Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రక్తికట్టని చరణ్ రీఎంట్రీ సీన్! బిగ్‌బాస్ టీమ్ పూర్ స్క్రిప్ట్ రైటింగ్!!

September 17, 2026 by M S R

.

బిగ్‌బాస్ టీమ్ తామొక్క గొప్ప సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాం, ట్విస్టు అదిరిపోయింది, ఇక ప్రేక్షకులు గమ్మత్తుగా చిత్తయిపోతారు, ఈ దెబ్బకు రేటింగ్స్ రివ్వుమని ఎగుస్తాయి అని భ్రమించినట్టుంది పాపం… పది సీజన్లుగా చూసీ చూసీ సగటు బిగ్‌బాస్ ప్రేక్షకుడికి చాలా తెలుసు, అన్నీ ముందే ఊహించేస్తారు కూడా…

అందుకని చరణ్‌ను హౌజులోకి ప్రవేశపెట్టడం పెద్ద సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఏమీ కాలేదు… పైగా ఆ సీన్ క్రియేషన్ కూడా అపరిపక్వంగా ఉంది… నవ్వొచ్చింది… షో స్టార్టయి మూడు రోజులు కూడా కాకముందే చరణ్‌ను సిల్లీ రీజన్స్‌తో ఎలిమినేట్ చేయడమే రాబోయే మరో ట్విస్టుకు సంకేతం అని అందరూ గ్రహించిందే…

Ads

బయటికి వచ్చాక శివాజీ ఇంటరాగేషన్ లేదు కదా, అందరికీ అర్థమైంది రీఎంట్రీ ఉంటుందని… ఏ మృత్యు సైనికులైతే తీసుకుపోయారో వాళ్లే వచ్చి అప్పగించిపోయారు… కాకపోతే ఓ సెట్ వేశారు, స్మశానంలాగా… నాలుగు శవపేటికలు…

దాన్ని ఓపెన్ చేయమన్నారు, షాలిని ఓపెన్ చేసింది, అంతే, నువ్వు మాతోరా అన్నట్టుగా గేటు వైపు తీసుకుపోయారు… కాసేపు సస్పెన్స్, తరువాత ఇదేదో వైల్డ్ కార్డ్ ఎంట్రీయో, ఎవరో రీఎంట్రీయో అనుకుని ఆమె తన ముసుగు తీసేయడంతో చరణ్ ప్రత్యక్షం…

ఈమాత్రం దానికి శవపేటిక తెరవడం దేనికి..? దానికీ రీఎంట్రీకి లింక్, సింక్ మన్నూమశానం ఏమీ కుదర్లేదు… ఇంకాస్త బెటర్ రైటింగ్ అవసరం స్క్రిప్టుకు..! అవునూ, మరి చైత్రను కూడా అలాగే మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు కదా… ఆమె సంగతేమిటి..? అదీ కొంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు… ఆమె ఇంటర్వ్యూలు గట్రా ఏమీ రాలేదు బయట, ఎలిమినేషన్ తరువాత..!

bb10

నిజానికి హౌజ్ మేట్స్ కూడా అనుకుంటున్నదే చరణ్‌ను మళ్లీ ప్రవేశపెడతారని… ఎదురుచూస్తున్నారు కూడా! కెప్టెన్సీ టాస్కులో దేబ్‌జానీ బాగా ఆడింది, ఆమే కన్నీళ్లు పెడుతూ చెప్పినట్టు… నసీబ్‌ రాసిలేదు… త్రిగుణ్, రోహిత్, రాంప్రసాద్, ఝాన్సీ, అమన్ హైలైట్ అయ్యారు… మరో లెవల్ ఉందట టాస్కులో… ఎటొచ్చీ ఆ వంశీ గడ్డం, మొహం, అరుపులే చికాకు పుట్టిస్తున్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions