Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందరూ ఉద్దండులే… ఓ నవలను సరిగ్గా సినిమాకరించలేక చతికిల…

July 6, 2024 by M S R

ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల బంగారు కలలు ఆధారంగా నిర్మించబడింది 1974 లో వచ్చిన ఈ బంగారు కలలు సినిమా . 1960s , 1970s యద్దనపూడి సులోచనారాణి , మాదిరెడ్డి సులోచన , కోడూరి కౌసల్యాదేవి , వాసిరెడ్డి సీతాదేవిల హవా . ఆహ్లాదకరమైన కుటుంబ కధా చిత్రాలు . పడుచు పిల్లలకు స్వప్న లోకాన్ని అందించాయి . పడవ కారు రాజశేఖరం , ఆజానుబాహులయిన కథానాయకులు , వగైరా . 1980s యండమూరి వీరేంద్రనాధ్ హవా . చిరంజీవి కోసమే వచ్చాయా అనిపించే నవలలు .

ఈ బంగారు కలలు సినిమాకు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణ వహీదా రెహమానే . 1955 లో రోజులు మారాయి , జయసింహ సినిమాల్లో మెరిసి మాయమయపోయిన వహీదా 19 ఏళ్ల తర్వాత తెలుగులో నటించిన మొదటి సినిమా . ఊర్వశి పురస్కారం , 1972 లో పద్మశ్రీ పురస్కారం , 2006 లో ఆం.ప్ర . ప్రభుత్వ NTR అవార్డు , 2011 లో పద్మ భూషణ్ , 2021 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను పొందింది .

సినిమా ఎలా ఉందని చూసొచ్చాక ఎవరయినా అడిగితే గూడ్సు బండి లాగా ఉందని చెప్పేవాళ్ళం . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టివిలో కూడా వచ్చేది . ఆ రోజుల్లోనే గూడ్సు బండి . ఇంక ఈరోజుల్లో ప్రేక్షకులకు ఆనుద్దా !?

Ads

నవలల్ని సినిమాలకు అనుగుణంగా మలచటం కష్టమే . నవల , సీరియల్స్ తీరిగ్గా చదివేవి . సినిమా మూడు గంటల్లో టకాటకా అయిపోవాలి . ఉద్దండులు ఆదుర్తి , దుక్కిపాటి సినిమాకు అనుగుణంగా మలచలేక పోయారేమో అని అనిపించింది నాకు .

ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం లోని శ్రావ్యమైన పాటలు . బాగా హిట్టయ్యాయి . సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారూ కలలే కంటున్నారా , పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి , చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా , నాలోన వలపుంది మీలోన వయసుంది , నీ కన్నులలో నే చూసానులే , సన్నగా సన సన్నగా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . మంచితనానికి తావే లేదు అనే విషాద గీతం కూడా బాగానే ఉంటుంది .

ANR , లక్ష్మి , వహీదా రెహమాన్ , SVR , కాంతారావు , రాజబాబు , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , గిరిబాబు , సూరేకాంతం ప్రభృతులు నటించారు . హాస్య నటి మమతకు మొదటి సినిమా ఇదే అనుకుంటా .

యూట్యూబులో ఉంది . సినిమా స్లో అయినా , చూడతగ్గ సెంటిమెంటల్ మూవీ . వహీదా రెహమాన్ అభిమానులయితే తప్పక చూడాల్సిందే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. By     డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాటి స్టార్ హీరోయిన్ మాలశ్రీ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తున్నదంటే…?
  • అమెరికాలో అదానీ కేసు వింత ‘సెటిల్మెంట్’ కథ ఇదీ…
  • అధికారమే పరమావధి… ఓ జర్నలిస్టుకు అనుభవంతో తత్వబోధ
  • చట్టిలో సరుకేదో నింపుకెళ్లు… భువనచంద్రుడూ వేటూరికి తీసిపోడు…
  • పాపం సాయి భగీరథ్… ఆంధ్రజ్యోతికి కన్నీళ్లొక్కటే తక్కువ…
  • అయోధ్యకు బాలీవుడ్ డబ్బు… సెలబ్రిటీల భారీ పెట్టుబడులు…
  • ఎర్రన్నలు మొత్తుకుంటుంటారు కదా… చైనాలో ప్రెస్ ఫ్రీడమ్ తెలుసా..?!
  • ఎబోలా…! ఏమో, అజాగ్రత్తగా వదిలేస్తే మరో కోవిడ్..? అసలే ప్రాణాంతకం..!!
  • Virat Kohli … ఇప్పటికే అదే జోష్… అదే టెంపర్‌మెంట్… తగ్గేదేలే…
  • అపరిపక్వత, పిరికి, కుళ్లు, అసూయ…ఇజ్జత్ పోగొట్టుకున్న రజినీకాంత్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions