.
నిస్సారం, నిస్తేజం, నిర్లిప్తం, నిరాసక్తం… ఏ పేరైనా పెట్టుకొండి… బిగ్‌బాస్ 10 సీజన్ ఆదిలోనే గాడితప్పింది… చివరకు వీకెండ్ సండే నాగార్జున షో కూడా మరీ ఇంత పేలవంగా ఉండటం ఊహించలేదు… చాలా నిరాశపరుస్తోంది ఈసారి బిగ్‌బాస్ సీజన్… నాగార్జున కూడా డల్‌గా ఉన్నాడు…
కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు… ఊహించిందే… ఒకటీరెండు వారాలకు మించి హౌజులో ఉండలేడని… నిజానికి మొదటి వారంలో చైత్ర ఎలిమినేషన్ కరెక్టు కాదు… ఆమెను ఉంచాల్సింది, ఆమె బదులు సృష్టిని పంపించేయాల్సింది… ఐనా లాజిక్ ప్రకారం వ్యవహరిస్తే అది బిగ్‌బాస్ టీమ్ ఎందుకవుతుంది…!
Ads
నిజానికి కృష్ణుడిని ఎంపిక చేయడమే పొరపాటు… తను ఈ ఆటకు సూట్ కాడు… తన స్థూలకాయం కాదు సమస్య, తన వ్యక్తిగత వ్యవహార ధోరణే దీనికి ఆప్ట్ కాదు… బిగ్‌బాస్‌కు దూకుడు కావాలి, మానిప్యులేషన్ కావాలి, పదే పదే తెరపై కనిపించే యాక్టివిటీ కావాలి… తప్పో ఒప్పో జానేదేవ్ యాక్టివ్‌గా ఉండాలి… కృష్ణుడు అలా ఉండలేడు…
టాస్కుల్లో ఎలాగూ వీక్… సో, ఈ ఎలిమినేషన్‌ను తప్పుపట్టాల్సిన పనిలేదు… లక్కీగా సృష్టి కూడా ఎస్కేప్‌డ్…. సండే మాత్రమే కాదు, వీకెండ్ రెండు రోజులూ కాస్త ఫన్ ఉండాలి షోలో… ఈసారి దరిద్రంగా మేనిప్యులేర్, పప్పెట్ ఫార్ములా ఏదో తీసుకుని, ఎవరెలాంటి వాళ్లు అని చర్చించడానికే రెండురోజులు గడిచిపోయింది… అదేమో పరమ బోర్…
ఏదో మాటవరుసకు, మరీ బాగుండదులే అని ఝాన్సీతో ఓపాట, ముకేష్-దేబ్‌జానీతో ఓ డ్యూయెట్, వర్షిణి-చరణ్‌తో మరో డ్యూయెట్… అంతే రెండు రోజుల షో మట్టిలో కలిసిపోయింది… అస్సలు కంటెస్టెంట్లలో జోష్ లేదు… పొట్టి నరేష్, ఆటో రాంప్రసాద్ ఉన్నారంటే ఉన్నారు షోలో… అంతే…
ఆయనెవరో తన వీడియోల్లో పదే పదే ఝాన్సీని గుంటనక్క అని ప్రస్తావిస్తున్నాడు… చిల్లర అవగాహన… ఆమె కన్నింగ్ కాదు, షోఆఫ్ కాదు… ఎవరూ ఇక్కడ గుంటనక్కలు కాదు, ఎవరి గేమ్ వాళ్లదే… ఈ ముద్రలు దేనికి..? అందుకే ఝాన్సీ తల్లి ఒక్కొక్కడినీ బూతులు తిడుతోంది…
క్లిక్ అవుతుందా లేదానేది వేరే విషయం… ఝాన్సీకి తనకంటూ ఓ గేమ్ ప్లాన్ ఉంది, కెప్టెన్సీ టాస్క్ చివరలో కూడా ఆమె ఆటను, తన ప్రతిభను మాత్రమే కాదు, అందరూ టార్గెట్ చేస్తుంటే ‘మీకేం కావాలి’ అని ప్రలోభాలు విసిరి ఇద్దరిని పడేసింది… అది తెలివి… మోసం కాదు… ఇక్కడే ఆమెను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సోకాల్డ్ డెయిలీ రివ్యూయర్లు…
ఈసారి సీజన్‌లో బలమైన కంటెండర్లలో ఒకతి దేబ్‌జానీ… మగ పురుషుల్లో రోహిత్, త్రిగుణ్, ముకేష్‌లు టఫ్ కంపిటీషన్ ఇస్తారు… రాబోయే వారాల్లో ఈ షో ఇలాగే ఉంటే మాత్రం గతంలో ఎన్నడూ లేనట్టు చాలా పూర్ రేటింగ్స్ మాత్రం ఖాయం..!!
Share this Article