నో డౌట్… రాహుల్ గాంధీ పర్యటన, వరంగల్ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఎలాగైతే నింపాయో… సేమ్, అమిత్ షా తుక్కుగూడ సభ, పర్యటన బీజేపీ శ్రేణుల్లోనూ అంతే ఉత్తేజాన్ని నింపాయి… సభ విజయవంతమైంది… గత నంగి వైఖరికి భిన్నంగా బీజేపీ హైకమాండ్ ఇప్పుడు కేసీయార్ మీద పదునైన విమర్శల బాణాల్ని ఎక్కుబెట్టింది… తెలంగాణకు సంబంధించి తమకు కాంగ్రెస్‌తో పోరాటం మీద పెద్ద ఇంట్రస్టు లేదనీ, టీఆర్ఎస్ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి అని తేల్చేసింది… అంతేకాదు, […]
కరోనా కంట్రోల్ పేరిట చైనా నగరాల్లో అరాచకం… రేషన్‌కూ నానా అగచాట్లు…
పార్ధసారధి పోట్లూరి ……… కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళని చూసి నేర్చుకోండి ! జీరో కోవిడ్ పాలసీని ఎలా అమలు చేయాలో చైనాని చూసి నేర్చుకోండి అంటాడు రాహుల్… చైనా ఎలా చెప్పమంటే అదే చెప్తాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే చైనా పడేసే కుక్క బిస్కెట్లని తింటూ తోకాడిస్తూ ఉంటుంది. భారత్ లో కోవిడ్ మరణాల సంఖ్య 47 లక్షలు అంటూ వాక్రుచ్చింది WHO. ఈ సంఖ్య ఎవరిచ్చి ఉంటారు ? పెద్దగా ఆలోచించాల్సిన […]
‘‘హిందీ మాట్లాడేవాళ్లు కోయంబత్తూరులో పానీపురి అమ్ముతుంటారు…’’
పాన్ ఇండియా సినిమాలు హిందీ వ్యతిరేక సెంటిమెంట్‌ను మళ్లీ రాజేస్తున్నాయి… కన్నడ నటుడు సుదీప్ చేసిన పిచ్చి వ్యాఖ్యలు, అంతకుమించి అజయ్ దేవగణ్ చేసిన తలతిక్క వ్యాఖ్యలు మళ్లీ హిందీ వివాదాన్ని రేపుతున్నాయి… ఇంకా… నిజానికి ఒక జాతి మీద మరో భాషను రుద్దే ప్రయత్నాలు అనేక విపరిణామాలకు దారితీస్తాయి… బుర్రతిరుగుడు వ్యాధి బలంగా ఉండే సినిమా నటులకు ఇది అర్థం కాదు… మంట రాజేస్తారు తమకు తెలియకుండానే… ఒక జాతికి తమ భాష, ఆహారం, ఆహార్యం, […]
పెట్రో, నూనె ధరలు మండుతున్నయ్ కదా… ఇక గోధుమల వంతు…!!
పార్ధసారధి పోట్లూరి ……. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని పెట్రోల్,డీజిల్, వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు గోధుమల వంతు రాబోతున్నది! ప్రపంచవ్యాప్తంగా గోధుమల దిగుబడులు ఘోరంగా పడిపోబోతున్నాయి. ఉదాహరణకి ప్రపంచం మొత్తం ఒక పంటకి సాధారణంగా 100 కిలోల ఉత్పత్తి అవుతుంది అనుకుంటే ఈసారి 60 కిలోల ఉత్పత్తి మాత్రమే అవబోతున్నది అంటే 40% శాతం దిగుబడి తగ్గబోతున్నది అన్నమాట. గోధుమ పంట దిగుబడి ఇంతలా పడిపోవడానికి కారణం ఏమిటి ? […]
ఈ రథం ఎక్కడిదబ్బా… తేలుతూ ఎలా కొట్టుకొచ్చింది… ఏ దేశానిదో…
పెద్ద పెద్ద తుపాన్లకు సముద్రం పొంగి, తీర ప్రాంతాల్లోని ఊళ్లను, ఇళ్లను, ఆస్తులను తనలోకి లాగేసుకోవడం చాలా పరిపాటి… అందులో పెద్ద హాశ్చర్యం ఏమీలేదు… అయితే నిన్న అసని తుపాన్‌తో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న స్థితిలో ఏపీ, శ్రీకాకుళం, సున్నపల్లి తీరప్రాంతానికి కొట్టుకొచ్చిన రథం ఓ మిస్టరీగా మారింది… బంగారు కలర్ కోటింగ్ ఉన్న ఆ రథం మిస్టరీ కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్న… అంత బరువైనది అలలపై మునుగుతూ తేలుతూ […]
రష్యన్ లోపాలకు ఇజ్రాయెల్ చికిత్స… మన నేవీ యుద్ధనౌకలు సేఫ్…
పార్ధసారధి పోట్లూరి ……. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్ నేవీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కుంటోంది… రెండు యుద్ధనౌకల్ని పోగొట్టుకుంది… బోలెడు లోపాలు బయటపడుతున్నాయి… మరి అదే రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన నేవీ ఆయుధాలు, నౌకల పరిస్థితి ఏమిటి..? సేఫేనా..? ఈ ప్రశ్నల గురించి మనం మొన్న ముచ్చటించుకున్నాం కదా… ఇక చదవండి… నల్ల సముద్రంలో రష్యన్ నావీ బలహీనతలు బయటపడ్డ సమయంలో రష్యా నుండి భారత్ కొన్న 8 తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ వాటి పని […]
ఊరుకున్నంత ఉత్తమం లేదు… సాక్షికి అదెప్పుడూ అర్థం కాదు…
వినదగునెవ్వరు చెప్పిన… అంటారు పెద్దలు..! కానీ జగన్ వినడు… జగన్ పత్రిక కూడా వినదు… నెవ్వర్… లాభమో, నష్టమో జానేదేవ్, జాన్తానై… నీ ఫలానా బాట, అడుగులు నీకే నష్టం అని చెప్పినా సరే..!! ఈమధ్య సాక్షి తన నాలుగో పేజీని ఈనాడు వార్తలకు ‘‘ఖండన పేజీ’’గా మార్చేసింది కదా… పత్రికల్లో సినిమా పేజీ, స్పోర్ట్స్ పేజీ, బిజినెస్ పేజీ వంటి రకరకాల పేజీలు ఉంటాయి తెలుసు కదా… సాక్షిలో ‘‘ఖండనల పేజీ’’ ప్రత్యేకం… ఈనాడులో ఏదైనా […]
అవి ‘పులి’ట్జర్ అవార్డులు కావు… ‘నక్క’ట్జర్ అవార్డులు… లైట్ తీసుకొండి…
ఒకప్పుడు పులిట్జర్ అవార్డు అంటే విశేష గుర్తింపు… ప్రాచుర్యం… ఆనందం… జర్నలిస్టు సర్కిళ్లలో పులిట్జర్ అవార్డు అంటే నోబెల్ ప్రయిజ్… ఓ ఆస్కార్ అవార్డు… అంతటి ఘనతను సొంతం చేసుకున్న ఆ అవార్డుల అసలు రూపమేమిటనే చర్చ కొత్తగా మొదలైంది… అవార్డుల ప్రకటన వెనుక చాలా రాగద్వేషాలు పనిచేస్తున్నాయా..? అవార్డులకు అందుకే మకిలి పడుతోందా..? చెప్పుకోవాలి… చెప్పుకోకపోతేనే తప్పు… ఒక్కసారి 2022 అవార్డులకు సంబంధించి, ఆ పులిట్జర్ వెబ్సైటులోకి వెళ్లి చూడండి… అనేక కేటగిరీల్లో అవార్డులు ఉంటాయి… […]
బాబు మీద కూడా కేసు… ఏ1 తనే… హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా… నిజమేనా..?!
