బహుశా రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు… ‘ఈనాడు వయా మీడియాగా పోతుంది, అదంటే గౌరవం… సాక్షిని నేను అసలు చదవను… జ్యోతి కూడా టీడీపీ భజన పత్రిక…’ అన్నాడట మీడియాతో ఆఫ్‌దిరికార్డు మాట్లాడుతూ..! అది నిజమే… సాక్షిని వైసీపీ వాళ్లే పెద్దగా చదవరు… అందులో జగన్ భజన తప్ప మరొకటి ఉండదు… ఇతర పార్టీల వార్తల కవరేజీలో గానీ, బాస్ భజనలో గానీ, ప్రత్యర్థుల మీద దాడిలో గానీ నమస్తే తెలంగాణ ఇంకా దారుణంగా ఉంటుంది… […]
నిరోధ్ వాడితే కేసు..! పిల్స్ దొరికితే జైలు..! కాపర్ టీ వేసుకుంటే అరెస్టు..!!
దుకాణంలో నిరోధ్ అమ్మితే తీసుకెళ్లి జైలులో పడేస్తారా..? ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు గర్భనిరోధక మాత్రలు గనుక దొరికితే వెంటనే అరెస్టు చేస్తారా..? కాపర్-టీ బిగింపులపై నిషేధం విధిస్తారా..? అవేకాదు, స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాన్ని కూడా రద్దు చేసిపారేస్తారా..? ఆ సూచనలే కనిపిస్తున్నాయి… అమెరికా మహిళల అబార్షన్ల హక్కు రక్షణను కొట్టిపారేసిన తిరోగామి తీర్పు చదివాం కదా… ఆ తీర్పు వెలువరించిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తోటి న్యాయమూర్తులకు ఓ అప్పీల్ చేశాడు… […]
ఆనంద్ దిఘే..! ఏకనాథ్ షిండేకు పదునుపెట్టిన ‘పెదరాయుడు’…!
ప్రస్తుతం జాతీయ స్థాయిలో వినిపిస్తున్న పేరు ఏకనాథ్ షిండే… ఒక ఆటో డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీనే ఆశిస్తూ హల్చల్ క్రియేట్ చేస్తున్న నాయకుడు… శివసైనికుడు… శివసేన మాదే, నువ్వు ఓ డమ్మీవి మాత్రమే అని ఏకంగా తన బాస్ బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు ఉద్దవ్ ఠాక్రేనే సవాల్ చేస్తున్నాడు… అసలు ఎవరు ఈ షిండే అని చాలా కథనాలు, వ్యాసాలు వచ్చాయి… కానీ ఈ ఏకనాథ్ అనే కత్తికి పదును […]
అరివీర కంపర పాత్రికేయం..! లోలోతుల్లోకి ఇంకా వేగంగా తెలుగు జర్నలిజం…!!
కంపరం… ఈ పదం సరిపోకపోవచ్చు, కానీ సమయానికి ఆ పదమొక్కటే గుర్తొస్తోంది… వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వకపోవడం దక్షిణ భారతదేశం అనే వేర్పాటు ఉద్యమాలకు ఊతం, బలం, కారణం అంటూ నిన్న ఒకటీరెండు యెల్లో చానెల్స్ రేపిన చర్చ నిజంగా కంపరం కలిగించింది… తెలుగు జర్నలిజం ఏ పాతాళ స్థాయిలో పొర్లుతున్నదో చెప్పడానికి ఇది ఓ ప్రబల తార్కాణం… ఆఫ్టరాల్, ఓ నాసిరకం చానెల్ ఏదో డిబేట్ పెడితే, ఎవరో మేధావి ఏదేదో సొల్లితే మొత్తం జర్నలిజం […]
విశ్వాసం లేని మోడీ… ఆంధ్రజ్యోతి మనోభావాలు బాగా దెబ్బతిన్నయ్…
అనుకున్నదే… వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అవకాశం ఇవ్వకపోవడాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈసడించుకుంటాయని అనుకున్నదే… మోడీని, షాను నిందిస్తాయనీ అనుకున్నదే… తనను గనుక అభ్యర్థిగా ఎంపిక చేస్తే వెంటనే తన చరిత్ర కథనాలతో ప్రత్యేక పేజీలు వెలువరించడానికి రెడీ అవుతాయనీ అనుకున్నదే… వెంకయ్యనాయుడిని పక్కన పెట్టేయడం ద్వారా మోడీ ఈనాడు, ఆంధ్రజ్యోతి మనోభావాలను గాయపరిచాడు… (టీవీ5 అనే చానెల్ కూడా బాగానే హర్ట్ అయి ఉంటుంది…) కానీ ఈనాడు ఎందుకోగానీ నెగెటివ్ వ్యాఖ్యానాల జోలికి పోలేదు… తమాయించుకుంది… […]
మోడీ పొగబెట్టాడు… పొగచూరిన ఆయనలో పగ… భలే రాష్ట్రపతి ఎన్నిక…
85 సంవత్సరాలు… అవును… విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వయస్సు అది… స్టిల్ యాక్టివ్… యాక్టివ్ అనుకునే ఏడాది క్రితం మమత తనను పార్టీలో చేర్చుకుంది… కారణం, మోడీ వ్యతిరేకి కాబట్టి… బీజేపీ మీద పగబట్టి ఉన్నాడు కాబట్టి… మోడీ బ్యాచ్ తనకు పొగబెట్టి బయటికి తరిమేశారు కాబట్టి… దేశంలో మోడీకి ఎదురుగా పోరాడేది మమత అనే భ్రమల్లో ఉన్నాడు కాబట్టి… తను పార్టీలో చేరినా సరే పెద్దగా ఏ పదవులూ ఆశించలేడు కాబట్టి… వయస్సైపోయినవాడు […]
శివసేన కకావికలు… బీజేపీ లక్ష్యం అదే… సగానికి చీల్చేస్తోంది…
నిజానికి ఎమ్మెల్యేలను కొనేయడంలో మంచి నేర్పరితనం సాధించిన బీజేపీ ఇన్నాళ్లు శివసేన ప్రభుత్వాన్ని పడకుండా సంయమనం పాటించడమే పెద్ద విశేషం… ప్రస్తుతం విధేయత, నిబద్ధత, నిజాయితీ వంటి లక్షణాలు కలిగిన నాయకులు ఎక్కడున్నారు..? పైగా మహారాష్ట్రలో ఓ మహావికాస్ అవధి కూటమే ఓ వింత ప్రయోగం… అఫ్ కోర్స్, రాజకీయాల్లో అన్నీ చల్తా… ఇది జరగదు, జరగకూడదు అనేదేమీ ఉండదు కదా… బీజేపీ, శివసేన పార్టీలది కాషాయ జెండాలు, ఎజెండాలే… ఒకప్పుడు కలిసి కాపురం చేసినవే… కానీ […]
థాంక్ గాడ్… లక్కీగా ఇతను రాజకీయాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు…
కొంచెం ఇంట్రస్టింగు వార్తే… సుఖేశ్ చంద్రశేఖర్ అనే నిందితుడు తనకు తీహార్ జైలులో ప్రాణహాని ఉందనీ, వేరే జైలుకు మార్చాలని ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాడు.., అయ్య బాబోయ్, ఆ పిటిషన్ విచారించి, తన కోరికను మన్నించవద్దు మహాప్రభో అని ఈడీ కోర్టుకు మొరపెట్టుకుంది… ఎందుకు..? అసలు ఎవరీ సుఖేష్..? ఏమిటీ కథ..? బెంగుళూరులో పుట్టిన సుఖేశ్‌కు చిన్నప్పటి నుంచే ‘లైఫ్’ మీద చాలా క్లారిటీ ఉంది… 17 ఏళ్ల నుంచే మోసాలు స్టార్ట్ చేశాడు… ఏవో […]
మోడీపై సంఘ్ పరివార్ కుతకుత..? రాంమాధవ్ వ్యాఖ్యల ఆంతర్యమేమిటి..?!
రాంమాధవ్… హిందూపరివార్లో చాలా కీలకమైన వ్యక్తి… ఆర్ఎస్ఎస్లో ముఖ్యమైన పాత్ర… ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో, కశ్మీర్లో నాన్-బీజేపీ భావజాలమున్న శక్తులతోనూ సంబంధాలు నెరిపి, బీజేపీ కొత్త దశకు డ్రైవర్‌గా పనిచేశాడు… కానీ ఏమైందో ఏమో తెలియదు… నిజానికి మోడీకి ఆర్ఎస్ఎస్ కోర్ శక్తులతో మోడీకి సత్సంబంధాలు లేవని తెలుసు… ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ కొన్ని పరిమితుల్లో మాత్రమే మోడీకి సపోర్ట్ చేస్తుందనీ తెలుసు… ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ వంటి ఆర్గనైజేషన్లను మోడీ అండ్ షా తన గుప్పిట్లోకి తెచ్చుకునే […]
మమత చదరంగంలో ఓ పావు… ఆటగాళ్లు మోడీషా… రాష్ట్రపతి ఎన్నికే వేదిక…
బీజేపీ వ్యతిరేక పోరాటంలో అసలు సమస్య ఏమిటంటే…? ప్రధానంగా హిందూవ్యతిరేకత… మమత, కేసీయార్, స్టాలిన్, అఖిలేష్, లాలూ ఎట్సెట్రా… వాళ్ల మీద పడ్డ ముద్ర ఏమిటంటే… వాళ్లు హిందూ వ్యతిరేకులు అని…! ఒకవైపు భారత్‌ను టార్గెట్ చేసుకుని, ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలు ఏదో సాకు చూపి మీదపడుతున్నయ్… కానీ యాంటీ-బీజేపీ క్యాంపులన్నీ మరింతగా యాంటీ-హిందు పోకడలతో సాగిపోతున్నయ్… రాష్ట్రపతి ఎన్నికల అనేది మోడీ ప్రభుత్వానికి జుజుబీ… అది సోనియాకు తెలుసు, మమతకు తెలుసు… తెర వెనుక కేసీయార్‌కు […]
కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా బీఆర్ఎస్… అదంత ఈజీ కాదు…
కేసీయార్ కొత్తగా ఓ పార్టీ పెడుతున్నాడు… నెలాఖరున ప్రకటించబోతున్నాడు… ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో వాక్యూమ్ నెలకొని ఉన్నందున, ఇప్పుడున్న పార్టీలేవీ దేశాన్ని ఉద్దరిస్తలేవు కాబట్టి కేసీయార్ పూనుకుని, బంగారు భారతం కోసం ఉద్యమించబోతున్నాడు… ఆ పార్టీ పేరు బీఆర్ఎస్… పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తీసుకున్నాడు…….. ఇదండీ వార్త సంక్షిప్త సారాంశం… ఈ ప్లానింగు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని గుసగుస… మంచిదే… రాజకీయాల్లో కూడా కొత్త నీరు వస్తుండాలి… నిల్వ నీరు వెళ్లిపోవాల్సిందే… కానీ గత ఎన్నికల […]
అశ్లీల నృత్యం అంటే ఏమిటి సార్..? ప్రతి సినిమా సెలబ్రిటీని బుక్ చేస్తారా మరి..?!
ఒక వార్త… హైదరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ పబ్ మీద దాడిచేసి కొన్ని అరెస్టులు చేశారు… విషయం ఏందయ్యా అంటే..? ఆ పబ్బులో అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తున్నారట… కస్టమర్లను ఆకర్షిస్తున్నారట… అవసరమైతే శృంగారసేవల్ని ఆఫర్ చేస్తున్నారట… అయితే ఇక్కడ కొన్ని సందేహాలు… సిటీలో లా అండ్ ఆర్డర్ ఓ దశ, ఓ దిశ లేకుండా కొట్టుకుపోతున్నందున సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవచ్చు… ఎందుకంటే..? డీజే ఆపరేటర్ అరెస్టు… ఇక్కడ డీజే ఆపరేటర్ చేసిన […]
కలుక్కుమనిపించిన వార్త… ఓ పసికందును పొట్టనబెట్టుకున్నారు…
పత్రికల నిండా నానా చెత్తా ఉంటుంది… కొన్ని మాత్రమే రీడర్‌కు కనెక్టవుతాయి… మనసు కలుక్కుమనిపిస్తాయి… ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయిపోతుంది… ఇదీ అలాంటి వార్తే… సోషల్ మీడియాలో ఎవరి వాల్ మీదో కనిపిస్తే… అసలు ఈ వార్త నిజమేనా అని డౌటొచ్చింది… ఆ పత్రిక ఫస్ట్ పేజీలోనే నిలువునా కనిపించింది… ఎస్, మనిషికి మరణాలు అనేక రకాలుగా వస్తుంటయ్… రోగాలు, విపత్తులు, ప్రమాదాలు, హత్యలు, నిర్లక్ష్యాలు, తప్పుడు వైద్యాలు వంటివి మనిషి ప్రాణాలను బలిగొంటాయి… కానీ […]
హనుమంతుడి జన్మస్థలి తగాదా..! ఎన్ని స్థలాలున్నాయో తెలుసా..?!
ఆంజనేయుడి జన్మస్థలం మీద వివాదం రగులుతూనే ఉంది… నాసిక్‌లోని అంజనేరిలో పుట్టలేదనీ, కర్నాటకలోకి కిష్కింధలోనే పుట్టాడని ఓ కన్నడ స్వామి వాదిస్తున్నాడు… ఆయన నాసిక్‌లో గురువారం ధర్మసంసద్ భేటీకి కూడా పిలుపునిచ్చాడు… దేశం నలుమూలల నుంచీ వచ్చే సాధుసంతుల అభిప్రాయాలు తీసుకుని, వాళ్ల నిర్ణయాన్ని ఆమోదిస్తామనీ అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే అంటున్నాడు… అసలు అంజనేరిలో ఆంజనేయుడు పుట్టినట్టుగా రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదని తన వాదన… కన్నడ మహంత్ గోవింద్ దాస్ కూడా ఇదే అంటాడు… […]
రష్యా, చైనాలు దండెత్తి… ఎర్రకోటపై ఎర్రజెండాలు ఎగరేస్తాయా అధ్యక్షా..!!
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా… 2 నెలల్లో కేంద్రంలో మార్పు తథ్యం, సంచలన వార్త వింటారు అని వ్యాఖ్యానిస్తే నిజంగా పెద్ద చర్చ జరగాలి… కానీ పెద్ద సారు కేసీయార్ చేసిన ఈ వ్యాఖ్య మీద నయాపైసా చర్చ లేదు… ఎందుకు..? క్రెడిబులిటీ సమస్య..!! గాయిగత్తర, అగ్గిపెడతా వంటి వ్యాఖ్యలతో, తన ఆచరణతో పోగొట్టుకున్న క్రెడిబులిటీ… తను ఏం మాట్లాడినా ఎవరూ సీరియస్‌గా తీసుకునే సిట్యుయేషన్ లేదు… పీకేలు, ప్రకాష్రాజ్లు, టికాయత్లు ఆ క్రెడిబులిటీని ఇంకాస్త లోపలకు […]
ఈ కుక్కల గోలేమిటి తల్లీ… ఈ భీతిగొలిపే ధోరణేమిటి..? ఈ పాలనేమిటి..?!
అపరిమిత అధికారాల్ని అనుభవించే ఐఏఎస్ అధికారుల పనితీరు ఎప్పుడూ పరిశీలనార్హమే… ఢిల్లీ స్టేడియంలో కుక్కతోపాటు వాకింగు చేయడానికి, అథ్లెట్లందరినీ బయటికి తరిమేసే… చివరకు తనే అరుణాచల్ ప్రదేశ్‌కు తరిమేయబడిన లేడీ ఐఏఎస్ ఆఫీసర్ రింకూ దుగ్గా కథ చదివాం కదా… గతంలో రాణివారు వస్తుంటే, వీథుల్ని ఖాళీచేయించేవాళ్లు సైనికులు… అదొక దర్పం… తలకెక్కిన అధికారం… తమ మంచి పనితీరుతో, ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసి మంచిపేరు తెచ్చుకున్న లేడీ ఐఏఎస్ అధికార్లు ఎందరో ఉన్నారు… అదేసమయంలో అవినీతి, […]
వద్దు… ఇప్పుడు చార్ధామ్ యాత్ర అసలే వద్దు… బుక్కయిపోతారు…
ప్రతి హిందువు తన జీవితంలో ఒకసారైనా చార్ ధామ్ యాత్ర చేయాలని అనుకుంటాడు… అమరనాథ్, మానససరోవర్ అందరికీ చేతకావు… చాలా వ్యయప్రయాస సాహసయాత్రలు అవి… చార్ ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్… వద్దురా బాబూ, ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లకండి అని చెప్పడం యాంటీ సెంటిమెంట్… కానీ చెప్పకతప్పని దుస్థితి… వద్దు, ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర ప్లాన్లలో ఉన్నవాళ్లు పునరాలోచన చేయడం బెటర్… చాలా బెటర్… మామూలు రోజుల్లోనే చార్ ధామ్ ఓ […]
ఆ చట్టం నిజంగానే వారణాసి శివలింగాన్ని బయటికి రానివ్వదా..?!
వారణాసి జ్ఞానవాపి ప్రాంగణంలో ముస్లింలు నమాజు చేస్తున్న ప్రాంతంలో… ఓ తటాకంలో శివలింగం కనిపించిందనీ… అది అధికారికంగా జరిగిన సర్వేలోనే బయటపడిందనీ నిన్న జోరుగా మీడియా, సోషల్ మీడియా కథనాలు… అసలు సర్వే వివరాలు బయటికి, మీడియాకు లీకైనందుకు బాధ్యుడిగా కోర్టు ఓ ఉద్యోగిపై వేటు వేసింది… నిజంగా శివలింగం బయటపడిందా లేదానేది కోర్టే చట్టబద్ధంగా తేల్చనుందన్నమాట.,. తనకు ఏ నివేదిక అందిందో, అందులో ఏముందో కూడా ఇక కోర్టే చెప్పాల్సి ఉంది… నిజానికి ఇతర మతాలకు […]
ఫిలిప్పీన్స్‌లో ప్రశాంత్ కిషోర్ గెలుపు… ఔను, తన ఫార్ములాదే విజయం…
ఎక్కడి ఫిలిప్పీన్స్… ఎక్కడి ప్రశాంత్ కిషోర్… ఇదెక్కడి గెలుపు… ఇదేం లింకు… అని హాశ్చర్యపడకండి… ప్రశాంత్ కిషోర్ ఫార్ములాయే ఫిలిప్పీన్స్‌లో గెలిచింది… ఇండియాలో రాబోయే ఎన్నికల పోరాటానికి సోషల్ మీడియాయే వేదిక అనుకుంటున్నదే కదా… అందుకని ఈ కథ కూడా ఓసారి చదవాలి… చరిత్ర రికార్డ్ చేసిన ఘోరాల్ని, దుర్మార్గాల్ని సైతం సోషల్ మీడియా ఎలా తారుమారు చేసి, జనాన్ని మాయచేసి, భ్రమల్లో పడేసి, తప్పుదోవ పట్టించగలదో తెలుసుకోవాలి… పీకే ఫార్ములా ఎందుకు డేంజరసో అర్థం చేసుకోవాలి… […]
చైనా ఊబిలోకి మరింతగా..! శ్రీలంక మీద కొత్తతరహా సామ్రాజ్యవాదం పడగ..!!
పార్ధసారధి పోట్లూరి…. వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని 20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాను అంటోంది చైనా !ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు శ్రీ లంకకి! ప్రస్తుతం అంతర్జాతీయముగా కొందరు తల పండిన మేధావులు పరోక్షంగా శ్రీలంకకి సలహా ఇస్తున్నారు ఇలా… అఫ్ కోర్స్ దీని వెనక చైనా పెద్దలు ఉన్నారు అని వేరే చెప్పక్కరలేదు. మొదట శ్రీలంకకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తుల చేత […]
- « Previous Page
- 1
- …
- 100
- 101
- 102
- 103
- 104
- …
- 149
- Next Page »