S R

delimitation

ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా చెప్పాలంటే- ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. కానీ- ఆచరణలో ఇది అంత తేలిగ్గా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అందరికీ సమానంగా ఉండదు అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. మచ్చుకు పార్లమెంటు కొత్త భవనంలో పెరిగిన కుర్చీల దగ్గర చర్చ మొదలుపెడితే అది […]

నటరాజ్ థియేటర్… లవకుశ హిస్టరీ… ఆ పాత జ్ఞాపకం కూలిపోయింది…

February 28, 2025 by M S R

natraj

. Murali Buddha ……. లవకుశులు తప్ప ఏదీ లేదు .. నటరాజ్‌.. తెలుగు సినిమాల్లో అజరామరంగా నిలిచిపోయే సినిమాల పేర్లు కొన్ని చెప్పమంటే అందులో లవకుశ ఉండి తీరుతుంది . 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో ఒక సంచలనం. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎడ్ల బండ్లను కట్టుకొని ఈ సినిమాను చూసేందుకు వచ్చేవారు. సికింద్రాబాద్‌లోని నటరాజ్‌లో ఈ సినిమా విడుదలైంది. నటరాజ్‌కు దగ్గరలో ఉన్న క్లాక్‌టవర్ పార్క్ వద్ద ఆ […]

శివపార్వతులకూ వీథుల్లో పెళ్లి ఊరేగింపులు… ఇంట్రస్టింగ్ కొత్త ధోరణి…

February 28, 2025 by M S R

asavari

. అన్ని సందేహాలూ, అన్ని ప్రశ్నలూ నెగెటివ్ పోకడతోనే కాదు… కొన్ని సకారాత్మకం… ఆలోచనాత్మకం… విషయం ఏమిటంటే..? హైదరాబాదులోనే ఒక కాలనీ, పేరు వదిలేయండి… గుడికి నాలుగు వైపులా నాలుగు కిలోమీటర్ల దాకా మైకులు పెట్టారు, లైట్లు పెట్టారు… మొన్న శివరాత్రి 12 దాటినా సరే, మైకుల మోత ఆగకపోయేసరికి… ఆ గుడి నిర్మాణానికి చందాలు ఇచ్చినవాళ్లే ఫిర్యాదులు చేశారు, పోలీసులు వస్తే గానీ మైకులు ఆగలేదు… నిర్బంధ జాగారం చేయించాలని అనుకున్నారేమో… మరుసటి రోజు రుద్రాభిషేకాలు, […]

కుంభమేళా అనంతర శుద్ధీకరణ… ఉత్సవాన్ని మించిన పెద్ద పరీక్ష…

February 27, 2025 by M S R

prayagraj

. సమ్మక్క సారలమ్మ జాతర తెలుసుగా… మన కుంభమేళా అంటుంటాం… ఒకప్పుడు గిరిజన జాతర, ఇప్పుడు జనజాతర… అందరూ వెళ్తున్నారు… కోట్ల భక్తజనం… మహాకుంభమేళాలో త్రివేణీ సంగమం… మేడారంలో జంపన్నవాగు… గతంలో రెండేళ్లకు ఓసారి, ఇప్పుడు మినీ మేడారం అని రెండేళ్ల నడుమ మరొకటీ నిర్వహిస్తున్నారు… రెగ్యులర్ భక్తులు ఇతర రోజుల్లో కూడా వెళ్తున్నారు… రెండేళ్లకోసారి జరిగే జాతర అయిపోయాక, భక్తజనం తిరిగిపోయాక… ఆ పరిసరాలు పారిశుద్ధ్య భీకరంగా కనిపిస్తాయి… మానవ వ్యర్థాలు సహా దుకాణదారులు వదిలేసి […]

