……….By… Prasen Bellamkonda………. సంస్థ గొప్పదా, వ్యక్తి గొప్పా..? వ్యక్తి వెళ్ళిపోతే వ్యవస్థ కూలిపోతుందా? వ్యక్తే ఆ వ్యవస్థను నిర్మించినా సరే, ఆ వ్యక్తి నిష్క్రమిస్తే, ఆ వ్యవస్థ కూలిపోతే, ఆ నిర్మాణంలో లోపం వున్నట్టే కదా. ప్రీతిష్ నంది లేకుంటే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లేదనుకునే వారు అప్పట్లో. కానీ ఆయన వెళ్ళాక కూడా ఏ నష్టమూ జరగలేదు. రాజదీప్ సర్దేశాయ్ లు, ఎంజే అక్బర్ లు, హన్సారి లు మారినా ఆయా వ్యవస్థలకేమీ నష్టం జరగలేదు. […]
కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడును వదిలేశాడు… లేక వదిలేయబడ్డాడా..? అసలేమిటీ కథ..?!
నిజానికి ఇది వేడి వేడి వార్తేమీ కాదు… చాలాసేపటి నుంచీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్తే… ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ తన కొలువుకు రాజీనామా చేశాడు… ఇదీ వార్త… వాళ్లో వీళ్లో చెప్పడం దేనికి..? తనే తన ఫేస్ బుక్ వాల్ మీద షేర్ చేసుకున్నాడు… సో, సందేహాలు అక్కర్లేదు… అయితే కొత్తగా ఆయన రాజీనామా మీద ఏం రాయగలం..? పొమ్మనబడ్డాడా..? తనే పోయాడా..? ఇదీ ఒక ప్రశ్న… ఈనాడు నుంచి వెళ్లిపోయేవాళ్లు కొందరు […]
అన్నీ బాగున్నవాళ్లదేం గొప్ప… ఇదుగో ఈ అవనిది అసలు గొప్పతనం…
అన్నీ బాగున్నవాళ్లు గెలిస్తే ఏం గొప్ప..? విధి వెక్కిరిస్తే, నిలబడి, దాన్ని ధిక్కరించి గెలిచేవాళ్లదే అసలు గొప్ప… అవును, పారాలింపిక్స్ స్వర్ణపతక విజేత అవని లేఖడా నిజంగా గొప్పే… ఎందుకో చెప్పుకుందాం… అలాగే, మరో మాట… ఒలింపిక్స్‌లో గెలిచినా గెలవకపోయినా, ఉత్త చేతులతో తిరిగి వచ్చినా మీడియా విపరీతంగా హైప్ ఇచ్చింది, చప్పట్లు కొట్టింది, పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసింది… ఓ చిన్న పతకం సాధిస్తే కోట్లకుకోట్లు గుమ్మరించాయి ప్రభుత్వాలు, సన్మానించాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇచ్చాయి, తెలుగు రాష్ట్రాలయితే […]
తిరుమల వెంకన్నా… ఈ బ్యూరోక్రాట్లను నమ్మితే ‘మునిగిపోతవ్’… బహుపరాక్…
కోట్ల మంది హిందువులకు ఆరాధ్యుడు తిరుమల వెంకటేశ్వరస్వామి… అత్యంత ధనిక హిందూ దేవుడు కూడా వెంకన్నే… ప్రతి నిర్ణయం వెనుక, ప్రతి ఆలోచన వెనుక ఓ ధార్మిక భావన ఉండాలి… అక్కడ నియుక్తులయ్యే ఏ అధికారికీ ఆ సోయి ఉండదు… ఇతరత్రా ప్రభుత్వ వ్యవహారాలు, పాలన ధోరణులు, ఇగోయిస్టిక్ వైఖరులే ప్రభావితం చేస్తూ ఉంటయ్ వాళ్లను… ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదీ అంటే… తాజా ఉదాహరణ సంప్రదాయ భోజనం…! నిజానికి సంప్రదాయ భోజనం అనే పదప్రయోగమే తప్పు… […]
అంతుచిక్కని విజయమ్మ అడుగులు… హైదరాబాదులో వైఎస్ ప్రత్యేక సంస్మరణ…
