.
పొద్దున్నే వెలుగు పేపర్ తిరగేస్తుంటే, ప్రధానంగా కనిపించిన వార్త ఏమిటంటే..? కేటీయార్ మాటలు ‘‘వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి, లక్ష క్యూసెక్కులు గోదావరిలో వరద వస్తోంది, పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయండి, లేకపోతే ఊరుకోం, యాభై వేల మంది రైతులతో వచ్చి పంపులు మేమే ఆన్ చేస్తాం కేసీయార్ నాయకత్వంలో… మామీద కక్షతో రైతులను శిక్షించకండి..’’
ఇలా సాగిపోయింది, అదే వార్త… దాని పక్కనే ఉత్తమకుమార్ రెడ్డి వివరణ… ‘‘డొల్ల మాటలు వద్దు, NDSA చెప్పింది అన్నారం, సుందిళ్ల బరాజుల పరిస్థితి బాగోలేదు, నీటిని ఎత్తిపోసినా, నిల్వ చేసినా ప్రమాదం, ఆల్రెడీ మేడిగడ్డను కుంగబెట్టారు, లక్ష కోట్లు గోదాట్లో పోశారు, రిపేర్లు చేస్తే తప్ప, కేసీయార్ చేసిన బ్లండర్స్ సరిదిద్దితే తప్ప నీటిని ఎత్తిపోయడం కుదరదు…’’
Ads

పక్కపక్కన వార్తలు ఇవి రెండూ… పొద్దున అవి చదివాక ఎక్కడో కొట్టేస్తోంది… ఎక్కడో విన్నాను, ఎక్కడో చదివాను, సేమ్ టోన్, సేమ్ కంటెంట్, సేమ్ డైలాగ్… కన్నెపల్లి, రైతులతో ముట్టడి, కేసీయార్ నాయకత్వం… వెతకగా వెతకగా దొరికింది… అదే వెలుగు పత్రిక పాత సంచికల్లోకి, వెనక్కి వెళ్లగా వెళ్లగా… సరిగ్గా ఏడాది క్రితం… అవును, ఒకటే రోజు తేడా… ఇలా కనిపించింది…

సేమ్… పంపులు మీరు ఆన్ చేయకపోతే మేమే కేసీయార్ నాయకత్వంలో లక్ష మందితో వస్తాం, ఆన్ చేస్తాం, మాపై కక్ష ఉంటే రైతులకు ఎందుకు శిక్ష? వారం రోజులు టైమిస్తున్నా… ఇదే టోన్, ఇదే డైలాగ్, ఇదే కంటెంట్… సరిగ్గా ఏడాది క్రితం… ఒక్కటే తేడా… ఇప్పుడు కేటీయార్, అప్పుడు హరీష్ రావు… సేమ్ టు సేమ్… అదే స్క్రిప్టు…
సేమ్, ఉత్తమకుమార్ రెడ్డి ఆరోజు కూడా అదే చెప్పాడు… పంపులు ఆన్ చేయడం కుదరదు, అన్నారం- సుందిళ్ల రిపేర్ చేయాల్సిందే, మేడిగడ్డను ఎలాగూ కుంగబెట్టారు, రాజకీయాలు చేయకండి, మీరేమైనా ఇంజినీర్లా? NDSA చెప్పేదాకా కుదరదంటే కుదరదు…

అప్పటికి ఇప్పటికీ అదే మంత్రి వివరణ… కాకపోతే బీఆర్ఎస్‌లోనే పోర్ట్‌ఫోలియో మారింది… గతంలో ఇరిగేషన్ సబ్జెక్టు హరీష్ రావు చూసేవాడు, పాత సాగునీటి మంత్రి కదా… నో, నో, ఇక నువ్వు చాల్లే, నేను మాట్లాడతాను, నేనే పగ్గాలు తీసేసుకున్నాను… అన్నట్టుగా హరీష్ రావు అదృశ్యమైపోయి కేటీయార్ ప్రత్యక్షం… అంతే తేడా… (కేసీయార్ బయటికొచ్చి రైతులతో వెళ్లి పంపుహౌజ్ మోటార్లు ఆన్ చేస్తాడనేదే నవ్వొచ్చే ఈ ప్రహసనంలో హైలైట్ పాయింట్)
సరే, సరిగ్గా ఏడాది తరువాత… అంటే 2027 జూలై మొదటివారంలో… అదే కన్నెపల్లి పంపులు మేమే కేసీయార్ నాయకత్వంలో లక్షలాదిగా వచ్చి ఆన్ చేస్తాం అంటుంది బీఆర్ఎస్… (అప్పటివరకు మూడు బరాజుల రిపేర్లు పూర్తి గాకపోతే మాత్రం ఉత్తమకుమార్ రెడ్డి సేమ్ అదే వివరణ ఇస్తాడు…) ఐతే వచ్చేసారి హరీష్ రావు వస్తాడా, అప్పటికి ఇక తనను పూర్తిగా సైడ్ లైన్ చేసేస్తారా..? కేటీయారే మళ్లీ జై కన్నెపల్లి అని బయల్దేరుతాడా చూడాలి…
(మునిగిన కన్నెపల్లి పంప్ హౌజ్)
రిలీఫ్ -1 … టీఆర్ఎస్ అధినేత్రి అక్కకు ఎందుకో కన్నెపల్లి యాదికి రాలేదు… లేకపోతే కేటీయార్‌కన్నా ముందే బయల్దేరిపోయేది… ఇప్పుడు అది తప్పినట్టే…
రిలీఫ్-2 … కేటీయార్ మరిచిపోయాడు, హరీష్ రావు అయితే అలవోకగా అనేసేవాడు, రేవంత్ రెడ్డి గురుదక్షిణగా గోదావరి నీళ్లను ఎత్తిపోయకుండా, చంద్రబాబు కోసం కిందకు వదిలేస్తున్నాడు అని… థాంక్ గాడ్…
రిలీఫ్-3 … బీజేపీ వాళ్లు ఏమైనా ఈ డిమాండ్ ఎత్తుకునే అవకాశముందా..? నెవ్వర్… కన్నెపల్లి, కాళేశ్వరం అనగానే కాంగ్రెసోళ్లే అంటారు… చాల్చాల్లేవోయ్, సీబీఐకి అప్పగించి ఏడాది అవుతోంది, నీ దర్యాప్తు ఏమైంది? కేసీయార్ మీ సీక్రెట్ దోస్త్ అనే కదా కాపాడుతోంది, పైగా చెప్పొచ్చారు అని ఉల్టా దాడి చేస్తారు… సో, కమలం మౌనం!! మరి లెఫ్ట్? భలేవారే… భలే కామెడీ ప్రశ్న..!!
Share this Article