ఇది దిశ అనే ఈ-పేపర్లో ఫస్ట్ పేజీలో కనిపించిన సవరణ… (ఐనా ఇయ్యాల్రేపు చాలా చిన్న పత్రికలు పేరుకే ప్రింట్.., ఆచరణలో వెబ్, వాట్సప్ ఎడిషన్లే కదా… రాబోయే రోజుల్లో ఇక డిజిటల్ ఎడిషన్లదే రాజ్యం…) ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే… మొన్న సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ హైదరాబాద్ వచ్చాడు కదా… టీఆర్ఎస్కు ఓటేయొద్దు, ఆ పార్టీ బీజేపీకి బీ టీం అన్నట్టుగా ఈ పత్రిక ఓ వార్త రాసింది… కానీ నిజానికి […]
తాత, అయ్య, కొడుకు… కుటుంబ వారసత్వాలు, వ్యక్తులకే పార్టీల ఓనర్షిప్స్…
కుటుంబ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికే ముప్పు అని ప్రధాని మోడీ అన్నాడు… ప్రతిపక్షాలు బహిష్కరించిన అధికారిక రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలపై ఇదొక్క మాటే చెప్పుకొచ్చాడు… అంతేతప్ప ఎలా ముప్పు అనేది చెప్పలేదు, చెప్పడు… ఆమధ్య ఒక దేశం, ఒక చట్టవేదిక అన్నాడు… అదేమిటో చెప్పడు… పైగా అందరూ ఏకాభిప్రాయానికి రావాలంటాడు… 75 ఏళ్లొచ్చాయి, మన స్వాతంత్ర్యానికి… నిజంగా మన ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కుటుంబ పార్టీల వల్ల వస్తోందా..? ఆనాటి నుంచీ కుటుంబ పార్టీలు, […]
‘చస్తూ బతకాలె’..! కానీ కేన్సర్ కణితులకు పశ్చాత్తాపాలు ఏముంటయ్..?!
కొన్ని తీర్పుల మీద డిబేట్ జరగాలి… పౌరసమాజం చర్చించాలి… ఇదీ అలాంటిదే… కానీ సబ్జుడీస్ భయంతో జర్నలిస్టులే పెద్దగా స్పందించరు, మనకెందుకొచ్చిన చర్చ అనుకుని అడ్వొకేట్ కమ్యూనిటీ కూడా పట్టించుకోదు… రాజకీయ నాయకులకు..? సారీ, తీరిక లేదు, అంత బుర్ర కూడా లేదు… ఒక నేరం- ఒక తీర్పు- ఒక చట్టం… ఎప్పుడూ చర్చనీయాంశాలే నిజానికి… ప్రజెంట్ ఈ కేసు ఏమిటంటే..? ఎనిమిదేళ్ల క్రితం ముంబైలో ఓ సామూహిక హత్యాచారం… మన సిస్టం గురించి తెలుసు కదా, […]
నో పెళ్లి, నో పిల్లలు… సోలో బతుకే సో బెటర్… చైనా యూత్ న్యూట్రెండ్…
భారతదేశంలో జనాభా తగ్గుముఖం పడుతోంది అనే వార్తకన్నా… చైనా యువత ‘‘వద్దురా సోదరా, పెళ్లంటే నూరేళ్ల మంటరా’’ అని పాడుకుంటూ పెళ్లికి దూరంగా ఉంటోంది అనే వార్తే ఎక్కువ ఆసక్తికరంగా ఉంది… పెళ్లి చేసుకోకపోతే పైలాపచ్చీస్గా ఉండవచ్చునని కాదు, పెళ్లి చేసుకుంటే ఖర్చులు పెరుగుతయ్, పిల్లలు, పోషణ, చదువులు, మరింత ఖర్చు… ఇప్పటి జీవన వ్యయప్రమాణాల్లో అవన్నీ భరించలేక, కొలువుల్లో స్థిరత్వం లేక, రేపు ఏమిటో తెలియక యువత ఏకంగా పెళ్లిళ్ల పట్లే విముఖత చూపిస్తున్నారు… ఏం, […]
ఈ అయ్యగారి చూపు ఇప్పుడు తృణమూల్ మీద పడింది..! ఏమగునో ఏమో..!!
