2014… టీవీ అనుపమ… ఓ ఐఏఎస్ అధికారిణి… తనది కూడా కేరళే… కన్నూరు సబ్‌కలెక్టర్‌గా చేసి టూరిజం, ఫుడ్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్‌గా ట్రివేండ్రం బదిలీ అయ్యింది… ఓ వెహికల్లోకి సామాను ఎక్కించుకుని ట్రివేండ్రం చేరింది… సమయానికి ఎవరూ లేబర్ దొరకలేదు… ఆమె, కుటుంబసభ్యులు, ఆ వెహికిల్ డ్రైవర్, హౌజ్ ఓనర్ అందరూ కలిసి సామాను అన్లోడ్ చేశారు, చివరలో ఓ వాషింగ్ మెషిన్ మిగిలింది… అప్పుడక్కడికి వచ్చిన సీఐటీయూ కూలీలు దాన్నలాగే ఆపేసి, మొత్తం లోడ్‌కు […]
సీనియర్ ఐఏఎస్… కానీ బుర్ర తిరుగుడు… లేడీ జర్నలిస్టు పట్ల చిల్లర ప్రవర్తన…
….. ఈ సారు గారి పేరు ప్రశాంత్ నాయర్… 2006 యూపీఎస్సీ ఫోర్త్ ర్యాంకు కొట్టాడు… కేరళ కేడర్ ఐఏఎస్… పెళ్లయింది, ఇద్దరు పిల్లలు… కానీ కాస్త తిక్క కేసు… ఎంత తిక్క అంటే తనకే లెక్క తెలియనంత తిక్క… కాకపోతే ఆ తిక్కకు ఓ వుమెన్ జర్నలిస్టు బజారుకెక్కాల్సి వచ్చింది… ఆమధ్య Sudden Sensorineural Hearing Loss (SSHL) ప్రాబ్లం తలెత్తి అకస్మాత్తుగా వినికిడి శక్తి కూడా కోల్పోయాడు… సరే, తన కెరీర్లో, తన సర్వీసులో […]
నమస్తే తెలంగాణను కొట్టేసిన దిశ… నెక్స్ట్ ఆంధ్రజ్యోతి… తర్వాత సాక్షి…!!!
నమస్తే తెలంగాణ దినపత్రికను దిశ అనే డిజిటల్ పేపర్ కొట్టేసింది… ఇక తరువాత టార్గెట్ ఆంధ్రజ్యోతే… ఆ తరువాతే సాక్షి, ఈనాడు…… ఆశ్చర్యపోకండి… దిశ డెయిలీ అలెక్సా ర్యాంకు స్టేటస్ ఇదీ అంటూ, ఇతర పత్రికల ర్యాంకులతో పోలిస్తూ ఓ చిన్న చార్ట్ వాట్సప్‌లో కనిపించింది… దాన్ని చూస్తే అలాగే అనిపించింది… కాస్త చిత్రంగా కూడా తోచింది… అంటే అది అబద్ధమని కాదు… ఆ ప్రచారమూ తప్పు అని కాదు… అవి నిజమైన ర్యాంకులే… కానీ దిశ […]
కలెక్టర్ కారు కదా… ఛట్, దానికి కూడా రూల్సేమిటి..? చలానాలు ఏమిటి..?
ఈరోజు పత్రికల్లో ఒక్కసారిగా కనెక్టయ్యింది ఈ వార్తే… ఒక కలెక్టర్ కారుపై ఏకంగా 23 చలానాలు పెండింగ్… ఎలాగూ ఖజానా నుంచే కట్టేస్తారు, వాళ్ల జేబుల్లో నుంచి కట్టేది లేదు కదా… అది కాదు అసలు విషయం… రవాణా చట్టాల్ని అమలు చేయాల్సిన ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తే, ఏ భయమూ భక్తి లేకపోతే, ఇక మామూలు మనిషికి ఎందుకు ఉండాలి..? కలెక్టరే చలానా కట్టకపోతే మామూలు మనిషి ఎందుకు నిజాయితీగా, చట్టానికి లోబడి ఉండాలి.., అతివేగం, ప్రమాదకరంగా […]
మోదీ… యోగీ… దాదాపు అందరిదీ అదే ‘భక్తి పర్యటన’ దారి..!
ప్రజాస్వామ్యంలో ఓట్లే ముఖ్యం. అవి వస్తేనే సీట్లు. సీట్లు వచ్చిన వారిదే అధికారం. రాష్ట్రం ఏదైనా, ఎన్నిక ఎక్కడైనా ఇదే ప్రధాన సూత్రం. ఓటు కోసమే రాజకీయం. ఓటు చుట్టే రాజకీయం. ఏం చేస్తే ఓట్లు వస్తాయో అదే చేయడం. విధానాలు, సిద్ధాంతాలు ఏం లేవు. ఏం చేస్తే ఓట్లు పడతాయో అదే విధానం. ట్రెండ్‌కు తగ్గట్లు రాజకీయం చేయడమే ఇప్పుడు గెలుపు విధానం. ఉత్తరప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ సీట్లు […]
రావణరాజ్యంలో అలోలక్ష్మణా..! చైనాను నమ్మిన శ్రీలంకలో ఆకలికేకలు..!!
……….. By…. పార్ధసారధి పోట్లూరి……….. మన పొరుగు దేశం శ్రీలంక తీవ్ర సంక్షోభం లో చిక్కుకుంది ! కరొన వల్ల దెబ్బతిన్న దేశాల సరసన శ్రీ లంక కూడా చేరబోతున్నది. దిగుమతుల మీద ఆంక్షలు విధించింది శ్రీలంక ప్రభుత్వం. అత్యవసరం అయితే తప్పితే ఎలాంటి దిగుమతులకి అనుమతి ఇవ్వబోమని ఒక ప్రకటనలో దేశ పౌరులని, పారిశ్రామికవేత్తలని ఉద్దేశించి తెలిపింది. గత సంవత్సరం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉండగా శ్రీ లంక ప్రభుత్వం ఒక కీలక […]
ఈ ‘కిన్నెర మెట్ల’ మొగులయ్యకు కేసీయార్ ఏమీ సాయం చేయలేదా..?!
ఓ తెలంగాణ జానపద వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య అలియాస్ కిన్నెర మెట్ల మొగులయ్యకు పోసాని కృష్ణమురళి లక్ష ఇచ్చాడు… గుడ్… ఏబీఎన్ చానెల్ ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి కొన్ని విరాళాలు ఇప్పించే ప్రయత్నం చేసింది… గుడ్… పవన్ కల్యాణ్ 2 లక్షలిచ్చాడు… గుడ్… తెలుగు సినిమాకు ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ జానపదం రంగు, రుచి, వాసన, చిక్కదనం కావాలి కాబట్టి… ఏ పదప్రాసలు, ప్రయాసల జోగయ్యో రాసిన ఓ భజన పాటకు ఏ […]
వావ్ స్టాలిన్… టోల్ ప్లాజాలు, పరువు నష్టాలపై మరో రెండు మంచి అడుగులు…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రశంసిస్తుంటే కొంతమందికి అస్సలు నచ్చడం లేదు… కారణం, స్టాలిన్ రాజకీయ ధోరణి నచ్చకపోవడం వల్ల కావచ్చు…! గుళ్లల్లో బ్రాహ్మణేతర అర్చకుల నియామకం, కేంద్ర వ్యవసాయ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం వంటి నిర్ణయాలు కొందరికి నచ్చడం లేదేమో…! విభేదించకూడదని ఎవరూ అనడం లేదు కానీ సమర్థించాల్సిన అంశాలు కనిపించినప్పుడు చప్పట్లు కొట్టకుండా ఎందుకు ఊరుకోవాలి..? ఇదీ అసలు ప్రశ్న… నిజానికి స్టాలిన్ మీద తను సీఎం అయ్యేదాకా ఎవరికీ […]
ఓ జర్నలిస్టు సంఘ నాయకుడు వర్సెస్ ఓ తెలుగు పత్రిక యజమాని..!!
ఓ ఇంట్రస్టింగ్ ఫస్ట్ పేజీ బాక్స్ ఐటం కనిపించింది ఆంధ్రప్రభలో… సైన్డ్ ఎడిటోరియల్ అంటారు దీన్ని సాధారణంగా… ఏవైనా కీలకాంశాలను పాఠకులకు వివరించేందుకు పలు సందర్భాల్లో ఇలాంటి ‘‘సంతకం చేయబడిన ఫస్ట్ పేజీ సంపాదకీయ లేఖలు’’ పరిపాటే… అసాధారణం ఏమీ కాదు… సదరు మీడియా సంస్థ ఓనరో, ఎడిటరో, ఎండీయో, ముఖ్యమైన బాధ్యులో అలాంటివి వదులుతూ ఉంటారు… ప్రజలకు, పాఠకులకు పత్రిక ప్రముఖంగా ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు ఈ పద్ధతి పాటిస్తుంటారు… ఈరోజు ఈ ఆంధ్రప్రభ […]
ABP-CVoter Survey… కాంగ్రెస్‌కు దుర్దినాలు… ఒక్కటీ సేఫ్ స్టేట్ లేదు..?!
మోడీ మీద జనంలో ఇంకా వ్యతిరేకత పెరిగినా సరే… మోడీ ఇంకా ఎన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా సరే…. వాటిని రాజకీయంగా వాడుకునే సమర్థ రాజకీయ పార్టీ కనిపించడం లేదు… కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేక, నెహ్రూ కుటుంబం నుంచి తప్పలేక, తప్పుకోలేక, తప్పించుకోలేక… తప్పులేక అన్నట్టుగా ఆ వారసత్వం అధికారికమో, అనధికారికమో తెలియని చందంగా నడుస్తూనే ఉంది… సరైన మార్గదర్శనం లేదు, రాజకీయ వ్యూహాల్లేవు, కేడర్‌ను కదిలించే మంచి లీడర్ లేడు… రోజురోజుకూ దాన్ని […]
ఆ వార్త రామోజీరావు పట్టేసుకున్నాడు… తెలుగు రాజకీయాల్నే మార్చేశాడు…
రామోజీరావు వ్యతిరేక శిబిరంలో కూర్చుని ఆలోచిస్తే ఆయన అడుగులు మహాపాతకాలు అనిపించవచ్చుగాక… కానీ ఆయన క్యాంపు కోణంలో చూస్తే మటుకు తన దూరదృష్టి, తన ప్లానింగు, తన ఇంప్లిమెంటేషన్ తీరు, తన పాచికలు అద్భుతం అనిపిస్తాయి… ఇప్పుడు ఆయన పాపం, ఈ వృద్దాప్యంలో ఎవరికీ ఏమీ ఆనకపోవచ్చుగాక, కానీ తను ‘‘ఆట ఆడిన కాలంలో’’ మాత్రం అనితరసాధ్యుడు… నిజానికి ఈనాడు లేక ఎన్టీయార్ పార్టీ లేదు, దాని దూకుడు లేదు, తెలుగుదేశం ప్రభే లేదు… అప్పుడే కాదు, […]
ఓ పాపా లాలీ…! ఈ అమెరికన్ సైనికురాలి ఫోటో గుర్తుందా..? ఇప్పుడీమె లేదు..!!
ఇరవయ్యేళ్ల యుద్ధం ముగిసింది… అఫ్ఘన్‌లో ఉన్న చిట్టచివరి అమెరికా సైనికుడు కూడా వెళ్లిపోయాడు… తాలిబన్లు పెట్టిన గడువుకు ఓ నిమిషం ముందే చివరి విమానం గాల్లోకి ఎగిరింది… ఇన్నేళ్ల యుద్ధంలో దాదాపు 2500 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు అక్కడ… 3500 మంది దాకా అమెరికన్ సైనిక కంట్రాక్టర్లు, వర్కర్లు మరణించారు అక్కడ… అన్ని మరణాలకన్నా… చిట్టచివరి సైనికుడు వీడ్కోలు విమానం ఎక్కేశాడు అనే వార్తలకన్నా…. ఆ విమానంలోకి ఒక యువతి ఎక్కలేదు అనే వార్తే […]
అమెరికా వాడు అప్ఘన్లో వదిలేసి వెళ్లిన ఆయుధాలతో ఇండియాకు ప్రమాదం..!?
………… by…. పార్ధసారధి పోట్లూరి ………. $85 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలని అమెరికా తాలిబన్లకి అప్పచెప్పింది ! ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశం ప్రపంచంలోనే 4 వ అతి పెద్ద సైనిక శక్తి. ఇలా చెత్త ప్రచారాలతో సోషల్ మీడియా లో కావచ్చు లేదా ఎలెక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ప్రచారం జరుగుతున్నది. సంబరాలు చేసుకుంటున్న వారికి లెక్క లేదు. ఫేస్బుక్ లో పోస్టుల మీద పోస్టులు. మరీ ముఖ్యంగా తాలిబన్లు భారత్ ని ఏదో చేయబోతున్నారు […]
వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు… వ్యవస్థలేమీ కుప్పకూలవు, జస్ట్, ఓ కంపనం…
……….By… Prasen Bellamkonda………. సంస్థ గొప్పదా, వ్యక్తి గొప్పా..? వ్యక్తి వెళ్ళిపోతే వ్యవస్థ కూలిపోతుందా? వ్యక్తే ఆ వ్యవస్థను నిర్మించినా సరే, ఆ వ్యక్తి నిష్క్రమిస్తే, ఆ వ్యవస్థ కూలిపోతే, ఆ నిర్మాణంలో లోపం వున్నట్టే కదా. ప్రీతిష్ నంది లేకుంటే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లేదనుకునే వారు అప్పట్లో. కానీ ఆయన వెళ్ళాక కూడా ఏ నష్టమూ జరగలేదు. రాజదీప్ సర్దేశాయ్ లు, ఎంజే అక్బర్ లు, హన్సారి లు మారినా ఆయా వ్యవస్థలకేమీ నష్టం జరగలేదు. […]
కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడును వదిలేశాడు… లేక వదిలేయబడ్డాడా..? అసలేమిటీ కథ..?!
నిజానికి ఇది వేడి వేడి వార్తేమీ కాదు… చాలాసేపటి నుంచీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్తే… ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ తన కొలువుకు రాజీనామా చేశాడు… ఇదీ వార్త… వాళ్లో వీళ్లో చెప్పడం దేనికి..? తనే తన ఫేస్ బుక్ వాల్ మీద షేర్ చేసుకున్నాడు… సో, సందేహాలు అక్కర్లేదు… అయితే కొత్తగా ఆయన రాజీనామా మీద ఏం రాయగలం..? పొమ్మనబడ్డాడా..? తనే పోయాడా..? ఇదీ ఒక ప్రశ్న… ఈనాడు నుంచి వెళ్లిపోయేవాళ్లు కొందరు […]
అన్నీ బాగున్నవాళ్లదేం గొప్ప… ఇదుగో ఈ అవనిది అసలు గొప్పతనం…
అన్నీ బాగున్నవాళ్లు గెలిస్తే ఏం గొప్ప..? విధి వెక్కిరిస్తే, నిలబడి, దాన్ని ధిక్కరించి గెలిచేవాళ్లదే అసలు గొప్ప… అవును, పారాలింపిక్స్ స్వర్ణపతక విజేత అవని లేఖడా నిజంగా గొప్పే… ఎందుకో చెప్పుకుందాం… అలాగే, మరో మాట… ఒలింపిక్స్‌లో గెలిచినా గెలవకపోయినా, ఉత్త చేతులతో తిరిగి వచ్చినా మీడియా విపరీతంగా హైప్ ఇచ్చింది, చప్పట్లు కొట్టింది, పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసింది… ఓ చిన్న పతకం సాధిస్తే కోట్లకుకోట్లు గుమ్మరించాయి ప్రభుత్వాలు, సన్మానించాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇచ్చాయి, తెలుగు రాష్ట్రాలయితే […]
తిరుమల వెంకన్నా… ఈ బ్యూరోక్రాట్లను నమ్మితే ‘మునిగిపోతవ్’… బహుపరాక్…
కోట్ల మంది హిందువులకు ఆరాధ్యుడు తిరుమల వెంకటేశ్వరస్వామి… అత్యంత ధనిక హిందూ దేవుడు కూడా వెంకన్నే… ప్రతి నిర్ణయం వెనుక, ప్రతి ఆలోచన వెనుక ఓ ధార్మిక భావన ఉండాలి… అక్కడ నియుక్తులయ్యే ఏ అధికారికీ ఆ సోయి ఉండదు… ఇతరత్రా ప్రభుత్వ వ్యవహారాలు, పాలన ధోరణులు, ఇగోయిస్టిక్ వైఖరులే ప్రభావితం చేస్తూ ఉంటయ్ వాళ్లను… ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదీ అంటే… తాజా ఉదాహరణ సంప్రదాయ భోజనం…! నిజానికి సంప్రదాయ భోజనం అనే పదప్రయోగమే తప్పు… […]
అంతుచిక్కని విజయమ్మ అడుగులు… హైదరాబాదులో వైఎస్ ప్రత్యేక సంస్మరణ…
నిజమే, అంగీకరించాలి… తెలంగాణకు వ్యతిరేకి అయినా సరే, మాజీ సీఎం రాజశేఖరరెడ్డికి తెలంగాణవ్యాప్తంగా అభిమానగణం ఉంది… ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వల్ల లబ్దిపొందిన కుటుంబాలు ఆయన్ని మరిచిపోవు… కానీ అదొక్కటీ షర్మిల పార్టీకి ఒక ‘డ్రైవింగ్ ఫోర్స్’గా సరిపోతుందా..? ఈ ప్రశ్న ఎందుకంటే..? వైఎస్ పన్నెండో వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాదు నోవాటెల్ అనే స్టార్ హోటల్లో ఓ ప్రోగ్రాం నిర్వహించనుంది… సెప్టెంబరు రెండున… ఇది నాన్-పొలిటికల్, నాన్-పార్టీ ప్రోగ్రాం అని చెబుతున్నారు… వైఎస్ కేబినెట్ సహచరులు, […]
కాళ్లల్లో కట్టెలు పెట్టేవాళ్లున్నా సరే… గూట్లేలు, గుండుగాళ్లే జోష్ నింపుతున్నారు…
మైనంపల్లి, మల్లారెడ్డిలతో రేవంతుడిని, సంజయుడిని తిట్టించడం అనేది కేసీయార్ స్ట్రాటజీ కావచ్చుగాక…. కోపమొస్తే ఒక మాట అనరా అని కేటీయార్ సమర్థించవచ్చుగాక… కానీ కేసీయార్ గమనించాడో లేదో తెలియదు గానీ ప్రజల్లో తన పట్ల, తన పార్టీ పట్ల, తన ప్రజాప్రతినిధుల పట్ల, తన ప్రభుత్వం పట్ల, తన వ్యవహారిక ధోరణి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది… టీఆర్ఎస్ క్యాంపు ఉలిక్కిపడి ఇక బూతులకు పూనుకున్నా సరే, కొన్ని నిజాల్ని అంతర్గతంగా అంగీకరించాల్సిందే… అసలు ఇది కాదు, మనం […]
తాలిబన్ల పాలన అంత వీజీ కాదు… ఆర్థికంలో అసలు కథ ముందుంది…
……….. By……… పార్ధసారధి పోట్లూరి ……… ఊపేకుహ : ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి ! తాలిబన్లు కాబూల్ ని స్వాధీనం చేసుకోగానే పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్ర సంస్థల వాళ్ళు వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచారు. ఇక పాకిస్థాన్ లో తాలిబన్లని సమర్ధించేవారు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇక చైనా, పాకిస్థాన్, రష్యాలు తమ వంతు వాటా కోసం తమ రాయబార కార్యాలయాలని మూసేయకుండా ఆశగా ఎదురు చూస్తున్నాయి….. కానీ […]
- « Previous Page
- 1
- …
- 117
- 118
- 119
- 120
- 121
- …
- 146
- Next Page »