నిజానికి ఇందులో విక్కీ, కత్రినాల తప్పేమీ లేదు… మస్తు డబ్బుంది, కీర్తి ఉంది, సాధన సంపత్తి ఉంది, చిటికేస్తే చాలు సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి… అదేదో సినిమాలో శ్రీదేవితో వెంకటేష్ అంటాడు కదా… కో అంటే కోతి, దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి… వాళ్లిద్దరూ కో అన్నారు… ఇంకేముంది..? వాళ్ల పెళ్లికి వేదికగా మారిన సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్ హోటల్ ఓవరాక్షన్‌కు దిగింది… ఇక ప్రపంచంలో ఎవరికీ పెళ్లే కానట్టు, ఇంతకుమించిన ఘనమైన పెళ్లి […]
భజన చేయకపోతే బహుపరాక్… బంగాళాఖాతంలోకి విసిరేస్తాం…
ఎమర్జన్సీ… ప్రభుత్వ వ్యతిరేక వార్త అనిపిస్తే చాలు, జర్నలిజంతో ఏమాత్రం టచ్ లేకపోయినా సరే అధికారులు రంగంలోకి దిగేవాళ్లు… కత్తి కట్టేవాళ్లు, సెన్సార్ అనేవాళ్లు, కొరడా పట్టుకునేవాళ్లు, ఒరేయ్, నీ పత్రిక రావాలని లేదా అని బెదిరించేవాళ్లు, జైళ్లోకి వెళ్లాలని ఉందా అని కూడా మెడ మీద కత్తి పెట్టేవాళ్లు… దేవుడా అనుకుంటూ సదరు పత్రికలు వాటికి బ్లాక్ చేసి, పత్రికల్ని రిలీజ్ చేసేవి… అంతే… పత్రికలపై సెన్సార్ అంటే అలాగే ఉండేది… తెలంగాణలో ఒకరకం ఎమర్జెన్సీ… […]
వేల కోట్లు..! మన డబ్బే విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది..!!
స్వదేశీ కంపెనీ అయితే… ఇక్కడ సంపాదించిన ప్రతి పైసా మళ్లీ ఇక్కడే ఏదో ఓ రంగంలో ఇన్వెస్ట్ చేయబడుతుంది… అది ఈ దేశ ఎకనమిక్ యాక్టివిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది… అంటే ఇక్కడే వినియోగించబడుతుంది… కానీ విదేశీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు అయితే..? ఇక్కడి సహజ వనరులు, ఇక్కడి మానవ వనరులతో ఇక్కడే డబ్బు సంపాదించి, ఆ డబ్బును తమ దేశాలకు తరలించుకుంటాయి… అవి ఆ దేశాల ఎకనమిక్ యాక్టివిటీకి దోహదపడుతుంది… సో, ప్రభుత్వాలు ఉచితంగా ఎకరాలకొద్దీ జాగా […]
మన మీడియా కుయ్యోమొర్రో… గూగుల్-ఫేస్బుక్ దున్నేసుకుంటున్నయ్..!!
కరోనా భయాలు, లాక్ డౌన్లు, థియేటర్ బందులు, స్టే హోమ్ ఇబ్బందులు, ఫంక్షన్ల రద్దులు, సోషల్ గ్యాదరింగుల ఆంక్షలు… ఇవన్నీ జనాన్ని ఎటువెైపు నెట్టాయి..? కంప్యూటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఓటీటీల వైపు జనం మళ్లిపోయారు… ఫలితంగా జనం వాడే బ్రాడ్‌బ్యాండ్ పెరిగింది… టైమ్ పెరిగింది… దీని రిజల్ట్ ఏమిటంటే..? గూగుల్, ఫేస్బుక్ మరింత పాతుకుపోయాయి… 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి ఇండియా ఆదాయం ఎంతో తెలుసా..? 23,215 కోట్లు…! 29 శాతం […]
రోశయ్యను కులమూ వదిలేసిందా..? నిజం నిష్టురంగానే ఉంటుంది మరి..!!
