స్వర్ణ భారతం కోసం ఉద్భవించిన భారత రాష్ట్ర సమితిలోకి ఏపీ నాయకులు కూడా తండోపతండాలుగా, మందలుమందలుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారట… మంచిదే… ఇన్నాళ్లూ రాష్ట్ర విభజనకు కారకుడని కేసీయార్ను నిందించే వాళ్లే కేసీయార్ నాయకత్వాన్ని కోరుకోవడం అంటే అంతకు మించిన గుణాత్మక మార్పు ఇంకేముంటుంది..? తోట చంద్రశేఖర్, కిషోర్ బాబు, పార్థసారథి తదితరులు ఏ అవసరాల కోసం బీఆర్ఎస్లో చేరారనే చర్చ జోలికి వెళ్లాల్సిన పనేమీ లేదు ఇప్పుడు… వాళ్లను తన పార్టీలోకి తీసుకురావడం మాత్రం కేసీయార్ […]
ఇదీ అసలు పాయింట్… చిన్న లీక్ లేకుండా ఆర్బీఐతో 6 నెలల సంప్రదింపులు…
పార్ధసారధి పోట్లూరి ……. కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సుప్రీం కోర్టు సమర్ధించింది! 1. 2016 లో కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సవాలు చేస్తూ మొత్తం 58 మంది సుప్రీం కోర్టులో పీటీషన్లు వేశారు. వీళ్లలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. 2. అయితే ఈ పిటీషన్ల మీద 5 గురు సభ్యులు కల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ రోజు ఉదయం తుది తీర్పు […]
తాగారు, ఊగారు, దొరికారు… భాగ్యనగరం చెత్తా రికార్డు… భేష్ బెంగుళూరు…
ప్రతి ఏటా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ… మందు ప్రేమికులు మద్యం తాగుతూనే ఉంటారు… ఈసారి కరోనా భయం లేదు కాబట్టి చిన్న చిన్న గెట్టుగెదర్స్ జరిగాయి… అయితే ఆంధ్రా ప్రజలు 142 కోట్లు తాగేశారు… తెలంగాణలో ఏకంగా 215 కోట్లు తాగేశారు… అని ఎడాపెడా పత్రికలు రాసిపారేశాయి… నిజానికి తాగడం కాదు వార్త… ఆ ఒక్కరోజు డిపోల నుంచి తీసుకొచ్చిన మద్యం విలువను రాశారు గానీ అంతకుముందే ఉన్న స్టాక్స్ విలువ మాటేమిటి..? పైగా తెలంగాణలో రెండుసార్లు […]
‘‘నో, నో… మా చంద్రబాబు పరమ పావనుడు… ఆ చావులతో సంబంధమే లేదు… ’’
ఒక విఫల ప్రయత్నం… నిన్నటి గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతికి అసలు కారకుడు చంద్రబాబును, ఆ పాతకం నుంచి బయటపడేయటానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ విఫల ప్రయత్నం చేశాడు… అబ్బే, చంద్రబాబుకు అస్సలు సంబంధం లేదు, అసలు అది టీడీపీ కార్యక్రమమే కాదు, అదంతా ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన జనోద్ధరణ మాత్రమే, వాళ్ల నిర్వాకం కారణంగానే ఆ ముగ్గురూ మృతిచెందారు… అని కవరింగు ఇవ్వడానికి నానాపాట్లూ పడింది… మొన్నటి కందుకూరు దుర్ఘటనలో సంభవించిన మరణాలు రాష్ట్రవ్యాప్తంగా […]
‘‘ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే… ఈ దేశ చట్టాల్ని గౌరవించాల్సిందే…’’
ముందుగా ఒక వార్త…ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన ట్విట్టర్ ఖాతాలో ఇండియా మ్యాప్ను తప్పుగా చూపించే ఓ కొత్త సంవత్సరపు గ్రాఫిక్ పోస్ట్ చేసింది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాలు లేని మ్యాప్ అది… ఇది గమనించిన వెంటనే కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియసయ్యాడు… ‘‘డియర్ వాట్సప్, వెంటనే ఆ తప్పును సరిదిద్దండి, లేకపోతే బాగుండదు… ఈ దేశంలో వ్యాపారం చేయాలని అనుకునే ఏ సంస్థయినా భారతదేశ చట్టాల్ని […]