‘‘…. అంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మనుషులా..? పనిచేసినా, చేయకపోయినా, లంచాలతో తెగబలిసినా, పనిచేయడమే తెలియకపోయినా సరే, వాళ్లను మిగతా ప్రజలందరూ అల్లుళ్లలాగా మేపాలా..? ఈ కరోనా సంక్షోభంలో ఎన్నివేల ప్రైవేటు కొలువులు పోయాయి..? ఎన్ని వేల కుటుంబాలు బజార్నపడ్డాయి… వ్యవసాయం దెబ్బతిని ఎన్ని ఆత్మహత్యలు జరగడం లేదు..? ఏం..? వాళ్లంతా మనుషులు కారా..? ఒక్కసారి ప్రభుత్వ కొలువు వస్తే ఇక చచ్చేదాకా మేపే బాధ్యత సమాజానిదేనా..? అసలు జగన్‌కు దమ్ముందా..? తన వైఖరి మీద నిలబడే […]
ఖర్మకాలి ఈ దిక్కుమాలిన ఆంధ్రజ్యోతి కథనం చదవబడితిని…!!
పొద్దున్నే ఓ దిక్కుమాలిన వార్త చదవబడితిని… నిజానికి ఇతర తెలుగు పత్రికల్లో వచ్చే రాజకీయ వార్తలతో పోలిస్తే ఆంధ్రజ్యోతి కథనాలు మంచి దమ్ బిర్యానీ టైపులో ఉండునని ప్రతీతి… (తెలుగు రాజకీయ వార్తలు మినహా.., ఎందుకనగా, అవి పసుపు రంగులో చిక్కగా అదోమాదిరి వాసన వేస్తుండును)… కానీ ఈ ఉత్తరప్రదేశ్ కథనమొకటి చదివాక ఆంధ్రజ్యోతి మీద అపారముగా జాలికలిగెను… అసలు రాధాకృష్ణుడు తన పత్రికలో, తన టీవీలో, తన సైటులో ఏం వార్తలు వస్తున్నాయో వెనుతిరిగి చూసుకుంటున్నాడా […]
యదువంశంలో ముసలం… చిన్నమ్మపై అఖిలేష్ మంట… బీజేపీ పెట్రోల్…
నువ్వు నా పార్టీలో మంట పెడితే… నేను నీ ఇంట్లోనే చిచ్చు రాజేస్తా…… అలాగే ఉంది యూపీలో బీజేపీ కౌంటర్ పాలిటిక్స్ తీరు..! యదువంశంలో ముసలం పుట్టినట్టు… ఇప్పుడు ములాయంసింగ్ యాదవ్ ఇంట్లో లుకలుకలు, కైలాట్కాలు ముదిరిపోయాయి… కుతకుతలాడటమే కాదు, చీలిక స్పష్టంగా కనిపించి, అవి పార్టీ రాజకీయాల్నే బజార్న పడేస్తున్నయ్… మొన్న మనం చెప్పుకున్నాం కదా… ములాయంసింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరబోతోంది అని… దానికి కారణాలేమిటో, కుటుంబం మీద కులం […]
మరో బ్రేకప్..! ఇదీ ఓ పాపులర్ జంటే… ఇద్దరికీ రెండో పెళ్లి, అదీ పెటాకులు..!!
అప్పట్లో మహాభారత్ దూరదర్శన్ సీరియల్ ఓ సంచలనం… ఆమధ్య కరోనా ఫస్ట్ వేవ్, లాక్ డౌన్ సందర్భంగా మళ్లీ ప్రసారం చేస్తే మళ్లీ టీఆర్పీల్లో రికార్డ్ క్రియేట్ చేసింది… అందులో శ్రీకృష్ణ పాత్రధారి పేరు నితిశ్ భరధ్వాజ్… దాంతో బాగా పాపులర్ అయిపోయాడు… ఇప్పుడు ఆయన ప్రసక్తి ఎందుకంటారా..? 59 ఏళ్ల వయస్సులో పెళ్లానికి విడాకులు ఇచ్చాడు… ఇప్పుడు అంతా సెలబ్రిటీల పెటాకుల వార్తలే కదా ట్రెండింగ్… ఆ జాబితాలోకి ఆయన కూడా చేరిపోయాడు… పన్నెండేళ్ల బంధానికి […]
నచ్చింది వార్త..! పెళ్లిళ్ల భారీ ఖర్చులపై ‘క్యాంపెయిన్’ ఇలాగే సాగాలి..!!
కొన్ని వార్తలు అసలు ఎందుకు మెయిన్ స్ట్రీమ్‌కు కనిపించవో, అవి వార్తలుగా ఎందుకు పరిగణనలోకి తీసుకోరో అర్థం కాదు… సొసైటీకి మంచి జరిగే ఆలోచనలు, వార్తలు మెయిన్ స్ట్రీమ్‌కు అస్సలు అక్కరలేదా..? ఈ వార్త ఫేస్బుక్లో ఓ మిత్రుడి వాల్ మీద కనిపించింది… వేములవాడలో ముస్లిం కమ్యూనిటీ ఓ భేషైన నిర్ణయం తీసుకుంది… అదేమిటో మీరే చదవండి… Mujahid Pasha…………. అమ్మాయి పెళ్లిలో విందు భారం వద్దు వేములవాడ గ్రామస్థుల తీర్మానం నికాహ్ (పెళ్లి) ఖర్చు అమ్మాయి తల్లిదండ్రులకు […]
చెన్నైలో రజినీ బిడ్డ ఐశ్వర్య… హైదరాబాదులో చిరంజీవి బిడ్డ శ్రీజ… ఒకేరోజు..?!
రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య… హీరో ధనుష్ విడాకుల వార్త ఇప్పుడు గాసిప్ కాదు, రూమర్ కాదు… హఠాత్తుగా అది అధికారికం అయిపోయింది… ధనుషే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు కాబట్టి…. కానీ ఒకవైపు తమిళ సుప్రీం మెగా స్టార్ రజినీకాంత్ బిడ్డ విడాకుల వార్త టాంటాం అయినరోజే… తెలుగు సుప్రీం మెగా స్టార్ చిరంజీవి బిడ్డ విడాకుల వార్త కూడా ఒక్కసారిగా టాంటాం అయిపోతోంది… సరే, ధనుష్ విడాకుల వార్త అధికారికం… మరి చిరంజీవి బిడ్డ సంగతి..? […]
ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయినట్టు..? 18 ఏళ్ల బంధం ఎందుకు తెగినట్టు..?!
పెద్ద విశేషం ఏమీ అనిపించదు కొన్నిసార్లు… టీవీ, సినిమా, మోడల్ రంగుల రంగాలే కాదు… సాధారణంగానే విడాకుల కేసులు పెరిగిపోతున్నయ్… ఏళ్లపాటు కాపురాలు చేసి, పెద్ద పిల్లలు ఉన్న దంపతులు సైతం విడిపోయి, ఎవరి బతుకులు వాళ్లు బతకడానికి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు… అడ్జస్ట్మెంట్ అనేది లేదిప్పుడు… కటీఫ్ అనేస్తున్నారు… అయ్యో, రేపు పిల్లల మెదళ్లపై పడే ప్రభావం ఏమిటి అనే సున్నితమైన భావన కూడా ఎవరినీ ఆపలేకపోతోంది… కానీ కొన్ని విడాకుల వార్తలు వినగానే విభ్రమ, షాక్ […]
రండి… రియల్ దోస్త్ ఒమిక్రాన్‌ను ఆహ్వానిద్దాం… పర్లేదు, కోవర్జినిటీ కోల్పోదాం…
ఏమిటి ఈ దారుణమైన స్టేట్మెంట్ అనిపిస్తోందా..? ప్రపంచంలో కొన్ని లక్షల కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేసిన చైనా వాడి నీచ వైరస్‌ను ఆహ్వానించడం ఏమిటి అని ఆశ్చర్యమేస్తోందా..? కానీ నిజంగానే ఓసారి ఆహ్వానించాలి… అది వచ్చి అలుముకుంటే ఆనందించాలి… హమ్మయ్య, దేవుడిచ్చిన బూస్టర్ డోస్, అసలైన వేక్సిన్ అని ఆనందపడాలి… అవును, ఒమిక్రాన్ వేరియంట్ వస్తానంటే అస్సలు వద్దనకూడదు… అడ్డుకోకూడదు… ఛల్ హట్, ఇంకా ఇంకా దిక్కుమాలిన బూస్టర్ డోసులు, దానికి డప్పుపాడే వుహాన్ బిడ్డల వంటి మీడియా […]