ఒక కాకి చనిపోతే… వందల కాకులు గుమిగూడతయ్… ఉమ్మడిగా కన్నీళ్లు పెట్టుకుంటయ్… అది కాకుల్లో కూడా కనిపించే సంస్కారం… జాతి సంస్కారం అనాలి దాన్ని..! అలాగే భారతీయ సమాజంలో కులం అనేది ఓ రియాలిటీ… కులం ప్రభావం లేని రంగం లేదు… అంగీకరించాల్సిన నిజం… ఎవరొచ్చినా రాకపోయినా ఓ మనిషి మరణిస్తే, అదీ ఆ కులానికి ఓ లెజెండరీ ఐకన్‌గా ఉన్న వ్యక్తి దూరమైతే… అప్పటిదాకా రకరకాల లబ్ది కోసం ఆయన చుట్టూ తిరిగి, ప్రదక్షిణలు చేసి, […]
సైబర్ రేప్స్..! ఈ సోషల్ పిశాచాలు చిన్నారులనూ వదలడం లేదు..!!
సోషల్ మీడియా ట్రోలర్స్ ఓ పిశాచజాతి… దానికి ఉచ్చంనీచం, మంచీచెడూ, నీతి-రీతి వంటివేమీ ఉండవు… నిలువెల్లా ఉన్మాదం నింపుకుని, ఫేక్ ఐడీలతో రకరకాల బూతులతో, హీనమైన బెదిరింపులతో దాడి చేసే ఓ రాక్షసగణం అది… సెలబ్రిటీలే కాదు, ఈ ప్రేత గణం ఎవరినీ వదిలిపెట్టదు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కరోనాలో డెల్టా వేరియంట్..!! రీసెంటుగా మీడియాలో పెద్దగా చర్చకు రాని విషయం ఒకటుంది… అది అభిషేక్ బచ్చన్ ఆక్రోశం… ఎందుకంటే..? ఈమధ్య అభిషేక్, ఐశ్వర్యల జంట […]
ఓహో… ఈ ఒమైక్రాన్ వైరస్ పుట్టుకకూ ఓ కొత్త కథ ఉందన్నమాట..!!
ఒమైక్రాన్… దీనికి అంత సీన్ లేదురా నాయనా… అని ఎందరు చెప్పినా మన మీడియా వినదు… మన ప్రభుత్వాలు వినవు… అసలు సమయాల్లో కరోనాను అడ్డుకునే తెలివి లేదు, జనాన్ని ఆదుకున్న ఔదార్యం-సామర్థ్యం లేవు గానీ… ఇప్పుడు తెగ భయపెట్టేస్తున్నారు… ఆంక్షలు, జరిమానాలు, తెగ హడావుడి… మళ్లీ బూస్టర్ల డోసుల పేరిట అడ్డగోలు ధరలకు వేక్సిన్లను జనానికి కుచ్చేయాలనే దందా… WHO చెబుతోంది, ఇప్పటికి ప్రపంచంలో ఒమైక్రాన్ వల్ల ఒక్క మరణం లేదని..! మెలికలుగా, చుట్టలుగా అల్లుకున్న […]
ఫ్యాక్షన్లు లేవ్… కక్షల్లేవ్… దిగజారుడు పాలిటిక్స్ అసలే లేవ్… అందరికీ ఇష్టుడే..!!
ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో కొణిజేటి రోశయ్య కన్నుమూశాడు..! నిజానికి చాన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం కుదురుగా లేదు… వార్ధక్యంతోపాటు వచ్చే సమస్యలే… ప్రతిసారీ ఒక ప్రశ్న కదలాడుతూ ఉంటుంది మన మెదళ్లలో…! ఆయన ఎన్జీరంగా శిష్యుడు, ఫిఫ్టీస్లోనే కామర్స్‌లో డిగ్రీ.., ఆంధ్రా ఉద్యమం… సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకుంటాడు, చదువుతాడు, పరిస్థితులకు సరిగ్గా అన్వయిస్తాడు… కాస్త వ్యంగ్యాన్ని రంగరించి, ప్రత్యర్థుల మీదకు వదిలేస్తాడు… ఇక జవాబు ఏమివ్వాలో తెలియక ఎదుటోడు గిరగిరా కొట్టుకోవాలి… 15 సార్లు ఉమ్మడి తెలుగు […]
‘గుడ్డు’ డెసిషన్… ఒప్పుకోరు కొందరు… అదీ మాంసమేనట, వద్దట… రచ్చ..!!