ట్విస్టులే ట్విస్టులు… మొత్తానికి మాజీ మంత్రి, ప్రముఖ విద్యావ్యాపారి నారాయణ అరెస్టు వ్యవహారం రకరకాల ట్విస్టులతో, భిన్న కథనాలతో రాజమౌళి సినిమాలాగా సాగిపోతోంది… నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడని ఒక వార్త… ఎట్టకేలకు తనను, తన భార్యతోసహా అదుపులోకి తీసుకున్నాడని మరో వార్త… టెన్త్ క్లాస్ పరీక్షపత్రాల లీకేజీ కేసు పెట్టారని, ఇప్పటికే కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారని ఇంకో వార్త… సోషల్ మీడియాలో వార్తలు, ఎఫ్ఐఆర్ కాపీలు చూడగానే మొత్తం […]
చాలా డేంజరట..? మానవతకు మచ్చ అట, మానవహక్కుల ఉల్లంఘన అట..!!
భక్తులు… పట్టణంలోకి ఏ మఠాధిపతినో పల్లకీలో ఊరేగిస్తూ, తాము పల్లకీ మోస్తూ తీసుకొస్తారు… ఆయన ఏవో పూజలు చేస్తాడు… ప్రవచనాలు చెబుతాడు… ఆ సీన్ చూస్తే, ఆ వార్త చదివితే మీకు ఏమనిపిస్తుంది..? అందులో తప్పేముంది..? స్వాములు ఇల్లిల్లూ తిరుగుతూ పాదపూజలు చేయించుకుని, దండిగా కానుకలు దండుకోవడం లేదా..? కొందరైతే పాదతాడనాలకూ డబ్బు తీసుకుంటారుగా… దొంగ బాబాలైతే నానా ఛండాలం పనులు చేయించుకుని భ్రష్టుపట్టించడం లేదా..? వాటితో పోలిస్తే ఈ పల్లకీ సేవలో తప్పేముంది… అది ఆ […]
అలాంటి నేతల్ని మళ్లీ చూస్తామా..? కనీసం వార్షిక స్మరణ కూడా లేదు…
ఒక వార్త బాగా ఆశ్చర్యపరిచింది… ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఓ నాయకుడి చివరి రోజుల్లో తనకు మిగిలిన ఆస్తులేమిటయ్యా అంటే… రేకుల పైకప్పు ఉన్న ఓ చిన్న ఇల్లు… కొన్ని పుస్తకాలు… తన హాఫ్ హ్యాండ్స్ కోటు పెట్టుకునే ఓ రేకులపెట్టె, భోజనం చేయడానికి ఓ ఇత్తడి పాత్ర… ఆయన పేరు దామోదరం సంజీవయ్య… నిన్న ఆయన వర్ధంతి… చోటాచోటా నేతలకూ బోలెడన్ని నివాళ్లు అర్పించి, స్మరించుకుంటుంటారు కదా… మరి […]
రష్యన్ నేవీ బలహీనత పట్టేసిన నాటో…! మరి మన యుద్ధనౌకలు ఎంత సేఫ్..?!
పార్ధసారధి పోట్లూరి…… రష్యా నౌకా దళానికి మరో ఎదురు దెబ్బ తగిలింది ! అడ్మిరల్ గ్రిగోరోవిచ్ క్లాస్ ఫ్రిగేట్ ‘’ అడ్మిరల్ మాక్రోవ్ ‘’ [Grigorovich-class frigate “Admiral Makarov]అనే పేరు కల ఫ్రిగేట్ ని ఉక్రెయిన్ కి చెందిన యాంటీ షిప్ మిసైళ్లు ‘నెప్ట్యూన్ ‘ లు దాడి చేసి తీవ్ర నష్టంని కలుగచేశాయి ! కడపటి వార్తలు అందే సమయానికి అడ్మిరల్ మాక్రోవ్ నల్ల సముద్రంలో మంటలతో పోరాడుతున్నది కానీ మునిగిపోలేదు. అడ్మిరల్ మాక్రోవ్ […]
ఇదుగో మేం ఈ పనులు చేస్తాం… ఇది కాంగ్రెస్ మాట… మరి బీజేపీ బాట..?!
రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు సహజమే… తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా పాతుకుపోయి ఉంది… కేసీయార్ చాణక్యుడి బుర్రే దానికి అసలు బలం… ప్రత్యర్థి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్… రేప్పొద్దున మూడు పార్టీలూ బలంగా పోటీపడతాయా..? లేక బీజేపీ, కాంగ్రెస్ తన్నుకుని, వోట్లు చీలిపోయి, మళ్లీ కేసీయార్‌కు చాయిస్ ఇస్తారా అనేది వేరే సంగతి… రేపటి గురించి ఇప్పుడే చెప్పలేం.., రాజకీయాల్లో మితృత్వాలు, శతృత్వాలు రేపెలా ఉంటాయో చెప్పడం కష్టం… అయితే కేవలం నాయకుల అవినీతి […]
ఓహ్.., తను రాహులేనా..? మెచ్యూర్డ్ స్పీచ్… పీసీసీపై రేవంత్ గ్రిప్…!
నిజానికి రాహుల్ ప్రసంగంపై చాలామంది తటస్థుల్లో పెద్ద ఆశలేమీ లేకుండా ఉండింది మొదట్లో… కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ప్రసంగాన్ని సరైన రీతిలో వెలువరించాడు రాహుల్… ఎక్కడా సందిగ్ధత లేదు… దాపరికం లేదు… కేసీయార్ ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ను తొక్కీ తొక్కీ, ఇక అది చచ్చిపోయింది అనుకున్నాడు… కానీ కాంగ్రెస్ బతికే ఉందని, బతికే ఉంటుందని, జెండా మోసేవాళ్లకు కొదువ లేదని వరంగల్ సభ నిరూపించింది… తెలంగాణ ఏర్పాటు ఎంత కష్టసాధ్యమైనా మేమే ఇచ్చామని చెప్పుకోవడం దగ్గర్నుంచి… […]
ఈ రోటీ నమక్ జర్నలిస్టు గుర్తున్నాడా మీకు..? చివరకు జీవితమే కోల్పోయాడు..!!
మీకు గుర్తుందా..? 2019… యూపీ, మీర్జాపూర్‌లోని జమాల్పూర్ బ్లాక్, సియూర్ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం కింద రొట్టె, ఉప్పు పెట్టారు… కూర కాదు, జస్ట్ ఉప్పు… పేద పిల్లల కడుపు నింపే ఆ పథకాన్ని కూడా భ్రష్టుపట్టించిన తీరును వివరించే ఆ దృశ్యాన్ని పవన్ జైస్వాల్ అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వీడియో తీశాడు… ఎండిన రొట్టెలు, అందులోకి ఉప్పు… కడుపు తరుక్కుపోయేట్టుగా ఉన్న ఆ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది… చాలా మీడియా సంస్థలు […]
‘‘బూతు చిత్రాలతో కొడదాం… వాళ్లే ఎగేసుకుని పరుగెత్తుకొచ్చేస్తారు…’’
అనుకుంటాం గానీ… ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర, సాంకేతిక సంస్థలయితేనేం… వాళ్లూ కొన్నిసార్లు మరీ నాసిరకంగా ఆలోచిస్తుంటారు… మరీ సీ గ్రేడ్ హాలీవుడ్ దర్శకుల్లాగా… పోనీ, ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించవచ్చునని నమ్మే టాలీవుడ్ దర్శకుల్లాగా..! విషయం ఏమిటంటే..? నాసా శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులను ఆకర్షించేందుకు పురుషుడు, మహిళ నగ్నచిత్రాలను రోదసిలోకి పంపించాలని ఆలోచిస్తున్నారట… ఏలియన్స్‌ను ఆకర్షించేందుకు ఈ ప్రయోగం ఫలితం ఇవ్వగలదని నాసా సైంటిస్టులు ఆశిస్తున్నట్టుగా బెకాన్ ఇన్ ది గెలాక్సీ అనే అధ్యయనం చెబుతోందట… ఇదీ […]
గెటవుట్ ట్విస్టులు… ఫ- పంచాయితీలోకి ఆ అనసూయనూ లాక్కొచ్చారు…
విష్వక్సేనుడు, దేవినాగవల్లి గెటవుట్ వివాదం మీద మొత్తానికి తెలుగు సమాజం రెండుగా చీలిపోయింది… విష్వక్సేనుడికి మద్దతుగా కొందరు… దేవికి మద్దతుగా కొందరు… అయితే టీవీ9 మీద, దేవి మీద ఇతర కారణాలతో ఇప్పటికే వ్యతిరేకత పెంచుకున్న సెక్షన్ ఇప్పుడిక చాన్స్ దొరికింది కదాని విష్వక్సేనుడికి మద్దతుగా నిలుస్తున్నారు… నిజం చెప్పాలంటే… దేవికి జర్నలిస్టు ప్రపంచం నుంచి, విష్వక్సేనుడికి సినిమా సంఘాల నుంచి పెద్దగా దొరికిన మద్దతేమీ లేదు… ఇదేదో తాము కలుగజేసుకునే వ్యవహారం కాదులే అని వదిలేశాయి… […]
యాదగిరి నర్సన్నను ముంచేశారు..! విఫల సమర్థన ప్రయత్నాలు వృథా..!!