పార్ధసారధి పోట్లూరి……… సుబ్రహ్మణ్యస్వామి నడిచే ఎన్సైక్లోపీడియా! కానీ.. ఎన్సైక్లోపీడియాని చదివి ఎవరయినా విజ్ఞానము సంపాదించుకోవచ్చు, అదే సమయంలో అదే ఎన్సైక్లోపీడియా అదే స్థితిలో ఉంటూ, తనలో విజ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ ఉంటుంది కానీ స్వయంగా రంగంలోకి దిగలేదు. స్వామి కూడా అంతే! దేశ విదేశాలలో ఆర్ధిక శాస్త్రం బోధించే విజిటింగ్ ప్రొఫెసర్ గా స్వామికి మంచి పేరుతో పాటు అనుభవం కూడా ఉంది. ఏకసంథాగ్రాహి! ఛాలెంజ్ చేసి మరీ నెల రోజుల్లో మాండరీన్ (చైనా భాష) ని నేర్చుకుని […]
తక్షణం తాళాలిచ్చేయండి… జయలలిత ఇంటిపై ఇంట్రస్టింగ్ తీర్పు…
సడెన్గా దూరం నుంచి చూస్తే జయలలితను చూసినట్టే అనిపిస్తది… ఆమె పేరు దీప… దీపజయకుమార్… జయలలిత పెద్దన్న బిడ్డ… జర్నలిజంలో మధురై కామరాజ్ వర్శిటీలో మాస్టర్స్ చేసింది, తరువాత వేల్స్, కార్డిఫ్ వర్శిటీలో ఇంటర్నేషనల్ జర్నలిజం కోర్సు చేసింది… కొన్నాళ్లు ఇండియన్ ఎక్స్ప్రెస్లో సబ్ఎడిటర్గా కొలువు చేసింది… ఏదో పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసింది గానీ జనం పట్టించుకోలేదు, సోదరుడి పేరు దీపక్… ఇంత పరిచయం దేనికీ అంటే..? మద్రాస్ హైకోర్టు తాజాగా ఓ తీర్పు చెప్పింది… […]
డీజే సౌండా మజాకా..! ఆ సౌండుకు గుండెపోటుతో కోళ్లు టపీటపీ…!!
మొన్నామధ్య ఎక్కడో ఒకాయన దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి.., నా బర్రె పాలిస్తలేదు సార్, ఎవడో మంత్రగాడు చేతబడి చేసి ఉంటాడని నా డౌటనుమానం, వెంఠనే మీరు దర్యాప్తు జరిపి, వాడి అంతు తేల్చేయాలె, అవసరమైతే ఉల్టా రివర్స్ చేతబడి చేయించాలె, వెంటనే కేసు పెట్టండి అని కోరుకున్నాడు తెలుసు కదా… అలా చాలా కేసులు వస్తుంటయ్, అసలు మామూలు వాడికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే డ్యాష్ డ్యాష్… కానీ కొందరు పోలీసులతోనే గేమ్స్ ప్లే […]
ఏది తీవ్ర లైంగికదాడి..? ఏది తేలికపాటి..? చట్టంలోనే బోలెడంత కన్ఫ్యూజన్..!!
ఒకరేమో స్కిన్ టు స్కిన్ టచింగ్ ఉంటే తప్ప దాన్ని లైంగిక దాడి అనలేం అంటారు… (దేహస్పర్శ)… దాన్ని సుప్రీం కోర్టు కొట్టిపారేస్తుంది… ప్రేమించినంత మాత్రాన సంభోగం చేస్తే ఆ అమ్మాయి అనుమతించినట్టు కాదు, అది అత్యాచారమే అంటారు మరొకరు… అంగప్రవేశం జరిగితే తప్ప అత్యాచారం కాదంటారేమో మరొకరు… చిన్నారుల మీద లైంగిక దాడులకు సంబంధించిన పోక్సో చట్టానికి ఒక్క కోర్టు ఒక్కో బాష్యం చెబుతోంది… స్పష్టత ఇచ్చే ప్రయత్నం సుప్రీం వైపు నుంచీ జరగడం లేదు… […]
ఈ ఆన్లైన్ రేపిస్టుకు బెయిల్ వచ్చేసింది… మరిక వీళ్లకు భయం ఎలా..?!
ఇక ఈ కేసులతో ఏం ప్రయోజనం..? భారత క్రికెట్ గర్వపతాక విరాట్ కోహ్లీ… తన భార్య ఓ పాపులర్ నటి… దేశం నిండుగా ఆశీర్వదించిన జంట… వాళ్ల బిడ్డ ఓ చిన్నారి… అన్నెంపున్నెం ఎరుగని, ముక్కుపచ్చలారని పసిబిడ్డ… ఓ గలీజు గాడు (మొదటిసారి ఇలాంటి పదాలు వాడుతున్నందుకు క్షమించండి…) ఇండియా టీ20 పోటీల్లో ఓడిపోతే భరించలేక ఆ పసిగుడ్డును రేప్ చేస్తానని కూశాడు… ఎంత దారుణం..? ఇలాంటివి ట్విట్టర్, ఫేస్బుక్ వేదికల మీద బోలెడు… ఆ నీచ్కమీనే […]
ఈనాడు రెండు ఎడిషన్లకు మంగళం..? ఏబీసీ సభ్యత్వమూ రద్దు…!!
హమ్మయ్య, కరోనా గండం నుంచి ఇక బయటపడ్డట్టే… ప్రింట్ మీడియా, అంటే పత్రికలు మెల్లిగా కరోనా కాలపు కష్టాల నుంచి గట్టెక్కుతున్నట్టే… ఏ పత్రిక చూసినా బోలెడు యాడ్స్, పేజీలకొద్దీ కనిపిస్తున్నయ్… ఇక జర్నలిస్టులు, ఇతర పత్రికా సంస్థల సిబ్బంది కొలువులకు ఢోకా లేనట్టే….. అని ఈమధ్య ఓ మిత్రుడు తన జ్ఞానాన్ని నామీద గుమ్మరించాడు… నవ్వొచ్చింది… ఈ రంగంలో రూపాయి ఖర్చుకు పదిరూపాయల లాభాన్ని తవ్వుకునే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపే ఊగుతోంది… 60 నుంచి […]
యోగీ తెలంగాణ రైతులకు పరిహారం ప్రకటిస్తే..? వోకేనా పెద్ద సారూ..?!
……… By……. Srini Journalist………… నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లో చనిపోయిన ప్రతీ రైతు పేరు మీద వారి కుటుంబాలకి 3లక్షల చొప్పున దాదాపు 750 కుటుంబాలకు 23 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల తరపున ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ప్రకటనను ఉటంకిస్తూ KTR చేసిన ట్వీట్ కి సినీ తారలతో పాటు చాలా మంది చప్పట్లు కొట్టారు మంచి నిర్ణయం అని. కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. 1. ఏడు […]
మహేశ్ బాబు సరే… అంతటి రామోజీరావుకూ ఈ చిల్లర డబ్బే కావాలా..?!
నిజమే… పత్రికల ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయని మీడియా సంస్థల యజమానులు కూడా అంగీకరించాల్సిన నిజం… సొసైటీలోని అన్ని రంగాల్లోనూ కనిపించే పతనమే పాత్రికేయంలోనూ ఉంది… సొసైటీలో భాగమే కదా..! ఐతే ఎలాగూ దిగజారుతున్నాం కదాని ఇక అన్ని విలువల్నీ, ప్రమాణాల్నీ మూసీలో కలిపేసుకోవాలా..? ప్రత్యేకించి డబ్బు కోసం సొసైటీకి హాని చేసే చర్యలకు పాల్పడినా సరేనా..? ఇక నైతికత అనే పదాన్ని బొందపెట్టడమేనా..? పొద్దున్నే ఈనాడు ఫుల్ పేజీ యాడ్ చూశాక ఇదే అనిపించింది… వేలకువేల కోట్ల […]
ప్రేమించడం అంటే పడకసుఖానికి సమ్మతించినట్టు కాదు… అత్యాచారమే…!!
ఈమధ్య ఏదో సినిమాలో ఓ దర్శకుడు ప్రేమకూ, శృంగారానికీ నడుమ తేడాను చెప్పడానికి తెగప్రయాస పడ్డాడు..! ప్రేమ లేని సంభోగం రేప్తో సమానం అనీ, ప్రేమ అంటే సంభోగం మాత్రమే కాదనీ రకరకాల బాష్యాలు గట్రా చాలారోజులుగా వింటున్నవే, చదువుతున్నవే, చూస్తున్నవే… చాలామందికి ఆ తేడా తెలియదు… కేరళ హైకోర్టు ముందుకు రీసెంటుగా ఓ కేసు వచ్చింది… అదేమంటే..? 26 ఏళ్ల శ్యామ్ శివన్ పిటిషన్… ‘‘అయ్యా, ఆమె నా ప్రియురాలు, ఆమె నా మీద కేసు […]
మోడీ ఆధిపత్యానికి చెల్లు..? సాగుచట్టాల రద్దుతో ఉల్టా రిజల్ట్స్..?
నాయకుడు బలవంతుడు అయినా గాకపోయినా… బలవంతుడిగా కనిపించాలి…! రకరకాల సవాళ్లు ఏవైనా సరే, వాటి ఎదుర్కొనే ధీశాలిగా ప్రపంచానికి కనిపించాలి… లేకపోతే అనుచరగణమే మాట వినదు, ప్రత్యర్థుల్లో ఉత్సాహం పెరుగుతుంది, అవి కొత్త సవాళ్లకు దారితీస్తాయి… కారణం ఏదైనా సరే, చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండాల్సింది… ఇన్నేళ్లుగా మనం చూసిన చంద్రబాబు వేరు… ప్రజెంట్ చంద్రబాబు వేరు… జగన్ జగనే, తను వైఎస్ కాడు… డ్రామా, మెలోడ్రామా, స్ట్రాటజీ అని ఎన్ని సమర్థనలు వినిపించినా సరే, ఈ […]
మిటూ..! చైనా అధికార పార్టీ నేత నిర్వాకం… ఆమె మాయమైపోయింది…
హక్కుల్లేవ్… తొక్కల్లేవ్… ఎవరి మీద కోపమొచ్చినా సరే తొక్కేయడమే… అది చైనా ప్రభుత్వం మీదే కాదు, ఆ నాయకుల మీదైనా సరే, ఎవడేం మాట్లాడినా, మాట్లాడతారేమోనని సందేహమొచ్చినా, చెప్పినట్టు వినకపోయినా… మనుషులు మాయం అయిపోతారు… అంతే… ఆ ఇనుప గోడల నడుమ ఎవడి బతుకేమిటో, ఎవడి భవిష్యత్తు ఏమిటో ఎవడికీ తెలియదు… అలీబాబా ఫౌండర్ జాక్ మాను చైనా ప్రభుత్వం ఎంత భ్రష్టుపట్టించిందో మొన్నమొన్ననే కదా చదువుకుంది… తాజాగా ఇదుగో, ఈ టెన్నిస్ మహిళ స్టార్ కూడా […]
యత్రనార్యస్తు పూజ్యంతే..! మగతనాల చర్చలతో ఏపీ పాలిటిక్స్ పునీతం..!!
బాగాలేదు… అస్సలు బాగాలేదు… ఏపీ రాజకీయాల్లో బూతులు, వ్యక్తిత్వ హననాల గురించి కాదు… ఇప్పుడు కొత్తేమీ కాదు… ఇక్కడితో ఆగేదీ కాదు… చిన్న చిన్న బూతులతో మొదలై, బోసిడికే మీదుగా మగతనాల దాకా ‘అద్భుతంగా ఎదిగిన’ ఏపీ రాజకీయాల నీచస్థాయికి అందరూ బాధ్యులే… ఒకడు తక్కువ కాదు, ఒకడు ఎక్కువ కాదు… చంద్రబాబు దుశ్శాసన చరిత్ర మరిచారా అనే సమర్థనల నుంచి దుశ్వాసనుల తాతలుగా వ్యవహరించాలా అనే వాదనల దాకా..!! చివరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న […]
చట్టాల రద్దుతో కూడా నష్టమేనా..? మోడీ మరో పెద్ద తప్పుచేశాడా..?