భాష కమ్యూనికేషనే కాదు, ఎమోషన్ కూడా… స్టాలిన్ విమర్శ సహేతుకం…

February 27, 2025 by M S R

hindi

. భాష కమ్యూనికేషనే కాదు, ఎమోషన్ కూడా… డీఎంకే స్టాలిన్ రాజకీయ విధానాల్ని వ్యతిరేకించేవారు సైతం ప్రస్తుతం రెండు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తన పోరాటాన్ని, తన విమర్శల్ని సమర్థిస్తున్నారు… 1) జనాభా నియంత్రణ కృషికి గానూ దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని అనగా, ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తోంది… 2) హిందీ భాషను మళ్లీ మళ్లీ రుద్దే ప్రయత్నం.,. మొదట్లో తమిళనాడు మాత్రమే ఈ హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకించేది, ఇప్పుడు […]

ఫాఫం సుధీర్ బాబు… టీవీలో తన సినిమాను దేకినవాడే లేడు…

February 27, 2025 by M S R

aarna vohra

. కాశిష్ వోహ్రా… అలియాస్ ఆర్ణ వోహ్రా… పేరు ఎప్పుడూ వినలేదా..? ఫాఫం… తెలుగులో హీరోయిన్‌గా కూడా చేసింది… మా నాన్న సూపర్ హీరో అని ఆమధ్య వచ్చింది… పోసాని నాగ సుధీర్ బాబు హీరో… కాస్త పేరున్నోడే కదా… ఓ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడే కదా… హీరో మహేశ్ బాబు బావ… కాస్త వైవిధ్యం ఉన్న సినిమాలు చేస్తుంటాడని కూడా పేరుంది కదా… ఐనా తన పక్కన హీరోయిన్‌గా చేస్తే తెలుగు ప్రేక్షకులకు కనీసం కొన్నాళ్లయినా […]

డియర్ మోడీజీ… దుబయ్‌లో ఏం జరుగుతోంది… ఎనీ ఐడియా..?!

February 27, 2025 by M S R

dubai

. ఇప్పుడు మోడీ… కాదు, ఎన్నాళ్లుగానో కేసీయార్‌కు రహస్య స్నేహితుడే…. మధ్యలో ఎక్కడో ఏదో తేడా కొట్టింది… కేసీయార్‌కు కోపమొచ్చింది… బీజేపీని బజారున పెట్టాలనుకున్నాడు… మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మోడీషా ప్రయత్నిస్తున్నారని బదనాం చేయడానికి ఓ డ్రామా… ఎవరో పిచ్చి స్వాములను రంగంలోకి దింపి… ఏదో నాటకం రాశాడు… రేవంత్ రెడ్డిని వోటుకునోటు కేసులో ఇరికించడం అంత ఈజీ అనుకున్నాడు… మోడీ అంతు చూద్దామని అనుకున్నాడు… దేశం మొత్తమ్మీద పార్టీల నాయకులకు, జడ్జిలకు తలాతోకా లేని […]

బీఆర్ఎస్ క్షుద్ర రాజకీయం..! ఎందుకో తెలుసా..? మొత్తం చదవండి..!!

February 27, 2025 by M S R

slbc

. బురద రాజకీయం… క్షుద్ర రాజకీయం… ఇలాంటి పదాలెన్ని వాడినా సరే… బీఆర్‌ఎస్ ముఖ్యులు హరీష్ రావు, కేటీయార్ చేస్తున్నది అదే… కచ్చితంగా అదే… ఈ మాట ఎందుకు అంటున్నానంటే కాస్త సీరియస్‌గా, చివరి దాకా చదవండి… ఎస్ఎల్‌బిసి ప్రమాదం నిజంగా ఎందుకు జరిగిందో తెలుసా..? 8 మంది విషయంలో ఆశలు ఎందుకు వదిలేసుకున్నామో తెలుసా..? కేసీయార్..! SLBC పనులు మొత్తానికే ఆపేశాడు… కారణం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కమీషన్లు భారీగా రావడం లేదు కాబట్టి అనే […]

స్వభాషాభిమానం… డీఎంకేకు మళ్లీ అందివచ్చిన హిందీ వివాదం…

February 27, 2025 by M S R

hindi

. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె రాజకీయ ప్రయోజనాలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ఉండవచ్చు. ప్రతిపాదిత పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను కూడా ఆ ఉద్యమానికి అగ్గికి ఆజ్యం పోసినట్లు కలిపి ఉండవచ్చు. హిందీ విషయం ఎలా ఉన్నా… పార్లమెంటు సీట్ల పునర్విభజన జరిగి… దక్షిణాదిలో పార్లమెంటు సీట్లు తగ్గి… ఉత్తరాదిలో గణనీయంగా పెరిగితే దక్షిణాదికి జరిగే అన్యాయం అంతా ఇంతా కాదు. దీని మీద విస్తృత చర్చ జరగకపోతే, మేల్కొనకపోతే, సంఘటితంగా పోరాడకపోతే జరగబోయే నష్టం […]

నిజంగానే డీఎంకేను ఓడించగలిగితే ప్రశాంత్ కిశోర్ తోపు స్ట్రాటజిస్టు

February 27, 2025 by M S R

prasant kishore

. Siva Racharla ………. విజయ్ కిషోర్ …. 2017 జులై 8 న జరిగిన వైసీపీ ప్లీనరీలో తొలిసారి ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా కనిపించారు.. జగన్ మోహన్ రెడ్డి ఆయన్ను వైసీపీ నేతలకు కార్యకర్తలకు పరిచయం చేశారు.. మళ్ళీ ఎనిమిదేళ్ల తరువాత అలాంటి పరిచయమే నిన్న జరిగింది.. నటుడు విజయ్ స్థాపించిన “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) తొలి వార్షికోత్సవ సభలో విజయ్ ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా […]

పరీక్షలకు అట్ట కలిగి ఉండటమే పేదరికానికి పెద్ద పరీక్ష…

February 26, 2025 by M S R

pad

. Mohammed Khadeerbabu ……… పరీక్ష అట్ట … నాలుగు మూలలూ కూసుగా ఉన్న అట్ట ఎవరి దగ్గరా ఉండేది కాదు. బతుకును బట్టి మూలలు. ఒకటి అరిగి, రెండు అరిగి, నాలుగూ అరిగి, అరిగి.. అరిగి… పరీక్షలకు అట్ట కలిగి ఉండటమే పెద్ద పరీక్ష. కోపాలూ తాపాలూ సంతోషాలూ రహస్యాలూ… దాని మీదే. పెన్ను రాస్తుందా లేదా రాసి చూడటం. విదిలించి రాసే ఇంకు పెన్నయితే దాని మీదే విదిలించడం. రఫ్‌వర్క్‌ దాని మీదే. ఇంపార్టెంట్‌ కొసెన్ల […]

అప్పట్లో సిటీలో శివరాత్రి జాగారం కూడా ఓ సామూహిక ఉత్సవం..!!

February 26, 2025 by M S R

ntr

. Murali Buddha …… శివరాత్రి ఓ మధుర జ్ఞాపకం: ఉదయం బడిపంతులు, రాత్రి నర్తనశాల… శివరాత్రి జాగారానికి ఏం ఏర్పాటు చేస్తున్నారు? ఈ రోజుల్లో ఇలాంటి ప్రశ్న వేస్తే అలా అడిగినవారిని చిత్రంగా చూడాల్సి వస్తుంది. మరో లోకం నుంచి వచ్చినట్టు చూసినా ఆశ్చర్యం లేదు. ఈ రోజుల్లో ప్రతిరోజు జాగారమే. ప్రత్యేకంగా జాగారం ఏర్పాట్లు ఎందుకు..? కాలం మారింది… ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేదు… రోజంతా నగరం మేల్కొనే ఉంటున్నది. అయితే టీవీ, లేదంటే […]

  • « Previous Page
  • 1
  • …
  • 93
  • 94
  • 95
  • 96
  • 97
  • …
  • 376
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions