.
ఈటీవీ ప్రభాకర్ కూతురు అట… పేరు దివిజ… బ్రహ్మా ఆనందం సినిమాకు ఆమె ఫోటోను కవర్ ఫోటోగా పెట్టడానికి కారణం ఏమిటంటే..? ఆమె తప్ప సినిమాలో ఎవరూ ఇంప్రెసివ్ నటన కనబరచలేెకపోయారు… ఎస్, ఇంక్లూడింగ్ బ్రహ్మానందం…
కాకపోతే తన తప్పేమీ లేదు… ఇలాంటి పాత్రలు తనకు జుజుబీ… తన అనుభవం, తన మెరిట్ గురించి పదే పదే చెప్పుకోనక్కర్లేదు… కానీ తను చేస్తే రంగమార్తాండ వంటి ఫుల్ ఎమోషనల్ పాత్రలైనా చేయాలి లేకపోతే ఫుల్లు కామెడీ పాత్రయినా చేయాలి… అటూఇటూ కాని బ్రహ్మా ఆనందం పాత్ర మాత్రం చేయకూడదు…
Ads
ఆ పాత్ర కేరక్టరైజేషన్, ప్రజెంటేషన్ బాగోలేక అంతటి బ్రహ్మానందం నటనలో కూడా పెద్ద స్పార్క్ కనిపించలేదు… తెలుగు వెండి తెర మీద ఉన్నతమైన కెరీర్ అనుభవించాడు తను… తెలుగు హాస్యానికి తను ఓ ఐకన్ అయ్యాడు… అందుకని తన స్థాయిని దిగజార్చే ఏ పాత్రనూ ఇక తను యాక్సెప్ట్ చేయకూడదు…
ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు, ఇప్పుడు వెన్నెల కిషోర్‌లాగా… తరువాత బ్రహ్మానందం నటనలో మొనాటనీ వచ్చింది… చూసీ చూసీ జనానికి మొహం మొత్తింది… సినిమాల్లో అవకాశాలు తగ్గాయి… కాదు, ఆగిపోయాయి… సరిగ్గా ఈ సమయంలోనే తను జాగ్రత్తపడాలి… తనకు కావల్సింది రంగమార్తాండలు, అంతేగానీ బ్రహ్మా ఆనందాలు కావు…
ఇక దివిజ విషయానికి వస్తే మంచి ఈజ్ ఉంది, మంచి రోల్స్ పడితే మంచిగా రాణిస్తుంది… ప్రియ వడ్లమాని సినిమాలో ఫిమేల్ లీడ్… వోకే… ఫస్టాఫ్ పర్లేదు, సెకండాఫ్‌లో కనిపించిన ఐశ్వర్య హోలక్కల్ పెద్దగా నటించడానికి కూడా అవకాశమివ్వని పాత్ర ఆమెది… చెప్పాల్సింది తాళ్లూరి రామేశ్వరి…
మంచి రోల్ పడితే ప్రేక్షకుడిని కనెక్టయ్యేలా నటించగలదు… కానీ దర్శకుడు ఆ చాన్స్ ఇస్తే కదా… వెరసి బ్రహ్మానందం, తాళ్లూరి రామేశ్వరి పేలవమైపోయారు… వెన్నెల కిషోర్ వోకే… రాజీవ్ కనకాల వేస్ట్… గౌతమ్ అనగా, బ్రహ్మానందం కొడుకు ఇంకా నటనలో నేర్చుకోవల్సింది బోలెడు ఉంది… ప్రత్యేకించి డైలాగ్ డెలివరీ…
కథలోనే లోపాలున్నాయి… కథనంలో ఇంకా ఎక్కువ లోపాలున్నాయి… దర్శకుడు సరైన కసరత్తు చేయనట్టున్నాడు… ఫలితంగా బ్రహ్మానందాన్ని ఎలా వాడుకోవాలో తెలియక దర్శకుడు చివరకు చేతులెత్తేశాడు క్లైమాక్సులో…
పోనీ, సంగీతం..? పూర్..! నిజానికి ఈ సినిమాను ఏ కాస్త రక్తికట్టేలా చిత్రీకరించినా… ఎలాగూ లైలా డిజాస్టర్ కాబట్టి, మార్కెట్‌లో పెద్దగా (తండేల్ మినహా) వేరే పెద్ద సినిమాలు లేవు కాబట్టి, ఈ బ్రహ్మా ఆనందానికి కాస్త ఆనందం కలిగేలా వసూళ్లు ఉండేవి… ఆ చాన్స్ మిస్…
అటు లైలా ఇటు బ్రహ్మా ఆనందం… రెండింటికీ చిరంజీవి ప్రమోషన్ చేశాడు… ప్చ్, రెండూ సో సో… సెకండాఫ్ మీద కాస్త ఎక్సర్‌సైజ్ చేసి ఉంటే, కథ దారితప్పకుండా ఉంటే, ముసలి జంట ప్రేమకథను మరీ నిస్సారంగా మార్చకుండా ఉంటే… బ్రహ్మకి ఆనందం మిగిలేదేమో…!!
Share this Article