రాక రాక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా ఎదగాలంటే… ముందుగా నోటిని అదుపులో పెట్టుకోవాలి, ప్రతి మాటా ఆచితూచి వాడాలి, మాటల్లో సంస్కారాన్ని ప్రోదిచేయాలి, హుందాగా అడుగులు వేయాలి, పరిపక్వ రాజకీయం వైపు ఆలోచించాలి… కానీ మన తెలుగు రాష్ట్రాల రాజకీయం మొత్తం బూతులు, కక్షసాధింపులు, అబద్ధాలు, యూటర్నులు, కేసులే కదా… ఒక్కసారి స్టాలిన్ వైపు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది… జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు… తోటి భాగస్వామ్య పక్షాలకు సీట్ల కేటాయింపు […]
ఆంధ్రజ్యోతి ఎలా ఏడ్చినా సరే… ఈ విషయంలో జగన్ అడుగులు సబబే…
నో డౌట్… ఏపీ ప్రభుత్వ వ్యవహారాలను అమరావతి ఆంధ్రజ్యోతి రిపోర్టింగ్ విభాగం ఇట్టే పట్టేసుకుంటోంది… మిగతా పత్రికలకు చేతకావడం లేదు… పత్రికల్లో అదొక్కటే కాస్త గట్స్ చూపిస్తోంది… ఐతే సమస్య ఎక్కడొస్తుందీ అంటే… పెండను, బెల్లాన్ని ఒకేరీతిన చూడటం, ప్రతిదీ జగన్ మీదకు విషంగా మార్చేసి అచ్చేయడం అలవాటైపోయింది దానికి… ఉదాహరణ కావాలా..? మొన్నామధ్య కొత్త జిల్లాల ఏర్పాటు మీద కేంద్రం నిషేధం పెట్టింది, జగన్ జనం చెవుల్లో పూలు పెడుతున్నాడు అని ఫస్ట్ పేజీలో ఓ […]
జగన్మోహన్రెడ్డి ఈడీ కేసుల కీలకాధికారికి యూపీలో బీజేపీ టికెట్టు..!
సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులు అనగానే గుర్తొచ్చే పేరు సీబీఐ నుంచి అప్పటి జేడీ లక్ష్మినారాయణ పేరు… తరువాత రాజకీయాల్లో చేరి, చేదు అనుభవం మూటగట్టుకుని, ప్రస్తుతం తనేమిటో తనకే అర్థం కాని అయోమయంలో ఉన్నట్టున్నాడు… మరో పేరు గుర్తొస్తుంది… ఈడీ నుంచి జేడీ రాజేశ్వర్ సింగ్… దేశంలో పెద్ద పెద్ద కేసుల్ని ఈడీ తరఫున డీల్ చేసిన ఈయన ఇప్పుడు యూపీలో బీజేపీ టికెట్టు మీద పోటీచేస్తున్నాడు… ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ […]
ఎంత సోకినా… ఎందరికి అంటుకున్నా… ఆందోళన వద్దు, దాని పనైపోయింది…
Yanamadala Murali Krishna……………. *** రానున్నదంతా ఒమిక్రానే… కోవిడ్ పీడ ఇక అంతానికి చేరువలో…*** కొరోనా వైరస్ రక రకాలుగా రూపాంతరం చెందుతూ, 2021 నవంబర్ 24 నాటికి ఒమిక్రాన్ రకంగా పరిణమించింది. తొలిగా దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఈ రకం వైరస్ విపరీతమైన వేగంతో వ్యాపించగలదు. అయితే ప్రధానంగా ముక్కు, గొంతు కణజాలానికి పరిమితమవుతుంది. విధ్వంసాన్నీ, విషాదాన్నీ సృష్టించిన డెల్టా రకం కొరోనా వైరస్ తరహాలో ఇది ఊపిరితిత్తుల కణజాలానికి వ్యాపించడం, అక్కడ పెరిగే అవకాశాలు […]
జపాన్ యుద్ధవిమానం అదృశ్యం వెనుక… చైనా కొత్త విధ్వంసక ఆయుధం…!?