మోడీ తప్పు చేశాడా..? వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదా..?…. రైతుచట్టాల రద్దు మీద దేశవ్యాప్తంగా రైతువిజయం పేరిట సంబరాలు సాగుతున్నా సరే, మోడీ ఈ చర్య రైతులకు పరోక్షంగా మరింత అన్యాయం చేయబోతోందనే చర్చ కూడా సాగుతోంది… ఐతే ఈ విజయ సంబరాల చప్పుళ్ల నడుమ ఈ చర్చ పెద్దగా వినిపించదు… ఎవరైనా ఏమైనా మాట్లాడితే రైతుద్రోహి అనే ముద్రవేస్తారనే భయం… నిజానికి మోడీ నిర్ణయాన్ని ఎవరూ ఊహించలేదు… బీజేపీలోనే ఎవరికీ తెలియదు… […]
ఎవరి మెడలు వంచాలన్నా… వోటు భయం క్రియేట్ చేయడమే మార్గం…
ఒక రాజకీయ పార్టీ… అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ మెడలు వంచాలంటే… ఓ రాజకీయ అనివార్యతను క్రియేట్ చేయడమే మార్గం..! అది ప్రజల సహకారంతో నిర్మించే బలమైన ఉద్యమాల ద్వారానే సాధ్యం..! అత్యంత బలమైన లాబీయిస్టులకు తలొగ్గకుండా, అప్పట్లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే కారణం ఈ రాజకీయ అనివార్యతే…! పార్టీలను వణికించాల్సిన అంశం ఏమిటంటే..? వోట్లతో వోడిస్తాం..!! ఈ మెసేజ్ అర్థమైతే చాలు, అధికారం అనేక మెట్లు దిగివస్తుంది, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుంది… అవసరమైతే అనూహ్యంగా […]
ఈ మాజీ కలెక్టర్ నామినేషన్ చెల్లుతుందా..? వీఆర్ఎస్కు కేంద్రం అంగీకరించిందా..?
నిన్న సోషల్ మీడియాలో తెగతిరిగిన ఫోటో మీమ్ ఇది… వరి వేస్తే తాట తీస్తా అన్న కలెక్టర్ ఇప్పుడు ఆకుపచ్చ కండువా వేసుకుని, టీఆర్ఎస్ మహాధర్నాలో కూర్చుని, వరి కొనకపోతే ఖబడ్దార్ అంటున్నాడు అనేది ఈ సెటైర్… ఆయన అలా రాజీనామాలు చేయడం, ఇలా ప్రభుత్వం ఆమోదించడం, ఆ వెంటనే గులాబీ కండువా కప్పేసుకోవడం, ఎమ్మెల్సీ పదవి వరించడం… అలా అలా ఆగమేఘాల మీద కొన్ని పరిణామాలు పరుగులెత్తాయి… అంతకుముందు ఆయన ముఖ్యమంత్రికి జరిపిన బహిరంగ పాదాభివందనాలు, […]
#అసలు_వాస్తవం_ఏంటో_తెలుసుకుందాం… పోస్టులో అన్నీ అవాస్తవాలే…
మొన్నటి నుంచి తెలుగు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది ఒక పోస్టు… ఎవరు రాశారో తెలియదు కానీ పైపైన చదివితేనే, అది రాసిన రచయితకు వరి గురించి ఏమీ తెలియదని మాత్రం మనకు తెలుస్తుంది… బహుశా వాట్సప్ యూనివర్శిటీలో కొత్త అడ్మిషన్ కావచ్చు… ఐనా ప్రభుత్వాలే అడ్డగోలు అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు, ప్రజల కళ్లకు గంతలు కట్టే ఆందోళనలకు దిగుతుంటే ఆఫ్టరాల్ సోషల్ యాక్టివిస్టుల తప్పేముంది..? కాస్త సబ్జెక్టు తెలిసిన నిపుణులు, అధికారుల నుంచి జ్ఞానబోధ […]
- « Previous Page
- 1
- …
- 111
- 112
- 113
- 114
- 115
- …
- 146
- Next Page »