సరిగ్గా పది రోజుల క్రితం… ముచ్చట ఒక స్టోరీ రాసింది… బిగ్‌బాస్ టీం రెండు జంటల ‘‘కాపురాల్లో’’ నిప్పులు పోసిందని..! 1) షణ్ముఖ్, దీప్తి సునైన జంటకు బ్రేకప్ తప్పదని… 2) సిరి, శ్రీహాన్ సహజీవనం కూడా చిక్కుల్లో పడక తప్పదని… ‘‘కనీసం నీ అంతరాత్మకైనా నువ్వు జవాబుదారీగా ఉండు’’ అని దీప్తి పెట్టిన ఇన్‌స్టా పోస్టు, షన్నూను తన లిస్టు నుంచి తీసిపారేయడం, ఫినాలే తరువాత జరిగిన ఊరేగింపుకు వెళ్లకపోవడం, శ్రీహాన్ ధోరణి కూడా అలాగే ఉండటం… ఇవన్నీ సూచనలు… ఎహె, ఉత్త గాసిప్ అని ముచ్చట స్టోరీ చదివి కొందరు నవ్వుకున్నారు… రెండుమూడు రోజులకు ఇది నిజమేననే విషయం తెలిసి, ఇక అందరూ రాయడం మొదలుపెట్టారు… ఇప్పుడు ఏం జరిగింది..? ఈ సందిగ్ధానికి దీప్తి సునైన తెరవేసింది… నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేసింది… షన్నూకు బ్రేకప్ చెప్పేసింది… ఓసారి ‘ముచ్చట’ పాత స్టోరీ చదవండి… బిగ్బాసోడి పైత్యం ప్లస్ నాగార్జున వికారం కలిసి ఈ రెండు జంటల్లో ఎలా నిప్పులు పోశాయో అర్థమవుతుంది…
ఒరే బిగ్బాసోడా… రెండు పచ్చటి ‘‘కాపురాల్లో’’ నిప్పులు పోశావు కదరా…
నిజానికి టీవీ, సినిమా, యూట్యూబ్ ఇండస్ట్రీ చాలా చాలా పెద్దది… ఆ సముద్రంలో షణ్ముఖ్ ఓ చిన్న, మరీ చిన్న పాయ… తనకు లక్షల్లో ఫాలోయర్స్ ఉండవచ్చుగాక… తన యూట్యూబ్ వీడియోలు బాగా పాపులర్ కావచ్చుగాక… కానీ చాలామంది టీవీ ప్రేక్షకులకు మాత్రం తను బిగ్‌బాస్‌కు వచ్చాకే తెలుసు… మొదటి నుంచీ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ బాగోతంలాగా బిగ్‌బాస్ తనకు ‘‘దండె కొట్టడం’’, దానికి తగినట్టు నాగార్జున డప్పు కొట్టడం… సరే, ఇదీ ఓ ఐపీఎల్ మ్యాచ్ అనుకుందాం… ఇద్దరికీ ఇద్దరు బయట లవర్స్ ఉన్నారు కదా, సహజీవనంలో ఉన్నారు కదా… మరి సిరి, షన్నూ బిగ్‌బాస్ హౌజులో ఆ వెగటు వేషాలేమిటి..? ప్రేక్షకులకు చిర్రెత్తింది… షణ్ముఖ్ తనకు వోటింగు కోసం మస్తు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నా సరే, చివరకు ఈ సిరితో యవ్వారం బెడిసికొట్టడం వల్లే ఓడిపోవాల్సి వచ్చింది…
Ads
సరే, బిగ్‌బాస్ టీంకు బుర్రల్లేవ్, పోనీ, వాడేదో రేటింగుల కోసం సిరిని, షన్నూను ఆ వెకిలి వేషాల వైపు నెట్టాడు అనుకుందాం… మరి వీళ్ల బుద్ధులు ఏమయ్యాయ్..? ఎంకరేజ్ చేసిన నాగార్జున పాపం పాత్ర ఎంత..? సో, వాడెంత బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ బాస్ కానివ్వుగాక… మన సోయి మనకు ఉండాలిగా, అదుగో ఆ సోయి లోపించి ఇద్దరూ తప్పులో కాలేశారు, చివరకు ‘ఎడ్డోళ్లు’ అయిపోయారు… దీప్తి సునైన కూడా ఓ సీజన్లో బిగ్‌బాస్ మొహం చూసి వచ్చిన కేరక్టరే… తనకు మొత్తం తెలుసు, బిగ్‌బాస్ టీం రేటింగుల కోసం ఏం చేస్తుందో..? అదొక వినోదదందా… ఏ జంట విడిపోతే వాళ్లకేం..? అదుగో అది చెప్పటానికే ఈ కథనం… లేకపోతే ఆ రెండు జంటలకు ఇండస్ట్రీపరంగా పెద్ద సీన్ ఎక్కడిది… నాలుగు రోజులైతే ఎవరూ దేకరు కూడా… ఇదుగో దీప్తి ఇన్‌స్టాలో పెట్టిన తాజా పోస్ట్… తెగదెంపులే…
ఈ హౌజు రొమాన్సులు, తాత్కాలికంగా జతకట్టడాలు ఓ పరిమితి మేరకే ఉండాలి… ఏదో ఓ సీరియల్లో నటిస్తున్నట్టుగా… అంతేతప్ప ఒకే బెడ్‌పై రోజూ పక్కపక్కనే ఒకే దుప్పట్లో పడుకుని పొర్లినట్టు ఉండకూడదు… అది గమనించేసరికి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది… శ్రీరాంచంద్ర హమీదా మధ్య ఇదే పెట్టాలని చూసింది బిగ్‌బాస్ టీం… వాళ్లు ఎక్కడా శృతిమించలేదు… మానస్, ప్రియాంక నడుమ అంతే… తాళం తప్పలేదు… ఎటొచ్చీ వీళ్లిద్దరే… సర్లెండి… అవును గానీ, నాగార్జున సార్… చూస్తున్నావు కదా… తమరు కూడా నవ్వుతూ నవ్వుతూ ‘‘మంటలో కాస్త పెట్రోల్’’ పోసినవారే కదా…!!
Share this Article