….. By…. పార్ధసారధి పోట్లూరి…… జపాన్ లో అదృశ్యమయిన యుద్ధ విమానం! 31-01-2022 సోమవారం, ఉదయం రొటీన్ ప్రాక్టీస్ కోసం [JASDF] జపనీస్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కి చెందిన F-15 Eagle యుద్ధ విమానం జపాన్ లోని కొమాట్సు ఎయిర్ బేస్ నుండి గాల్లోకి ఎగిరిన 5 నిముషాల్లో రాడార్ తెర మీద నుండి అదృశ్యం అయిపోయింది. కడపటి వార్తలు అందే నాటికి జపాన్ సముద్రంలో కూలిపోయి ఉండవచ్చు అని భావిస్తున్నారు. అమెరికాకి చెందిన లాక్ […]
శవపాత్రికేయం… ఆ అమ్మాయి మృతదేహంపై పేలాలు ఏరుకుంటోంది…
కులగజ్జి రాజకీయాలే కాదు… ఏపీ రాజకీయాలు ఎంత భ్రష్టుపట్టిపోయాయంటే… చివరకు ఓ పద్నాలుగేళ్ల బాలిక లైంగిక వేధింపులకు బలైపోతే, ఆ పిల్ల శవం మీద పేలాలు ఏరుకుంటున్నారు నేతలు, పార్టీలు, పత్రికలు, టీవీలు ప్లస్ సోషల్ మీడియా… సమాజం కుళ్లి కంపు కొడుతోంది…!! ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ విజయవాడ అమ్మాయి మరణానికి కారకుడు వినోద్ జైన్ అనే యాభయ్యేళ్ల వ్యక్తి… ప్రస్తుతం ఏవగింపు పుట్టిస్తున్న పార్టీల ధోరణి చూస్తుంటే, ఆ అమ్మాయి మరణాన్ని పొలిటికల్‌గా ట్విస్ట్ […]
“సేటూ… కిలో ఉప్పు, 3 కిలోల పప్పు, ఒక పేస్ట్, 4 సబ్బులు… 2 విస్కీ, 4 బీర్లు…’’
మీరు మీ వీథిలోనే ఉన్న ఓ కిరాణా షాపుకి వెళ్తారు… ఉప్పు, పప్పు, పేస్ట్, బియ్యం, సబ్బులతోపాటు… సేటూ, నాలుగు రెడ్ వైన్ బాటిల్స్, రెండు విస్కీ ఫుల్ బాటిల్స్ కూడా లిస్టులో చేర్చండి అంటారు… జస్ట్, కిరాణా సామగ్రిలాగే అవీ మీ ఇంటికి చేరతాయి….. భవిష్యత్తు అదే… అబ్బే, అదెలా కుదురుతుంది..? లైసెన్సులు, లాటరీలు, సిండికేట్లు, లంచాలు గట్రా చాలా బాగోతాలు ఉంటాయి లెండి అంటారా..? నో… గ్రాసరీ షాపుల్లో కూడా లిక్కర్ దొరికే రోజులు […]
ప్రతి ముగ్గురిలో ఒకరు చచ్చిపోవాల్సిందేనా..? జాగ్రత్తగా చదవండి ఓసారి…!!
పోతారు… చచ్చిపోతారు… దక్షిణాప్రికాలో ఓ కొత్త కరోనా వైరస్ కనిపించింది… అది చాలా ఫాస్ట్‌గా వ్యాపిస్తుంది… ఒకసారి సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు చచ్చిపోవాల్సిందే… బీకేర్ ఫుల్………… ఇదీ చైనా శాస్త్రవేత్తల పేరిట విడుదలైన హెచ్చరిక… ప్రస్తుతం ప్రపంచమంతా ఒమిక్రాన్ వ్యాప్తిలో మునిగాక, దేవుడిచ్చిన వేక్సిన్ అది, ఇక కరోనా బెడద తొలగినట్టే అనుకుని ఆంక్షలు కూడా సడలిస్తున్నవేళ… నో, నో, మేం ఒప్పుకోం అన్నట్టుగా చైనా ఈ కొత్త ప్రచారానికి దిగింది… ప్రపంచం మీద చైనా […]
హవ్వ… పెళ్లి ఖర్చులు, హోటల్ బిల్లుల చెల్లింపులకు షెల్ కంపెనీలా..?!
2005… ఒక ఐఏఎస్ ఆఫీసర్… 21 లక్షల నగదును కర్నాటకకు తరలిస్తూ, బేగంపేట ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడు… అప్పట్లోనే 21 లక్షల నగదు అంటే తక్కువ అమౌంట్ కాదు.., అన్నీ 500, 1000 రూపాయల నోట్లు… ఓ ఐఏఎస్ అధికారికి కాల్ చేసి అడిగాను.., ఏమవుతుంది చివరకు అనేది నా ప్రశ్న… ఆయన పకపకా నవ్వాడు… ‘‘ఏమీ జరగదు, అది మరిచిపో… కానీ నగదును బయటికి ఎలా తరలించాలో, ఎక్కడ పట్టుబడే చాన్స్ ఉంటుందో కూడా తెలివి లేకపోతే […]
నా బ్రా సైజ్ కొలుస్తున్నాడు… కృష్ణుడిపై ఓ టీవీ నటి వెకిలి వ్యాఖ్య…
ఈమధ్య హిందూ ధర్మపరిరక్షక్ పాత్ర పోషిస్తున్న మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రాకు మరో కేసు దొరికింది… హిందూ దేవుళ్లు అనగానే రెచ్చిపోయి వెకిలి నవ్వులు, వ్యాఖ్యలకు దిగే సెలబ్రిటీలే ఆయనకు ఆ ఆస్కారం కల్పిస్తారన్నమాట… ఆమధ్య సన్నీలియోన్ గనుక క్షమాపణ చెప్పకపోతే మూడు రోజుల్లో లాక్కొచ్చి జైలులో పడేస్తా అని హెచ్చరించిన వార్త గుర్తుంది కదా… ఆయనే నరోత్తముడు… ఇప్పుడు తాజా ఏమిటంటే… శ్వేత తివారీ అనినలభయ్యేళ్ల వయస్సున్న ఓ టీవీ నటి… బిగ్‌బాస్ హిందీ […]
మోడీ ప్రభూ… మీ ప్రజల ఆరోగ్యం మీద కూడా వ్యాపారమేనా జహాపనా..?!
కరోనా వేక్సిన్ ఓపెన్ మార్కెట్ కోసం కమర్షియల్‌గా ఒక డోస్ 275 రూపాయలట… 150 సర్వీస్ ఛార్జి అట… గుడ్… ఈ సర్వీస్ చార్జి మీద మళ్లీ జీఎస్టీ ఉండవచ్చుగాక…. కానీ ఇష్యూ అది కాదు… ఇక్కడ కొన్ని ప్రశ్నలు… సమాధానం మోడీ ప్రభుత్వానికి చేతకాదు… వేక్సినేషన్ స్టార్టయి 150 కోట్ల మందికి పూర్తయిపోయినా సరే, ఈ దేశప్రజల ప్రశ్నలకు జవాబులు మాత్రం మోడీకి చేతకావు… చెప్పడు… అసలు పాలన తెలిస్తే కదా… హార్ష్‌గా ఉన్నట్టు అనిపిస్తోందా..? […]
రష్యా Vs అమెరికా… ఆధిపత్య యుద్ధం… కొత్త ఆయుధాల పరీక్ష కూడా..!!
(రచయిత :: పార్ధసారధి పోట్లూరి…….. ) దాదాపుగా ఒక లక్షా 20 వేల మంది సైనికులని రష్యా తన సరిహద్దుల దగ్గరికి తరలించింది. చాలాకాలంగా ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ! 2014 లో రష్యా క్రిమియాని ఆక్రమించిన సంగతి తెలిసిందే ! ఇప్పుడు ఉక్రేయిన్ ని స్వాధీనం చేసుకోవడానికి పట్టుదలగా ఉన్నది రష్యా !మరోవైపు నాటో దేశాలు కూడా తమ సైనికులని ఉక్రేనియన్ సరిహద్దుల దగ్గరికి తరలిస్తున్నాయి. […]
ఇది పాన్ ఇండియా మీడియా అన్నమాట… ప్రత్యేకించి దక్షిణభాషలపై కన్ను…
తప్పేమీ కాదు, తప్పేదేమీ లేదు… తప్పదు… బీజేపీ తమ అనుకూల మీడియా కోసం బాగా తాపత్రయపడుతోంది… పాన్ ఇండియా సినిమాల్లాగే, పాన్ ఇండియా మీడియా ఇప్పుడు ట్రెండ్… పాన్ ఇండియా మీడియా అనగానే హిందీ, ఇంగ్లిష్ మాత్రమే అనుకోకండి… ఆ కాలం పోయింది… పాన్ ఇండియా సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు… సేమ్, మీడియా కూడా… పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఇన్నాళ్లూ ఈ భాషల్లో మీడియాను లోకల్ […]
పంజాబ్ మళ్లీ కాంగ్రెస్ చేతుల్లో పడితే..? ఖలిస్థానీ శక్తులకు ఊతమే..!!
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ఓ ముచ్చట చెప్పాడు… అసాధారణం ఏమీ కాదు, కానీ పంజాబ్‌లో వరుసగా కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు, పంజాబ్ వేగంగా మళ్లీ ఆందోళనకర పరిస్థితుల్లోకి వెళ్తున్న సంకేతాల్లో దీన్ని కూడా చూడొచ్చు… ప్రత్యేకించి కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయం, కేంద్ర ప్రభుత్వ వ్యూహరాహిత్యం, చేతకానితనం కూడా కనిపిస్తాయి… అమరీందర్ గతంలో కూడా పలుసార్లు పాకిస్థాన్ నుంచి వచ్చిపడుతున్న బెడదల గురించి బహిరంగంగానే మాట్లాడాడు… ఇప్పుడేమంటాడంటే..? ‘‘నవజోత్ సింగ్ సిద్ధూను తిరిగి కేబినెట్లోకి తీసుకోవాలంటూ పాకిస్థాన్ […]
ధైర్యం చెప్పేవాళ్లే కాదు… మంచి వైద్యసలహాలు కావాలిప్పుడు… ఇది అదే…
అధికశాతం ఒమిక్రాన్ కేసులే… దాదాపు 5 శాతంలోపే డెల్టా కావచ్చు… అది చాలు కార్పొరేట్ మాఫియాకు… అది డెల్టాయా, ఒమిక్రానా తేల్చే పరీక్ష చేయించాలి అంటూ హాస్పిటల్స్‌కు వచ్చే రోగులతో నిర్బంధంగా చేయిస్తున్నారు… దానికీ 5 వేల నుంచి 10 వేల చార్జ్ చేస్తున్నారు… మనం అనుకుంటున్నాం కదా, ఒమిక్రాన్ చాలా మైల్డ్… ఇప్పుడది జలుబుతో సమానమే అని… చాలా దేశాలు ఆంక్షల్ని కూడా ఎత్తేశాయి… డెల్టా నాటి చికిత్స ప్రోటోకాల్ కూడా ఇప్పుడు లేదు… విచ్చలవిడిగా […]
యోగి ఓడితే ఇక జైళ్లు బార్లా…! ఆ దుష్టశక్తులన్నీ మళ్లీ జనంపై పడతయ్…!!
కొన్ని వార్తలు మనదాకా రావు… రానివ్వరు… మెయిన్ స్ట్రీమ్ మీడియా జ్ఞానులు తమ సెక్యులర్ పాతివ్రత్యం ఎక్కడ మంటగలిసిపోతుందో అని భయపడి, కొంగులు తలపైకి కప్పుకుంటారు… అప్పుడెప్పుడో కాశ్మీర్లో హిందువులను ఊచకోత కోసి, బయటకు తరిమేసిన సంగతే చెప్పడానికి ఇబ్బందిపడతారు… ప్రపంచమంతా తెలుసు, ముష్కరులే గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఒక్క మీడియా సంస్థకు కూడా దాన్ని ప్రస్తావించే దమ్ము ఉండదు… అక్కడిదాకా దేనికి..? ఉత్తరప్రదేశ్‌లో యాదవ-ముస్లిం మాఫియా గ్యాంగులు సాగించిన అరాచకం దేశప్రజలకు తెలిసింది ఎక్కడ..? టీఆర్ఎస్ […]
ఇప్పటికీ కరోనా పేరు చెప్పి భయపెట్టే బూచాళ్లు ఉన్నారు, జాగ్రత్త సుమా…!!