గుడ్డు శాకాహారమా..? మాంసాహారమా..? మళ్లీ చర్చ ముందుకొచ్చింది… నిజానికి కోడి ముందా..? గుడ్డు ముందా..? అనే చర్చ ఉన్నన్నిరోజులూ… ఈ శాకాహారమా, మాంసాహారమా అనే చర్చ కూడా బతికే ఉంటుంది… ఇప్పుడు కథేమిటంటే..? కర్నాటక ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది… మధ్యాహ్నభోజనంలో భాగంగా పిల్లలకు గుడ్డు ఇవ్వాలనేది ఆ నిర్ణయం… వారానికి మూడు గుడ్లు… అది కూడా కేవలం ఏడు జిల్లాల్లోనే… ఎందుకంటే..? ఆ జిల్లాల్లో పిల్లల పౌష్ఠికాహార స్థాయి బాగా తక్కువగా, రక్తహీనత ఎక్కువగా ఉందట… […]
తమరి బొంద, బోకె… ఆలూ లేదు, చూలూ లేదు… ముప్పు పేరు ఒమిక్రాన్ అట..!!
అదుగో ఒమిక్రాన్…. వచ్చె, వచ్చె… అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక సత్తెనాశ్… అదుగో రెండు కేసులు, హైదరాబాద్ కూడా వచ్చేసిందట… ఈ నీచ్ కమీన్ మీడియా చేస్తున్న దుర్మార్గం, సమాజాన్ని ప్యానిక్ చేస్తున్న దారుణం అంతా ఇంతా కాదు… దిక్కుమాలిన జర్నలిజానికి అజ్ఞానం తోడయితే ఎంత నష్టమో ఒమిక్రాన్ వార్తలే చెబుతున్నయ్… అన్నింటికన్నా నీచం ఏమిటంటే అప్పుడే రాష్ట్రాల వైద్యారోగ్య బాధ్యులు కూడా ఆ రేంజులో మాట్లాడుతుండటం… కొత్తగా ఆంక్షలు, జరిమానాలు అంటూ బెంబేలెత్తించడం… అరాచకానికి అసలైన […]
‘లైంగిక బాధితురాలి’కే శిక్ష..! ఇదెక్కడి న్యాయం కామ్రేడ్స్..?!
అందరికీ నీతులు చెప్పేవాళ్లు… అందరికన్నా నీతిమంతులుగా ఉండేందుకు ప్రయత్నించాలి..! ముందుగా కేరళలోని ఓ కేసు ఏమిటో చదవండి… నిన్న తిరువల్ల పోలీసులు 39 ఏళ్ల సి.ఇ. సాజి అనే వ్యక్తిని అరెస్టు చేశారు… ఆయన అధికార పార్టీ సీపీఎం సభ్యుడు… తనపై కేసు ఏమిటయ్యా అంటే..? తమ పార్టీకే చెందిన ఓ మహిళ నగ్న వీడియోను ఆన్లైన్లో సర్క్యులేషన్లో పెట్టాడు… అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది… ఈ కేసులో సాజితోపాటు మరో పదకొండు మంది నిందితులు, […]
బాదడమే తెలిసిన కరెంటోళ్లు… వసూలైన ఛార్జీలు వాపస్ ఇస్తున్నారహో…
ప్రజాశక్తిలో ఓ సింగిల్ కాలమ్ బాక్స్ కనిపించింది… సీపీఎం సాగించిన పోరాటం, ప్రయత్నంతోనే కరెంటోళ్లు ఇన్నాళ్లూ వసూలు చేసిన వేల కోట్లను మళ్లీ వాపస్ ఇస్తున్నారు అనేది వార్త… ఇది తమ పోరాట ఫలితమే అని ఓన్ చేసుకుంటున్నారు… తప్పేమీ లేదు, అర్హులే… నిజం, వాళ్లే ఆ ట్రూఅప్ చార్జీల వెంట పడ్డారు… అందుకే ఈ ఆందోళనతో ఏమొస్తుంది, ఈ పోరాటంతో ఏమొస్తుంది అనే నిస్పృహ అక్కర్లేదు… ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు, వ్యవస్థల మీద పట్టు వదలని […]
ఫాఫం పీకేను నమ్మిన మమత… ప్రధాని పీఠంపై అంతులేని ఆశలు…
పెద్ద పెద్ద రాజకీయ పండితులు అవసరం లేదు… మమతకు ప్రధాని పీఠంపై కన్నుపడింది, ఆశ పెరిగింది, చాన్స్ కనుచూపు మేరలో లీలగా కనిపిస్తోంది… మొన్నటి గెలుపుతో ధీమా పెరిగింది… పీకే మీద భరోసా కుదిరింది… కాంగ్రెస్ రాహుల్‌తో ఇక వేస్టని తేల్చేసుకుంది… ఇక ఆట మొదలెట్టింది… అసలు ఈ ఆట నుంచి కాంగ్రెస్‌ను డిలిట్ చేయాలని అనుకుంటోంది… శరద్ పవార్‌ను కలిసింది… కూటమి కడదాం అని చెప్పింది, తనూ సరే అన్నాడు… (ఒకవైపు కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో […]
ఓహ్… ఈ ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ పేరు వెనుకా ఇంత కథ ఉందా..?
….. By…. పార్ధసారధి పోట్లూరి………… కొత్త కోవిడ్ వేరియంట్‌కు ఓమ్రి కాన్ అని ఎందుకు పేరు పెట్టింది WHO..? OMICRON పేరు ఎక్కడి వచ్చింది..? Well…! ప్రపంచ ఆరోగ్య సంస్థని మొదటి నుండి చైనా ప్రభావితం చేస్తున్నది అని పోయిన సంవత్సరమే అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగానే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే..! అదే సమయంలో WHO కి ఇచ్చే అమెరికన్ ఫండ్స్ మీద కోత కూడా పెట్టాడు… అదే సమయంలో కోవిడ్ ని చైనా […]
‘సిరివెన్నెల’పై సోషల్ రచ్చ… మునుపెన్నడూ లేని ఓ విపరీత ధోరణి…
ఫేస్బుక్లో ఓ మిత్రురాలు ఉవాచ… ఎవరి మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు, అనర్హుల మరణానికి నివాళీ అక్కర్లేదు..! యుద్ధాల్లో మినహా… మనకు నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా మరణించినప్పుడు సంతాపం ప్రకటించడం, మరీ నచ్చని వ్యక్తి అయితే నిశ్శబ్దంగా ఉండటం..! కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుజనం ధోరణి విస్తుగొలుపుతోంది… ఎవరైనా సెలబ్రిటీ మరణిస్తే తన కులాన్ని బట్టి, తన రాజకీయ భావజాలాన్ని బట్టి, వ్యక్తిత్వాలు అంచనా వేయబడుతున్నయ్, వృత్తిలో ప్రతిభకు కొత్త కొలతలు వేయబడుతున్నయ్… కటువైన విమర్శలు పోస్టవుతున్నయ్… […]
యోగి..! తను మారడు, మారే సవాలే లేదు… ఏమైనా రానీ, ఉక్కుపాదమే…
యూపీటెట్… ఉపాధ్యాయుల నియామకం కోసం ఉద్దేశించిన అర్హత పరీక్ష… దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు… పేపర్ లీకైంది… ఏం చేయాలి..? వేరే ప్రభుత్వం అయితే ఏదో ఎంక్వయిరీ అంటుంది, సీఐడీకి అప్పగిస్తుంది, అదెప్పుడూ తేలదు… ఈలోపు పార్టీలు ఒకరినొకరు బదనాం చేసుకుంటయ్… అసలే యూపీలో అరాచకానికి మారుపేరుగా ఉండే అఖిలేష్ పార్టీ, మధ్యలో దూరి పూర్వవైభవం కోసం నానా కష్టాలూ పడుతున్న ప్రియాంక వాద్రా… విమర్శలు స్టార్ట్… బురద జల్లుకోవడం స్టార్ట్… కానీ అక్కడున్నది యోగీ […]
భేష్ రామయ్యా… చప్పట్లు కొడదాం… కానీ విపత్తు సన్నద్ధత మాటేమిటి..?!
పొద్దున్నే అభినందించడం మరిచిపోయా… వందల మందిని ఓ విపత్తు నుంచి కాపాడిన మాజీ లష్కర్ రామయ్య… తన వార్తకు తగిన ప్రయారిటీ ఇచ్చిన ఆంధ్రజ్యోతి… వార్త రాసిన రిపోర్టర్‌కు అభినందనలు… మీకు ధర్మాడి సత్యం అనే పేరు గుర్తుందా..? పెద్ద పెద్ద ఇంజనీర్లు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేతులెత్తేసిన చోట, గోదావరి అడుగు నుంచి ఓ లాంచిని నొగలు పట్టి, మెడలు పట్టి, ఒడుపుగా గట్టు మీదకు లాక్కొచ్చి పడేసిన సత్యం… తనకు తెలిసిన సంప్రదాయిక టెక్నిక్స్, అనుభవం, […]
ఈ జిల్లాలో అస్సలు పేద అనేవాడు ఒక్కడూ లేడట తెలుసా…!!
నిన్న ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించడం మరిచిపోయింది, ప్రశంసించడం విస్మరించింది మన మీడియా… ఆ జిల్లా పేరు కన్నూరు… కేరళ… నిన్న నీతి ఆయోగ్ విడుదల చేసిన పావర్టీ ఇండెక్స్‌లో ఆ జిల్లా ప్రత్యేకత ఏమిటో తెలుసా..? జీరో పావర్టీ… నిజం… ఆ జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవాళ్లెవరూ లేరు… నీతి ఆయోగ్ తీసుకున్న ప్రమాణాల మేరకు..! ఈ ప్రమాణాలు కరెక్టేనా అనే చర్చలోకి వెళ్దాం కానీ, వాళ్లు ఎంచుకున్న ఆ ప్రమాణాల మేరకైనా సరే, ఈ […]
ఆపండ్రోయ్… ఫార్మా దందాకు ఇప్పుడు ఒమిక్రాన్ దొరికింది… అంతే…
Amarnath Vasireddy…….. ఉత్తుత్తి గాలివాన ! ఫ్లూ .. అంటే సాధారణ జలుబు . మీకు ఎన్ని సార్లు జలుబు చేసింది ? ఇదేంటి పిచ్చి ప్రశ్న అనుకొంటున్నారు కదా ? జలుబు ను ఎవడు పట్టించుకొంటారు ? ఎందుకు లెక్క పెడుతారు .. ఇది కదా మీ ఆలోచన . ఆగండి. తెల్లోళ్ళ దేశాలు వున్నాయి కదా . అదే అమెరికా, యూరోపు .. ఇక్కడ ఫ్లూ కు వాక్సిన్ వుంది . సంవత్సరానికి రెండుసార్లు […]
నార్త్ నేతల భాషే కాదు, భావమూ అంతుపట్టదు… రిపోర్టర్లూ బహుపరాక్…
ఇది దిశ అనే ఈ-పేపర్లో ఫస్ట్ పేజీలో కనిపించిన సవరణ… (ఐనా ఇయ్యాల్రేపు చాలా చిన్న పత్రికలు పేరుకే ప్రింట్.., ఆచరణలో వెబ్, వాట్సప్ ఎడిషన్లే కదా… రాబోయే రోజుల్లో ఇక డిజిటల్ ఎడిషన్లదే రాజ్యం…) ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే… మొన్న సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ హైదరాబాద్ వచ్చాడు కదా… టీఆర్ఎస్కు ఓటేయొద్దు, ఆ పార్టీ బీజేపీకి బీ టీం అన్నట్టుగా ఈ పత్రిక ఓ వార్త రాసింది… కానీ నిజానికి […]
- « Previous Page
- 1
- …
- 105
- 106
- 107
- 108
- 109
- …
- 141
- Next Page »