Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దిక్కుమాలిన సంత – యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను ?

September 23, 2026 by M S R

.

సిగ్గూశరం లేవు… అఫ్‌కోర్స్, అవి లేకపోతేనే వాడిని బిగ్‌బాస్ అంటారు…ఈ సీజన్ మరీ దిక్కుమాలిన బాటలో వెళ్తోంది… చివరకు ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌నే వెక్కిరిస్తూ, కెమెరా ముందు ఫోజులు పెడితే, ఆ బిగ్‌బాస్‌కు ముందే చెప్పుకున్నట్టు సిగ్గూశరం లేవు…

ఎలాగంటే..,? వంశీ… ఆ గడ్డం, ఆ చూపు, ఆ లుక్కు అస్సలు బాలేవు, ఇరిటేటింగ్ కూడా… తనకు తోడు త్రిగుణ్ అని మరో చిత్రమైన కేరక్టర్… మనిషికి ఉండే అరిషడ్వర్గాల్లో క్రోధం, మదం, మాత్సర్యం… ఈ మూడు గుణాలూ, అంటే ఆ త్రిగుణాలూ కలబోసినట్టున్నాడు…

Ads

ఆ భాష, ఆ మాట, ఆ ధోరణి… అన్నీ అంతే… ఓ ఉదాహరణ… ఏదో ఓచోట షాలిని, అమన్ మాట్లాడుకుంటుంటే కెప్టెన్ ఝాన్సీ మందలించలేదని బిగ్‌బాస్ అనేవాడు ఆ తప్పు చేసిన వాళ్లను కాదని, పట్టుకోలేని జైలర్‌కు మూడు రోజులపాటు క్లీనింగ్ శిక్ష విధించాడు… అసలు మెంటల్ కేసు బిగ్‌బాసే…

సరే, స్ట్రాంగ్ కంటెండర్ కాబట్టి అందరూ ఆమెనే టార్గెట్ చేస్తున్నారు, మరీ ఈ వంశీ, త్రిగుణ్ ఆమెను పురుగులా తీసిపారేస్తున్నారు… ఓ దశలో కిచెన్‌లో మాట్లాడుకుంటుంటే, మీరు మాట్లాడకండి అని చెప్పింది ఆమె… మేం మాట్లాడతాం, అవసరమైతే బిగ్‌బాస్ చెప్పాడు కదా, టేపు పంపించుమను, మూతులకు అడ్డంగా అతికించుకుంటాం అని అడమెంటుగా మాట్లాడారు వాళ్లు…

ఝాన్సీ పట్ల ఎగతాళి… ఆమె చెప్పీ చెప్పీ ఇక బిగ్‌బాస్‌కే చెప్పింది టేపు పంపించమని… ఆ మూర్ఖులకు అర్థం కానిదేమిటంటే..? టేపులు అతికించుకొండి అనేది సెటైరిక్ ఆదేశం… మాట్లాడకండర్రా అని చెప్పడం… ఆ మూర్ఖ కేరక్టర్లకు అర్థం కాలేదు కదా, నిజంగానే టేపు పంపించాడు… అది మూతులకు అతికించుకున్నారు, బిగ్‌బాస్‌కు కెమెరా ఎదుటకు వచ్చి అక్షరాలా వెక్కిరించారు…

నిజంగానే…. యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను… ఎక్సెంట్రిక్ ఫెలోస్… మొన్నటిదాకా నిరాసక్తంగా ఏదో ఉన్నదంటే ఉన్నదన్నట్టు కనిపించిన సృష్టి అకస్మాత్తుగా విజృంభించింది… కెప్టెన్సీ టాస్కులో గెలిచింది… తెరపై కనిపిస్తోంది…

సృష్టి

ఏదో తిప్పలు పడుతోంది, హౌజులో కొనసాగడానికి… వోటింగు చూస్తే వంశీ, వర్షిణి, ఝాన్సీలకు తక్కువ వోట్లు పడుతున్నాయి, ఝాన్సీ ఏ ఆదిరెడ్డినో ఎంగేజ్ చేసుకోలేదు కదా… అందుకని గుంటనక్క అనే ముద్రలు, నెగెటివ్ ప్రచారాలు…

చూడబోతే త్రిగుణ్ గెలిచినా ఆశ్చర్యం లేదు అన్నాడో మిత్రుడు… నిజమే, అలాంటి కేరక్టర్లే బిగ్‌బాస్‌కు కావాలి… అందుకే చరణ్, సుధీర్, రోహిత్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు… దీంతో పాపం, అమన్, రాంప్రసాద్, నరేష్ వెనుకబడిపోతున్నారు… బట్ ఏమాటకామాట, ఈరోజుకూ ఆటకు తగినట్టు కనిపిస్తోంది దేబ్‌జానీ మాత్రమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!
  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…
  • పిచ్చి స్క్రిప్టుతో అభాసుపాలు – ఇప్పుడు దిద్దుబాటుకు మరో ప్రయాస
  • డియర్ చంద్రబోస్, ఓ నాలుగు రోజులు చల్లగరిగెలో ఉండి రావచ్చుగా…
  • Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!
  • నిషా నూర్‌..! ఈమెదీ సిల్క్ స్మిత కథేనా..? డర్టీ పిక్చర్‌-2 అదేనా..?
  • ఘర్షణ వద్దు – అదెటు దారితీస్తుందో ఎవరూ చెప్పలేని రోజులివి !!
  • FSD … మస్కా కాదు, మస్క్ మార్క్ ఆటో పైలట్ Tesla కారు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions