.
నిజానికి ఆసక్తికరమైన తాజా వార్తే ఇది… కానీ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాలేదు… ఐక్యరాజ్యసమితిలో చైనా, పాకిస్థాన్ కలిసి ఓ ప్రతిపాదన పెట్టాయి… వోటింగులో దెబ్బతిని బోల్తాకొట్టాయి… బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం సాయుధ, గెరిల్లా పోరాటం చేస్తున్న రెండు సంస్థలను (బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్) ఉగ్రవాద గ్రూపులుగా ముద్ర వేయాలని వాటి సంయుక్త తీర్మాన ప్రతిపాదన సారాంశం…
చైనా- పాకిస్థాన్ అసలు ఉద్దేశం వేరు… ‘విదేశీ మద్దతుతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న బెలూచిస్థాన్ సంస్థలు’ అని ఆ తీర్మాన ప్రతిపాదనల్లో పదజాలం వాడి, ఆ విముక్తి పోరాటానికి ఇండియా సహకరిస్తోందనే వాదనతో, ఇండియా మీద ‘ఉగ్రవాద సహాయదేశం’ అనే ముద్ర వేయాలనుకున్నాయి… ప్రపంచంలో ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్థాన్, అనేకానేక ఉగ్ర సంస్థలకు అడ్డా అది… అలాంటిది తనే ఇండియా మీద ఉగ్రవాద సహాయ దేశం అనే ముద్ర వేయదలిస్తే… ఆ ఆటలకు ఎదురుదెబ్బ తగిలింది… ఈమధ్య పాకిస్థాన్ కొమ్ముకాస్తున్న అమెరికా కూడా దానికి మద్దతు పలకలేదు…
Ads
ఈ విషయంలో పాకిస్థాన్ ద్వంద్వ పోకడల్ని ఫ్రాన్స్, యూకేలకు ఇండియా సరిగ్గా వివరించగలిగింది… దాంతో అవి కూడా పాకిస్థాన్- చైనా కుట్రలను అర్థం చేసుకుని, అవీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాయి… చైనా- ఇండియాల పట్ల మిత్రవైఖరిని కలిగిన రష్యా సైలెంటుగా ఉండిపోయింది… దీంతో వోటింగులో పాకిస్థాన్ తీర్మానం వీగిపోయింది… ఒకరకంగా ఇండియా దౌత్య విజయం ఇది…
పాకిస్థాన్ నుంచి వేరుపడాలనేదే బెలూచిస్థాన్ పోరాటం… సో, ఆ దేశానికి కోపం ఉండటంలో ఆశ్చర్యం లేదు, అసాధారణమూ కాదు… కానీ చైనా..? దానికి సీపీఈసీ ముఖ్యం… అంటే చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్… బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ముఖ్యం…
అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్ పోర్టును చైనా భవిష్యత్ వ్యూహాత్మక కేంద్రంగా చూస్తోంది… వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది… కానీ బెలూచ్ తిరుగుబాటు గ్రూపులు ఈ ప్రాజెక్టును “వనరుల దోపిడీ”గా అభివర్ణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి…
బెలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని ప్రత్యేక విభాగమైన మజీద్ బ్రిగేడ్ గత కొన్నేళ్లుగా కేవలం పాకిస్థాన్ భద్రతా బలగాలనే కాదు, చైనా లక్ష్యాలపైనా దాడులు చేస్తున్నాయి… చైనా ఇంజినీర్లు, చైనా కంపెనీలు, చైనా ప్రాజెక్టులు వారి టార్గెట్‌గా మారుతున్నాయి… దాంతో బెలూచిస్తాన్ సమస్య పాకిస్థాన్ అంతర్గత వ్యవహారం నుంచి నేరుగా చైనాకు ఓ భద్రత సమస్యగా మారిపోయింది…
పాకిస్థాన్ కోరుకున్నట్టు బెలూచ్ సంస్థల్ని ఉగ్రవాద గ్రూపులుగా పేర్కొంటూ తీర్మానం చేసి ఉంటే, భవిష్యత్తులో బెలూచ్ ఉద్యమాన్ని అంతర్జాతీయంగా ఉగ్రవాద ఉద్యమంగా చిత్రీకరించేందుకు ఇస్లామాబాద్‌కు బలం దొరికేది… బెలూచ్ సంస్థలకు మద్దతు ద్వారా ఇండియా ఉగ్రవాదానికి సహకరిస్తున్నది అంటూ ఇండియా మీద ముద్ర వేసేది… చైనాకు కూడా అదే కావాలి…
కానీ అమెరికా తోసిపుచ్చింది… అల్ ఖైదా, ఐఎస్ఐ వంటి సంస్థలతో బెలూచ్ విముక్తి పోరాట సంస్థల్ని ఒక్క గాటన కట్టలేమని పేర్కొంటోంది… (చైనా ప్రాజెక్టులపై దాడులు దానికీ సంతోషమేగా)… వెరసి ఐరాస వేదిక మీద భంగపడింది..!!
Share this Article