కేసీయార్ బిడ్డ కవితను ఈడీ తన ఆఫీసుకే విచారణకు రమ్మంటోంది… ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగింది కూడా… ఆ కేసు, విచారణ తీరు మీద చర్చ కాదు ఇక్కడ… ఈడీ వృద్ధులు, మహిళల విచారణకు వాళ్ల ఇంటికే వెళ్లాలి, ఆఫీసులో విచారణ జరపకూడదు అనేది కవిత ఫిర్యాదు… దాని మీద సుప్రీంలో కేసు ఉంది కూడా..! తీర్పు చెప్పాల్సి ఉంది… ఇది ఒక అంశం… ఆమెది ఢిల్లీ స్కాం కేసు… మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల కేసుకు సంబంధించి […]
సరోగేట్ యాడ్స్ వదిలేసిన ఆదర్శుడు… సజ్జనార్ సలహా మాత్రం పెడచెవిన…
మన మహేశ్ బాబు వినడు… మనుషుల ఆరోగ్యాన్ని పాడుచేసే గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ నిక్షేపంగా చేస్తుంటాడు… తాజాగా దేవరకొండ విజయ్ కూడా థమ్సప్ యాడ్స్ స్టార్ట్ చేశాడు… గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ చేసి, తప్పు తెలుసుకుని, లెంపలేసుకుని అమితాబ్ తాను అడ్వాన్సుగా తీసుకున్న డబ్బుల్ని కూడా వాపస్ చేశాడు… ఆహా, మన హీరోలకు సామాజిక బాధ్యత లేకపోయినా సరే, అంతటి అమితాబ్ ఆదర్శంగా నిలిచాడు అనుకున్నాం కదా… కేంద్రం కూడా ఈమధ్య వాణిజ్య ప్రకటనల్లో […]
అడ్డదారులూ ఫలించని సాక్షి… ఈనాడును జయించలేక చతికిల… ప్చ్, ఆంధ్రజ్యోతి…
పత్రికల గతిని శాస్త్రీయంగా సూచించేవి ఏబీసీ లెక్కలు… ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… పది రోజుల క్రితం తాజా ఫిగర్స్ వచ్చాయి… జాతీయ స్థాయిలో ఎవరూ రాసుకోలేదు… ఎవరికీ ఆశించినంత, రాసుకునేంత సంతృప్తి లేదు గనుక… కరోనా భయాల అనంతరమూ పత్రికల సేల్స్ పెద్దగా పెరగలేదు గనుక… 2019 స్థాయిని తిరిగి చేరలేదు గనుక… చేరుకుంటామనే నమ్మకమూ, సూచనలూ లేవు గనుక… సరే, ప్రింట్ మీడియా పరిస్థితి ఇకపై కూడా పెద్దగా బాగుపడే అవకాశాల్లేవు, కారణాలు అనేకం […]
హవ్వ… అంతటి అమెరికాలో ప్రొహిందూ ధోరణులా..? ఏమిటీ తిరోగమనం..?!
ఎంత దారుణం..? ఈ మోడీ ఇక్కడ ప్రజాస్వామిక, నీతి శుద్దపూసలను సీబీఐ, ఈడీల పేరుతో వేధిస్తున్నది చాలక తన కంటిని ఇక అమెరికా మీద కూడా కేంద్రీకరించాడు… మోడీ ప్రపంచానికే ప్రమాదకారి అయిపోయాడు… హమ్మ, హమ్మ… ఎంత అమానుషం..? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీద కూడా లిక్కర్ కేసులు పెట్టేస్తామని బెదిరించి, జార్జియా రాష్ట్ర ప్రతినిధులను ప్రలోభపెట్టి… హిందూ మత వ్యతిరేక చర్యలను సహించేది లేదని తీర్మానం చేయించాడు… ఇక ఊరుకునేది లేదు… అమెరికాలో కూడా […]
కవిత అరెస్టుపై మోడీకి వణుకు..? రాధాకృష్ణా, ఏం చెప్పితివి, ఏం చెప్పితివి..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేర్చినా సరే, కవితను అరెస్టు చేయడానికి మోడీ ప్రభుత్వం వెనకాడుతోంది… అరెస్టు చేస్తే కేసీయార్ దాన్ని సానుభూతి అస్త్రంగా మార్చుకుంటాడని బీజేపీ భయపడుతోంది… ప్రత్యేకించి మహిళల్లో సానుభూతిని పెంచుకుంటుందనీ, ఆ దిశలోనే కవిత ద్వారా మహిళ రిజర్వేషన్ల పోరాటం అనే కొత్త ఆట మొదలెట్టిందనీ బీజేపీ భావిస్తోంది…… ఈ భావన వచ్చేలా ఆంధ్రజ్యోతి రాజకీయ విశ్లేషకుడు రాధాకృష్ణ ఏదో రాసుకొచ్చాడు… చిత్రవిచిత్రంగా సాగిపోయిన తన ఎడిటోరియల్ వ్యాసంలో… అద్వానీకి, వాజపేయికి సహాయకుడిగా పరిచర్యలు […]
అమెరికాకు గగనంలో చుక్కలు చూపిస్తున్న చైనా… వరుసగా స్పై ప్లేన్ల కూల్చివేత…!!
పార్ధసారధి పోట్లూరి …… (భారత్ –రష్యా – చైనా కూటమి ! పార్ట్ -02) న్యూయార్క్ కి చెందిన హిండెన్‌బర్గ్ ట్వీట్ చేసింది : మేము మరొక సంచలన విషయం బయటపెట్టబోతున్నాము భారత్ దేశపు సంస్థ గురుంచి అంటూ! ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది అమెరికా భారత దేశానికి ? భారత్,రష్యా,చైనా లు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది! లడాక్ మరియు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనా తన దళాలని భారీగా మోహరించింది […]
ఆహా… అల్లు వారి కొత్త దినపత్రిక త్వరలో… ఏకంగా డమ్మీలే ప్రత్యక్షం…
పొద్దున్నే ఓ ఆశ్చర్యం… అల్లు అరవింద్ ఓ దినపత్రికను స్టార్ట్ చేయబోతున్నాడని…! నిజానికి బయటి వ్యక్తులెవరో చేస్తున్న ప్రచారం కాదు, ఆహా వాళ్లు ఫేస్ బుక్ వాల్ మీద కనిపించింది… వావ్, ఒక్కో దినపత్రిక మూతపడుతూ, నడుస్తున్నవేమో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న దుస్థితిలో ఒక కొత్త దినపత్రిక వస్తుందనే ఊహ విస్మయాన్ని కలిగించింది… అసలు ఆహా ఫేస్ బుక్ పేజీలో దాని డిస్క్రిప్షనే బ్రాడ్ కాస్టింగ్ అండ్ మీడియా కంపెనీ అని రాసి ఉంటుంది… వాళ్ల పోస్ట్‌లో […]
రోజుల శిశువుకు ఉప్మా తినిపించిందట… నోరుజారింది, పట్టుబడిపోయింది…
బెంగుళూరు… మగది రోడ్ దగ్గరలోని బిన్నీ మిల్ ఏరియా… నలభయ్యేళ్ల హేమావతి తన కొడుకుతో ఎటో వెళ్తోంది… కంఠీరవ క్రాంతివీర సంగోలి రాయన్న మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఓ గుంపును దాటేటప్పుడు ఓ శిశువును ఎత్తుకున్న ఓ మహిళ కనిపించింది… మరీ రోజులనాటి పసి శిశువులా కనిపిస్తోంది… గుక్క పెట్టి ఏడుస్తోంది… శిశువును ఎత్తుకున్న మహిళకు ఊరడించడం చేతకావడం లేదు… హేమవతిలో అనుమానం మొలకెత్తింది… ఏదో కృత్రిమత్వం, అసహజత్వం కనిపిస్తోంది… ఆమె కూడా ఓ తల్లి కదా… […]