ఎహె, ఒక రోడ్డు కాస్త కుంగిపోతే ఇన్ని విమర్శలా..? 99 శాతం పాజిటివిటీ గమనించకుండా ఒక శాతం నాణ్యతలోపాల్ని పనిగట్టుకుని బదనాం చేయాలా..? చిన్న చిన్న లోపాలు కనిపిస్తే యాదాద్రి ఘన వైభవ పునర్నిర్మాణాన్ని కించపరచాలా..?….. ఇవీ కొన్ని విపల సమర్థనలు… చిన్నపాటి వర్షానికే యాదాద్రి లోపాలు బయటపడటంపై, నిర్మాణంలో కనిపిస్తున్న డొల్లతనంపై విమర్శలకు ఇవి నిజంగా సరైన సమాధానాలేనా..? అసలు మీడియా ఎలా కవర్ చేసిందో ఓసారి పరిశీలిస్తే… టీవీలు మరీ అంతగా రెచ్చిపోయి టాం […]
జగన్ సార్… మీ హోం మంత్రిగారి వ్యాఖ్యల తీరు చూస్తున్నారా..?
మాట్లాడటం తెలియకపోతే మౌనాన్ని ఆశ్రయించడం బెటర్… జగన్ అర్జెంటుగా తన మంత్రులకు చెప్పాల్సిన నీతి అదే… ప్రత్యేకించి కీలకమైన హోం శాఖకు మంత్రిగా ఉన్న తానేటి వనిత మాట్లాడకుండా ఉంటేనే ప్రభుత్వానికి, పార్టీకి మంచిది… వెనకేసుకురావడం కాదు, జరుగుతున్న నష్టాన్ని గమనించాలి… రేపల్లె రైల్వే స్టేషన్లో ఓ గర్భిణి మీద జరిగిన అత్యాచారం సమాజమే నివ్వెరపోయేలా ఉంది… నిజానికి ఆ దుర్మార్గంలో సొసైటీని కూడా నిందించాలి… రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అత్యంత నీచంగా వ్యవహరించగా… ఆ […]
ఉక్రెయిన్ వార్… సందట్లో సడేమియా… మధ్యలో ఎవరి ఆట వాళ్లు ఆడేస్తున్నారు…
పార్ధసారధి పోట్లూరి ……. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ! ఏప్రిల్ 22 న టర్కీ తమ ఎయిర్ స్పేస్ ని రష్యాకి చెందిన పాసింజర్ విమానాలతో పాటు మిలటరీ విమానాలు వాడుకోకుండా నిషేధం విధించింది. ఇది సిరియా నుండి రష్యా వెళ్ళే ప్రయాణీకుల విమానాలని ఆపేయడానికే ! ఇక సిరియాలోని షియా వర్గానికి చెందిన అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ కి మద్దతుగా గత 8 ఏళ్లుగా రష్యా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే […]
- « Previous Page
- 1
- …
- 101
- 102
- 103
- 104
- 105
- …
- 149
- Next Page »