నిజమే, అంగీకరించాలి… తెలంగాణకు వ్యతిరేకి అయినా సరే, మాజీ సీఎం రాజశేఖరరెడ్డికి తెలంగాణవ్యాప్తంగా అభిమానగణం ఉంది… ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వల్ల లబ్దిపొందిన కుటుంబాలు ఆయన్ని మరిచిపోవు… కానీ అదొక్కటీ షర్మిల పార్టీకి ఒక ‘డ్రైవింగ్ ఫోర్స్’గా సరిపోతుందా..? ఈ ప్రశ్న ఎందుకంటే..? వైఎస్ పన్నెండో వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాదు నోవాటెల్ అనే స్టార్ హోటల్లో ఓ ప్రోగ్రాం నిర్వహించనుంది… సెప్టెంబరు రెండున… ఇది నాన్-పొలిటికల్, నాన్-పార్టీ ప్రోగ్రాం అని చెబుతున్నారు… వైఎస్ కేబినెట్ సహచరులు, […]
కాళ్లల్లో కట్టెలు పెట్టేవాళ్లున్నా సరే… గూట్లేలు, గుండుగాళ్లే జోష్ నింపుతున్నారు…
మైనంపల్లి, మల్లారెడ్డిలతో రేవంతుడిని, సంజయుడిని తిట్టించడం అనేది కేసీయార్ స్ట్రాటజీ కావచ్చుగాక…. కోపమొస్తే ఒక మాట అనరా అని కేటీయార్ సమర్థించవచ్చుగాక… కానీ కేసీయార్ గమనించాడో లేదో తెలియదు గానీ ప్రజల్లో తన పట్ల, తన పార్టీ పట్ల, తన ప్రజాప్రతినిధుల పట్ల, తన ప్రభుత్వం పట్ల, తన వ్యవహారిక ధోరణి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది… టీఆర్ఎస్ క్యాంపు ఉలిక్కిపడి ఇక బూతులకు పూనుకున్నా సరే, కొన్ని నిజాల్ని అంతర్గతంగా అంగీకరించాల్సిందే… అసలు ఇది కాదు, మనం […]
తాలిబన్ల పాలన అంత వీజీ కాదు… ఆర్థికంలో అసలు కథ ముందుంది…
……….. By……… పార్ధసారధి పోట్లూరి ……… ఊపేకుహ : ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి ! తాలిబన్లు కాబూల్ ని స్వాధీనం చేసుకోగానే పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్ర సంస్థల వాళ్ళు వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచారు. ఇక పాకిస్థాన్ లో తాలిబన్లని సమర్ధించేవారు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇక చైనా, పాకిస్థాన్, రష్యాలు తమ వంతు వాటా కోసం తమ రాయబార కార్యాలయాలని మూసేయకుండా ఆశగా ఎదురు చూస్తున్నాయి….. కానీ […]
పనికిమాలిన అఖండ భారత్ క్యాం‘పెయిన్’..! అసలు ఫాయిదా ఏమిటి..?!
Subramanyam Dogiparthi…… పోస్టు ఇది… ఓసారి చదవండి… ‘‘సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న మరో ఫొటో ఇది . ఎవరు స్పాన్సర్ చేసారో తెలియదు . ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఉంటున్నాయి . ఈ ఫొటోలో స్పాన్సర్ పేరు లేదు . అదో అంశం . నేను ప్రస్తావించదలచుకున్న అంశం మరొకటి . అది : అఖండ భారతం నినాదం బాగా ఉంది . అందరికీ ఇష్టమే . అయితే […]
నోరు విప్పితే అబద్ధం..! నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కదా మరి…!!
నో డౌట్… చదువుకోవాలనుకున్న ఈ పిల్లపై అప్పట్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపింది నిజం…. వాళ్లు చేసిన అనేకానేక బీభత్స, భీకరమైన అరాచకాల్లో చాలా చిన్న సంఘటన అది… అంతర్జాతీయ సమాజం ఖండించింది, అండగా నిలిచింది, ఆమె చదువుకుంది… ఆశ్చర్యంగా నోబెల్ వాడు ఆమెకు శాంతి బహుమతి ప్రకటించాడు… నిష్ఠురంగా ఉన్నా ఒకటి మాత్రం నిజం… ఆమె బాధితురాలు, అంతేతప్ప శాంతి స్థాపనకు ఆమె చేసింది ఏముంది..? తాలిబన్ల పాలనలో లక్షల మంది మహిళలు, పిల్లలు ఇంతకన్నా ఘోరాతిఘోరమైన […]
అఫ్ఘన్ నుంచి మనవాళ్లను అంత వేగంగా ఎలా తీసుకురాగలిగామో తెలుసా..?
అఫ్ఘన్ సంక్షోభం గురించి మనకెందుకు ఇంత హైరానా అనుకోవడానికి వీల్లేదు… తాలిబన్లు బలపడటం, వాళ్లతో చైనా, పాకిస్థాన్ దోస్తీ బలపడటం, వాటికి రష్యా డప్పు కొట్టడం మనకు ఎప్పుడూ ముప్పుకారకమే… అందుకే అధ్యయనం అలవాటైన కలాలన్నీ కదులుతున్నయ్… రకరకాల కోణాల్లో విశ్లేషణలు, కథనాలు కనిపిస్తున్నాయి… సోషల్ మీడియాలో కూడా బోలెడు ఆసక్తికరమైన సమాచార వ్యాప్తి జరుగుతోంది… ఇదే అప్ఘనిస్థాన్‌కు ఎగువన తజికిస్థాన్ అని ఓ దేశం ఉంటుంది… గతంలో సోవియట్ యూనియన్‌లో పార్ట్, తరువాత విడిపోయింది… అక్కడ […]
ఆంధ్రజ్యోతికి ఏమిటీ హఠాత్ జ్ఞానోదయం..? ఇన్నేళ్లకు ఆ బిడ్డల సొమ్ము వాపస్…!!
వివిధ విపత్తులు, ఇతర సందర్భాల్లో ప్రజల్ని ఆదుకోవడం కోసం విరాళాలు వసూలు చేస్తే… వచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పి, ఆ డబ్బును ‘కనిపించే’ ఉపయుక్త పనులకు ఉపయోగించడంలో ఈనాడు నిజాయితీ గొప్పది… మీరు ఈనాడును ఎన్ని విషయాల్లో ఎన్నిరకాలుగా తిట్టుకున్నా సరే ఈ విషయంలో మాత్రం ఈనాడు పారదర్శకత అభినందనీయం… ఆంధ్రజ్యోతి పూర్తి కంట్రాస్టు… అప్పట్లో అమరావతి రాజధాని పేరిట ఏదో డబ్బు వసూలు చేసినట్టు గుర్తు… ఆ డబ్బు 2.5 కోట్లు చంద్రబాబు చేతుల్లో […]
కోళ్లదొంగ… ఇంటికోడి… పాముపిల్ల… బేబీ పెంగ్విన్…! ఈ వైరం ఏనాటిదో…!!
ముందుగా వార్త చదవండి… కేంద్ర మంత్రి నారాయణ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు… కారణం ఏమిటంటే..? తను సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడనేది కేసు… ఏమన్నాడు..? ‘‘మనకు స్వరాజ్యం ఎప్పుడొచ్చిందో కూడా ఈ సీఎంకు తెలియదు, ప్రసంగం మధ్యలో ఆపి ఎవరినో అడుగుతున్నాడు, నేను గనుక అక్కడ ఉండి ఉంటే చెంప చెళ్లుమనిపించేవాడిని’’… ఇదీ వ్యాఖ్య… వెంటనే రాష్ట్రవ్యాప్తంగా శివసేన కేడర్ రగిలిపోయింది, రాణె దిష్టిబొమ్మలు తగులపెట్టారు, బీజేపీ ఆఫీసులపై రాళ్లు […]
ఏదో గట్టి తేడా కొడుతోంది..? అసలు మనం చూసేది ఆ పాత కేసీయార్నేనా..?
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నిక కోణంలో…. ఇప్పుడప్పుడే బీజేపీ ఉపఎన్నికలపై దృష్టిపెట్టదు అని చాలారోజుల క్రితమే ‘ముచ్చట’లో చెప్పుకున్నాం కదా… అదే జరుగుతోంది… ఇప్పుడంత అర్జెంటుగా హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించాల్సిన అవసరం కేంద్రానికి లేదు… ఉండదు… ఇంకా జాప్యం జరుగుతూనే ఉంటుంది… (అబ్బే, కేంద్రానికీ ఎన్నికల సంఘానికీ లింకేమిటి అనడక్కండి, అది చాలా లోతైన సబ్జెక్టు)… ఈ జాప్యం వల్ల జరుగుతున్నదేమిటి..? కేసీయార్ తెలంగాణలో అజేయుడు అనే భావన బద్దలవుతోంది… విపక్షాలను తొక్కేశాడు, తిరుగులేని చాణుక్యుడు […]
మెరిట్ ఉంటే… మంచి చదువు ఉంటే… అవి బెయిల్ అర్హతలా యువరానర్..?
అసలు పార్లమెంటులో చర్చలు జరుగుతున్నాయా..? మొన్నీమధ్య సుప్రీం చీఫ్ బాధిపడిపోయాడు… తప్పులేదు, కానీ అది పార్లమెంటు, నిజానికి అదే సుప్రీం… ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల వేదిక… ఈ దేశానికి అల్టిమేట్ అధికార కేంద్రం… సరే, దాన్నలా వదిలేద్దాం… కానీ సీజే అర్జెంటుగా దృష్టి సారించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్… అసలు అదే తన ప్రధాన బాధ్యత ఇప్పుడు… లక్షల కేసుల పరిష్కారం, వరుస వాయిదాలు, జాప్యంతో పాటు అసలు బెయిళ్లు అనే అంశం మీద తను దృష్టి […]
నిజంగా మనకు థర్డ్ వేవ్ ముప్పు ఉందా..? అది కబళించేయబోతోందా..?
………… By…. Amarnath Vasireddy….. మన దేశంలో మొదటివేవ్ రెండోవేవ్ లలో సుమారుగా డెబ్భై శాతం మంది ఇన్ఫెక్ట్ అయ్యారు . మొదటి వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారికి ఆల్ఫా కరోనా యాంటీబోడీలు వచ్చాయి . రెండో వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారికి డెల్టా లేదా డెల్టా ప్లస్ కరోనా యాంటీబోడీలు వచ్చాయి . యాంటీబోడీలు రక్తం లో ఆరు నుంచి ఎనిమిది నెలలు ఉంటాయి . యాంటీబోడీలు రక్తంలో వున్నప్పుడు కరోనా సోకే అవకాశం లేదు […]
టీఆర్ఎస్ వింత ఏడుపు… బీజేపీ ఎడ్డిమొహం… భలే దొరికాయి, దొందూదొందే…
ఒక చిన్న పాయింట్… దీనికి పెద్ద తెలివి కూడా అక్కర్లేదు… ఒకవేళ తెలివి ఉన్నట్టు కనిపించినా సరే, ప్రస్తుతం రోజులు బాగాలేవు కాబట్టి… జస్ట్, కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం…… ఒక ఫ్యాక్టరీ ఉంది, ప్రభుత్వ రంగంలో ఉంది, అన్నిరకాల అవలక్షణాలూ ఉన్నాయి, నష్టాలు… సరే, దాని నిర్వహణకు కొంతకాలానికి ప్రైవేటు వాళ్లకు అప్పగిద్దాం అనుకుంది కేంద్ర ప్రభుత్వం… అమ్మడం కాదు, కేవలం నిర్వహణకు అప్పగించడం… మరీ సింపుల్‌గా చెప్పాలంటే లీజుకు ఇవ్వడం… కౌలుకు ఇవ్వడం అంటే అమ్మినట్టు […]
పారిపోతూనే అమెరికా డర్టీ గేమ్… అగాధంలో అప్ఘన్ సైనికులు…
……… By…….. పార్ధసారధి పోట్లూరి…… డొనాల్డ్ ట్రంఫ్ ఏమంటున్నాడు…: అమెరికా చరిత్రలోనే ఆతి పెద్ద తప్పిదం… హఠాత్తుగా 3 rd క్లాస్ ప్లాన్ ని అమలుచేశాడు జో బీజింగ్… నేను సరయిన నిర్ణయమే తీసుకున్నాను .. జో బీజింగ్ ! (జో బైడెన్)… ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ లోని పరిస్థితికి జో బీజింగ్ తీసుకున్న చెత్త నిర్ణయమే ప్రధానం కారణం… వాస్తవాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. జో బీజింగ్ ఏం అంటున్నాడు…? 2020 లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ […]
చివరకు డాక్టర్ రెడ్డీస్ కూడా అంతేనా..? ఇవేమి తప్పుడు ప్రకటనలు..?!
మన దేశ ప్రధాన ఆరోగ్య సమస్య సుగర్… ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ… సైలెంట్ కిల్లర్… ఒకేసారి ప్రాణం తీసినా బాగుండు, ఇది రకరకాలుగా మనిషిని దీర్ఘకాలం పీల్చేస్తుంది… ఈ మధుమేహం నియంత్రణ పేరిట జరిగే అక్రమాలు, మోసాలు పెద్ద సబ్జెక్టు… మన దేశంలో సరైన మెడికల్, ఫార్మా కంట్రోల్ వ్యవస్థలు లేవు కాబట్టి.., సహజంగానే కుర్చీ మీద ఉన్నవాడికి రాజ్యపాలన అంటే తెలియదు కాబట్టి, ఇలాంటివన్నీ చెలామణీ అయిపోతున్నయ్… కానీ చివరకు డాక్టర్ రెడ్డీస్ వంటి […]
ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, నిలబెట్టుకుంటూ…. దటీజ్ చిరంజీవి..! కానీ…?
….. By… Shiva Prasad…….. 2000 సంవత్సరం అనుకుంటా.. ఆదాయం పన్ను ఎక్కువ కట్టినందుకు చిరంజీవికి చెన్నైలో అవార్డ్ ఇచ్చారు. అప్పుడు ఆయన దగ్గర జెమిని న్యూస్ ఒక సౌండ్ బైట్ తీసుకుంది. అది ఆఫీస్ కి వచ్చి ఎడిటింగ్ అయ్యేలోపు చిరంజీవి అనుచరవర్గం నుంచి కాల్.. ఆ బైట్ వాడకండి.. సార్ మళ్ళీ పంపిస్తారని అభ్యర్థన. ఆ మధ్యాహ్నం ఫ్లైట్ కే చిరంజీవి హైదరాబాద్ వచ్చేసారు. చిరంజీవి వచ్చేసరికి ఆయన బైట్ రికార్డ్ చేయడానికి ఇద్దరు రెడీగా […]
బాలయ్య మొహం మీద ఉమ్మేశాడు..! మరి ఆ బ్లడ్డు, ఆ బ్రీడు అసహజం కదా…!!
ఓ చిన్న వీడియో బిట్ చూస్తే నిజంగా బాధేసింది… కోట శ్రీనివాసరావు ఇన్నాళ్లూ దాచుకుని, దాచుకుని ఇప్పుడెందుకు బయటపడి తను ఎదుర్కొన్న అవమానాల్ని చెబుతున్నాడో తెలియదు… బహుశా, ఎప్పుడో ఓసారి ప్రజలకు చెప్పాలి, ఇప్పుడిక నన్ను చేసేదేముంది వీళ్లు అనే మొండి ధైర్యమేమో… విషయం ఏమిటంటే..? అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకూ, ఎన్టీయార్‌కూ పడేది కాదు… అది అందరికీ తెలుసు… ఎన్టీయార్ నిర్మించుకున్న ఓ బలమైన గ్రూపును ఢీకొన్నది కృష్ణే… అప్పట్లో ఎన్టీయార్ భజనబృందం చాలా పవర్ఫుల్… […]
- « Previous Page
- 1
- …
- 121
- 122
- 123
- 124
- 125
- …
- 149
- Next Page »