మీరు ఏ ఊరిలోని ఏ చిన్న కిరాణా కొట్టుకైనా వెళ్లండి… ఉద్దెర రేపు అని రాసి ఉంటుంది… రోజూ రేపే… ఈ వాక్యాన్ని కాయిన్ చేసినవాడెవడో గానీ అద్భుతం… మన సినిమా నటుల పార్టీల యవ్వారమూ అంతే… ప్రత్యేకించి రజినీకాంత్… నా పార్టీ ప్రకటన రేపు అంటాడు… మీరు ఎప్పుడు అడిగానా ఆ డైలాగులో మాత్రం తేడా రాదు… సారు గారి వయస్సు 70 ఏళ్లు… ఇప్పటికీ స్టెప్పులు వేస్తూనే ఉంటాడు… సినిమాలు తీస్తూనే ఉంటాడు… ఇదుగో […]
పాత భయాలు…! కేసీయార్‌కు అనూహ్యంగా సెక్యులరిస్టుల మద్దతు..?
……. కొందరు మిత్రుల్ని అడిగితే… హిందుత్వ వేరు, హిందూ వేరు అని స్పష్టంగానే చెబుతున్నారు… నిజానికి వాళ్లంతా కేసీయార్ పాలన విధానాలను, వ్యక్తిగత వ్యవహార పోకడలను ద్వేషించేవాళ్లే… లెఫ్ట్, న్యూట్రల్, సెక్యులర్ భావాలున్నవాళ్లే… అదేమిటీ అనడిగితే… బీజేపీ ప్రవచించే హిందూత్వ వేరు… కేసీయార్ చెప్పుకునే నంబర్ వన్ హిందువును అనే తత్వం వేరు అంటూ విభజన రేఖ గీచి చూపించారు… మత దురభిమానం వేరు, స్వీయ మత అనుసరణ- పరమతసహనం వేరు… బీజేపీది మత దురభిమానం, కేసీయార్ది […]
ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..?!
ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..? అబద్దాలో, నిజాలో జానేదేవ్… మాట్లాడుతుంటే ప్రత్యర్థులపై గండ్రగొడ్డలి పట్టుకుని భీకరంగా దాడిచేసే పరుశురాముడిలా కనిపించే ఆ కేసీయార్ ఏమయ్యాడు..? ఎందుకింత డిఫెన్స్‌లో పడిపోయాడు..?…… ఇదీ ఎల్బీ స్టేడియంలో కేసీయార్ స్పీచ్ విన్న తరువాత ఓ కేసీయార్ అభిమాని అభిప్రాయం… స్పీచ్ అయిపోగానే బీజేపీ స్పందించింది… అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు ఓ ప్రకటనలో… ‘‘గ్రేటర్ పీఠం చేజారుతున్నదనే భయం కేసీయార్ స్పీచులో కనిపించింది…’’ అని వ్యాఖ్యానించాడు… కేసీయార్ స్పీచ్ […]
పవన్ కల్యాణ్ సార్… ఆస్తుల అమ్మకం తప్పే… ఏం చేయమంటావో చెప్పు…
నిజానికి ఇదొక చిక్కుముడి… ఏమిటీ అంటారా..? ‘‘మంత్రాలయం మఠం భూములు అమ్ముతారా..? భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా..? దాతలు ఇచ్చిన ఆస్తులను నడిబజారులో వేలం వేస్తారా..? అమ్ముకోవడం కోసమా మీకు ఆస్తులు ధారబోసింది..? దాతలు ఇచ్చే ఆస్తులకు మీరు ధర్మకర్తలే గానీ యజమానులు కారు, ప్రజలు వ్యతిరేకించారని తిరుమల ఆస్తుల అమ్మకం ఆపేశారు… మరి మంత్రాలయం ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు ఎందుకు..?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు… మంచి ప్రశ్నే… ఈ జగన్ ప్రభుత్వమే ఆమధ్య హిందుత్వవాదుల విమర్శలతో వెనక్కి […]
కంగనా వ్యవహారంలో శివసేన సర్కారుకు బాంబే హైకోర్టు చురకలు…
సంజయ్ రౌత్ తెలుసు కదా… మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వ్యూహకర్త, శివసేన అధికార పత్రిక సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎంపీ… మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు దిశలో తను ఎంత కీలకమో… ఆ ప్రభుత్వానికీ సినీనటి కంగనా రనౌత్కూ నడుమ అగాధాన్ని పెంచింది కూడా తనే… ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేశాడు… చివరకు ముంబై హైకోర్టు కూడా తనను తప్పుపట్టింది… ఒక పార్లమెంటేరియన్‌కు ఇలాంటివి తగవు అని చెప్పింది తాజా ఆర్డర్లో… అంతేకాదు, తను […]
ఉద్యోగులూ హోల్డాన్… జెర ఠైరో… తొందరపడితే బుక్కయిపోతారు…
ఉద్యోగులు రాజకీయ ప్రచారం చేయవచ్చా…!? ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కొందరు ఇటీవల కాలంలో అవగాహనా రాహిత్యంతోనో లేక అత్యుత్సాహంతోనో రాజకీయ పార్టీలకు బహిరంగంగా మద్ధతు ప్రకటనలు చేస్తూ… మితి మీరి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. తాము ప్రభుత్వ ఉద్యోగులమని… నిబంధనల ప్రకారమే వ్యవహరించాలన్న సోయే వారిలో లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాహాటంగా రాజకీయ పార్టీలకు మద్ధతు పలుకుతూ లేదా విమర్శిస్తూ పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మనకేం అవుతుంది? […]
కరోనా వ్యాప్తికీ నైతిక ప్రవర్తనకూ లంకె… ఒక ఇంట్రస్టింగ్ స్టడీ…
కొందరెందుకు కరోనా జాగ్రత్తలు పాటించరంటే! ———————- ప్రపంచం ముందు ఇప్పుడున్న అతి పెద్ద సమస్య కరోనా. భారత్ తోపాటు అయిదారు దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగశాలల్లో ఇంకా పరీక్షల దశలోనే ఉంది. పోలియో టీకాలా వంద శాతం పనిచేసేవి మాత్రం ఇంకా తయారయినట్లు లేదు. మరో నాలుగయిదు నెలల్లో కనీసం డెబ్బయ్ అయిదు శాతమయినా పనిచేసే కరోనా వ్యాక్సిన్ రావచ్చు. 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో అందరికీ టీకా వేయడం కూడా పెద్ద యజ్ఞమే. […]
శెభాష్ ఆంధ్రజ్యోతీ…! ఇంకా పాత్రికేయం నీలో బతికే ఉన్నట్టుంది…!
…. ముందుగా ఆంధ్రజ్యోతికి అభినందనలు… ఈ పాలిటిక్సులో పడి పత్రికలు, టీవీలు ఇక వేరే జీవనాన్ని పట్టించుకోవడమే మానేశాయి… నాయకుల పిచ్చి వాగుళ్లను హైలైట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి… ఏపీలో కులసమరం, తెలంగాణలో గ్రేటర్ సమరం… ఇక జనం కష్టాలకు మీడియాలో స్పేస్ ఎక్కడిది..? కానీ… కానీ… ఈ హెక్టిక్, పొలిటికల్, కమర్షియల్ యాక్టివిటీలోనూ అన్నదాత అరిగోసను ఫస్ట్ పేజీలో హైలైట్ చేసినందుకు… పాత్రికేయం ఆత్మహత్య చేసుకుంటున్న ఈ గడ్డు రోజుల్లో, ఇంకా సదరు పత్రికలో అది […]
ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో సరిగ్గా తెలిసి, ఎదిగి… చివరకు…
1980-81… ఓ శీతాకాలం సాయంత్రం… పార్లమెంటు సభ్యుల నడుమ ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది… గుజరాత్, భరూచ్ నుంచి వచ్చిన యువ ఎంపీ అహ్మద్ పటేల్ బ్యాటింగులో ఇరగదీసేస్తున్నాడు… సెంచరీకి దగ్గరయ్యాడు… మరోవైపు మాధవరావు సింధియా… అహ్మద్ పటేల్ బ్యాటింగు చేస్తుంటే ఇక వేరే ప్లేయర్లకు ఆడటానికి ఏమీ ఉండదు… సింధియా సరదాగా నవ్వుతూ మొత్తం నువ్వే ఆడితే మరి మేమేం చేయాలి భయ్యా అన్నాడు… ఆ తరువాత బంతికే పటేల్ బౌల్డ్ అయ్యాడు… కావాలనే… […]
ట్రబుల్ షూటర్… నిజంగానే ఈయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు…
…. ఎవరైనా మరణిస్తే… ఆయన మరణం తీరని లోటు అని సంతాప ప్రకటన చేస్తుంటారు కదా… చాలా మరణాల విషయంలో అది మర్యాదపూర్వకమైన సంతాపం కావచ్చు గాక… కానీ ఈరోజు మరణించిన కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ మరణం మాత్రం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే తీరనిలోటు… అసలే అనేక కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం మరింత నష్టదాయకమే… కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఆయన కీలకమైన లీడర్… ట్రబుల్ షూటర్… స్ట్రాటజిస్టు… సైలెంట్ ఆపరేటర్… తను […]
ఉన్నవి ముంచేయడం దేనికి..? మీరే బ్యాంకులు పెట్టేయండర్రా…
ఇక టాటా బ్యాంకు! బిర్లా బ్యాంకు! ———————- అర్థశాస్త్రం అందరికీ అర్థం కాదు. అర్థం కానిదే అర్థశాస్త్రం అనబడునేమో. అర్ధ భాగం అర్థమైనా సరే అది చాలా గొప్పే… ధనమేరా అన్నిటికీ మూలం అన్నదే సామాన్యులకు అర్థమయిన అర్థశాస్త్రం. సామాన్యులు ధనం దాచుకోవడానికి తమ ఇళ్లు భద్రం కాదని- బ్యాంకుల్లో, బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటూ ఉంటారు. సులభంగా వైట్ కాలర్ ఎగరేసి దోచుకోవడానికి బ్యాంకులే అత్యంత అనువైనవని కొందరు నిరూపిస్తూ ఉంటారు. మనం రుణం తీసుకుంటే పది […]
అన్ని రేప్ కేసులూ నిజం కావు… ఇదీ ఓ నిఖార్సు ఉదాహరణ…
అవును… ప్రతి రేప్ కేసూ నిజం కాదు… అన్ని కేసుల్లోనూ మహిళలు చెప్పిందేమీ అల్టిమేటు కాదు… కాకపోతే మన చట్టాలు మహిళ పక్షపాతాలు… మీడియా, సమాజం ఎప్పుడూ మగవాడినే అనుమానంగా చూస్తుంది… వేలెత్తి చూపిస్తుంది… ఇది పూర్తి భిన్నమైన కేసు… ఇవీ చదవాలి… రికార్డు కావాలి… తప్పుడు రేప్ కేసులు కొన్నిసార్లు బద్దలవుతుంటయ్, అసలు దోషులెవరో బయటపడక తప్పదు… ఒక అమ్మాయి… ఒక అబ్బాయి… పెళ్లి కుదిరింది… ఇక దండలు మార్చుకోవడమే తరువాయి… కానీ రెండు కుటుంబాల […]
ఈడ్చి తంతే లక్ష రాలవు… తనపై 500 కోట్లకు దావా…
….. యూట్యూబ్ చానెల్ ఉంది కదాని ఏది పడితే అది రాస్తే… కొన్నిసార్లు బూమరాంగ్ శతఘ్నులై రివర్స్ వచ్చి, వాళ్ల మీదే పేలిపోవచ్చు కూడా… భావప్రకటన స్వేచ్చ గట్రా పదాలు ఏవీ రక్షించలేవు… పెద్ద పెద్ద మీడియా హౌజుల ఎడిటర్లు, ఓనర్లే కొత్తగా పరువునష్టం దావాలకు యాడ్ అయిపోయిన క్రిమినల్ కేసులకు భయపడిపోతున్నారు… పరువునష్టం కేసులు వేసుకుంటే వేసుకోనీ అనే ఓ బేఫర్వా వైఖరి గతంలో ఉండేది… కానీ ఎప్పుడైతే క్రిమినల్ కేసులు అంటున్నారో ఆ ధీమాలు, […]
చప్పుడు లేదు, చంపదు… నో ఫైర్, నో బుల్లెట్… అదే చైనా గన్…
…. తుపాకీ కాలిస్తే… శబ్దం రావద్దు… సైలెన్సర్‌తో కాదు, సహజంగానే రావద్దు… మంట రావద్దు… అసలు పేలుడు అనేదే ఉండొద్దు… ఈ ట్రిగ్గర్లు నొక్కడాలు, క్వాడ్రిట్జ్ ఓపెనై బుల్లెట్ దూసుకుపోవడాలు… అబ్బే, మరీ ఓల్డ్ ఆయుధాలు… అదే చైనా వాడి మైక్రోవేవ్ గన్ చూడండి… ఎయిమ్ చేయడం, క్లిక్ చేయడం… అంతే… కిరణాలు ఎదుటి దేశం జవాన్ల మీదకు దూసుకుపోతయ్… వాళ్ల దేహాల్లో కలవరం… వాంతులు, నీరసం, కుప్పకూలడం ఉంటాయట… గాయాలు, నెత్తురు కారడం, అవయవాలు తెగిపడటం […]
ఒవైసీ భాయ్.., బెంగాల్ మీద మస్త్ ప్లాన్ చేసినవ్…
…… ఒవైసీ భలే ఎత్తుగడ ఇది… హైదరాబాద్ పాతబస్తీ దాటి విస్తరించే ప్లాన్… జాతీయ స్థాయిలో ముస్లిం వాయిస్ అనిపించుకునే స్ట్రాటజీ… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు కాస్త విస్తరించి… మొన్న బీహార్‌లో ఏకంగా అయిదు అసెంబ్లీ సీట్లు గెలిచి… ఇప్పుడు బెంగాల్‌పై గురి… అక్కడ చాలా ఆశలున్నయ్… ఎందుకు..? బంగ్లాదేశ్ సరిహద్దు… లక్షల మంది ముస్లింలు ఆ దేశం నుంచి బెంగాల్ వచ్చి స్థిరపడ్డారు, పడుతున్నారు… వాళ్ల వోట్ల కోసం ఇన్నేళ్లూ సీపీఎం గానీ, టీఎంసీ గానీ నానా […]
ఎడిటర్ అనగానెవ్వరు..? వీళ్లకు ప్రత్యేక హక్కులు ఉండునా..?
………. ఎడిటర్ అనగానే మనలో చాలామందికి వాళ్లు జ్ఞానులు అనే భ్రమ ఉంది… ఎడిటర్ అంటే తెలుగులో సంపాదకుడు… నిజమే… వాళ్లలో అధికులు ప్రస్తుతం కేవలం సంపాదకులు మాత్రమే… వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంకేతిక వ్యవహారాలపై చాలామంది సంపాదకుల జ్ఞానం సున్నాలు… వితండవాదాల్లో మిన్నలు… అందరూ కాదులెండి.,. కానీ చాలామంది… అసలు అప్డేట్ కారు… ఎడిటర్స్ గిల్డ్ అని ఓ పే-ద్ద సంఘం ఉంది… ఆర్నబ్ గోస్వామి అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రకారం… ఆ […]
#NOYB… ఐఫోన్లు వాడుతున్నారా..? ఓసారి చదవండి…
 యాన్ యాపిల్ ఏ డే… కీప్స్ అవర్ ఫోన్ డేటా అవే! ———————— ఫోన్ అంటూ ఉన్న తరువాత దానికి ట్యాపింగ్/ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అది అధికారిక ట్యాపింగా, అనధికారిక ట్యాపింగా అన్నది వేరే విషయం. ఇటుకలు సిమెంటుతో కట్టిన గోడలకే వినే చెవులుంటే- చెవుల దగ్గరే వినపడే ఫోన్ సంభాషణలను వినే ట్యాపింగ్ చెవులు ఎందుకుండవు? ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా? లేదా? అన్నది బ్రహ్మపదార్థం. ఎప్పుడో బ్రిటీషు వారు దేశం వదిలి వెళ్ళడానికి […]