అపర్ణ యాదవ్… ఈమెది ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ… ఆ కుటుంబం మీద కులప్రభావం…
అపర్ణ… అపర్ణ యాదవ్… అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బలమైన పార్టీ సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్ చిన్న కోడలు… అఖిలేష్ యాదవ్ మరదలు… మళ్లీ ముఖ్యమంత్రి పీఠం కావాలని నానా ప్రయత్నాలూ చేస్తున్న ఆ కుటుంబం నుంచి ఓ మహిళ బీజేపీలోకి వెళ్లనుందనే వార్త ఖచ్చితంగా ఇంట్రస్టింగు… ఒకవైపు బీజేపీలో టికెట్లు దొరకని వాళ్లను ఎస్పీ అక్కున చేర్చుకుంటుంటే… ఏకంగా ఎస్పీ బాస్ ఫ్యామిలీ మెంబరే బీజేపీలోకి పోవడం విశేషమే… వెళ్తే…!! అసలు ఈమె నేపథ్యమేంటి..? […]
ఆంధ్రజ్యోతి ఆర్కే, దీన్నే థర్డ్ రేట్ ఇంటర్వ్యూ అంటారు… ఎందుకీ దిగజారుడు..?!
సినిమా టికెట్ల ధరల తగ్గింపు, చిరంజీవి రాయబారం, హీరోల రెమ్యునరేషన్ల రచ్చ, వైసీపీ నేతల విమర్శలు, సినిమావాళ్ల ఎదురుదాడి, తెలుగుదేశం వైఖరి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ధోరణి, రాంగోపాలవర్మ దౌత్యం……. వీటి జోలికి పోవడం లేదు ఇక్కడ… అన్ని వైపులా తప్పుంది… ప్రత్యేకించి ప్రభుత్వ ఆలోచనల ధోరణిలోనూ తప్పుంది… దాన్నలా వదిలేద్దాం… రాంగోపాలవర్మ పేర్ని నాని దగ్గరకు దౌత్యానికి వెళ్లాడు… ఏం జరిగింది..? ఏమీ జరగదు… అక్కడ జగన్ ఆలోచనల్లో మార్పు రాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లో వీసమెత్తు తేడా, […]
మీ చుట్టూ కరోనా కేసులు పెరుగుతున్నాయా..? ఓసారి ఇది తప్పక చదవండి..!
Amarnath Vasireddy……. కరోనా ఓమిక్రాన్ రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా విసరిస్తోంది . భయపడాల్సిన అవసరం లేదు . బాగా చదివి అర్థం చేసుకొని పాటించండి . ఓమిక్రాన్ సోకిన వారికి కనిపించే లక్షణాలు . 1 . జలుబు , గొంతు గరగర; ఒక్కోసారి దగ్గు . ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి . 2 . జ్వరం .. కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తోంది . ఎక్కువ మందికి జ్వరం రావడం […]
ఎంత తిట్టిపోసినా సరే.., మళ్లీ నాడిచూసి, గోలీలు ఇచ్చేది ఆ అమెరికావాడే…
నిజానికి నాయకుల వ్యక్తిగత అనారోగ్యం, జబ్బులు, వాటి చికిత్సలకు సంబంధించిన విమర్శలు నీచస్థాయి… ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడి ఆరోగ్యం కోసం ఆ రాష్ట్ర ఖజానా నుంచి నాలుగు రూపాయలు ఖర్చు చేస్తే దాన్ని ఖండించి, తమ రాజకీయ విధానాలతో కలగలిపి, ఏవేవో మాట్లాడేసి, రచ్చ చేయడం థర్డ్ రేట్ ధోరణి… కానీ సోషల్ మీడియాకు ఆ సంస్కారాలు ఏమీ పట్టవు… తిట్టిపోయడమే… కడుక్కోవడం నీ వంతు… అంతే… అయితే అసలు విషయం ఏమిటంటే..? కేరళ […]
‘గీతలు’ చెరిపేసుకున్న విశ్వమానవులు వీళ్లు… ఐకన్స్ ఆఫ్ ఇండియన్ రూట్స్ కూడా…
మనకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురించి ఎంతో కొంత తెలుసు కదా… తల్లి శ్యామల గోపాలన్ తమిళురాలు… తన రూట్స్ మరిచిపోలేదు… తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకాకు చెందినవాడు… భర్త డగ్ ఎమ్హాఫ్ అమెరికన్… ఇప్పుడు మరో ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వస్తున్నయ్… 1) ప్రీతి పటేల్… 2) రిషి సునక్… ఈ ఇద్దరూ బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో కనిపిస్తున్నారు… వీరిలో ప్రీతిపటేల్ ప్రస్తుతం హోం సెక్రెటరీ… రిషి సునక్ ఆర్థిక […]
అత్యంత ఖరీదైన కరోనా చికిత్స… తప్పక చదవాల్సిన ఓ ట్రాజెడీ స్టోరీ…
అందరూ తప్పక చదవాల్సిన కరోనా కథ అని ఎందుకంటున్నాను అంటే… బహుశా ఇంత ఖరీదైన చికిత్స, కరోనా మరణం మరొకటి గుర్తుకురావడం లేదు… ఆమధ్య పాత ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యాపారి కుటుంబం కోట్లు ఖర్చు చేసిందని చదివాను, అది ఎంతో గుర్తులేదు… అసలు ఎస్పీ బాలును పీల్చి పిప్పిచేసి, ఆస్తిని అరగదీసి, చివరకు తనను గాకుండా చేసింది ఓ చెన్నై హాస్పిటల్… అసలు మనకు ఓ అపోహ ఉంది గానీ, హైదరాబాద్ హాస్పిటల్స్ చాలానయం… ఆఫ్టరాల్ […]
టీకా దందాకు ఈనాడు డప్పు… అచ్చోసిన పిచ్చి రాతలు, కూతలు…
అప్పట్లో సమైక్యవాదానికి యాంటీ-తెలంగాణ పత్రికల మద్దతు… తెలంగాణ మీద ఎవడు ఏం కూసినా ఈ మీడియా అచ్చేసేది… వాడెవడో, వాడి రేంజ్ ఏమిటో ఈ మీడియాకు అక్కరలేదు… తెలంగాణను తిట్టాడా లేదా..? అంతే..! అలాగే జగన్‌ను తిడితే చాలు, మంచి ప్రయారిటీతో వార్త వేసేవాళ్లు… ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు… చంద్రబాబును మెచ్చుకోవాలి… పత్రిక అడుగులు, ఆలోచనలకు తగ్గట్టు ఎవడేం మాట్లాడినా కళ్లకద్దుకుని అచ్చేసి సంబరపడిపోతాయి ఇవి… ఈరోజు ఈనాడు తెలంగాణ ఎడిషన్‌లో ఫస్ట్ పేజీ ఫస్ట్ […]
యాంటీ హిందూ..! బీజేపీ ద్వేషంతో అందరికీ దూరమవుతున్న కాంగ్రెస్..!!
ఎందుకు క్రమేపీ కాంగ్రెస్ హిందువులకు దూరమైపోతోంది..? కమ్యూనిస్టులంటే సరే, నరనరాన హిందూవ్యతిరేకతను నింపుకున్నవాళ్లే… సోకాల్డ్ సెక్యులర్, కరప్టెడ్, రీజనల్, ఫ్యామిలీ పార్టీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు… కానీ ఓ ఉత్కృష్ట చరిత్ర కలిగిన కాంగ్రెస్ కూడా ఈ దేశ మెజారిటీ మతాన్ని, కోరికలను, మనోభావాలను జస్ట్, అలా చీప్‌గా తీసిపడేస్తుంది… దానికి కావల్సింది ఒకటే, మోడీని తిట్టేయాలి, బీజేపీని ఎండగట్టాలి… అంతే… ఇక సబ్జెక్టులో ఏముంది అనేది ఆ పార్టీకి అక్కర్లేదు… మోడీ […]
టీవీ రేటింగ్స్ మళ్లీ షురూ..! అసలు మోడీ సర్కారు మీదే బోలెడన్ని డౌట్స్..!!
