Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదుగో మేం ఈ పనులు చేస్తాం… ఇది కాంగ్రెస్ మాట… మరి బీజేపీ బాట..?!

May 7, 2022 by M S R

triangle

రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు సహజమే… తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా పాతుకుపోయి ఉంది… కేసీయార్ చాణక్యుడి బుర్రే దానికి అసలు బలం… ప్రత్యర్థి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్… రేప్పొద్దున మూడు పార్టీలూ బలంగా పోటీపడతాయా..? లేక బీజేపీ, కాంగ్రెస్ తన్నుకుని, వోట్లు చీలిపోయి, మళ్లీ కేసీయార్‌కు చాయిస్ ఇస్తారా అనేది వేరే సంగతి… రేపటి గురించి ఇప్పుడే చెప్పలేం.., రాజకీయాల్లో మితృత్వాలు, శతృత్వాలు రేపెలా ఉంటాయో చెప్పడం కష్టం… అయితే కేవలం నాయకుల అవినీతి […]

ఓహ్.., తను రాహులేనా..? మెచ్యూర్డ్ స్పీచ్… పీసీసీపై రేవంత్ గ్రిప్…!

May 6, 2022 by M S R

rahul

నిజానికి రాహుల్ ప్రసంగంపై చాలామంది తటస్థుల్లో పెద్ద ఆశలేమీ లేకుండా ఉండింది మొదట్లో… కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ప్రసంగాన్ని సరైన రీతిలో వెలువరించాడు రాహుల్… ఎక్కడా సందిగ్ధత లేదు… దాపరికం లేదు… కేసీయార్ ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ను తొక్కీ తొక్కీ, ఇక అది చచ్చిపోయింది అనుకున్నాడు… కానీ కాంగ్రెస్ బతికే ఉందని, బతికే ఉంటుందని, జెండా మోసేవాళ్లకు కొదువ లేదని వరంగల్ సభ నిరూపించింది… తెలంగాణ ఏర్పాటు ఎంత కష్టసాధ్యమైనా మేమే ఇచ్చామని చెప్పుకోవడం దగ్గర్నుంచి… […]

ఈ రోటీ నమక్ జర్నలిస్టు గుర్తున్నాడా మీకు..? చివరకు జీవితమే కోల్పోయాడు..!!

May 6, 2022 by M S R

pawan jaiswal

మీకు గుర్తుందా..? 2019… యూపీ, మీర్జాపూర్‌లోని జమాల్‌పూర్ బ్లాక్, సియూర్ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం కింద రొట్టె, ఉప్పు పెట్టారు… కూర కాదు, జస్ట్ ఉప్పు… పేద పిల్లల కడుపు నింపే ఆ పథకాన్ని కూడా భ్రష్టుపట్టించిన తీరును వివరించే ఆ దృశ్యాన్ని పవన్ జైస్వాల్ అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వీడియో తీశాడు… ఎండిన రొట్టెలు, అందులోకి ఉప్పు… కడుపు తరుక్కుపోయేట్టుగా ఉన్న ఆ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది… చాలా మీడియా సంస్థలు […]

‘‘బూతు చిత్రాలతో కొడదాం… వాళ్లే ఎగేసుకుని పరుగెత్తుకొచ్చేస్తారు…’’

May 6, 2022 by M S R

nasa

అనుకుంటాం గానీ… ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర, సాంకేతిక సంస్థలయితేనేం… వాళ్లూ కొన్నిసార్లు మరీ నాసిరకంగా ఆలోచిస్తుంటారు… మరీ సీ గ్రేడ్ హాలీవుడ్ దర్శకుల్లాగా… పోనీ, ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించవచ్చునని నమ్మే టాలీవుడ్ దర్శకుల్లాగా..! విషయం ఏమిటంటే..? నాసా శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులను ఆకర్షించేందుకు పురుషుడు, మహిళ నగ్నచిత్రాలను రోదసిలోకి పంపించాలని ఆలోచిస్తున్నారట… ఏలియన్స్‌ను ఆకర్షించేందుకు ఈ ప్రయోగం ఫలితం ఇవ్వగలదని నాసా సైంటిస్టులు ఆశిస్తున్నట్టుగా బెకాన్ ఇన్ ది గెలాక్సీ అనే అధ్యయనం చెబుతోందట… ఇదీ […]