Amarnath Vasireddy…… ఓమిక్రాన్ సోకి కోలుకొన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయా ? కరోనాకు టాటా చెప్పేముందు కొన్ని ముఖమైన మాటలు! శ్రద్ధగా చదవండి… నవంబర్ నెల చివరి వారంలోనే ఓమిక్రాన్ వల్ల ప్రమాదం లేదని, ఇది జలుబు లాంటిదని, తేటతెల్లం అయిపోయింది. కానీ సంక్రాంతి పండుగ దాకా, ఓమిక్రాన్ సోకితే ప్రాణాలు పోతాయని, లాక్ డౌన్ పెట్టేస్తున్నారని, భీతి గొలిపే ప్రచారం జరిగింది… నేను ఈ మెసేజ్ రాసేనాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నూటికి డెబ్భై మందికి, […]
డాక్టర్ గారూ… నెలకు ఒక బూస్టర్ టీకా చాలా..? రెండు పొడిపించుకోనా..!!
WHO… కరోనా భూతం ఇంత చెలరేగి, ప్రపంచమే అల్లకల్లోలం కావడానికి మొదటి నిందితుడు చైనా… రెండో నిందితుడు మొత్తం వ్యవహారాన్ని దారితప్పించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ… అది చేయాల్సింది చేయలేదు సరికదా మొత్తం భ్రష్టుపట్టించింది… అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భోళాగా వెల్లడించాడు… అందరూ చైనా వ్యతిరేకతతో ఏదో కూస్తున్నాడు అనుకున్నారు… కానీ ట్రంప్ చెప్పిందే నిజం… వైరస్ వ్యాప్తి మొదట్లోనే WHO మొత్తం ప్రపంచాన్ని తప్పుడుదోవ వైపు తీసుకెళ్లిందని రకరకాల విశ్లేషణలు వచ్చాయి… తరువాత చికిత్స […]
ఎంత మంచి వార్త..? ఎంత మంచి ఫోటో..? ఈనాడుకు అభినందనలు…!
కొన్ని వార్తలను అభినందించడానికి పెద్ద ఉపోద్ఘాతాలు, వివరణలూ అక్కర్లేదు… జస్ట్, ఆ ఫోటో చూసి, ఆ రైటప్ చదివితే చాలు… విషయం మొత్తం అర్థమైపోతుంది… బోలెడంత వ్యాఖ్యానం, వార్త అవసరం లేదు… ఒక మంచి ఫోటో చాలా పెద్ద వార్తను చెబుతుంది… అదే ఇది… నిజానికి ఇప్పుడు ఈనాడు పాత్రికేయ ప్రమాణాల కోణంలో చూస్తే ఆ పత్రిక ఓ చప్పిడి పథ్యం తిండి బాపతు… దాని ఘనత అంతా ఒకప్పటి వైభవం… ఇప్పుడు ఆ పత్రికలో చదవడానికి […]
పర్రీకర్ బీజేపీకి ఓ ఆస్తి ఒకప్పుడు..! పర్రీకర్ కొడుకు ఉత్పల్ ఓ తల్నొప్పి ఇప్పుడు..!!
అవి గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ మరణించినప్పటి రోజులు… తన నిజాయితీ, తన నిరాడంబరత, తన నాయకత్వ లక్షణాలు, స్థూలంగా పర్రీకర్ అంటే అభిమానించనివాళ్లు లేరు… గోవాలో అయితే మతానికి, కులానికి అతీతంగా తన పట్ల విశేషమైన ఆదరణ ఉండేది… గ్రేట్ పర్సనాలిటీ… తను మరణించిన తరువాత ఓ విలేకరి పర్రీకర్ కొడుకు ఉత్పల్‌ను అడిగాడు… ‘‘మీరేనా పర్రీకర్ రాజకీయ వారసులు..?’’ ఇదీ సూటి ప్రశ్న… నిజానికి పర్రీకర్ తను బతికినన్నిరోజులూ […]
- « Previous Page
- 1
- …
- 106
- 107
- 108
- 109
- 110
- …
- 146
- Next Page »