టీవీ రేటింగ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రసార మంత్రిత్వ శాఖ, ట్రాయ్ ఎప్పుడూ సందేహాస్పదంగానే వ్యవహరిస్తున్నయ్… కొన్ని వేల కోట్ల యాడ్స్ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్న దందా అది… ఇప్పుడూ అంతే… కాస్త వివరంగా చెప్పుకుందాం… స్టార్, జీ, సోనీ, సన్ వంటి పెద్ద పెద్ద పెద్ద చానెళ్ల గుత్తాధిపత్యం సాగుతూ ఉంటుంది… వాళ్లు ఏదంటే అది చేయగలరు… నిజానికి ఆఫ్టరాల్ కొన్ని రీడింగ్ మీటర్లతో మొత్తం దేశవ్యాప్త టీవీ వీక్షణను లెక్కించడం, అంచనా వేయడం […]
పర్ సపోజ్… మన జ్ఞాపకాల్ని, జ్ఞానాన్ని కొత్త డిజైనర్ బాడీలోకి బదిలీ చేసేస్తే..?!
బాబాయ్, పంది గుండెను మనిషికి పెట్టేశారట… బాగానే సెట్ అయిపోయిందట… ఇంకేముంది..? మనిషికి చాలా రోగాల బాధ పోయినట్టే… ఎందుకురా అబ్బాయ్… ఒకేసారి అంత మాటనేశావు..? ఆఫ్టరాల్ జలుబుకు మందులేదు ఇప్పటికీ… ఐనా ప్రకృతిని నువ్వు జయించేకొద్దీ అది కొత్త సవాళ్లు విసురుతూ ఉంటుంది… కరోనా రూపంలోలాగా… ఐనా పంది గుండె సక్సెసయితే రోగాల బాధ పోయినట్టేనా..? కాదా మరి..? జస్ట్, ఈ రీసెర్చ్ ఇలాగే సాగితే, మనిషిలో ఏ అవయవం చెడిపోతే దాన్ని పీకేసి, ఏ […]
హఠాత్తుగా ఆ వింత ప్రసంగాల ‘నిత్యానందుడే’ చాలా నయం అనిపిస్తున్నాడు..!!
ముఖ్యమంత్రులు వెళ్లి సాగిలబడినంత మాత్రాన ఆయన అందరికీ ఆమోదయోగ్యుడైన ఆచార్యుడేమీ కాదు… వివాదాస్పదుడే… అప్పట్లో తిరుమల వేయికాళ్ల మంటపం దగ్గర నుంచి లక్ష్మి నరసింహులను విడదీసి, విడివిడిగా విగ్రహాలు ఉండాలనే దాకా… యాదగిరిగుట్ట పేరును యాాదాద్రిగా మార్చడం నుంచి పాదపూజల వసూళ్లు, రామనుజ ప్రాజెక్టుకు వసూళ్ల దాకా… ఆధ్యాత్మిక స్పృహకన్నా అధికారకేంద్రంగా ఉండటంపై ధ్యాస దాకా… చాలామంది అర్చకవర్గ ప్రముఖులకే నచ్చడు తను… (శైవ, వైష్ణవ తేడాలు, గురుపరంపర సంబంధిత విభేదాలు కాదు, తన ధోరణే చాలామందికి […]
చెంపలేసుకున్నాడు… అందులోనూ దొంగ కన్నీళ్లు, అబద్ధాలు, ఆత్మవంచన…
సిద్ధార్థ్ అనబడే ఓ సిగ్గూశరం లేని తమిళనటుడు చెంపలేసుకున్నాడు… ఈ డర్టీ కేరక్టర్ టపీటపీమని చెప్పుతో కొట్టేసుకున్నాడు… సైనా నెహ్వాల్‌కు అదే ట్వీట్టర్ ద్వారా ఓ క్షమాపణ లేఖ రాశాడు… అయితే అందులోనూ అబద్ధాలు, దొంగ కన్నీళ్లు, ఆత్మవంచన… డ్యామేజీ కంట్రోల్ డ్రామా… నిజానికి సిద్ధార్థ్ తత్వమే ఓ సిగ్గూశరం లేనిది… అదెప్పుడూ మారదు… ఇప్పుడు అకస్మాత్తుగా సైనా నెహ్వాల్‌కు క్షమాపణ చెప్పగానే, తనలోని ఏ జ్ఞానచక్షువులో తెరుచుకున్నాయని కాదు అర్థం… దాని వెనుకా ఓ లెక్క […]
- « Previous Page
- 1
- …
- 107
- 108
- 109
- 110
- 111
- …
- 146
- Next Page »