గెటవుట్ ట్విస్టులు… ఫ- పంచాయితీలోకి ఆ అనసూయనూ లాక్కొచ్చారు…

May 5, 2022 by M S R

anasuya

విష్వక్సేనుడు, దేవినాగవల్లి గెటవుట్ వివాదం మీద మొత్తానికి తెలుగు సమాజం రెండుగా చీలిపోయింది… విష్వక్సేనుడికి మద్దతుగా కొందరు… దేవికి మద్దతుగా కొందరు… అయితే టీవీ9 మీద, దేవి మీద ఇతర కారణాలతో ఇప్పటికే వ్యతిరేకత పెంచుకున్న సెక్షన్ ఇప్పుడిక చాన్స్ దొరికింది కదాని విష్వక్సేనుడికి మద్దతుగా నిలుస్తున్నారు… నిజం చెప్పాలంటే… దేవికి జర్నలిస్టు ప్రపంచం నుంచి, విష్వక్సేనుడికి సినిమా సంఘాల నుంచి పెద్దగా దొరికిన మద్దతేమీ లేదు… ఇదేదో తాము కలుగజేసుకునే వ్యవహారం కాదులే అని వదిలేశాయి… […]

యాదగిరి నర్సన్నను ముంచేశారు..! విఫల సమర్థన ప్రయత్నాలు వృథా..!!

May 5, 2022 by M S R

yadadri

ఎహె, ఒక రోడ్డు కాస్త కుంగిపోతే ఇన్ని విమర్శలా..? 99 శాతం పాజిటివిటీ గమనించకుండా ఒక శాతం నాణ్యతలోపాల్ని పనిగట్టుకుని బదనాం చేయాలా..? చిన్న చిన్న లోపాలు కనిపిస్తే యాదాద్రి ఘన వైభవ పునర్నిర్మాణాన్ని కించపరచాలా..?….. ఇవీ కొన్ని విపల సమర్థనలు… చిన్నపాటి వర్షానికే యాదాద్రి లోపాలు బయటపడటంపై, నిర్మాణంలో కనిపిస్తున్న డొల్లతనంపై విమర్శలకు ఇవి నిజంగా సరైన సమాధానాలేనా..? అసలు మీడియా ఎలా కవర్ చేసిందో ఓసారి పరిశీలిస్తే… టీవీలు మరీ అంతగా రెచ్చిపోయి టాం […]

జగన్ సార్… మీ హోం మంత్రిగారి వ్యాఖ్యల తీరు చూస్తున్నారా..?

May 4, 2022 by M S R

వనిత

మాట్లాడటం తెలియకపోతే మౌనాన్ని ఆశ్రయించడం బెటర్… జగన్ అర్జెంటుగా తన మంత్రులకు చెప్పాల్సిన నీతి అదే… ప్రత్యేకించి కీలకమైన హోం శాఖకు మంత్రిగా ఉన్న తానేటి వనిత మాట్లాడకుండా ఉంటేనే ప్రభుత్వానికి, పార్టీకి మంచిది… వెనకేసుకురావడం కాదు, జరుగుతున్న నష్టాన్ని గమనించాలి… రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఓ గర్భిణి మీద జరిగిన అత్యాచారం సమాజమే నివ్వెరపోయేలా ఉంది… నిజానికి ఆ దుర్మార్గంలో సొసైటీని కూడా నిందించాలి… రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అత్యంత నీచంగా వ్యవహరించగా… ఆ […]

ఉక్రెయిన్ వార్… సందట్లో సడేమియా… మధ్యలో ఎవరి ఆట వాళ్లు ఆడేస్తున్నారు…

May 4, 2022 by M S R

turkey

పార్ధసారధి పోట్లూరి ……. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ! ఏప్రిల్ 22 న టర్కీ తమ ఎయిర్ స్పేస్ ని రష్యాకి చెందిన పాసింజర్ విమానాలతో పాటు మిలటరీ విమానాలు వాడుకోకుండా నిషేధం విధించింది. ఇది సిరియా నుండి రష్యా వెళ్ళే ప్రయాణీకుల విమానాలని ఆపేయడానికే ! ఇక సిరియాలోని షియా వర్గానికి చెందిన అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ కి మద్దతుగా గత 8 ఏళ్లుగా రష్యా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే […]

మరొక్క వేవ్ ప్లీజ్… కోరలు తెరుచుకుని ఫార్మా కంపెనీల ఎదురుచూపు…!!

May 4, 2022 by M S R

corona vaccine

ప్రపంచమంతటా కరోనా భయం తగ్గిపోయింది… మొన్నమొన్నటిదాకా కేసుల సంఖ్య భయానకంగా అనిపించిన కొన్ని దేశాల్లో కూడా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తోంది… కేసుల సంఖ్య కనిపిస్తున్నా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది… అంటే కరోనా బలహీనపడింది అని అర్థం… కొత్త వేరియెంట్లు వచ్చినా సరే మనిషి వాటిని తట్టుకునే స్థితికి చేరుకున్నాడనే అనుకోవాలి… ఏడాది, రెండేళ్ల క్రితంతో పోలిస్తే కరోనా ఓ సాధారణ వైరస్‌లా మారిపోయింది… దాని ఉనికి ఉంటుంది, అది చావదు… ఎటొచ్చీ చైనాలోనే వ్యాప్తి […]

మందు లేదు, చిందుల్లేవు… రాహుల్ వీడియోకు అసలు విలువే లేదు…

May 3, 2022 by M S R

rahul

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఈ విదేశీ టూర్లు ఏమిటీ ప్రధాని గారూ అని కాంగ్రెస్ ప్రశ్నించింది ఓ ట్వీట్‌లో… ఇంకేం..? బీజేపీ క్యాంపుకు కోపమొచ్చింది… మరి ఇదేమిటో చెప్పండి అన్నట్టుగా… ఓ నైట్ క్లబ్బులో రాహుల్ కనిపిస్తున్న వీడియోను వదిలింది… ఈయన ఎవరో తెలుసా అంటూ కపిల్ మిశ్రా ఓ ట్వీట్ వదిలాడు… సోషల్ మీడియా మొత్తం రాహుల్ గాంధీ అనుకూల, వ్యతిరేక పోస్టులతో ఊగిపోతోంది… రాహుల్ వీడియో సారాంశం ఏమిటయ్యా అంటే… నేపాల్, ఖట్మాండులోని […]

దేవి నాగవల్లి..! న్యూస్ రీడర్ కాదు ఇక్కడ… తనే ఓ న్యూస్… ఓ వైరల్ నేమ్..!!

May 3, 2022 by M S R

బిగ్‌బాస్ షో… 2020… ఏదో పిచ్చి టాస్క్… హౌజులో ఎవరినైతే జీరో అనుకుంటున్నారో వాళ్లను మెడపట్టుకుని, గేటు నుంచి తోసేయాలి… టీవీ9 దేవి కూడా ఆ షోలో కంటెస్టెంట్… తన భాషతో, తన చేష్టలతో కంటెస్టెంట్లను, ప్రేక్షకులను హింసించిన అమ్మ రాజశేఖర్ అనే కంటెస్టెంట్‌ను దేవి నెట్టుకెళ్లి, మెడ పట్టుకుని, గేటు బయటికి నెట్టేసింది… అది ఆట… ఆట అంటే అంతే… సదరు రాజశేఖరుడు అక్కడే పొర్లిపొర్లి ఏడ్చాడు… దేవి సైలెంటుగా, నిర్వికారంగా చూస్తూ నిలబడింది… విష్వక్సేన్ […]

మరి ఈ తప్పుకు ఎవరిని శిక్షించాలి..? హోం మంత్రి చెబితేనే బెటర్…!!

May 3, 2022 by M S R

228A

గత సంవత్సరం జూలై వార్త… అత్యాచార బాధితుల పేర్లు, వివరాలు బయటపడకుండా జాగ్రత్తవహించాలని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది… దిగువ కోర్టులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని హెచ్చరించింది… నేరుగా గానీ, పరోక్షంగా గానీ లైంగిక దాడి బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని ఐపీసీ 228ఏ చెబుతోందనీ, దాన్ని పాటించాలని సూచించింది…  228A. Disclosure of identity of the victim of certain offences etc.. Whoever prints or publishes the name […]

ప్లీజ్, ప్లీజ్… అఘాయిత్యాల కేసుల్లో తల్లుల్ని నిందితులుగా చేర్చకండి సార్…

May 1, 2022 by M S R

TANETI

హమ్మయ్య… క్లారిటీ వచ్చింది… ఇన్నేళ్లూ పెద్ద పెద్ద క్రైమ్ ఇన్విస్టిగేటర్లకు, జడ్జిలకు, లాయర్లకు, సోషియాలజిస్టులకు, సైకాలజిస్టులకు, జర్నలిస్టులకు, ఎట్సెట్రా అందరికీ ఓ పెద్ద ప్రశ్న… ఆడవాళ్లపై అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో ఓపట్టాన బోధపడకపోయేది… కొందరు చిల్లరగాళ్లు ఆడవాళ్ల వస్త్రధారణే సమస్య అన్నారు, మరి చిన్నపిల్లల మీద, ముసలోళ్లు మీద అత్యాచారాల మాటేమిట్రా అనడిగితే నోళ్లు మూతపడ్డాయి… సాహిత్యం, సినిమాలు, టీవీలు గట్రా కారణమని బల్లలు గుద్ది మరీ చెప్పారు కొందరు… నో, నో, చట్టాలు కఠినంగా లేకపోవడమే […]

ఆచార్యా… ఏమిటీ అరాచకం..? అపచారం..? ఇదేనా ధర్మస్థలి పరిరక్షణ..?!

April 30, 2022 by M S R

ramcharan

demigods are more powerful than original gods… నిజమే… వ్యక్తిపూజ నరనరాన ఇంకిన మన దేశంలో దేవుళ్లు కోట్లాదిమంది ఉండవచ్చుగాక… కానీ వాళ్లకు మించిన దేవుళ్లు సినిమా హీరోలు, వాళ్ల కొడుకులు, బిడ్డలు, నాయకులు ఎట్సెట్రా… సైకోఫ్యాన్స్… ఈ ఫ్యాన్స్ భజనలతో వీళ్లు కూడా తాము నిజంగానే దైవాంశ సంభూతులమేమో అనే సందేహంలో పడి, అది ముదిరి, చివరకు అవే భ్రమల్లో కూరుకుపోతారు… అంతెందుకు..? అసలు దేవుళ్ల దగ్గరకు పూజకు వెళ్లడానికి కూడా పౌండ్రక వాసుదేవుళ్ల రేంజులో […]

వాళ్ల సినిమా పంచాయితీలోకి… కన్నడ పార్టీలు దూరడం దేనికి..?!

April 29, 2022 by M S R

hindi

ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ సినిమాలు దేశవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లను రాబట్టడంతో… హిందీ ఇండస్ట్రీ నెగెటివ్‌గా స్పందిస్తుందని, పైకి ఎంత సంయమనం పాటిస్తున్నట్టు కనిపిస్తున్నా సరే, ఎప్పుడో ఓచోట ఆ అసహనం బట్టబయలు అవుతుందని అనుకుంటున్నదే… బాలీవుడ్ కోటలు కూలిపోతున్నట్టు ఫీలయిపోతున్నారు… ఇప్పుడు అజయ్ దేవగణ్ బయటపడ్డాడు… లోలోపల చాలామంది హిందీ హీరోలు, ఇండస్ట్రీ ముఖ్యులకు రగులుతూనే ఉంది… కన్నడ నటుడు సుదీప్‌కూ, అజయ్ దేవగణ్‌కూ నడుమ జరుగుతున్న పంచాయితీ కేవలం సినిమాలు, వాటి భాష గురించి […]

గాయిగత్తర లేదు, అగ్గి లేదు… తన పరిమితులేమిటో కేసీయారే చెప్పేశాడు…

April 28, 2022 by M S R

kcr

ఓ డిజిటల్ పత్రికయితే నేరుగా రాసేసింది… కేసీయార్ జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ అని… అంటే భారతీయ రాష్ట్ర సమితి అట… అబద్ధం… తను ఆ మాట చెప్పలేదు… చెప్పాలనే ఉద్దేశం కూడా తనకు లేదు… పార్టీ ఎమ్మెల్యే నుంచి వచ్చిన ప్రతిపాదన మాత్రమే అని స్పష్టంగానే చెప్పాడు… నిజానికి పరోక్షంగా తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఉన్న పరిమితులేమిటో కూడా కేసీయార్ తన ప్లీనరీ ప్రసంగంలో చెప్పాడు… ఎస్, ఒక రాజకీయ పార్టీకి జాతీయ రాజకీయాల […]

ఈరోజు భలే నచ్చిన వార్త… ఓ మండలంలో దీపావళి… సరైన ప్రజాభిప్రాయ ప్రకటన…

April 28, 2022 by M S R

aj

ఈరోజు నచ్చిన వార్త ఇది… గొప్ప వార్త కాదు.,. ప్రజలు తిరగబడి కొట్టలేదు… తెలంగాణలో ఓ లేడీ ఎమ్మార్వోను తగులబెట్టినట్టు కూడా కాదు… రెవిన్యూ వ్యవస్థ అంటేనే ప్రజల్లో విపరీతమైన ద్వేషం… భూమికి సంబంధించిన పెత్తనాలు కాబట్టి అధికారం కేంద్రీకృతమైన వ్యవస్థ అది… పైగా మెజిస్టీరియల్ పవర్స్… ఒక్క ముక్కలో చెప్పాలంటే పాలనకు కేంద్ర బిందువులు… ప్రభుత్వ ఉద్యోగి అంటేనే… తన రూపస్వభావాలు ఏమిటో ప్రజలకు క్లారిటీ ఉంది… ఆ క్లారిటీని ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తుంటారు కూడా… […]

అంగసాన్ సూకీ రాజకీయ చరిత్ర ఇక ముగింపుకు వచ్చినట్టే..?

April 28, 2022 by M S R

aungasan

మన మీడియాకు పెద్దగా ఆనలేదు గానీ… మన పొరుగున ఉన్న బర్మాలో వార్తలు మనకు కూడా ఇంపార్టెంటే… జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక అంగసాన్ సూకీ కెరీర్ సమాప్తం అయినట్టే కనిపిస్తోంది… తాజాగా ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు… ఆరు లక్షల డాలర్ల నగదు, 11 కిలోల బంగారు కడ్డీలను మాజీ ముఖ్యమంత్రి థస్ నుంచి ముడుపులు తీసుకున్నారనేది ఆమెపై సైనిక జుంటా ప్రభుత్వం పెట్టిన ఆరోపణ… అసలు ఇదే కాదు… ఇంతకుముందే 2022 […]

ఆ రాచజంటకు ట్రంపు దిష్టి… ఇక్కడా తనకు వర్ణవివక్షే… ఆ నోరసలే బ్యాడు…

April 27, 2022 by M S R

meghan

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంపు కొన్ని పిచ్చి వ్యాఖ్యలు చేశాడు… అఫ్‌కోర్స్, తనకు అలవాటైన పనే కదా… మేఘన్, హ్యారీ విడిపోతారట… ఎవరీ మేఘన్… ఎవరీ హ్యారీ…? బ్రిటిష్ రాజకుమారుడు హ్యారీ=… ఆయన భార్య మేఘన్… ఒకప్పుడు ప్రపంచమంతా ఆరాధించిన లేడీ డయానా కొడుకే ఈ హ్యారీ… మన మీడియాకు ఇలాంటి కథనాలు పెద్దగా పట్టవు… కానీ ఇంట్రస్టింగే… ఎందుకంటే..? ఈ మేఘన్ ఆ రాజరికాన్ని, ఆ వారసత్వాన్ని, ఆ సంపదను, ఆ కృత్రిమత్వాన్ని ఎడమకాలితో తన్నేసి, […]

కాంగ్రెస్‌ పీకేను ఎందుకు వద్దనుకుంది..? పీకే వ్యాపార ప్రణాళిక తల్లకిందులు..!!

April 26, 2022 by M S R

pk

ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున అయోమయానికి, గందరగోళానికి కారకుడైన ప్రశాంత్ కిషోర్…. ఒకేసారి అనేకానేక పడవుల మీద ప్రయాణించాలని అనుకున్నాడు… జాతీయ స్థాయిలో ఒక పార్టీకి వ్యూహకర్తగా వర్క్ చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలి, ప్రేమ కావాలి, కానీ పీకే వంటి వ్యాపారి ఒక చట్రంలో ఇమడాలని ఎందుకు అనుకుంటాడు… దీనికితోడు మాకు పనిచేయాలనుకుంటే ఇతర పార్టీలతో కటీఫ్ అయిపో అని కాంగ్రెస్ నిర్మొహమాటంగా చెప్పింది… పీకే వ్యవహార ధోరణి ఎలా ఉంటుందో […]

  • « Previous Page
  • 1
  • …
  • 112
  • 113
  • 114
  • 115
  • 116
  • …
  • 141
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions